పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి మోహన అభిప్రాయం:

    02/24/2012 11:06 am

    దీనినే కన్నడములో నొణ కాట (ఈగ బాధ) అంటారు. నొణ పదములో నకారము, ణకారము రెండూ ఉన్నాయి కదా! కర్ణాటకాన్ని ణకారముతోనే పలకాలి కాని హిందీ ప్రభావమువల్ల నకారముగా కూడ పలుకుతారు. ణకారము ఒత్తుతో ఉండే పదాలైన వర్ణము, స్వర్ణము, కర్ణము, చూర్ణము మొదలగు పదాల ఉచ్చరణలో కూడ ఈ దోషము సర్వసాధారణమే. కర్ణాటక సంగీతములో ఉండే కర్ణాటకము వేరు, ఇప్పటి కర్ణాటక రాష్ట్రము వేరు. కొన్ని శతాబ్దాలముందు ఇప్పటి రాయలసీమ, నెల్లూరు, ఆర్కాడు, చెంగల్పట్టు ప్రాంతాలన్నీ కర్ణాటకమనే వ్యవహరించబడేది. కర్ణాటక యుద్ధాలు జరిగింది కర్ణాటక రాష్ట్రములో కాదు, తమిళనాడు ప్రాంతాలలో. కర్ణాటక సంగీతానికి ఆద్యులైన శ్రీపాదరాయలు, వ్యాసరాయలు, పురందరదాసు, కనకదాసు, మున్నగువారు అందరూ ఇప్పటి కర్ణాటక రాష్ట్రానికి చెందినవాళ్లే. నా ఉద్దేశములో కర్ణాటకమే సరి. హిందుస్తానీ విషయములో హిందూస్థానీ, హిందుస్తాని రెండు సరియే, కాని సామాన్యముగా హిందుస్తాని అనే అంటారు. ఇది పారసీక భాషా ప్రభావమే, ఉదా. పాకీస్తాన్, హిందుస్తాన్, రేగిస్తాన్, ఇత్యాదులు. విధేయుడు – మోహన

  2. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి తఃతః అభిప్రాయం:

    02/24/2012 10:59 am

    భాష వేరు సాహిత్యం వేరు అన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ ఎటువంటి విషయాన్నయినా – సాహిత్యవిషయం కాకపొయినా – భాషలొనే వ్యక్తీకరించటం జరుగు తుంది కాబట్టీ , పెద్దలు చేసిన దానినే పిన్నలు అనుసరిస్తారు గాబట్టీ భాషా విషయకం గా సరియైన పద్ధతి లొ వ్రాయటానికి ప్రయత్నించటం సర్వదా అభిలషణీయం

  3. ఒక నేను, కొన్ని నువ్వులు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    02/24/2012 10:22 am

    ఈమాట బాట వెంట నడుస్తూ పోతుంటే, దోవలో చిన్న బిళ్ళ ఒకటి కనిపించింది. ముచ్చికాగితంలో చుట్టబడిన బిళ్ళ. కాగితమ్మీద ఏదో రాసుంది. “ఒక నేను, కొన్ని నువ్వులు”.
    పేరు బట్టి రుచి తెలీదు కదా! విప్పి, నోట్లో వేసుకున్నాను. బిళ్ళ నాలికని తాకగానే ఏదో తెలిసిన రుచే తీయతీయగా తగిలింది. బాగానే ఉందే అని చప్పరించడం మొదలెట్టాను. మెల్లమెల్లగా కరుగుతోంది. చల్లచల్లగా రుచి మారుతోంది. తీపిదనం తగ్గింది. మరికాస్త కరిగేసరికి రుచంటూ తెలియకుండా పోయింది. ఏమిటి చెప్మా అని చప్పరింపు కొనసాగించాను. పులుపో వగరో తెలియని రుచి నాలికంతా వ్యాపించడం మొదలుపెట్టింది. అలా అలా వగరు కాస్తా చేదై, చేదు పెను చేదై అది నోరంతా పట్టేసింది. గబుక్కున ఆ బిళ్ళని ఉమ్మేయాలనిపించింది. కానీ చూద్దును కదా అప్పుడింక బిళ్ళేదీ! అప్పటికే మొత్తం కరిగిపోయింది! నోరంతా చేదు మిగిలిపోయింది.
    దాని పేరు “ఒక నేను, ఎన్నో నువ్వులు” అని మార్చుకున్నాను.

  4. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి Rohiniprasad అభిప్రాయం:

    02/24/2012 9:47 am

    కర్ణాటక తప్పని కొందరు అన్నారు. అది రాష్ట్రం పేరు కదా అని నేనూ మానేశాను. హిందీ ప్రకారం స్తాన్ కనక కనక హిందుస్తానీ తప్పుకాదేమో. ఏమైనా ఇది సాహిత్యవిషయం కాదుగదా.

  5. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి Girija Dwibhashyam అభిప్రాయం:

    02/24/2012 7:43 am

    Rohiniprasadgaru,
    I feel, your music-related articles are always a treasure to preserve, for all music-lovers/students. I am doing a radio show in TORILIVE [http://www.teluguoneradio.com/] , which is an online global radio, a program ‘Swara madhuri’. Its on all Mondays 10.30pm IST. It a raga-based film songs program.
    I thank you for allowing me to use the info given in your articles and also allowing me to name you too, in my radio show. With regards- Girija.

  6. మూడు వందల రామాయణాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    02/24/2012 2:19 am

    ఫణీంద్ర గారూ,

    “అన్నా చెల్లెళ్ళ మధ్య వివాహాలను ఇస్లాం అంగీకరిస్తుంది”???

    నాకు తెలిసి ఇస్లాం ఫస్ట్ కజిన్స్ (పెదనాన్నా, చిన్నాన్నా) పిల్లల మధ్య వివాహాలను అంగీకరిస్తుంది.

    సురేశ్ గారూ,

    వెస్సాంతర జాతకాన్నీ (VJ), అయోధ్య కాండ (AK) నూ, దశరథ జాతకాన్నీ (DJ) తులనాత్మకంగా పరిశీలించిన ఓ వ్యాసాన్ని చదివాను. రచయిత పేరు రిచర్డ్ గోంబ్రిక్ (Richard Gombrich, నా ఉచ్చారణ తప్పు కావచ్చును). ఇదీ లింకు. అయోధ్య కాండకూ, వెస్సాంతర జాతకానికీ మధ్య కథావస్తువులలో, కథనంలో, ఎంచుకున్న వర్ణనలలో చాలా పోలికలను చూపిస్తారా రచయిత.

    దశరథ జాతకం అయోధ్య కాండనూ, వెస్సాంతర జాతకాన్నీ కలగలిపి రాసిన పేలవమైన కథ అని అభిప్రాయపడతారు. (రెండు జాతక కథల అజెండా – “హిందూ” సమాజాన్నీ/ఆదర్శాలనూ విమర్శించడమే అంటారు.)

    Gombrich does not think much of DJ’s suggestion of the consanguineous relationship of Rama and Seeta. Unlike Arudra who read a hint of evolving social mores in it and unlike Jacobi who thought that this was consistent with the Sakya/Koliya traditions, Gombrich thinks that this could be just a minor (?) aberration resulting from the author’s attempt at replay of VJ’s sequence of events by AK’s characters.

    As far as the timelines are concerned, Gombrich thinks that VJ’s verses might not have been later than 3rd century BC (earlier than any of the written Ramayanas) and its prose might date back to 5th century AD). He thinks that DJ could have been written in 5th century AD.

  7. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి Bhavabhooti అభిప్రాయం:

    02/23/2012 12:34 pm

    మీరు కర్ణాటకని కర్నాటక అని రాస్తున్నారు. అలాగే, హిందూస్థానీని హిందూస్తానీ అంటున్నారు. కారణమేమైనా ఉందా? కేవలం పలికే విధంగా రాద్దామన్న సరళీకరణా?

  8. మారిన కాలం మారిన మనుషులు గురించి k.t.devi అభిప్రాయం:

    02/22/2012 10:31 pm

    మధ్యతరగతి జీవితాల గురించి హృదయానికి హత్తుకుపొయే విధంగా వ్రాశారు.బంగారం కుదువ పెట్టకుండా, అప్పు చేయకుండా చదివించలేని రోజులువి.ఇంత మంచి అనువాదకథ అందించిన మీకు ధన్యవాదాలు.

  9. మూడు వందల రామాయణాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    02/21/2012 10:40 am

    తః తః గారి వ్యాఖ్య పూర్తిగా అర్థం కాలేదు నాకు. నాకు అర్థమయినంత మేరకు –

    B.A. స్థాయికి ఈ పాఠం సమంజసమో కాదో నాకు తెలీదు కానీ, ఇది చరిత్ర పాఠమేనా అని నాకు అనుమానం. అందుకే “ఈ వ్యాసం చరిత్ర విద్యార్థుల కన్నా సాహిత్య విద్యార్థులకు ఎక్కువ ఉపయుక్తమవుతుందేమో…” అని రాసాను.

    “ఈ వ్యాసాన్ని పాఠ్యాంశంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయం వెనకాల కూడా నాన్-అకడమిక్ ప్రోద్బలాలలున్నాయని” నాకు అనిపించింది. అదలా ఉంచితే, “అసహిష్ణు రాజకీయాలు” అన్న మాటను politics of intolerance అనే మాటకు అనువాదంగా వాడినట్లున్నాను. నేను చదివిన కొన్ని వ్యాసాల ఆధారంగా నేను ఏర్పరచుకున్న అభిప్రాయం అది. ఆ అసహిష్ణుత మరే ఇతర రాజకీయాలకో ప్రతిక్రియాత్మకం కావచ్చు కానీ అది వీధుల్లో ప్రదర్శనగా వ్యక్తమై, విశ్వవిద్యాలయాల నిర్ణయాలను ప్రభావితం చేయటం జరిగిందని, అది తప్పని అనుకున్నాను. కాదంటారా?

  10. మూడు వందల రామాయణాలు గురించి Phaneendra అభిప్రాయం:

    02/21/2012 4:41 am

    సురేష్ గారూ… మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. బుద్ధుడూ, వ్యాసుడూ వాల్మీకి కంటే పూర్వీకులని అంటారు. ఇంక చెప్పగలిగేదేముంది? మాట్లాడగలిగేదేముంది? బౌద్ధ వాజ్ఞ్మయంలో సీతా రాములు అన్నా చెల్లెళ్ళా! బాగు బాగు. అన్నా చెల్లెళ్ళ మధ్య వివాహాలను ఇస్లాం అంగీకరిస్తుంది కాబట్టి వాల్మీకి మహమ్మద్ ప్రవక్త కంటె తరువాతి వాడు అన్నదే తరువాయా? హతోస్మి.

    ఫణీంద్ర పురాణపండ