పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16482

  1. భావతరంగాల సింధువు: భైరవి గురించి Rohiniprasad అభిప్రాయం:

    08/19/2011 11:25 am

    బర్‌సాత్‌ సినిమాలో బర్‌సాత్‌ మే అనే లతా, బృందం కలిసి పాడినది సింధుభైరవి రాగం లోని పాటే. జియా బేకరార్ కాదు. అందాజ్‌లో ఆ రాగం పాటేదీ ఉన్నట్టు గుర్తురావడంలేదు.
    ఒకే రాగంలోని పాటలన్నీ ఉదహరిస్తున్నప్పుడు అవన్నీ ఒకే శ్రుతిలో పాడినవై ఉంటే రాగాన్ని గుర్తుపట్టడం మరింత తేలికవుతుందేమోగాని అటువంటిది ఆశించడం కష్టమే.

  2. శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి రాణి. అభిప్రాయం:

    08/19/2011 5:30 am

    శాస్త్రి గారూ,
    మీ మాట అక్షరాలా నిజం. శ్రీశ్రీ తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం. ఆయన దురదృష్టం అనను గానీ.., ఆయన తెలుగువాడు కావడం వల్లే తగినంత గుర్తింపు రాలేదనేది మాత్రం నిజం. సాహిత్యం వెనుక దాన్ని సృష్టించిన కవి వుండచ్చుగానీ. ఆ కవిని అంచనా వెయ్యడానికి మాత్రం వైయక్తిక జీవితాన్ని పరిగణించకూడదు. ఎందుకంటే ఏ బలహీనతా లేకుండా ఎవరైనా ఒక కవో సాహిత్యకారుడో అయితే అతనికి వున్న మొదటి బలహీనత పేరు కవిత్వం అవుతుంది. అదీ కాకుండా మనిషి బలహీనతల్తోనే సహజీవనం చేస్తాడు. అలాంటి మనిషి బలహీనతలని పదే పదే ఎత్తిచూపిస్తున్నారూ అంటే అదీ ఒకవిధమైన బలహీనతే. దానిపేరు ఓర్వలేమితనం. అదే తెలుగువాడి జాతీయలక్షణం.

  3. సువర్ణభూమిలో … గురించి తాడేపల్లి హరికృష్ణ అభిప్రాయం:

    08/19/2011 4:35 am

    “కవి”కీ “పాఠకుడికీ” ఉన్న “స్థాయీభేదాన్ని” పాఠకుడే అధిగమించాలని ఇక్కడో గీతాప్రవచనం. ఏమిటా స్థాయీభేదం? అచ్చు అందుబాటులో వున్నవాడు పైస్థాయి వాడు; అది కాక వట్టి చక్షువులతో వెళ్ళదీస్తున్న వాడు క్రీస్థాయి వాడూనా? ఇక్కడున్నదల్లా అనుభవవ్యత్యాసం మాత్రమేను. తన అనుభవాన్ని పైకి అక్రోశించగలవాడు కవి, రచయితానూ. అది చెయ్యలేని వాడు చదువరి, ప్రేక్షకుడు. ఎక్కడో Random Harvest (James Hilton?) అనే నవలలో అన్నట్టు – స్టేజీ మీద సిల్కు అంగీలతో బిచ్చగాడొచ్చి పాటలు పాడి వెళితే అంతా వినోదంగా అనుభవయోగంగా వుంటుంది. కానీ నిజజీవితంలో బిచ్చగాడు పాటలు పాడడూ, కావ్యభాషలో ఆక్రోశించడూ. మౌనంగా పడుకుంటాడు. కయ్యానికీ వియ్యానికీ నెయ్యానికీ సమవుజ్జీ వుండాలని పాత లోకనీతి. కావ్యానిక్కూడా అది అంతే నిజమేమోను. వాల్ పోస్టర్ మీద లక్ష రూపాయల డైమండ్ నగ ప్రకటన వుంటుంది. కానీ అది కొనగల తాహతు ఉన్నవారినుద్దేశించినది. తక్కిన వారికవి పొల్లు మాటలు మాత్రమేను. కవిత్వం కూడా అంతేనేమోను. నా అనుభవసామగ్రి నీ దగ్గర లేందే నా కవిత్వమెవడు చదవమన్నాడు నిన్ను? అని పరోక్షంగా నిలదీస్తున్నారు ఇలాటి రసహీనమైన పద్యాన్ని గాలికి వదిలి. ఫెర్మా సిద్ధాంతంతో సామ్యం కృత్రిమం. ఫెర్మా సిద్ధాంత నిరూపణ చెప్పకుండా ఫెర్మా సిద్ధాంతాన్ని హైస్కూలు విద్యార్ధికి చెప్పొచ్చును. కానీ ఇలా పేజీల పేజీల వ్యాఖ్య లేందే ‘కవి’ చెప్పదలచిందేంటో ఆ బ్రహ్మ పదార్ధాన్ని పట్టుకోడానికి 46 వ్యాఖ్యల తరవాత కూడా తేల్చలేక పోయారు. అది కవికి గర్వకారణం కావచ్చును. కానీ జాగ్రత్తగా పరిశీలించినట్లైతే ఈ పధ్యాల భావాన్ని ఒక విధమైన వోటింగ్ పద్ధతి ద్వారా మెజారిటీ బలంతో నిర్ణయించాల్సి వచ్చింది. ఇదేనా కవి నిజంగా కోరుకుంటున్నది?

  4. హాయిహాయిగా ఆమని సాగే గురించి తాడేపల్లి హరికృష్ణ అభిప్రాయం:

    08/19/2011 3:30 am

    లక్ష్మన్న గారూ. నాదో విన్నపం. సినిమాల్లో ఘంటసాల ఇత్యాదులు పాడిన పద్యాలకీ, శ్లోకాలకీ (ఉదా: కాళిదాసులో మాణిక్యవీణాం, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యము లో ఉన్న పలు పద్యాలు, భక్త ప్రహ్లాదలో సుశీలగారు పాడినవి, లవకుశ, సత్యహరిశ్చంద్ర, భారతమ్మీద భాగవతం మీద వచ్చిన చాలా సినిమాలు) ఉన్న సంగీత ప్రాతిపదికలేమిటో తెలిపే వ్యాసమొకటి తలపెట్టండి.

  5. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి తాడేపల్లి హరికృష్ణ అభిప్రాయం:

    08/18/2011 9:59 pm

    కరుణశ్రీ ఘంటసాల గానాన్ని శాశ్వతం చేశాడా, లేక ఘంటసాల పుష్పవిలాపాన్ని తెలుగు వాళ్ళ చెవుల్లోనూ హృదయాల్లోనూ శాశ్వతంగా మోగేలా పాడాడా అంటే, నా అభిప్రాయం రెండవదేను. ఇటువంటి, ఇంతకన్నా భావగర్భితాలైన పద్యాలు పాటలూ అన్ని శైలుల్లోనూ అప్పటికే వున్నాయి, ఆ తరవాత కూడా వస్తున్నాయి. కానీ అవన్నీ ఘంటసాల గొంతులోంచి వినపడే అదృష్టానికి నోచుకోలేదు. ఈ వివరాలు రాసి రోహిణీప్రసాద్ గారు పఠితలని వశం చేసుకున్నారు.

  6. వేటూరి పాట గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    08/18/2011 8:52 pm

    ఆ అన్వయానికై కొద్దిగా మీరు హోం వర్క్ చెయ్యాలి…

  7. భావతరంగాల సింధువు: భైరవి గురించి తాడేపల్లి హరికృష్ణ అభిప్రాయం:

    08/18/2011 3:22 pm

    ఇక్కడ పెట్టిన పాత తెలుగు పాటలన్నీ http://www.oldtelugusongs.com అనే సైట్ లోనివి. ఇవన్నీ అలబ్ధాలు. నొక్కితే –

    “Bandwidth Limit Exceeded. The server is temporarily unable to service your request due to the site owner reaching his/her bandwidth limit. Please try again later.”

    అని వస్తోంది. బంగారుపాప, మిస్సమ్మ, అనార్కలి వంటి సినిమాపాటలు యూట్యూబ్ లోనే విరివిగా దొరుకుతున్నయి కనక ఈ లింకులు సవరిస్తే బావుంటుంది.

    నాకు సంగీతం తెలియదు. అయినా ఈ చిరువ్యాఖ్య రాయ సాహసిస్తున్నాను. ఇటీవల వచ్చిన ఒక హిందీ సినిమా పాటల వ్యాఖ్యానంలో (రచయిత, పేరు జ్ఞాపకం లేవు) భైరవి రాగాన్ని రాజ్ కపూర్ మొదటిగా అందాజ్ సినిమాలో విన్నాక తన సినిమాల్లో చాలా పాటలు శంకర్ జైకిషన్ల చేత అదే రాగంలో కట్టించినట్లు వ్రాశారు. బర్సాత్ లో ప్రసిద్ధమైన “జియా బేకరార్ హై” కూడా ఇదే రాగమని చదివిన గుర్తు.

    [లింకులు త్వరలోనే సరిచేస్తాము. – సం.]

  8. వేటూరి పాట గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    08/18/2011 1:26 pm

    “ప్రమథ లోక హిమ దీపం” అంటే?
    ప్రమథ గణం = శివుని సేవించే సమూహం (a class of demons attending Siva)

    అన్వయం కుదరటం లేదేమో?

  9. రామతత్వం గురించి yaddanapudi kameswari అభిప్రాయం:

    08/17/2011 3:07 pm

    యెర్నేని లైలాగారి కథనంలో రాముడితో పోలిక ఎంతో బాగుంది. పోకిరి సినిమా అందరికి తెలిసిందే. నాకు లైలాగారిలాగే ఆ సినిమాలో రాముడితో, రామాయణంతో పోలికలు కనిపిస్తాయి. “ఒకసారి కమిటైతే నామాట నేనే వినను” అన్నహీరో డైలాగు నాకు శ్రీరాముని సత్యసంధతను గుర్తుకు తెస్తుంది. రాముడి అరణ్యవాసం, సీతను రావణుని బారినుండి కాపాడుకోవటం, దుష్టశిక్షణ, ప్రజలరక్షణ ఇవన్నీ నాకు ఆ కథానాయకునిలో, ఆకథతో రామాయణంతో కనిపించే పోలికలు. ఎన్నో సంవత్సరాల విదేశీ జీవనంలో కూడా తెలుగుసాహిత్యాన్ని మరువని లైలాగారికి అభినందనలు.

    డా.యద్దనపూడి కామేశ్వరి

  10. వేటూరి పాట గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    08/17/2011 1:16 pm

    నాగ మురళి గారికి:
    పాట పాడినప్పుడు, ఎస్పీగారు “ప్రమథాలోక” అని సంగీతపరమైన కారణాలవల్ల పాడారు గాని, కవితాపరంగా
    “కైలాసాన కార్తీకాన శివరూపం
    ప్రమిదే లేని ప్రమథ లోక హిమదీపం”
    (కార్తీకం, చలికాలం, హిమాలయంలోని కైలాసం, మంచు – శివుడు తెల్లని వాడు, స్వయం జ్యోతిస్వరూపుడు – ఇంధనం అక్కర్లేని దీపం – ప్రమిదే లేని దీపం – ఆ దీపం చల్లనిది , వెచ్చనిదికాదు. )
    పదాల ఉచ్చారణ ఇలా మారడం, అర్ధాలు మరుగుపడడం ఇదివరలో కూడా జరిగింది.. (” లాహిరీ నడి సంద్రములోనా, లంగరుతో పని లేద” న్నప్పుడు కూడా)

    ఓ పాపా లాలి అన్న పాట.. సినిమాలో సందర్భంతో అర్ధం చూస్తే మంచి భావప్రదమైన పాట.

    నార్ల దగ్గర పాత్రికేయుడిగా పని చేసిన వేటూరి, అర్ధాన్ని విస్మరించారని అనుకోలేం. కవితావేశంలో అనర్ధాలు కవులకి మామూలే.

    “ప్రతి భారత సతి మానం
    చంద్రమతీ మాంగల్యం”
    లాంటి భావాల్ని వెదజల్లిన కవులెంతమంది మన తెలుగులో..