పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. తెలుగు భాష వయస్సెంత? గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    02/29/2012 2:14 am

    సురేశ్ గారూ,
    వృత్తి రీత్యా భాష /సాహిత్యాలలొ ఉపన్యాసకులుగా ఉన్నవారిలో కనపడని వినయం, సంశయాత్మక గళం ముచ్చటగా ఉన్నయ్యి. You are justified in focusing exclusively on the obverse side of the issue.The ever conspicuous predilection for imitating any other language, be in Sanskrit, Persian , Portuguese, or English, not only in lexicon, but also in syntax may soon be tapered off. Your unique non assertive tone prompts the reader to ask for more.

    I request you to acknowledge the considerable contribution rendered in connection to Dravidian roots by Koraada Rama Krishnayya Pantulu గారు. Many thanks for the hopeful drift you have incorporated in the essay.

    yours
    S B N

  2. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి తఃతః అభిప్రాయం:

    02/28/2012 7:19 pm

    సురేశ్ :మీ ‘ప్రత్యభిప్రాయా’నికి అందులొ మీరు ఇచ్చిన ‘నతి’ సూత్ర వివరణకీ ధన్యవాదాలు. [మాన ప్రమాణాలూ, దాన ప్రదానాలూ కాస్త తెలిసినట్టుగా ఉంది] ఉటంకింపబడిన పుట్టపర్తి వారి ‘ముదావహం’ ఆధారంగా కరునాడు సంగీతం – లేదా దీని ‘వడక్కు’ రూపం కరు నాటి సంగీతం – అన్నది గూడా తమిళులే ఐయ్యుంటారేమోననీ ప్రకర్షా ప్రియులు దీన్ని మెల్లిగా కర్ణాటక సంగీతంగా తయారు చేశారేమోననీ, భాష్య కారులు ఈ రూపానికి నిరుక్తాలు తయారు చేశారేమోననీ అన్నాను. నేను చూపిన పుస్తకం లోని 15, 16 పుటల నుంచి ఎత్తి రాసిందే మిగతాదంతా.

  3. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    02/27/2012 7:19 pm

    తఃతః గారు: నా పేరు సురేష్ అనే చాలామంది రాస్తారు. దానికి క్షమాపణలు అక్కరలేదు. సంగీతం గురించి రాసిన వ్యాసంపై భాషాసంబంధమైన చర్చ పొడిగించడం ఎందుకని ఊరుకున్నాను.

    మోహన గారూ – ఈ “ణ” కారం చాలా సంస్కృ త పదాల్లొ నకారానికి ముందు “ర” కారం జల్లటం వల్ల వస్తుందన్న పరిశీలన ఉందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది

    మీరు చెప్పిన ఈ ‘నతి’ సూత్రం చాలా ఆసక్తికరమైనది. ఈ సూత్రాన్ని పాణిని కంటే ప్రాచీనమైన ఋగ్వేద ప్రాతిశాఖ్యలో అయిదవ పటలంలో చాలా విపులంగా చర్చించారు. ఉత్తరాయణం లో ‘ణ’ ఎందుకు వస్తుందో, దక్షిణాయనంలో ‘న’ కారం ఎందుకు ఉందో దీనివల్ల తెలుస్తుంది. /ష/, /ర/, /ఋ/, /ౠ/ కారాల తరువాత మధ్యలో మూడు మధ్య వర్గాల అక్షరాలు రాకుండా వచ్చే /న/ కారం /ణ/ కారంగా మారుతుంది, (“త్రిభిశ్చ మధ్యమైర్వర్గైః లశసైశ్చ వ్యవాయే న” — మహాభాష్య). అందుకే దేశ భాషలలో కర్నాటక అని రాసినా సంస్కృతంలో కర్ణాటక అని రాయడం సముచితం. “కర్ణాటక సంగీతం” అని రాసే సంప్రదాయం గత అయిదు శతాబ్దాలనుండీ ఉంది కాబట్టి అలా రాయడాన్ని నేను తప్పు పట్టను.

    మీరు ఉటంకించిన తమిೞ పద్యంలో ‘కరునాడు’ అంటే ఆంధ్రదేశమేనని చెప్పడానికి ఆధారాలు లేవండి. జయంకొండర్ రాసిన కళింగత్తుపరణి లోని అసలు పద్యం ఇది:

    “మೞలైత్ తిరుమొೞಿయిల్ సిల వడుగుం సిల తమిೞುಂ
    కుೞఱిత్తరు కరునాడియర్, కుఱుగిక్ కడై తిఱమిన్‌”

    దీని గురించి ఇంకా వివరంగా చర్చించాలంటే ఈ వ్యాసపు అభిప్రాయపేటిక సరైన వేదిక కాదేమో.

  4. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి తఃతః అభిప్రాయం:

    02/27/2012 4:57 am

    రోహిణీ ప్రసాద్ గారూ మీరు ఎత్తి చూపినట్టు నేను సురేశ్ అనే రాయవలసినది. సురేశ్ గారికి వారి పేరు పొరపాటుగా రాసినందుకు క్షమాపణలు. భాషకు అక్షరాలు సంగీతానికి స్వరాల లాంటివేమో. చాలా సందర్భాల్లో అన్యస్వరం బాలమురళి ప్రతిమధ్యమావతి లాగా అందాన్నే తెస్తుందనుకుంటాను, సురేశ్ కు బదులు సురేష్ అని రాయటం అలా లేదా?

  5. నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    02/26/2012 11:56 pm

    “Ode to the Medieval Poets”
    ఎక్కడో ఇస్మాయిల్ గారనుకుంటా, మన పాత కవిత్వమంతా ఆర్భాటమయం, మామూలు మనుషులు అసలు కనిపించరు అన్నారు . కాని, ఈ పద్యం విని, మీ విశ్లేషణ చదివితే, మన భాష మీద గర్వంతో ఉప్పొంగి పోకుండా ఉండలేము.

    నాకీ మధ్యనే Garrison Keillor పుణ్యమా అని తెలుసుకున్న Auden పద్యం గుర్తుకొచ్చింది:

    “Chaucer, Langland, Douglas, Dunbar, with all your
    brother Anons, how on earth did you ever manage,
    without anaesthetics or plumbing,
    in daily peril from witches, warlocks,

    lepers, The Holy Office, foreign mercenaries
    burning as they came, to write so cheerfully,
    with no grimaces of self-pathos?”

    “I would gladly just now be
    turning out verses to applaud a thundery
    jovial June when the judas-tree is in blossom,
    but am forbidden by the knowledge
    that you would have wrought them so much better.”

    “కవిత్వపు తామరాకు మీద నీటిబొట్టు లాగా నిల్చిన కవి,” అన్నారు మీరు. “తిక్కన ప్రతిభ” అన్న ప్రసంగంలో, కృష్ణశాస్త్రి, “ఇది కవి కెంత కష్టమైన పనో తెలుసునా? తన్ను తాను పూర్తిగా లేకుండా తుడిచేసుకోవడమన్న మాట. లోకంలో వాడై కూడా దానిలో లేనట్లు తటస్థుడుగా, ఒడ్డున సాక్షిగా కూర్చోవడన్న మాట!” [1]. ఆ ప్రసంగాలు పుస్తకరూపంలో వచ్చినట్లే, మీ ఈ వ్యాఖ్యానాలు కూడా ఓ పుస్తకంగా వస్తే మరింక ఎక్కువ మంది తెలుగు వాళ్ళకి మన పాతకవుల గొప్పదనం చాటినట్లవుతుంది.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] కృష్ణశాస్త్రి వ్యాసావళి-1, కవి పరంపర. రాజహంస ప్రచురణలు, 1982.

  6. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి మోహన అభిప్రాయం:

    02/26/2012 7:03 pm

    1) కాటుక కంటి నీరు చను కట్టు పయింబడ నేల యేడ్చెదో
    కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల యో మదంబ యో
    హాటక గర్భు రాణి నిను నాకటికిన్ గొని పోయి యెల్ల క
    ర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!

    ఈ పద్యము అందరికీ తెలిసినదే. ఇందులోని చివరి పాదము తీసికొందామా? తెలుగు వృత్తాలలో యతి తప్పక ఉండాలి. యతి స్థానములో ఉండే అక్షరాలు ర్ణా, క. ర-కారానికి లేక ణ-కారానికి క-కారముతో గాని అ-కారముతో గాని యతి చెల్లదు. కాని కమ్మ లోని క-కారము సంధి ద్వార వచ్చినది. కీచకులకు + అమ్మ = కీచకులకమ్మ. అంటే కమ్మలోని అ-కారానికి కర్ణాటలోని (కర్ణ + అట) అ-కారానికి యతి చెల్లుతుంది. అంటే కొన్ని శతాబ్దాలముందు తెలుగువాళ్లు ఇప్పటి కర్నాటక పదాన్ని కరు-నాడు అర్థములో కాక కర్ణాటక అనే వాడేవాళ్లు. ఈ కర్నాటక పదము కర్నాటక రాష్ట్రములో ఇటీవల చేసిన ఒక శాసనము అని చదివాను.

    2) నా ఉద్దేశములో కర్ణాటకసంగీతములో మొదటి త్రయము అని చెప్పాలంటే అందులో అన్నమాచార్యులు, శ్రీపాదరాయలు, వ్యాసరాయలు వీరి ముగ్గురి పేరులు ఉంటాయి. కర్ణాటక రాష్ట్రములోని వారు కాబట్టి శ్రీపాదరాయలు మున్నగు కన్నడిగులను గురించి ప్రస్తావించాను. నాకూ అన్నమాచార్యులంటే ఎంతో యిష్టమే. నేను ఆద్యులు అంటే మొదటి తరము వాళ్లు అనే అర్థములో వ్రాసినాను. ఇది అన్నమాచార్యుల అసమాన సంగీత సంపత్తిని కించపరచడానికి మాత్రము కాదు. సంగీతము సాహిత్యము ఈ కళల అభివృద్ధికి ఎందరో పాటు పడ్డారు. కొందరిని గురించి మనకు బాగుగా తెలుసు, మరి కొందరిని గురించి అంతగా తెలియదు. ఈ విషయాలను తెలిసికోవాలన్నదే తహతహ. ఆ కారణమువల్లనే నాకు తెలిసినది (చాలవరకు ఒప్పులు, అక్కడా యిక్కడా తప్పులు) అందరితో పంచుకోవాలనుకొంటాను నేను. ఆ కారణమువల్లనే తెలుగువారికి నాగరత్నమ్మను గురించి, శ్రీపాదరాయలను గురించి నాకు తెలిసినది పంచుకొన్నాను.

    విధేయుడు – మోహన

  7. రెండు కవితలు గురించి నవీన్ నంబూరి అభిప్రాయం:

    02/26/2012 3:36 pm

    ఇంట్లో తూనీగలో మీ ఇదివరకటి కవితలు పిల్లలు నిద్దరోతున్నారు, వానకు తడిసిన పువ్వొకటి లోని మ్యాజిక్ కనిపించకపోయినా శైలి ఎప్పటిలాగే ఉంది. రోజువారీ జీవితం మీ లెన్సులోంచి చూస్తే చాలా అందంగా ఉంటుంది 🙂 యాపిల్లోంచి యాపిల్ ఊహ బావుంది. గేయంలా మా అమ్మాయితో కలిసి పాడుకోడానికి వీలుగా ఉంది. కృతజ్ఞతలు.

  8. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి తఃతః అభిప్రాయం:

    02/26/2012 11:55 am

    తమిళులకు సంబంధించినంతవరకూ కరునాడు అంటే ఆంద్ర దేశం. అందుకనే దాక్షిణాత్య సంగీతానికి కరునాడు సంగీతమని తమిళులే పెట్టారేమో. అది సంస్కృతీకరింపబడి – నక్కబొక్కలపాడు జంబూక రంధ్ర అగ్రహారమైనట్టుగా, (దొంగరాముడు, డీ.వీ. నరస రాజు, వంగర వెంకట సుబ్బయ్య) – కర్ణాటక సంగీతమన్న పేరుపొంది మళ్ళీ నిరుక్తాలను వెతుక్కుందేమో.

    ఈ ఉటంకింపు చూడండి: “… ఆనాడు తెలుగులూ- తమిళులూ – చాల సన్నిహితంగా బ్రతికినారు.ఆంధ్రదేశాన్ని వారు “కరునాడు” అనేవారు. తెలుగును “వడక్కు” అని పిలవటం వాడుక. ఆ సందర్భంలో మూలం ఇలా వుంది.

    ‘మజలై తిరుమొజియిల్ చిలవడకుం,చిలతమి జుం
    కురిత్తరు,కరునాటియర్!క్కటై తిరమిన్’

    దీని అనువాదం:
    మురిపించుతూ కొన్ని ముద్దు తెలుగు పదాలు
    అరవమ్ముతో కలిపి అచటచట తడబడుచు
    చిరుతీపి పలుకులు చెవులు విందులు చేయ
    కరునాడు యువతులు గడియ తీయండి … ”

    ఈ ఆసక్తికరమైన – కనీసం నాకు – విషయం మొన్న ఖర మాఘ బహుళ విదియ గురువారం [ఫిబ్రవరి 09, 20112] ఆరుద్ర అనువాద కావ్యం ‘వెన్నెల -వేసవి’ [2009, విశాలాంధ్ర ప్రచురణాలయం, హైదరాబాద్ ] కొని
    రెండు గంటల క్రితం పుట్టపర్తి నారాయణాచార్యులు గారి తొలిపలుకు ‘ముదావహం’ చదవటంతో తెలిసింది. పైన ఉటంకించింది పుటలు 15,16 ల నుంచి.

    ఇంక నేను దీనికి గడియ వేసేస్తాను.
    తఃతః

  9. రవీంద్రధనుస్సు గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    02/26/2012 9:01 am

    Just for practice, I stopped reading the essay after the English version of Guruji, made my own attempt to Telugize it, and then continued reading the five Telugu versions. Felt my rendering was not too out of mark. So, sharing it here. Think it is alright:

    ఎక్కడ మనస్సు నిర్భయమై శిరస్సు నిటారుగా నిలబడుతుందో
    ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా వర్తిస్తుందో
    ఎక్కడ ప్రపంచం
    ఇరుకు గోడల మధ్యన ముక్కలు ముక్కలయిపోకుండా ఉంటుందో
    ఎక్కడ మాటలు సత్యం లోతుల లోంచి పుడతాయో
    ఎక్కడ నిర్విరామ కృషి పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో
    ఎక్కడ హేతువు అనే శుభ్రమైన సెలయేరు దారి తప్పి
    మూర్ఖపు అలవాట్ల ఎడారి ఇసుక లోనికి ప్రవహించదో
    ఎక్కడ మస్తిష్కాన్ని
    నవనవోన్మేషమైన యోచన, ఆచరణల వైపు నువ్వు నడిపిస్తావో
    ఆ స్వేచ్ఛా స్వర్గం దిశగా, తండ్రీ, నా దేశం మేల్కొననీ

    Oh, Already several people did the same as I did. Some of them are really better. But let me too stay here.
    Thanks to Kolichala Suresh for directing me here.

  10. రాగలహరి: మోహనం గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    02/26/2012 6:15 am

    లక్ష్మన్న గారూ – I, being illiterate in music, exclusively rely on my musically imtimated amateur friends for technical tit bits. I have been made to endorse that జ్యోతి కలశ… (భాభీ కీ చుడియా) was based on Hindusthani Bhimpalasi. Could there be any justification to harbor such doubt? Could you please throw some more light?