పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి HaTaHaTa అభిప్రాయం:

    01/10/2012 12:35 pm

    తహతహ గారు ఇలా అన్నారు:

    ‘వాల్మీకి మనకేమీ చెప్పలేదు’ అంటూనే వ్యాసకర్త ‘మనకు తెలుసు’ అనటం నిరాధారంగా ‘మనం’, ‘మనకు తెలుసు’ అంటే ఎంత నేరమో అంత కన్నా ఎక్కువ నేరం.

    ఇది వెల్చేరుగారు రాసిన ఈ వాక్యాల గురించి:

    “వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు.”

    తహతహ గారు: “మనం”, “మనకు తెలుసు”, “మనకేమీ చెప్పలేదు” అనడం ఒక రకమైన రచనాశైలి (writing style). కథను స్థూలంగా చెబుతూ, పాఠకుకుని ఆసక్తి తగ్గిపోకుండా ఉండడానికి “We”, “We know that”, “We will find out” అని వాడడం ఇంగ్లీషులో రాసే చాలామంది పండితులు ఉపయోగించే టెక్నిక్.

    ఇక్కడ “మనకి తెలుసు” అన్నది రాముడు, సీత, లక్ష్మణుడు మాత్రమే అడవికి వెళ్ళారని రామాయణం గురించి ఏ మాత్రం తెలిసిన పాఠకునికైనా అర్థమయ్యే విషయమని చెప్పడం. ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తాననడం వాల్మీకి రామాయణంలో లేదు. తెలుగువాళ్ళు అల్లిన కథలో “ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది” అని చదవగానే రామాయణం తెలిసిన పాఠకుడు “కానీ లక్ష్మణుడు ఒప్పుకోడు” అని ఊహిస్తాడు. పాఠకుడు ఊహిస్తున్న విషయాన్ని రచయిత బలపరచడం ద్వారా రచన పాఠకునికి చేరువౌతుంది. ఇది నాకర్థమైన విషయం.

  2. పొదుపు సమీకరణాలు గురించి siva subrahmanyam అభిప్రాయం:

    01/10/2012 12:32 pm

    చాలా బాగుంది

  3. వేణునాదం ఆగింది! గురించి మోహన అభిప్రాయం:

    01/10/2012 12:18 pm

    ఆల్ ఇండియా రేడియో కాలంలో విజయరాఘవరావుగారి పేరు ఎక్కువగా వినబడేది. అతడు గొప్ప కళాకారుడన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. మన శ్రద్ధాంజలిని తగిన రీతిగా చూపడము సబబే. ఇక పోతే లైలాగారి ఆక్షేపణ అంతా బ్రదికి ఉన్నవారిపైన ఎందుకు వ్రాయడము లేదు అనేదే. మదరాసులో చిన్నప్పుడు నేను బడిలో చదివేటప్పుడు జూను బతికిన కాలేజి అని, మ్యూసియమును చచ్చిన కాలేజి అని వ్యవహరించే వాళ్లము. అలా ఈమాట చచ్చిన కాలేజి మాత్రమే కాకుండా బతికిన కాలేజిగా కూడ ఎందుకు ఉండరాదు అనేదే ప్రశ్న. బహుశా సంపాదకులు ప్రముఖాంధ్రుల 60 లేక 70 ఏళ్ల వయస్సును చేరేవారి పట్టికను తయారు చేసి వారు తెలుగు సాహిత్యానికి, లలిత కళలకు ఎలాటి సేవ చేసారో అనే విషయాన్నిగురించి సంచికలను తయారు చేయవచ్చును. అందులో ఆ కళాకారుని కూడ వ్రాయమనవచ్చును. అలా భద్రిరాజు కృష్ణమూర్తిని గురించి ఇంతకు ముందు ఒక సంచిక వెలువడింది. అలాగే అట్టి ప్రయత్నాలను కొనసాగించమనే లైలాగారు భావిస్తున్నారని నేను అనుకొంటాను. విధేయుడు – మోహన

  4. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    01/10/2012 12:16 pm

    రవి,

    1. ఇక్కడ “సంభాషణా చాతుర్యం” అంటే మీరు “చమత్కారం” అని అర్థం చేసుకున్నట్టున్నారు. నా ఉద్దేశం అది కాదు, అవతలి వారన్నదానికి తగ్గట్టుగా మాట్లాడే నేర్పు అని. “స్త్రీ మనసుకు నచ్చిన ఊహలు” – ఇక్కడ స్త్రీ మనసుకు నచ్చిన ఊహ ఏమిటి? ఒక భర్త తన భార్యతో ఆమె మాటలకి అనుగుణంగా మాట్లాడడం స్త్రీల మనసుకు నచ్చని విషయమంటారా? 🙂

    2. “స్త్రీల పాటలకు, పురుషుల నిస్సహాయతను వారు ఊహించి ఆనందించే మౌఖిక సాహిత్యం లో అన్వయాన్ని వస్తుతః లేదా రచనా సంవిధానపరంగా కాక, పాడుకునే వారికి కలిగే ఆనందాన్ని అనుసరించి ఊహించడం సబబేమో”

    ఇది కాస్త ప్రమాదకరమైన ఆలోచన. ఒకటి – పురుషుల నిస్సహాయత స్త్రీలు ఆనందిస్తారని సాధారణీకరించి సూత్రీకరించడం చాలా తప్పు. అలా సూత్రీకరించడం “మగ”తనానికి సంతృప్తినిస్తుందేమో! రెండు – అలా సూత్రీకరించినా, అది పాట మొత్తానికి అన్వయం కావాలి కదా. మీరన్న ఆ స్త్రీలు తాము పరపురుషుడిని చూసి భయపడినట్టుగాను, తన భర్త కాళ్ళ మీద పడ్డట్టుగాను ఊహించుకోడానికి ఇష్టపడతారా? మూడు – ఇక్కడ వ్యాసంలో, పాటని బట్టి పాతకాలపు స్త్రీల స్థితిగతులని మనస్తత్వాన్నీ ఊహించే్ ప్రయత్నం జరుగుతోందా, స్త్రీ మనస్తత్వాన్ని బట్టి పాటని అర్థం చేసుకొనే ప్రయత్నం జరుగుతోందా?

  5. కవిత్వంలో శ్రీశ్రీ ప్రస్థానం, పరిణామం గురించి మోహన అభిప్రాయం:

    01/10/2012 12:05 pm

    శ్రీశ్రీపైన ఈమాట ప్రత్యేక సంచికను ఇక్కడ చదువగలరు. విధేయుడు – మోహన

  6. వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/10/2012 12:00 pm

    లైలాగారూ, నా వెర్రి మీకు తెలియదు లెండి.

    2007లో అట్లాంటాలో ఉన్నప్పుడు అప్నా అనే ఒక సంస్థ మొదలయింది. దాన్ని ప్రారంభించిన వ్యక్తులు నాకు తెలుసు గనక ప్రారంభోత్సవానికి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో బాటుగా విజయరాఘవరావుగారిని కూడా ఆహ్వానిస్తే బావుంటుందని నేను సూచించాను. కాస్త తటపటాయించి ఆ ప్రయత్నం విరమించారు.

    నాకు వీలున్నంతవరకూ ఇంకా చాలా సందర్భాల్లో చాలామందితో ఈ సంగతి చెప్పి, ఒక పద్మశ్రీ అవార్డుతో అయినా ఆయనను మనం గుర్తించాలని చెప్పాను.

    బతికుంటేనేం, లేకపోతేనేం అనే మీవంటివారి వైఖరి ఉంటే ఏమీ జరగదు కదా. పైగా మీకు ఆయనొక పబ్లిక్ ఫిగర్ కావచ్చు. నాకు పరిచయం ఉంది కనక కాస్త సీరియస్‌గా అనిపిస్తుంది. అర్థం చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు.

  7. వేణునాదం ఆగింది! గురించి lyla yerneni అభిప్రాయం:

    01/10/2012 11:38 am

    ఉత్తమ కళాకారులను మరణించాక తలుచుకోవడంకూడా తప్పేనని లైలాగారివల్ల తెలిసింది!- రోహిణీప్రసాద్

    మరణించినప్పుడే ఉత్తమ కళాకారులు యాదిలొకి వస్తారా? లేక మరణించినందువలన అప్పుడు ఉత్తమ శ్రేణిలోకి జేరతారా. ఒక కళాకారుని చనిపోయినప్పుడే, ఎందుకు పరిచయం చెయ్యటం? కళ అంతకు ముందునుండీ ఉందిగా. తర్వాత కూడా ఉంటుంది. ఇతర పత్రికలు, సాహిత్య సంగీత కళల విషయాలు ఎప్పటికప్పుడు పరిచయం చేస్తుంటారు. విషయాలు మారుతూ ఉంటాయి. ఆసక్తి దాయకంగా ఉంటాయి. ట్రిబ్యూట్లు మీకొక రిపొర్టింగ్ సెన్సేషనలిసమ్. అది మీ ఆచారం. ప్రజలందర్నీ ఈ వ్యక్తి చనిపోయాడు, చనిపోయాడు, ఇప్పుడు స్పందించండో అని synchronise చెయ్యటం. ఒక వ్యక్తి మరణిస్తేనే వేణు నాదం ఆగిపోతుందా? ఏమిటా హెడ్డింగ్ ? ఏమిటీ వెర్రి? రోహిణీ ప్రసాద్?

    మరణించినప్పుడే కళాకారులను గుర్తు చేసుకోటానికి, పరిచయం చెయ్యటానికి, మీరిచ్చే కారణం?

    లైలా.

  8. కవిత్వంలో శ్రీశ్రీ ప్రస్థానం, పరిణామం గురించి k s hareesh kumar అభిప్రాయం:

    01/10/2012 11:06 am

    రావు గారు వ్రాసినది నిజము. Sri Sri కవిత ప్రస్థానము మహా ప్రస్థానముతొనె ఆగిపొయినది. I fully agree with the views of Sri Rao. We do not know much about his earlier works. So therefore, it can be safely concluded that other than Mahaprasthanam, there is vacuum pre- Mahaprasthanam and Post -Mahaprasthanam. It’s a great analaysis by Rao. It would have been useful for the readers had he analyzed the reasons for which Sri Sri could not or did not produce anything worth after Mahaprasthanam. I have read about the life journey of Sri Sri from various angles and the reasons for such a vacuum in my opinion are as under: (of course, everyone of us knew about it-but for recapitulation).

    Sri Sri had struggled to make his both ends meet. Except for showering empty praises on him by the people, nothing has been done by any one to come to his rescue. He was being called as a Mahakavi when he was in terrible penury. If he were not born as a Telugu, probably he would have lived a dignified life. So, it is purely because of our Telugus that we could not get any thing more than Mahaprasthanam from Sri Sri. We have to blame ourselves for that. So, in the melee, he had lost himself and could not produce any literature that is worth. Sri Sri lived from hand to mouth before entering cinema field. He could make money on entering cinema industry but lost his poetic glory and had to confine himself to routine cinema stuff and involve himself in nitty gritty of film making. In the process, he had alienated himself from main stream poetry and has become a part-time poet.

    The other reason for the downfall of Sri Sri was his staunch belief in Communism/Marxism etc., He thought them to be panacea for all problems. But, I believe, he was not a practicing communist. This conflict also added to his confusion. Mahaprasthanam had become a great work since it was an outcome of his heart felt feelings whereas Post-Mahaprasthanam, he was being identified as a Communist and not as a Poet. So, he stooped to the level of a communist from poet and therefore he did not contribute anything thereafter.

    This is my opinion. I would request the author Mr.Rao himself to evaluate the reasons for his degeneration as a poet.

  9. నన్ను ఎవరో చదివారు గురించి కెక్యూబ్ వర్మ అభిప్రాయం:

    01/10/2012 10:19 am

    చాలా నచ్చింది Sir..

  10. వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/10/2012 10:03 am

    ఉత్తమ కళాకారులను మరణించాక తలుచుకోవడంకూడా తప్పేనని లైలాగారివల్ల తెలిసింది!