మొత్తానికి “చంద్రునికో నూలుపోగు” అని అన్నట్టు కాకుండా ఖణీగా సుబ్బరంగా మాంచి తిక్కగా కల్తీలేని పేరడీని విసిరి మరీ పుట్టినరోజు శుభాకాంక్షల్ని చెప్పిన వేలూరీ …;) బాగా రాసినందుకు మెచ్చుకోకుండా ఉండగలనా? 🙂 అక్కడక్కడ కృష్ణశాస్త్రీ.. అక్కడక్కడ మాచిరాజు.. కాస్త జరుక్కూ.. కట్టకలిపి అందర్నీ వెక్కిరించే ఆయన్ని కరువు తీరా వెక్కిరించి మరీ అభినందించినందుకే ముచ్చటేసి.. హమ్మయ్య కాస్త ఘాటు ఇంకా ఈమాటలో మిగిలి ఉందని నమ్మకాన్నిచ్చినందుకే మురిసి, happy birthday to NARA!
కరునాడును ఆంధ్రదేశమని చెప్పడం నిరాధారమని నా నమ్మకం.
“ఆంధ్ర దేశాన్ని తమిళులు ‘కరునాడు’ అన్నారు” అని నారాయణాచార్యులు అనడం [పూర్తిగా] నిరాధారం అనగూడదేమో . ఆయన చూపిస్తున్న ఆధారం ఆకాలంలో తెలుగులూ తమిళులూ సన్నిహితంగా బ్రతికినారన్నది. ఇది విద్వత్తు మీద కన్నా కొద్దో గొప్పో ఆయన అనుభవం లోంచి వచ్చిన మాట అయిఉండవచ్చునేమో. ఆ వాక్యాన్ని ఆయన రాసిన పద్ధతి నాకు అలా తోపింపజేస్తోంది…
ఎన్‌టి రామారావుపై వ్యాసం చూశాను. జూన్‌లో పుట్టినవారంతా ఇలా ఉంటారు అంటూ పాశ్చాత్య రాశీఫలాల గురించి మాట్లాడే తీరులో 1950ల్లో కొకు రాశారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకో విషయం – వ్యాసంలో ఇచ్చిన రామారావు పుట్టిన రోజు జూన్ 15 – కానీ రామారావు పుట్టినరోజు మే28 కదా?
శ్రీనివాస్ గారు, చాల బాగుంది. దీనిని వినడం ఇదే మొదటిసారి.
ఒక్కొక్క వృత్తము వ్రాయడములో ఒక్కొక్క కవి కడు నేర్పరి. భారవి వంశస్థవృత్తమునకు, రత్నాకరుడు వసంతతిలకానికి, భవభూతి శిఖరిణికి, కాలిదాసు మందాక్రాంతానికి, రాజశేఖరుడు శార్దూలవిక్రీడితానికి ప్రసిద్ధులని క్షేమేంద్రుడు సువృత్తతిలకములో చెబుతాడు. భుజంగప్రయాత వృత్తములో చేసిన రచనలకు మాత్రము ఆదిశంకరులు సుప్రసిద్ధులు. ఈ నిర్వాణాష్టకము కూడ భుజంగప్రయాతములో వ్రాయబడినదే. శంకరుల రచనలో వృత్తవైవిధ్యాన్ని ఇక్కడ చదువ వీలగును.
“చాలాసార్లు పదాలలో పైపైన కనిపించే పోలికలు, భాషలమధ్య లేని సంబంధమేదో ఉన్నట్టు మభ్య పెడుతాయి.”
Leonard Bloomfield in his” Language”[University of Chicago 1984] is very informative in this respect. Elaborating phoneme theory,, he cites exhaustively from his intimate acquittance of Indo European languages like Sanskrit, Latin, Greek, Proto- German. In order to prove the distinctiveness he juxtaposes phonetically similar terms from diverse languages. His meticulous study of the Old world languages, as well as that of Amerindian language groups such as Fox, Cree, Menominee, and Ojibwa, stands him in good stead as he gives his examples from a wide variety of families of languages.
గంటి జోగీసొమయాజి is the name of the university teacher, as I remember. As a student of literature, rather than that of language, I am pleasantly surprised at the perseverance of a non professional Telugu expatriate.
చాలా మంచి వ్యాసాన్ని చాలా ఆలస్యంగా ఈ పూట చదివాను. భావనరాయణ గారికి ధన్య వాదాలు.
1 నేను విష్ణు సహస్రనామం చదవను అందులో “చాణూరాంధ్ర నిషూదనః ” అని ఉందని మొదటి సారి చదివినప్పుడు కోపమొచ్చి. ..
2. తెలుగయినా వేరే ఏదైనా మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే ‘native genius’ ని పొగొట్టుకునే ఘోర ప్రమాదం ఉన్నదని అనుకుంటాను. తూర్పు ఇరోపా నుంచి అమెరికా కు వలస పోయిన చాలా మంది శాస్త్రజ్ఞులు, ముఖ్యంగా లెక్కల్లొ, తర్కంలో ప్రప్రథమ శ్రేణికి చెందిన వాళ్ళు, వారి వారి మాతృ భాషల్లో పాటవం ఉన్నవాళ్ళుగా అగపడతారు. అమెరికాలో వేసవిలో హైస్కూలు పిల్లలకు నూతనాంశాలతోనూ, సమస్యా సాధనలతోనూ పరిచయం కలుగచేసే ఒకానొక కార్యక్రమంలో ఒక రష్యన్ కుర్రాడు ఒక ‘insanely difficult’ సమస్యను అవగాహన చేసుకొవటంలోనూ కొంత సాధించటంలోనూ చూపిన నైపుణ్యాన్ని ఆ వేసవి గురువు మెచ్చుకోవడం నేను చదివాను. ఆ కుర్రాడి గురించి రెండు ముక్కలు రాస్తూ అతను తన మాతృ భాషలో క్లాసిక్స్ చదువుతాడనీ రష్యన్ సంప్రదాయ సంగీతం వింటాడనీ రాశారు. ఇది మనపిల్లలకు తెలుగు భాష మీద శ్రధ్ధ లేకపొవడం ఇలాగే కొనసాగితే మనం genuinely intellectual ప్రపంచంలో మన ఉనికిని త్వరలొనే పూర్తిగా పొగొట్టుకుంటామా అని అనిపింపజేస్తోంది. ఈ విషయంలో చాలా ఇబ్బందు లున్నాయి అయినా, సురేశ్ , హనుమంత రావు (కొడవళ్ళ) లాంటి విజ్ఞులు కొంచెం గట్టిగా పూనుకోవాలేమో.
3. సురేశ్ తను ఈ వ్యాసం రాసి చాలా సంవత్సరాలైనది . ఈవ్యాసం ఈకోవలో తమ మొదటి ప్రయత్నం అని గూడా రాశారు అయినా, ఆయన పోతన ‘యెవ్వని చేజనించు’ పద్యాన్ని గురించి రాసిన వాక్యం కొంచెం ఆశ్చర్యాన్ని కలగజేసింది. పోతన సంస్కృత భాగవతాన్నే గదా అనువదించింది. [‘ ఓం నమో భగవతే…. పరేశాయాభి ధీమహి”, “…యేనేదం …స్వయం భువం” అన్న శ్లోకాల అనువాదంగా ఈ పద్యం కనపడుతుంది (గోరఖ్ పూర్, గజేంద్రమోక్షం, తెలుగు ప్రతి నుంచి.) ఈ వాక్యం సబబుగా లేదని సంపాదకులైనా సూచించి ఉండ వలసినదేమో.
త:త గారూ, సురేశ్ గారూ వీరిద్దరూ మాట్లాడుతున్న మాటలేవీ నాకు సరిగ్గా అర్ధం కావడం లేదు. ఉదాహరణకి.. ” ష , ర, ౠ ౠ కారాల తరువాత మధ్యలో మూడు మధ్య వర్గాల అక్షరాలు రాకుండా వచ్చే న కారం ణ కారంగా మారుతుంది”
ఇవి తెలుగు వాక్యాల లాగే అనిపిస్తున్నా .. ఎందుకో ..తెలుగు వాక్యం లాగా మాత్రం అర్ధం చప్పున నాకు తెలియడం లేదు. అందువలన తెలుగు తెలిసిన వారెవరైనా దీనికి వివరణ ఇస్తే తెలుసుకుందామని కుతూహలంగా ఉంది. వీరిద్దరూ వాళ్లకి తెలిసిన వివరాలు అలా వారే మాట్లాడుకుంటూ ఉన్నప్పటికిన్నీ ..పాఠకులు అనబడే వాళ్ళు సైతం ఉందురు కదా!! విషయం ఏమో కాస్త వీటిని చదువుతున్న ఇతరులకి కూడా తెలిస్తే బాగుంటుంది కదా? ఎంతగా సురేశ్ సంస్కృత శ్లోకం అక్కడ ఇచ్చినా ..కన్యాశుల్కంలో చెప్పినట్టూ .. అసలు ఎంత అర్ధం అయ్యిందో దాని తర్జుమా సైతం అంతే అర్ధం అయినట్టుంటేనూ.. 🙂 ..కుప్పుసామయ్యర్ మేడ్ డిఫ్ఫికల్ట్ లా కాకుండా మరి కాస్త వివరించగలరు.
కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి rama అభిప్రాయం:
03/01/2012 4:21 pm
చాలా బాగుంది. కన్నబాబు characterization చాల బాగా చేసారు. కథకుడికే కాదు, నాకు కూడ కన్నబాబు గుర్తుండి పొయేలా ఉన్నాడు.
ఎమితిని సెపితివె? గురించి rama bharadwaj అభిప్రాయం:
03/01/2012 4:05 pm
మొత్తానికి “చంద్రునికో నూలుపోగు” అని అన్నట్టు కాకుండా ఖణీగా సుబ్బరంగా మాంచి తిక్కగా కల్తీలేని పేరడీని విసిరి మరీ పుట్టినరోజు శుభాకాంక్షల్ని చెప్పిన వేలూరీ …;) బాగా రాసినందుకు మెచ్చుకోకుండా ఉండగలనా? 🙂 అక్కడక్కడ కృష్ణశాస్త్రీ.. అక్కడక్కడ మాచిరాజు.. కాస్త జరుక్కూ.. కట్టకలిపి అందర్నీ వెక్కిరించే ఆయన్ని కరువు తీరా వెక్కిరించి మరీ అభినందించినందుకే ముచ్చటేసి.. హమ్మయ్య కాస్త ఘాటు ఇంకా ఈమాటలో మిగిలి ఉందని నమ్మకాన్నిచ్చినందుకే మురిసి, happy birthday to NARA!
రమ.
పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి తః తః అభిప్రాయం:
03/01/2012 3:59 pm
“ఆంధ్ర దేశాన్ని తమిళులు ‘కరునాడు’ అన్నారు” అని నారాయణాచార్యులు అనడం [పూర్తిగా] నిరాధారం అనగూడదేమో . ఆయన చూపిస్తున్న ఆధారం ఆకాలంలో తెలుగులూ తమిళులూ సన్నిహితంగా బ్రతికినారన్నది. ఇది విద్వత్తు మీద కన్నా కొద్దో గొప్పో ఆయన అనుభవం లోంచి వచ్చిన మాట అయిఉండవచ్చునేమో. ఆ వాక్యాన్ని ఆయన రాసిన పద్ధతి నాకు అలా తోపింపజేస్తోంది…
కినిమా పత్రిక నుంచి – 2 గురించి V Chowdary Jampala అభిప్రాయం:
03/01/2012 2:54 pm
ఎన్‌టి రామారావుపై వ్యాసం చూశాను. జూన్‌లో పుట్టినవారంతా ఇలా ఉంటారు అంటూ పాశ్చాత్య రాశీఫలాల గురించి మాట్లాడే తీరులో 1950ల్లో కొకు రాశారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకో విషయం – వ్యాసంలో ఇచ్చిన రామారావు పుట్టిన రోజు జూన్ 15 – కానీ రామారావు పుట్టినరోజు మే28 కదా?
సూర్య శతకం గురించి తః తః అభిప్రాయం:
03/01/2012 2:28 pm
INDIRA DASARI :
మయూర మహాకవి కృతం, శ్రీ సూర్య శతకం (అన్వయ-ప్రతిపదార్థ -భావార్థ -వివరణ సహితము)
వ్యాఖ్యాత: బ్రహ్మశ్రీ పాతూరి సీతారామాంజనేయులు
టాగూరు పబ్లిషింగ్ హౌస్
హైదరాబాద్-27
ఒక ప్రతి ని నేను కొన్న చోటు [రెండు సంవత్సరాల క్రితం]
శ్రీ శృంగేరి శంకరమఠం
నల్లకుంట
హైదరాబాద్
శివోహం! శివోహం! గురించి మోహన అభిప్రాయం:
03/01/2012 10:35 am
శ్రీనివాస్ గారు, చాల బాగుంది. దీనిని వినడం ఇదే మొదటిసారి.
ఒక్కొక్క వృత్తము వ్రాయడములో ఒక్కొక్క కవి కడు నేర్పరి. భారవి వంశస్థవృత్తమునకు, రత్నాకరుడు వసంతతిలకానికి, భవభూతి శిఖరిణికి, కాలిదాసు మందాక్రాంతానికి, రాజశేఖరుడు శార్దూలవిక్రీడితానికి ప్రసిద్ధులని క్షేమేంద్రుడు సువృత్తతిలకములో చెబుతాడు. భుజంగప్రయాత వృత్తములో చేసిన రచనలకు మాత్రము ఆదిశంకరులు సుప్రసిద్ధులు. ఈ నిర్వాణాష్టకము కూడ భుజంగప్రయాతములో వ్రాయబడినదే. శంకరుల రచనలో వృత్తవైవిధ్యాన్ని ఇక్కడ చదువ వీలగును.
విధేయుడు – మోహన
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:
03/01/2012 10:02 am
Leonard Bloomfield in his” Language”[University of Chicago 1984] is very informative in this respect. Elaborating phoneme theory,, he cites exhaustively from his intimate acquittance of Indo European languages like Sanskrit, Latin, Greek, Proto- German. In order to prove the distinctiveness he juxtaposes phonetically similar terms from diverse languages. His meticulous study of the Old world languages, as well as that of Amerindian language groups such as Fox, Cree, Menominee, and Ojibwa, stands him in good stead as he gives his examples from a wide variety of families of languages.
గంటి జోగీసొమయాజి is the name of the university teacher, as I remember. As a student of literature, rather than that of language, I am pleasantly surprised at the perseverance of a non professional Telugu expatriate.
సూర్య శతకం గురించి INDIRA.DASARI అభిప్రాయం:
03/01/2012 8:59 am
Dear sir,
సూర్య శతకం, మయూర కృతశతకం, తెలుగులో ఎక్కడ దొరుకుతుందో దయచేసి చెప్పగలరా? నాకు అంతగా ఇంగ్లీష్ రాదు.
తెలుగు భాష వయస్సెంత? గురించి తఃతః అభిప్రాయం:
02/29/2012 8:04 pm
చాలా మంచి వ్యాసాన్ని చాలా ఆలస్యంగా ఈ పూట చదివాను. భావనరాయణ గారికి ధన్య వాదాలు.
1 నేను విష్ణు సహస్రనామం చదవను అందులో “చాణూరాంధ్ర నిషూదనః ” అని ఉందని మొదటి సారి చదివినప్పుడు కోపమొచ్చి. ..
2. తెలుగయినా వేరే ఏదైనా మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే ‘native genius’ ని పొగొట్టుకునే ఘోర ప్రమాదం ఉన్నదని అనుకుంటాను. తూర్పు ఇరోపా నుంచి అమెరికా కు వలస పోయిన చాలా మంది శాస్త్రజ్ఞులు, ముఖ్యంగా లెక్కల్లొ, తర్కంలో ప్రప్రథమ శ్రేణికి చెందిన వాళ్ళు, వారి వారి మాతృ భాషల్లో పాటవం ఉన్నవాళ్ళుగా అగపడతారు. అమెరికాలో వేసవిలో హైస్కూలు పిల్లలకు నూతనాంశాలతోనూ, సమస్యా సాధనలతోనూ పరిచయం కలుగచేసే ఒకానొక కార్యక్రమంలో ఒక రష్యన్ కుర్రాడు ఒక ‘insanely difficult’ సమస్యను అవగాహన చేసుకొవటంలోనూ కొంత సాధించటంలోనూ చూపిన నైపుణ్యాన్ని ఆ వేసవి గురువు మెచ్చుకోవడం నేను చదివాను. ఆ కుర్రాడి గురించి రెండు ముక్కలు రాస్తూ అతను తన మాతృ భాషలో క్లాసిక్స్ చదువుతాడనీ రష్యన్ సంప్రదాయ సంగీతం వింటాడనీ రాశారు. ఇది మనపిల్లలకు తెలుగు భాష మీద శ్రధ్ధ లేకపొవడం ఇలాగే కొనసాగితే మనం genuinely intellectual ప్రపంచంలో మన ఉనికిని త్వరలొనే పూర్తిగా పొగొట్టుకుంటామా అని అనిపింపజేస్తోంది. ఈ విషయంలో చాలా ఇబ్బందు లున్నాయి అయినా, సురేశ్ , హనుమంత రావు (కొడవళ్ళ) లాంటి విజ్ఞులు కొంచెం గట్టిగా పూనుకోవాలేమో.
3. సురేశ్ తను ఈ వ్యాసం రాసి చాలా సంవత్సరాలైనది . ఈవ్యాసం ఈకోవలో తమ మొదటి ప్రయత్నం అని గూడా రాశారు అయినా, ఆయన పోతన ‘యెవ్వని చేజనించు’ పద్యాన్ని గురించి రాసిన వాక్యం కొంచెం ఆశ్చర్యాన్ని కలగజేసింది. పోతన సంస్కృత భాగవతాన్నే గదా అనువదించింది. [‘ ఓం నమో భగవతే…. పరేశాయాభి ధీమహి”, “…యేనేదం …స్వయం భువం” అన్న శ్లోకాల అనువాదంగా ఈ పద్యం కనపడుతుంది (గోరఖ్ పూర్, గజేంద్రమోక్షం, తెలుగు ప్రతి నుంచి.) ఈ వాక్యం సబబుగా లేదని సంపాదకులైనా సూచించి ఉండ వలసినదేమో.
ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి rama bharadwaj అభిప్రాయం:
02/29/2012 2:06 pm