koteswararao గారికి
ఒక నవ్వూసు [‘నవ్వూసు’ జొక్ కు -నేను చేశానని నేననుకుటున్న- తెలుగు]
చాలా కాలం క్రితం ఒక పత్రికలో చదివినది జ్ఞాపకానికొస్తున్నది.
ఒక స్కూళ్ళ ఇన్స్‌పెక్టరు ఒక బళ్ళో ఒక తరగతిలో తెలుగు ఉపాధ్యాయుని సమక్షం లోనే పిల్లలను పరీక్షిస్తున్నాడు.
“హరిశ్చంద్రు డెవరు?”
పిల్లలు ఆనందంగా ముక్త కంఠంతో “NT రామారావు.”
“తప్పు, మీకు హరిశ్చంద్రు డెవరో గూడా తెలియదు.”
ఆ తెలుగు పంతులు గారందుకుని “పిచ్చి వెధవల్లారా ఆమాత్రం తెలియదూ, హరిశ్చంద్రుడు SV రంగారావు.”
స్కూళ్ళ ఇన్స్‌పెక్టరు కోపంతో ఊగి పోతూ “అయితే మీకూ తెలియదు, హరిశ్చంద్రుడు అద్దంకి శ్రీ రామమూర్తి.”
చాలా సరళంగా, చాలా లోతైన సమస్యను ఈ కథ చూపిస్తోంది. తమ జీవితంలో ప్రత్యమ్నాయ విలువలని ఆచరించిన తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అవే విలువల్ని ఒక సంప్రదాయం లాగా పాటించాలా? సమాజం పిల్లలకు నేర్పుతున్న విలువల ఒరవడిలో వాళ్ళని వెళ్ళనివ్వాలా? తమ జీవితాల్లో ఎదురైన సమస్యల నుంచి పిల్లలను రక్షించే ప్రయత్నంలో సమాజానికి లొంగిపోవడం నేర్పించాలా? సులువైన సమాధానాలు లేని ప్రశ్నలను క్లుప్తంగా లేవనెత్తి ‘ఇంత మౌనానికీ, ధ్యానానికీ’ వదిలేయడం రచయిత చేసిన మంచి పని.
మీ అనువాదం బాగా వచ్చింది. వ్యాసం నిడివి ఎక్కువైనందుకేమో అక్కడక్కడ కొన్ని భాగాలు వదిలేసినట్లున్నారు (అనువాద పద్ధతులపై ఆలోచనలు, ముగింపు భాగంలో కొంత…)
మీ అనువాదమూ, మూలమూ చదివాక ఆరుద్ర రాసిన ‘రాముడికి సీత ఏమవుతుంది’ చదివాను.రామానుజన్ వ్యాసం కన్నా ఆరుద్ర పుస్తకమే నచ్చింది నాకు.ఒక మౌలిమైన విభేదం: రామానుజన్ వ్యాస వస్తువు రామాయణ కథన వైవిధ్యాల పరిశీలన. సాహిత్యకారుడి దృష్టికోణం ఆయనది. ఆరుద్ర లక్ష్యం రామాయణ పాత్రల పుట్టుపూర్వోత్తరాలని సామాజిక పరిణామాల నేపథ్యంలో పరిశీలించటం.చారిత్రిక పరిశోధకుడి దృక్పథం ఆయనది.
నాకు ఇంకా అంతు పట్టని విషయం – ఈ వ్యాసానికి చరిత్రకూ ఉన్న సంబంధం ఏవిటని! ఇంగ్లీషు వ్యాస శీర్షిక (Three Hundred Ramayanas: Five Examples and Three Thoughts on Translation) సూచించినట్లు వ్యాసకర్త ప్రధాన ఉద్దేశ్యం: అనువాద పద్ధతుల పరిశీలన. దేశ కాల సమాజాల ప్రభావాలూ, కథకుడి దృక్కోణమూ, కథనాన్ని ఎంతో వైవిధ్యవంతం చేస్తాయని వివరించే ఈ వ్యాసం చరిత్ర విద్యార్థుల కన్నా సాహిత్య విద్యార్థులకు ఎక్కువ ఉపయుక్తమవుతుందేమో…
ఈ వ్యాసాన్ని పాఠ్యాంశాలలోంచి తొలగించాలని పట్టు పట్టడం ఖచ్చితంగా తప్పే,అసహిష్ణు రాజకీయాల కారణంగా జరిగినదే. అయితే, మూడేళ్ళ క్రితం ఈ వ్యాసాన్ని పాఠ్యాంశంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయం వెనకాల కూడా నాన్-అకడమిక్ ప్రోద్బలాలలున్నాయని అనుకుంటాను.
రాముడికి సీత చెల్లెలవుతుందనో లేక రావణుడినో, లక్ష్మణుడినో సీత మోహించిందనో ఎవరైనా రాస్తే నొచ్చుకునే వాళ్ళు ఉన్నారనే అనుకుంటాను. వాళ్లందరూ మత రాజకీయాల వాళ్ళు కారేమో. చిక్కెక్కడా అంటే కొన్ని వందల ఏళ్ళుగా రామాయణ మహాభారతాల స్థూల కథలు ఆదర్శీకరించబడి, మన సమాజానికి నైతికతా నిర్దేశం చేసే స్థాయిని సంపాదించుకున్నాయి. ఆ ఆదర్శీకృత కథనానికి విరుద్ధమైన కథనాన్ని వినిపించి ఒప్పించటం అంత సులభం కాదు. ఆరుద్ర కన్నా, రామానుజన్ కన్నా చాగంటి కోటేశ్వర రావుకే ఆదరణ ఎక్కువని నేననుకుంటాను.
(Apologies for commenting on the original essay and not Suresh’s able translation.)
IMO, it’s much ado about nothing. I find Ramanujan’s essay ordinary and the criticism mediocre.
The essay is obviously aimed at world audiences. A typical “survey paper”. That there are many adaptations of the Indian epics (Ramayana, Mahabharata) is hardly a discovery. And, that the author used one of the more salacious stories as his primary evidence/illustration is neither here nor there.
Ramanujan’s tiny value-add seems to be his argument that these are “tellings” and not “variants” since the authors of the later adaptations (the right word, IMO) may have used earlier adaptations as their source / starting point rather than the “original”. It’s not a big deal whether these various adaptations are called “tellings” or “variants”. It’s potato vs potahtoh. But, I have two issues with the logic employed.
First, whether or not Valmiki’s Ramayana is the original for the later adaptations should be decided based on to what extent the original story survives in these adaptations. And, not based on how a particular detail was added or deleted.
Secondly, I believe Michael Wood when he claims in the Story of India that the Indian epics (true of most world epics?) represent the accumulation of all the stories known to the civilization in a given age. Essentially, the authors of that time period would have worked all the stories/morals known to them into these works. In other words, Valmiki himself was more of a recorder/transcriber of all the stories known to his generation rather than the “original author”. (Chances are many people’s works over many generations have been ascribed to Valmiki — a conjecture on my part.) But, if we accept the claim that these epics are accumulations, then it’s natural to expect the text to evolve as new stories are added to the text and some are modified to fit the mores / ism’s of the time. That makes these adaptations a mere continuation of the “process of accumulation” through which it came into existence in the first place.
My final comment on the essay is that I find it difficult to believe Ramanujan’s implied claim that each adaptation was based only on the latest prior adaptation and never the original. I believe that it’s more likely that each writer used all the prior adaptations AND the original accessible to him. (In fact, this is one point that could easily be proven one way or the other.) As a side note, one may find interesting the story of how the many translations of The Art of War (by Sun Tze) built on each other as much as on the original.
ఆ సొగసంతా..మనదైన సంక్రాంతి పండగదే అంటే అతిశయోక్తి కాదేమో కదూ! నాకూ అంతే. ఆ ముగ్గుల లోగిళ్ళు దాటి రాబుధ్ధి కాదు.
చాలా థాంక్సండి రత్నాకర్ గారూ. పొద్దునే, ఈమాట తెరవగానే మీ మెచ్చుకోలు కనిపించింది. అంతే. గొప్ప ఉత్సాహమేసిపోయింది.
కృతజ్ఞతలతో…
– ఆర్.దమయంతి.
ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందించినందుకు కృతజ్ఞతలు.
“త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన.
త్యాగరాజు కృతుల్లో కాదు, త్యాగరాజు మనసులో (రామ) భక్తి తప్ప ఇంకేమీ లేదనిపిస్తుంది. తనకుతాను తాదాత్మ్యం చెంది పరవశంతో పాడినవే గాని, ఫలానాది రాయాలన్న తహతహ గాని సంకల్పంగాని కనీసం రాసానన్న కర్తృత్వ భావం సైతం కనిపించదు. కీర్తనలలో కనిపించే “త్యాగరాజనుత” ముద్ర సైతం తనను తానే సాక్షీభావంతో third person గా చూస్తూ విన్నవించుకుంటున్నట్టు గానే ఉంటుంది, ఎక్కువ చేసుకున్నట్టుగా ఉండదు.
చిన్నబిడ్డను ఎత్తుకునేటప్పుడు తల్లి పాత్రలో ఉన్న గొప్ప నటి, అనుగుణమైన దుస్తులు జోడించి, తగిన అలంకారాలు, ఆభరణాలు తొడిగి ముచ్చటపడడం ఒక ఎత్తు. కన్నబిడ్డను ఎత్తుకునేటప్పుడు సాదాసీదా తల్లి సైతం అంతే ఎరుకతో, అనుగుణమైన దుస్తులు జోడించి నప్పిన అలంకారం ఆభరణాలు తొడిగి ఎత్తుకోవడం ఇంకో ఎత్తు, ఏదో గమ్మత్తు. మొదటి సందర్భంలో బట్టలు నగలు పెట్టాననే స్పృహ ఎంత ఎక్కువో, రెండవదానిలో అంత తక్కువగా, అసలు పెట్టాననే భావంకన్నా బిడ్దకు తాను పెట్టుకున్నాననే సంబరమే ఎక్కువ, అసలు బిడ్డ పైనే మక్కువ. అంటే మిగితావి లేవనికాదు, అంతగా ప్రేమించే బిడ్డకు మంచి బట్ట నగ ఎందుకు పెట్టుకోదు, తనివితీరా పెట్టుకుంటుంది, అయినా బిడ్డే ప్రధానం. అట్లే ఆశ్చర్యమో లేక అంత ఆశ్చర్యం కానిదో- నిజమైన భక్తితో పలికిన కృతులలో కవిత్వం, విప్లవ సందేశాలు, స్ఫూర్తి సందేశాలు అవంతట అవే పెట్టని ఆభరణాలుగా చేరుతూండడం ఎప్పటికప్పుడు అబ్బురపరచే అంశం. అందుకే ఎన్ని ఏండ్లు గడిచినా, కాలం, పరిస్థితులు, భాష సైతం ఎంతగా మారినా, ఆ పదాలలో ప్రతి గుండెను ఇప్పటికీ తాకే ఏదో గమ్మత్తు సజీవంగా ఉందేమో అనిపిస్తుంది.
_____________
విధేయుడు
_శ్రీనివాస్
కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు గురించి TahaTaha అభిప్రాయం:
12/12/2011 7:22 am
koteswararao గారికి
ఒక నవ్వూసు [‘నవ్వూసు’ జొక్ కు -నేను చేశానని నేననుకుటున్న- తెలుగు]
చాలా కాలం క్రితం ఒక పత్రికలో చదివినది జ్ఞాపకానికొస్తున్నది.
ఒక స్కూళ్ళ ఇన్స్‌పెక్టరు ఒక బళ్ళో ఒక తరగతిలో తెలుగు ఉపాధ్యాయుని సమక్షం లోనే పిల్లలను పరీక్షిస్తున్నాడు.
“హరిశ్చంద్రు డెవరు?”
పిల్లలు ఆనందంగా ముక్త కంఠంతో “NT రామారావు.”
“తప్పు, మీకు హరిశ్చంద్రు డెవరో గూడా తెలియదు.”
ఆ తెలుగు పంతులు గారందుకుని “పిచ్చి వెధవల్లారా ఆమాత్రం తెలియదూ, హరిశ్చంద్రుడు SV రంగారావు.”
స్కూళ్ళ ఇన్స్‌పెక్టరు కోపంతో ఊగి పోతూ “అయితే మీకూ తెలియదు, హరిశ్చంద్రుడు అద్దంకి శ్రీ రామమూర్తి.”
అనుభవం గురించి V. Rajiv అభిప్రాయం:
12/12/2011 2:24 am
చాలా సరళంగా, చాలా లోతైన సమస్యను ఈ కథ చూపిస్తోంది. తమ జీవితంలో ప్రత్యమ్నాయ విలువలని ఆచరించిన తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అవే విలువల్ని ఒక సంప్రదాయం లాగా పాటించాలా? సమాజం పిల్లలకు నేర్పుతున్న విలువల ఒరవడిలో వాళ్ళని వెళ్ళనివ్వాలా? తమ జీవితాల్లో ఎదురైన సమస్యల నుంచి పిల్లలను రక్షించే ప్రయత్నంలో సమాజానికి లొంగిపోవడం నేర్పించాలా? సులువైన సమాధానాలు లేని ప్రశ్నలను క్లుప్తంగా లేవనెత్తి ‘ఇంత మౌనానికీ, ధ్యానానికీ’ వదిలేయడం రచయిత చేసిన మంచి పని.
సా విరహే తవ దీనా గురించి ellanti అభిప్రాయం:
12/12/2011 1:55 am
This is wonderful article worth reading by those who like old classics from Telugu movies most of which are in Sanskrit like Sa virahe.
I can’t type in telugu yet. But hoepfully one day I will. Please check ellanti.wordpress.com for variety of topics related to Telugu and history.
Special thanks to both authors. They are so blessed they can understand Sanskrit. I don’t understand Sanskrit and would love to.
మూడు వందల రామాయణాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
12/11/2011 3:17 am
సురేశ్ గారికి
మీ అనువాదం బాగా వచ్చింది. వ్యాసం నిడివి ఎక్కువైనందుకేమో అక్కడక్కడ కొన్ని భాగాలు వదిలేసినట్లున్నారు (అనువాద పద్ధతులపై ఆలోచనలు, ముగింపు భాగంలో కొంత…)
మీ అనువాదమూ, మూలమూ చదివాక ఆరుద్ర రాసిన ‘రాముడికి సీత ఏమవుతుంది’ చదివాను.రామానుజన్ వ్యాసం కన్నా ఆరుద్ర పుస్తకమే నచ్చింది నాకు.ఒక మౌలిమైన విభేదం: రామానుజన్ వ్యాస వస్తువు రామాయణ కథన వైవిధ్యాల పరిశీలన. సాహిత్యకారుడి దృష్టికోణం ఆయనది. ఆరుద్ర లక్ష్యం రామాయణ పాత్రల పుట్టుపూర్వోత్తరాలని సామాజిక పరిణామాల నేపథ్యంలో పరిశీలించటం.చారిత్రిక పరిశోధకుడి దృక్పథం ఆయనది.
నాకు ఇంకా అంతు పట్టని విషయం – ఈ వ్యాసానికి చరిత్రకూ ఉన్న సంబంధం ఏవిటని! ఇంగ్లీషు వ్యాస శీర్షిక (Three Hundred Ramayanas: Five Examples and Three Thoughts on Translation) సూచించినట్లు వ్యాసకర్త ప్రధాన ఉద్దేశ్యం: అనువాద పద్ధతుల పరిశీలన. దేశ కాల సమాజాల ప్రభావాలూ, కథకుడి దృక్కోణమూ, కథనాన్ని ఎంతో వైవిధ్యవంతం చేస్తాయని వివరించే ఈ వ్యాసం చరిత్ర విద్యార్థుల కన్నా సాహిత్య విద్యార్థులకు ఎక్కువ ఉపయుక్తమవుతుందేమో…
ఈ వ్యాసాన్ని పాఠ్యాంశాలలోంచి తొలగించాలని పట్టు పట్టడం ఖచ్చితంగా తప్పే,అసహిష్ణు రాజకీయాల కారణంగా జరిగినదే. అయితే, మూడేళ్ళ క్రితం ఈ వ్యాసాన్ని పాఠ్యాంశంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయం వెనకాల కూడా నాన్-అకడమిక్ ప్రోద్బలాలలున్నాయని అనుకుంటాను.
రాముడికి సీత చెల్లెలవుతుందనో లేక రావణుడినో, లక్ష్మణుడినో సీత మోహించిందనో ఎవరైనా రాస్తే నొచ్చుకునే వాళ్ళు ఉన్నారనే అనుకుంటాను. వాళ్లందరూ మత రాజకీయాల వాళ్ళు కారేమో. చిక్కెక్కడా అంటే కొన్ని వందల ఏళ్ళుగా రామాయణ మహాభారతాల స్థూల కథలు ఆదర్శీకరించబడి, మన సమాజానికి నైతికతా నిర్దేశం చేసే స్థాయిని సంపాదించుకున్నాయి. ఆ ఆదర్శీకృత కథనానికి విరుద్ధమైన కథనాన్ని వినిపించి ఒప్పించటం అంత సులభం కాదు. ఆరుద్ర కన్నా, రామానుజన్ కన్నా చాగంటి కోటేశ్వర రావుకే ఆదరణ ఎక్కువని నేననుకుంటాను.
శ్రీనివాస్
మూడు వందల రామాయణాలు గురించి Kondalarao Palaka అభిప్రాయం:
12/10/2011 1:15 pm
(Apologies for commenting on the original essay and not Suresh’s able translation.)
IMO, it’s much ado about nothing. I find Ramanujan’s essay ordinary and the criticism mediocre.
The essay is obviously aimed at world audiences. A typical “survey paper”. That there are many adaptations of the Indian epics (Ramayana, Mahabharata) is hardly a discovery. And, that the author used one of the more salacious stories as his primary evidence/illustration is neither here nor there.
Ramanujan’s tiny value-add seems to be his argument that these are “tellings” and not “variants” since the authors of the later adaptations (the right word, IMO) may have used earlier adaptations as their source / starting point rather than the “original”. It’s not a big deal whether these various adaptations are called “tellings” or “variants”. It’s potato vs potahtoh. But, I have two issues with the logic employed.
First, whether or not Valmiki’s Ramayana is the original for the later adaptations should be decided based on to what extent the original story survives in these adaptations. And, not based on how a particular detail was added or deleted.
Secondly, I believe Michael Wood when he claims in the Story of India that the Indian epics (true of most world epics?) represent the accumulation of all the stories known to the civilization in a given age. Essentially, the authors of that time period would have worked all the stories/morals known to them into these works. In other words, Valmiki himself was more of a recorder/transcriber of all the stories known to his generation rather than the “original author”. (Chances are many people’s works over many generations have been ascribed to Valmiki — a conjecture on my part.) But, if we accept the claim that these epics are accumulations, then it’s natural to expect the text to evolve as new stories are added to the text and some are modified to fit the mores / ism’s of the time. That makes these adaptations a mere continuation of the “process of accumulation” through which it came into existence in the first place.
My final comment on the essay is that I find it difficult to believe Ramanujan’s implied claim that each adaptation was based only on the latest prior adaptation and never the original. I believe that it’s more likely that each writer used all the prior adaptations AND the original accessible to him. (In fact, this is one point that could easily be proven one way or the other.) As a side note, one may find interesting the story of how the many translations of The Art of War (by Sun Tze) built on each other as much as on the original.
సిరుల సంక్రాంతి గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
12/09/2011 11:44 pm
సంక్రాంతి సొగసే అంత!
****
ఆ సొగసంతా..మనదైన సంక్రాంతి పండగదే అంటే అతిశయోక్తి కాదేమో కదూ! నాకూ అంతే. ఆ ముగ్గుల లోగిళ్ళు దాటి రాబుధ్ధి కాదు.
చాలా థాంక్సండి రత్నాకర్ గారూ. పొద్దునే, ఈమాట తెరవగానే మీ మెచ్చుకోలు కనిపించింది. అంతే. గొప్ప ఉత్సాహమేసిపోయింది.
కృతజ్ఞతలతో…
– ఆర్.దమయంతి.
కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు గురించి koteswararao అభిప్రాయం:
12/09/2011 11:03 am
super…అయినా బాలనాగమ్మ అంటే..svr,ntr,అంజలిది కదా? అదయితే youtubeలో ఉంది..ఓ వేళ కాకపోతే comedyగా నవ్వుకోకండి…
నా దగ్గర 1988 నుంచి సినిమా వారపత్రికలు ఉన్నాయి..మీకేమైనా అవసరం అవుతాయేమో?
నీళ్ళు కాచే పనిపిల్ల గురించి TahaTaha అభిప్రాయం:
12/08/2011 4:06 pm
ఇంకా ఆ నీళ్ళదగ్గరే ఉన్నాను.
గరిక పేని ఏనుగును కట్టేయడం చేతనయిన కవయిత్రి ఇంద్రాణి.
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
12/08/2011 3:59 pm
ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అందించినందుకు కృతజ్ఞతలు.
“త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన.
త్యాగరాజు కృతుల్లో కాదు, త్యాగరాజు మనసులో (రామ) భక్తి తప్ప ఇంకేమీ లేదనిపిస్తుంది. తనకుతాను తాదాత్మ్యం చెంది పరవశంతో పాడినవే గాని, ఫలానాది రాయాలన్న తహతహ గాని సంకల్పంగాని కనీసం రాసానన్న కర్తృత్వ భావం సైతం కనిపించదు. కీర్తనలలో కనిపించే “త్యాగరాజనుత” ముద్ర సైతం తనను తానే సాక్షీభావంతో third person గా చూస్తూ విన్నవించుకుంటున్నట్టు గానే ఉంటుంది, ఎక్కువ చేసుకున్నట్టుగా ఉండదు.
చిన్నబిడ్డను ఎత్తుకునేటప్పుడు తల్లి పాత్రలో ఉన్న గొప్ప నటి, అనుగుణమైన దుస్తులు జోడించి, తగిన అలంకారాలు, ఆభరణాలు తొడిగి ముచ్చటపడడం ఒక ఎత్తు. కన్నబిడ్డను ఎత్తుకునేటప్పుడు సాదాసీదా తల్లి సైతం అంతే ఎరుకతో, అనుగుణమైన దుస్తులు జోడించి నప్పిన అలంకారం ఆభరణాలు తొడిగి ఎత్తుకోవడం ఇంకో ఎత్తు, ఏదో గమ్మత్తు. మొదటి సందర్భంలో బట్టలు నగలు పెట్టాననే స్పృహ ఎంత ఎక్కువో, రెండవదానిలో అంత తక్కువగా, అసలు పెట్టాననే భావంకన్నా బిడ్దకు తాను పెట్టుకున్నాననే సంబరమే ఎక్కువ, అసలు బిడ్డ పైనే మక్కువ. అంటే మిగితావి లేవనికాదు, అంతగా ప్రేమించే బిడ్డకు మంచి బట్ట నగ ఎందుకు పెట్టుకోదు, తనివితీరా పెట్టుకుంటుంది, అయినా బిడ్డే ప్రధానం. అట్లే ఆశ్చర్యమో లేక అంత ఆశ్చర్యం కానిదో- నిజమైన భక్తితో పలికిన కృతులలో కవిత్వం, విప్లవ సందేశాలు, స్ఫూర్తి సందేశాలు అవంతట అవే పెట్టని ఆభరణాలుగా చేరుతూండడం ఎప్పటికప్పుడు అబ్బురపరచే అంశం. అందుకే ఎన్ని ఏండ్లు గడిచినా, కాలం, పరిస్థితులు, భాష సైతం ఎంతగా మారినా, ఆ పదాలలో ప్రతి గుండెను ఇప్పటికీ తాకే ఏదో గమ్మత్తు సజీవంగా ఉందేమో అనిపిస్తుంది.
_____________
విధేయుడు
_శ్రీనివాస్
నీళ్ళు కాచే పనిపిల్ల గురించి uma makala అభిప్రాయం:
12/08/2011 10:17 am
Wow Indrani garu..ur poem is too good! in simple language u have expressed so much.