పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. కిరానా సంప్రదాయపు భీమబలుడు గురించి srinivasarao v అభిప్రాయం:

    09/02/2011 11:44 pm

    ఎన్నొ విషయాలు తెలిసుకొన్నాను. ఆసక్తిగా ఉన్నాయి. ఇలా తరచుగా వ్రాయ గలరు.

  2. మాతృత్వానికి మరో ముడి: కథ నచ్చిన కారణం గురించి Gowri Kirubanandan అభిప్రాయం:

    09/02/2011 10:42 pm

    “మాతృత్వానికి మరో ముడి” అన్న పదం మీద క్లిక్ చేస్తే కథ ఉంటుంది.

    Gowri Kirubanandan

  3. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన అభిప్రాయం:

    09/02/2011 1:32 pm

    పాదారంభములో మూఁడు పదమున్న మరొక పద్యము నాకు కనబడలేదు. కాని, లోఁగు పదాన్ని లోఁగు, లోంగు గాను ఉపయోగించిన ఒక పద్యము దొరికింది. అంటే కావలసినప్పుడు, అర్ధానుస్వారము, లేకపోతే పూర్ణానుస్వారమును ఉపయోగించాడు నన్నిచోడుడు. అంటే ఆ పదాలను రెండు విధాలుగా ఉచ్చరించాడు. ఆ పద్యాలు –

    లోఁగుఁ దరమైన పొదరుల
    నాఁగిన శకునంబ తలఁచు నడుగడుగునకున్
    డాఁగఁ గెల నరయుఁ బ్రాణము
    లీఁగుట కొడఁబడక మదనుఁ డెంతయు భీతిన్ – కు.స. – 5.13
    (ప్రాససాంకర్యము చేయలేదు ఇక్కడ)

    (దట్టమైన పొదలలో అణగిఉంటాడు, దుశ్శకునాలనుగురించి తలబోస్తాడు, దాగుకోడానికి పక్కల చూస్తాడు, ప్రాణాము విడువడానికి మనసొప్పక మన్మథుడు భయపడుతాడు)

    వీంగు నపారసత్త్వగుణా విస్ఫురణం బరమేశ్వరోరు వా-
    మాంగమునందు మున్నుదయమై నియమస్థితిఁ గొల్చి తద్దయున్
    లోంగొని పేర్మితో నఖిలలోకములుం దగఁ గాచుచున్న వే-
    దాంగు ననంతు విష్ణుఁ గమలాధిపు సంసుతిఁ దేల్తు సమ్మతిన్ – 1.4

    ఇందులో వీఁగు, లోఁగొని అనేవి సామాన్య ప్రయోగాలు. వాటికి బదులు వీంగు, లోంగొని అని ప్రాసకై ఉపయోగిస్తాడు చోడుడు.
    (విజృంభించిన గొప్ప సత్త్వ్వగుణశక్తితో ఈశ్వరుని పెద్దదగు ఎడమవైపు శరీరములో ఉద్భవించి నిష్ఠతో సేవించి శివుని అనుగ్రహముతో సకల లోకములను లొంగదీసికొని ప్రేమతో రక్షించు అనంతరూపుడైన లక్ష్మీపతి విష్ణువును నా స్తోత్రముతో సంతోషింపజేస్తాను)

    వాఁడు, వీఁడు కు బదులు వాండు, వీండు అని ఉపయోగించిన ఒక పద్యము –

    వీండేమి సేయుఁ బంచిన
    వాండుండంగ నిక్కమునకు వధ్యుఁడుగా నా
    ఖండలుఁడు గాక, యేసిన
    వాండుండఁగ నేమిసేయు వరశర మనిలోన్ – 10.155

    (నిజముగా పంపినవాడు ఉండగా వీడేమి చేయును? ఇతడిని పంపిన ఇంద్రుడిని చంపాలి. ప్రయోగించినవాడు ఉండగా బాణము ఏమి చేస్తుంది యుద్ధములో?)

    ఇప్పుడు కూడ తమిళనాడులో ఆడవాళ్లను ఆండవాళ్లు అని అంటారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనేది ఆండవాళ్ల మాటలకు అర్ధాలే వేరులే అవుతుంది 🙂

    విధేయుడు – మోహన

  4. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన అభిప్రాయం:

    09/02/2011 12:54 pm

    పరవస్తు చిన్నయసూరి బాలవ్యాకరణమునుండి –

    సాంస్కృతికాచ్ఛికమిశ్రభేదంబుచే సమాసంబు త్రివిధంబు – సమాస 2.

    సాంస్కృతికంబు సిద్ధంబని సాధ్యంబని ద్వివిధంబు. కేవల సంస్కృతంబుల సమాసంబు సిద్ధంబు నాఁబడు రాజాజ్ఞ-తటాకోదకంబు-లక్ష్మీవల్లభుఁడు. సంస్కృతసమంబుల సమాసంబు సాధ్యంబునాఁబడు. రాజునాజ్ఞ-తటాకంబునుదకము-లక్ష్మీవల్లభుఁడు. తక్కిన తెనుఁగుల సమాసంబాచ్ఛికం బనంబడు. ఱేనియానతి-చెఱువునీరు-సిరిచెలువుఁడు. ఉభయంబులు గూడినది మిశ్రంబనంబడు. రాజుముదల-చెఱువునుదకము-సిరివల్లభుఁడు.

    మూలఘటిక కేతనకవి ఆంద్రభాషాభూషణమునుండి –

    దినకరకొడుకునకును సరి
    యనిమిషమొదవునకు సాటి యని యిబ్భంగిన్
    దెనిఁగింప సంస్కృతములు
    దెనుఁగులు సంధించిరేనిఁ దెగడుదు రార్యుల్ (132)

    తెనుగుపదంబులపైఁ బెం-
    పొనరఁగ సంస్కృతముచెల్లు నొక్కొకచోటన్
    మును సుకవీంద్రులు గృతులన్
    బనిగొని రచియించినట్టి పరిపాటిమెయిన్ (133)

    వాఁడిమయూఖము లనఁగా
    వేఁడిపయోధార లనఁగా వింజామర నా
    మూఁడస్త్రంబు లనఁగా
    బోఁడిమిఁ గఱకంఠనామము బోలి తగున్ (134)
    (ఇక్కడ అరసున్న ప్రాసనే అన్నిచోట్ల నుపయోగించాడు కేతన)

    నీ సంస్కృతంబుతోడ స-
    మాసించును నీవినూత్నమణినూపురశ-
    బ్దాసక్తచిత్తహంస
    త్రాసకరాంబుదము నాగఁ దఱుచై యునికిన్ (135)

    ఆకామిని యక్కామిని
    యీకొడుకు కిక్కొడుకు నాఁగ నీయూ రియ్యూ
    రేకార్యం బెక్కార్యం
    బాకథ యక్కథ యనఁగ నుదాహరణంబుల్ (137)

    మీరు వ్రాసిన సమాసాలు ఇలా ఉండవలెననుకొంటాను – పడుచు యాహారము, గొప్ప యావేశము, మూడు నేత్రములవాఁడు, పచ్చ యంబరము లేక పచ్చని యంబరము, పాల యభిషేకము.

    విధేయుడు – మోహన

  5. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి pandu kollarapu అభిప్రాయం:

    09/02/2011 9:35 am

    బాగుందండీ సరదాగా నవ్వడానికి.

  6. మాతృత్వానికి మరో ముడి: కథ నచ్చిన కారణం గురించి రాణి. అభిప్రాయం:

    09/02/2011 8:17 am

    కొన్ని కథలు స్థల కాలాలను మించి విస్తరిస్తాయి. వాటికవే సార్వత్రిక సత్యాలుగా అవతరిస్తాయి. అలా శాశ్వతత్వాన్ని సంతరించుకున్న గొప్ప కథని పూర్తిగా చదవలేకపోయినందుకు చాలా వెలితిగా అనిపిస్తోంది.

  7. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి Sowmya అభిప్రాయం:

    09/02/2011 5:58 am

    🙂 బాగుందండీ సరదాగా చదువుకోవడానికి.

  8. మాతృత్వానికి మరో ముడి: కథ నచ్చిన కారణం గురించి మోహన అభిప్రాయం:

    09/01/2011 10:01 pm

    ఒక రచయితకు అసిస్టంటు అంటే, ఆ వ్యక్తి పని ఏమి అనే కుతూహలము నాకు కలుగుతూ ఉంది. అంటే ఘోస్ట్ రైతటింగ్ చేస్తారా? ఈ అసిస్టంటులు వ్రాసినదాన్ని రచయిత అక్కడా యిక్కడా మార్పు చేసి తనదంటాడా? పాటలు వ్రాసేవాళ్లకు కూడా ఇలా సహాయకులు ఉంటారు, వాళ్ల పేరులను టైటిల్సులో చూస్తుంటాము. పూర్వకాలములో గొప్ప చిత్రకారులకు ఇలా అసిస్టంటులు ఉండేవారట. వాళ్లు నేపథ్యాన్ని చిత్రీకరిస్తే ముఖ్య చిత్రకారుడు పాత్రలను చిత్రీకరించేవాడట. నా ఈ ప్రశ్నలో ఏదైనా తప్పుంటే క్షమించమని ముందరే మనవి చేస్తున్నాను.. విధేయుడు – మోహన

  9. నివాసం గురించి రవి వీరేల్లి అభిప్రాయం:

    09/01/2011 9:10 pm

    చాలా బావుంది. ఇల్లలుకుతున్న కందిరీగ మరీ నచ్చింది.

  10. తానా 2011 ప్రసంగాలు: నవల-నాటకం-సినిమా గురించి Sivakumar అభిప్రాయం:

    09/01/2011 9:00 pm

    ఆకెళ్ళ గారి ప్రసంగానికి మారుతీరావుగారి జవాబు చాలా గొప్పగా వున్నది.