“త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన.”
సాయి గారు,
త్యాగరాజ కృతులలో భక్తే ప్రధానం. అదే ఆయన ఎన్నుకున్న మార్గం. చేతకాక కాదు. (నిజానికి అందరు వాగ్గేయకారుల కృతులలో నూ ఇదే పరమప్రయోజనం). సాహిత్య పరంగా చూసినా కొన్ని కృతులు “జగదానందకారకా”, “బాల కనకమయ చేల” మొదలైనవి ఎన్నో కనిపిస్తాయి. త్యాగరాజ సాహిత్యం అంతా రామ మయం, ఇంకొక రామాయణం. అందంగా అనిపించడానికి , “భలే వేసారు ఇక్కడ ఈ పదాల కూర్పు” అనిపించుకోడానికి చేసిన ప్రయోగాలు కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పోతన గారి అంత్యానుప్రాస ప్రయోగ్రం ఎక్కువగా త్యాగరాజ కృతులలో కనిపిస్తుంది. ఎన్నో కావ్యాలు, కీర్తనలు అనేకమంది ప్రభువుల మీద, వారి భార్యల మీద, వారి ప్రేమికుల మీద రచించారు, సాహిత్య పరంగా మంచి విలువలు ఉన్నవి, రాగాలపరం గా వినసొంపుగా ఉండేవి. కాని అవేవి నిలబడలేదు. భారతీయ సంగీతానికి లక్ష్యం పరమాత్మని అందుకోవడమే. దానికి నవవిధ భక్తి ని ప్రమాణం గా తీసుకున్న వారి కృతులే అజరామరం గా నిలుస్తాయి. ఒక అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పురందరదాసు మొదలైనవి. కవిత్వం ఎంత గొప్పగా ఉన్నా, భక్తి లేనిది కేవలం వ్యర్ధమే….
బాలమురళి గారి గానం నాకెంతో ఇష్టం. కొన్ని కీర్తనలు భావం ఎరిగి ఆయన పాడినట్లు ఇంక ఎవరూ పాడ లేరేమో అని అనిపిస్తుంది. ఆయన కృతులు కూడా చాల బాగుంటాయి, బాలమురళి గారు కేవలం భక్తే కాకుండా విప్లవం, స్ఫూర్తి కూడా జోడించాను అన్నారు. నిజానికి వెతికితే త్యాగరాజ కృతులలో అవి కూడా కనిపిస్తాయి. “యజ్ఞాదులు సుఖమనువారాల” , “తెలియలేరు రామ”, మొదలైనవి. భక్తి ప్రధానం గా ఉండి మిగిలినవి అంతర్లీనం గా ఉంటె అది గొప్ప సంగీత సాహిత్యం అవుతుంది. కేవలం సాహిత్య విలువల కోసం ఒకరి కీర్తన కంటే ఇంకొకరిది బాగుంది అని, వీరి కృతులలో కంటే వీరి కృతులలో సాహిత్యం బాగుంది అని ఎలా అనగలం?
రహమతుల్లాగారూ, చిరు చిరు నగవుల, నీ చరణ కమలాన, పదవే పోదాము గౌరీ, రామయ తండ్రీ మొదలైన పాటలని వినిగాని రాగం చెప్పలేనండీ. మొదటి రెండూ విన్న గుర్తులేదు. మూడోది పహాడీగాని, మాండ్‌గాని కావచ్చు.
కాస్త చాదస్తంగా అనిపిస్తుందేమోగాని కొంతవరకూ కీబోర్డ్స్ వాయించడం వచ్చినవారికి కొన్నిపాటలకి స్వరాలో, కొన్ని సందేహాలకి సమాధానాలో ఇస్తే బావుంటుందేమో.
మొదటి వేంకటమఖి నాయక రాజుల కాలం లోని వాడు కాగా ముద్దు వేంకటమఖి మరాఠా రాజుల కాలం వాడు. చరిత్ర వీరికి సంబంధించినది ఇంకా మొన్నటి కాలమే గనక ఎంతోకొంత స్పష్టం గానే ఉంది. పైగా మనకన్నా తమిళదేశస్థులు ఈ విషయంలో శ్రధ్ధ చూపించారు. పరిశ్రమ చేయగలిగిన వారికి సంగతులు తెలుస్తాయి.
ఇంక సంగీత లక్షణ గ్రంధాలు అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. సంగీతం + సంస్కృతం రెండూ బాగా తెలిసిన వారు వీటిని గురించి మాట్లాడగలిగిన వాళ్ళు. చర్ల గణపతిశాస్త్రి గారిలాంటి వాళ్ళు సంగీత రత్నాకరం వంటి గ్రంధాలని తెలుగు చేసారనుకుంటాను. ఎవరన్నా ఇటువంటి పనులు చేయడం లో శ్రధ్ధ చూపించగలగాలి. మన వాళ్ళు పైపై విషయాలు మాట్లాడేసి బతికేయడానికి అందులోంచి అరకొరగా విషయాలని వివరించడానికి అలవాటు పడిపోయి ఉన్నవాళ్ళు మరి:)
మిగతా ఇతర శాస్త్రాలకి ఎలా అయితే లక్షణ గ్రంధాలున్నాయో, వాటి అనువాదాలున్నాయో సంగీతానికి సైతం ఉన్నాయి. ముందు తరాలు కృషి చేసి పెట్టాయి. మనం వాటిని నిలబెట్టుకోవడం లేదు.
సంకీర్తనా లక్షణం సంస్కృతంలో అన్నమయ్య రాసినట్టూ దానిని పెద తిరుమలయ్య వ్యాఖ్యానం రాసినట్టూ దానిని అనుసరించి సంకీర్తనా లక్షణాన్ని తాను తెలుగు చేసినట్టూ అన్నమయ్య పెద్ద మనవడైన చిన తిరుమలయ్య చెప్పాడు. అందులో ఆనాటి సంగీత లక్షణ గ్రంధాల ప్రస్తావనలున్నాయి. ఈ పుస్తకం ఒకప్పుడు టిటిడి అచ్చువేసింది. ఇవాళ ఆ ప్రతులు సైతం లేవు. వాళ్ళు మళ్ళీ దీనిని కూడా తిరిగి ప్రచురించలేదు. టిటిడి కి మరి డబ్బులకి కొరత. పనిచేసేవాళ్ళకి కొరత. విశ్వవిద్యాలయాలు తెలుగున పనిచాతకాని వాళ్ళతోనీ ముందుచూపు లేని వాళ్ళ తోనీ కదా నడుస్తున్నాయి. అంచేత వాటినించీ మనం ఏదీ ఆశించడానికి వీలేలేదు.
రమ గారూ,
మీరు ప్రస్తావించిన వేంకటమఖి మనవడు గురించి తెలుసు. కానీ ఆయనే లక్షణ గీతాలు రాసిన వ్యక్తి కాదేమోనని నా అభిప్రాయం. నేను వేంకటమఖి పూర్వీకులు తెలుగువారేనని చదివాను. నా పుస్తకాలు వెతికి వెలికి తీయాలి. ఎక్కడ వుందో? ఇది కూడా నేను సంపాదించిన చాలా పాత పుస్తకాల్లో ఉంది. ఎవరు ఈయన్ని తెలుగు వాడేనని రాసారో వెతికి చెబుతాను. దానికి కాస్త వ్యవధి కావాలి.
కంచి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి గురించి మీరు చెప్పినది నాకు తెలీదు. ఇహ రామామాత్యుల స్వరమేళకళానిధి ఆధారంగానే వేంకట మఖి “చతుర్దండి ప్రకాశికా” రాసినా, తన మేధస్సు కూడా జోడించి, కావాల్సినవి కొన్ని సంగ్రహించి, మిగతావి కొత్త ప్రతిపాదనలు చేసాడు. కొన్ని చోట్ల అయితే రామామాత్యుణ్ణి చాలా ఘాటుగా విమర్శించాడు. తప్పు పట్టాడు. మీరన్నట్లు ఇవి ఎవరూ తెలుగులో తిరిగి రాయడానికి ప్రయత్నించలేదు. సంగీత శాస్త్రం అంటే ఒక జడ పదార్థమన్న భావనే తెలుగు వారికి బలపడి పోయింది. విడమర్చి చెప్పే వారు లేక పోయారు.
నారాయణ గారు,మీ కవిత మొత్తమగా ఏమి చెపుతోంది,ఆధునికమయిన ప్రయాణములొ కూడ ప్రకృతిని చూసేటప్పటికి మనసు పరవశించి గతము వైపు పరుగెడుతోంది (లేదా బాల్యము వైపు). ఇది రెండు వ్యతిరేక దిశల ప్రయాణము. కాబట్టి దానిని స్ఫురించే విధంగా శీర్షిక ఉండాలని అనుకుంటాను.అది పొయిటిక్ గా కూడా ఉండాలని అనుకుంటాను. కనుక నేనైతే ఎండ_ నీడ అని పెడతాను.
అభినందనలతో
రామకృష్ణ
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి Paramjyothi Kompella అభిప్రాయం:
11/09/2011 3:52 pm

పహాడీ రాగం అందాలు గురించి Sunny అభిప్రాయం:
11/09/2011 11:52 am
“కోయీ నహీ హై ఫిర్ భి హై ముఝ్ కో క్యా జానే కిస్ కా ఇంతజార్” అన్న లతా పాట కూడానా? ఇది భలే తాళమ్ లో ఉంటుంది.
పహాడీ రాగం అందాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
11/09/2011 10:08 am
రహమతుల్లాగారూ, చిరు చిరు నగవుల, నీ చరణ కమలాన, పదవే పోదాము గౌరీ, రామయ తండ్రీ మొదలైన పాటలని వినిగాని రాగం చెప్పలేనండీ. మొదటి రెండూ విన్న గుర్తులేదు. మూడోది పహాడీగాని, మాండ్‌గాని కావచ్చు.
కాస్త చాదస్తంగా అనిపిస్తుందేమోగాని కొంతవరకూ కీబోర్డ్స్ వాయించడం వచ్చినవారికి కొన్నిపాటలకి స్వరాలో, కొన్ని సందేహాలకి సమాధానాలో ఇస్తే బావుంటుందేమో.
పహాడీ రాగం అందాలు గురించి nrahamthulla అభిప్రాయం:
11/09/2011 2:32 am
రోహిణీప్రసాద్ గారూ, సినిమా పాటలలో రాగాలను ఎలా గుర్తుపట్టాలో తెలిసేలా చేస్తున్న మీకృషి అభినందనీయం.నాకు రాగాలు తెలుసుకోవాలని కుతూహలం.సుబ్బరామన్ గారు పహాడీని మరుపురాకుండా చేశారు. చిరు చిరు నగవుల,నీ చరణ కమలాన,పదవేపోదాము గౌరీ,రామయ తండ్రీ…లాంటి పాటలలో పహాడి ఉందా?
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి rama bharadwaj అభిప్రాయం:
11/08/2011 11:47 pm
మొదటి వేంకటమఖి నాయక రాజుల కాలం లోని వాడు కాగా ముద్దు వేంకటమఖి మరాఠా రాజుల కాలం వాడు. చరిత్ర వీరికి సంబంధించినది ఇంకా మొన్నటి కాలమే గనక ఎంతోకొంత స్పష్టం గానే ఉంది. పైగా మనకన్నా తమిళదేశస్థులు ఈ విషయంలో శ్రధ్ధ చూపించారు. పరిశ్రమ చేయగలిగిన వారికి సంగతులు తెలుస్తాయి.
ఇంక సంగీత లక్షణ గ్రంధాలు అన్నీ సంస్కృతంలో ఉన్నాయి. సంగీతం + సంస్కృతం రెండూ బాగా తెలిసిన వారు వీటిని గురించి మాట్లాడగలిగిన వాళ్ళు. చర్ల గణపతిశాస్త్రి గారిలాంటి వాళ్ళు సంగీత రత్నాకరం వంటి గ్రంధాలని తెలుగు చేసారనుకుంటాను. ఎవరన్నా ఇటువంటి పనులు చేయడం లో శ్రధ్ధ చూపించగలగాలి. మన వాళ్ళు పైపై విషయాలు మాట్లాడేసి బతికేయడానికి అందులోంచి అరకొరగా విషయాలని వివరించడానికి అలవాటు పడిపోయి ఉన్నవాళ్ళు మరి:)
మిగతా ఇతర శాస్త్రాలకి ఎలా అయితే లక్షణ గ్రంధాలున్నాయో, వాటి అనువాదాలున్నాయో సంగీతానికి సైతం ఉన్నాయి. ముందు తరాలు కృషి చేసి పెట్టాయి. మనం వాటిని నిలబెట్టుకోవడం లేదు.
సంకీర్తనా లక్షణం సంస్కృతంలో అన్నమయ్య రాసినట్టూ దానిని పెద తిరుమలయ్య వ్యాఖ్యానం రాసినట్టూ దానిని అనుసరించి సంకీర్తనా లక్షణాన్ని తాను తెలుగు చేసినట్టూ అన్నమయ్య పెద్ద మనవడైన చిన తిరుమలయ్య చెప్పాడు. అందులో ఆనాటి సంగీత లక్షణ గ్రంధాల ప్రస్తావనలున్నాయి. ఈ పుస్తకం ఒకప్పుడు టిటిడి అచ్చువేసింది. ఇవాళ ఆ ప్రతులు సైతం లేవు. వాళ్ళు మళ్ళీ దీనిని కూడా తిరిగి ప్రచురించలేదు. టిటిడి కి మరి డబ్బులకి కొరత. పనిచేసేవాళ్ళకి కొరత. విశ్వవిద్యాలయాలు తెలుగున పనిచాతకాని వాళ్ళతోనీ ముందుచూపు లేని వాళ్ళ తోనీ కదా నడుస్తున్నాయి. అంచేత వాటినించీ మనం ఏదీ ఆశించడానికి వీలేలేదు.
రమ.
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి బ్రహ్మానందం అభిప్రాయం:
11/08/2011 7:51 pm
రమ గారూ,
మీరు ప్రస్తావించిన వేంకటమఖి మనవడు గురించి తెలుసు. కానీ ఆయనే లక్షణ గీతాలు రాసిన వ్యక్తి కాదేమోనని నా అభిప్రాయం. నేను వేంకటమఖి పూర్వీకులు తెలుగువారేనని చదివాను. నా పుస్తకాలు వెతికి వెలికి తీయాలి. ఎక్కడ వుందో? ఇది కూడా నేను సంపాదించిన చాలా పాత పుస్తకాల్లో ఉంది. ఎవరు ఈయన్ని తెలుగు వాడేనని రాసారో వెతికి చెబుతాను. దానికి కాస్త వ్యవధి కావాలి.
కంచి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి గురించి మీరు చెప్పినది నాకు తెలీదు. ఇహ రామామాత్యుల స్వరమేళకళానిధి ఆధారంగానే వేంకట మఖి “చతుర్దండి ప్రకాశికా” రాసినా, తన మేధస్సు కూడా జోడించి, కావాల్సినవి కొన్ని సంగ్రహించి, మిగతావి కొత్త ప్రతిపాదనలు చేసాడు. కొన్ని చోట్ల అయితే రామామాత్యుణ్ణి చాలా ఘాటుగా విమర్శించాడు. తప్పు పట్టాడు. మీరన్నట్లు ఇవి ఎవరూ తెలుగులో తిరిగి రాయడానికి ప్రయత్నించలేదు. సంగీత శాస్త్రం అంటే ఒక జడ పదార్థమన్న భావనే తెలుగు వారికి బలపడి పోయింది. విడమర్చి చెప్పే వారు లేక పోయారు.
-బ్రహ్మానందం
ఒక (అ)నాగరిక ఆనందం గురించి ramakrishna అభిప్రాయం:
11/08/2011 7:06 pm
నారాయణ గారు,మీ కవిత మొత్తమగా ఏమి చెపుతోంది,ఆధునికమయిన ప్రయాణములొ కూడ ప్రకృతిని చూసేటప్పటికి మనసు పరవశించి గతము వైపు పరుగెడుతోంది (లేదా బాల్యము వైపు). ఇది రెండు వ్యతిరేక దిశల ప్రయాణము. కాబట్టి దానిని స్ఫురించే విధంగా శీర్షిక ఉండాలని అనుకుంటాను.అది పొయిటిక్ గా కూడా ఉండాలని అనుకుంటాను. కనుక నేనైతే ఎండ_ నీడ అని పెడతాను.
అభినందనలతో
రామకృష్ణ
పాఠకులకు సూచనలు గురించి subbarao అభిప్రాయం:
11/08/2011 1:24 pm
అయ్యా ! నమస్కారము. ఈ రకమైన సాహిత్య సేవ చేయు చున్నందులకు మిమ్ములను అభినందించుచున్నాను. నా రచనలు పద్య రూపములో పంపుదును. మీ అంగీకారము తెలియ జేయ గోర్తాను.
ఇట్లు,
సుబ్బారావు పోచిరాజు
(రిటైర్దు తెలుగు పండితుడు)
[పై సూచనల ప్రకారంగా మీ రచనలు పంపిస్తే, పరిశీలించి ప్రచురణార్హమైనదీ లేనిదీ మీకు తెలుపగలము – సం.]
జనరంజని: మహానటి సావిత్రి గురించి nagaavrdhan అభిప్రాయం:
11/08/2011 11:59 am
I CONVEY MY HEARTFULL THANKS TO YOU FOR GIVING SUCH A RARE PROGRAMME
రెండు కవితలు గురించి బొక్కా ప్రేమ్ కుమార్ అభిప్రాయం:
11/08/2011 6:47 am
పాలలో నీరుందని ఎలా తెలుస్తుంది ?
తోడేసి మజ్జిగ చిలికే దాకా..
ఏటిలో చిరుచేప ఎలా ఈదుతుంది?
మొప్పలోని సత్తువ అయ్యేదాకా..
మండుటెండలో దాహం ఎలా తీరుతుంది..
చల్లదనం అందించే కోకు దొరికే దాక
గుండె లోతుల్లొ ఏముందో ఎలా తెలుస్తుంది.
తలుపుతట్టె ఆత్మీయత లభించే దాక…
ఈ కవితకు ప్రశంస ఎలాదొరుకుతుంది
చదివి స్పందించే కవి హృదయం దొరికేదాక…..