పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/02/2011 10:33 am

    నా టీనేజ్‌లో కొనుక్కున్న హిందీ సినిమా పాటల పుస్తకాలు ఇప్పటికీ నాదగ్గరున్నాయి. అవి చూస్తే నిజంగానే archival material అనిపిస్తాయి. కినిమా సంచికలలోని సినిమా ప్రకటనలూ, కొన్ని స్టిల్ ఫోటోలూ కూడా అంతే.

    ఇలాంటి వ్యాసాలు కమర్షియల్ పత్రికల్లో చూసే అవకాశం తెలుగువారికి ఉండదు. హిందూ పత్రికలో మాత్రం వారానికొకటి చొప్పున పాత సినిమాల గురించిన పరిచయవ్యాసాలు అచ్చవుతున్నాయి. రావి కొండలరావు పాతబంగారం పేరుతో ఈనాడు శుక్రవారం ఎడిషన్‌లో కొంత సమాచారం అందిస్తున్నారు.

  2. తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి Sowmya అభిప్రాయం:

    11/02/2011 8:40 am

    ఇదివరలో రోహిణీప్రసాద్ గారు రాసిన వ్యాసం చదివాను కానీ, ఇంకో వ్యాసం ఉందని గమనించలేదు. మీరు అందించిన సమాచారానికి ధన్యవాదాలు.

  3. ఒక (అ)నాగరిక ఆనందం గురించి vjrao అభిప్రాయం:

    11/02/2011 6:31 am

    Simply great, Garimella garu.

  4. కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు గురించి Sowmya అభిప్రాయం:

    11/02/2011 4:51 am

    బాగుందండీ. అందించినందుకు ధన్యవాదాలు.

  5. దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు గురించి Sowmya అభిప్రాయం:

    11/02/2011 4:43 am

    నేను పాత చందమామలు చదవడం మొదలుపెట్టాక వాటిల్లో ఉండే సినిమా అడ్వర్టైజ్మెట్లు చూడ్డం, పోస్టర్లు గమనించడం ఆ మధ్య కాలంలో నాకో వ్యసనమై పోయింది. కానీ, ఇలా పోస్టర్ల అధ్యయనం కూడా చేయవచ్చన్నమాట ఇప్పుడే తెలుసుకున్నాను. మీ వ్యాసానికి, అందులో అందించిన రిఫరెన్సులకీ ధన్యవాదాలు.

  6. మూడు వందల రామాయణాలు గురించి Sowmya అభిప్రాయం:

    11/02/2011 4:37 am

    ఇందులో అంత వివాదాస్పదం కావాల్సిన విషయం ఏముందో అర్థం కాలేదు వ్యాసం మొత్తం చదివాక.

    మీ అనువాదం చాలా సరళంగా ఉంది.

    అన్నట్లు, ఆరుద్ర రాసిన పుస్తకం చదివితే వీళ్ళంతా ఏమంటారో మరి!! 🙂

  7. ఒక (అ)నాగరిక ఆనందం గురించి Sowmya అభిప్రాయం:

    11/02/2011 4:09 am

    బాగుందండీ!

  8. దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు గురించి DBR అభిప్రాయం:

    11/02/2011 12:18 am

    శభాశ్! అరుదైన విషయాన్ని గురించి విలువైన సమాచారాన్ని సాధికారంగా, విశ్వసనీయంగా, ఉపయుక్త గ్రంథసూచితో సహా ఇచ్చారు. చాలా బావుంది. ఈ వ్యాసం ఈమాట స్థాయికి తగినట్లుగా– కాదు స్థాయిని పెంచేదిగా ఉంది. అభినందనలు, కృతజ్ఞతలు. ఇటువంటి వ్యాసాలు మరిన్ని ప్రచురించాలని కోరుకుంటాను.

    కానీ, పరుచూరి శ్రీనివాస్ గారు కూడా “పరిణితి” అని రాస్తే బుర్ర గోక్కుని నిఘంటువు వెతకవలసి వచ్చింది. “పరిణితి” కాదండీ, “పరిణతి” (“పరిణామము” లా అన్నమాట) “పరిణితి” అన్నమాట ఈ మధ్య ఇంటర్నెట్టులో, చివరికి తెలుగు వార్తా పత్రికల్లో కూడా కనిపిస్తోంది.

    ఈమాట స్థాయిని పెంచేది అని ఎందుకు అనడం అంటే ఈ సంచికలో సంగీతం మీద ఉన్న ఒక వ్యాసం చాంతాడంత పొడుగ్గా ఉన్నా, విశ్వసనీయమైన సమాచారం ఏదీ లేకుండా పుక్కిట పురాణంలా ఉందిలెండి. ఆ వ్యాసానికి రాశి (పొడుగు) మాత్రమే, వాసి (సాధికారమైన authentic సమాచారం) లేదు. భుజాలు తడుముకోవడానికి ఈమాత్రం హింటు చాలనుకుంటాను.

    – DBR
    02/11/11

    [ఆ పొరపాటు అచ్చుతప్పులు దిద్దిన సంపాడక్‌ది. తప్పు సరిదిద్దుకున్నాం – సం.]

  9. పహాడీ రాగం అందాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/01/2011 11:55 pm

    రామ్‌గారూ,
    మీ అంచనా నిజమే. గాలికి కులమేదీ పహాడీ రాగమే. అలా standard style ఎత్తుగడ ఉన్న పహాడీ పాటలను గుర్తించడం సులువు. నిజానికి కొన్ని శాస్త్రీయరాగాలతో పోలిస్తే పహాడీకున్న range తక్కువే.
    శ్రీనివాస్ గారు ఉదహరించిన పాత పాటలను నేను వినలేదు. వాటిలో పహాడీ రాగంమీద ఏవైనా ఉన్నాయేమో.
    1937లో చనిపోయిన కరీమ్‌ఖాన్, 1950లో చనిపోయిన ఫయ్యాజ్‌ఖాన్ తదితరులు పహాడీ పాడగా ఇచ్చిన రికార్డులేవీ ఉన్నట్టులేవు. దీనానాథ్ మంగేశ్కర్ (1900-42) పాడినది ఒకటుంది. పహాడీకి జనాదరణ కలిగించినది నిస్సందేహంగా బడేగులామలీయే.

  10. ఒక (అ)నాగరిక ఆనందం గురించి HARANATH అభిప్రాయం:

    11/01/2011 11:20 pm

    చాలా బాగుంది. . .