పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. ఈమాట మార్చ్ 2012 సంచికకు స్వాగతం! గురించి తః తః అభిప్రాయం:

    03/02/2012 3:19 pm

    ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! అంటూ జనవరి 2012 సంచికను ఆవిష్కరించిన ఈమాట నోటి ముత్యాలు మార్చ్ 2012 సంచిక వెలువరిస్తూ ” [నందన] ఉగాది శుభాకాంక్షలు” అంటె రాలిపోతాయా!

    [ఉగాదికే కాదండీ. రంజాన్‌కీ, క్రిస్టమస్‌కీ, హానుక్కాకీ ఇంకా ఇలా ఇలాంటి చాలావాటికి కూడా రాలిపోతాయి – సం.]

  2. పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/02/2012 2:27 pm

    సురేశ్! మీరు చాలా ఓర్పుగా విశదీకరించి రాసిన ఈ వ్యాసం నిజంగా విలువైనదే! కానీ ” దేవ భాష” ని సరిగ్గా తెలియని నాలాంటి వారికి ఇది కొరుకుడు పడటం కస్టం! అయితేనేంగాక! మీ శ్రమ వృధాపోదని నమ్ముతాను. మీ కృషి ఫలించాలని కోరుకుంటాను. ఇటీవల కాలంలో భాష మీద ఇంత శ్రధ్ధ చూపిస్తున్న వారు మీరేనేమో.

    ఇదే అభిప్రాయం నాకూ కలిగింది.. నేను రాసేసాను కదా? మళ్ళీ మీరెందుకూ రాయడం మీ అభిప్రాయం?? అని తహ తహ గారు మళ్ళీ అనకుండా ఇది నా వ్యక్తిగత మెచ్చుకోలు మీకని ముందే విన్నవించుకుంటున్నాను. 🙂

    రమ.

  3. ఎమితిని సెపితివె? గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    03/02/2012 2:22 pm

    హాయిగా చదువుకుని సుబ్భరంగా కడుపుబ్బా నవ్వేసుకోవచ్చు మనం ఈ రచన చదివి. వేలూరిని ఎంతో కాలంగా ఎరిగిన వాళ్లకి కూడా తెలియని ఒక కొత్త పెంకె గొంతుక వినిపిస్తుందిక్కడ. జరుక్ శాస్త్రీ జంఘాల శాస్త్రీ జమిలిగా వినిపిస్తారు కొంచెం నిదానంగా వింటే.

    నిరంతర సాహితీశ్రామికుడు ఎనభై ఏళ్ల యువకుడు నారాయణ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.

  4. పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/02/2012 1:58 pm

    మీరు బాగానే చెప్పారు తత గారూ! నా మూర్ఖత్వానికి నేను కూడా బానిసనే!

    అయినా నేను సందర్భం వచ్చినప్పుడల్లా పదే పదే ఒక విషయాన్ని చెప్పడం దేనికంటే.. ఆ దిశగా ఎవరికైనా తెలిసిన మరింత సమాచారం బయటికి వస్తుందనే! అందుకోసం ఒక మాట మరో సారీ మరో సారీ వచ్చినా ఇబ్బందేమీ పడనఖ్ఖరలేదు. మీకు తెలిస్తే మీరైనా చెప్పవచ్చు. సంగీతం గురించి ఇన్ని వ్యాసాలు రాసిన వాళ్ళూ రాస్తున్న వాళ్ళూ దాని పుట్టుక పెంపు విస్తరణ మొదలైన విషయాలని గురించి కూడా రాస్తే ఎక్కువ పరిజ్ఞానం కలుగుతుంది.. నా బోటి అజ్ఞానులకి ! కనీసం నా వరకూ నాకైతే ఈ సంగతులు విపులంగా తెలియవు. సంగీత రంగం లోని వారు ఎవరికైనా తెలిస్తే వీటిని గురించి విశదీకరించి చెపితే మంచిది. కనీసం నలుగురికీ తెలుస్తుంది కదా!! తెలుగులో సాహిత్య చరిత్ర ఉన్నట్టూ సంగీత చరిత్ర అంత స్పస్టంగా లేదు.”బృహద్దేశి నించి చతుర్దండిప్రకాశిక” దాకా పుస్తకాలైతే ఉన్నా! వాటిని గురించి తెలిసి మాట్లాడే వాళ్ళు సంగీత వ్యాసాలు రాస్తున్న వాళ్లలో లేరు కాబోలు. అది తెలియడం మాత్రం ఎందుకంటారా? అది వేరే మాట! భాషా విషయాలు మాత్రం ఎందుకూ?? ఇదీ అలాగే !!

    “వడుగర్” అన్న మాటని తమిళులు తెలుగు వారిని ఉద్దేశ్యించి అన్న మాటగా మనకి ముందు తరాల వారు ప్రస్తావించారు. దాన్ని వ్యతిరేకించడం లోని అంతరార్ధం నాకు బోధపదలేదు. అలా అన్ని ప్రాంతాల వారూ.. వారికి ఉత్తరంగా ఉన్న అన్ని ప్రాంతాల వారినీ ఇలా వడుగర్ శబ్దంతోనే సంభావించినప్పుడు మాత్రమే అది సాధారణ మౌతుంది. లేకుంటె కాదు. కదా మోహన గారూ??

    రమ.

  5. మల్లెపూల మధూలిక గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    03/02/2012 1:06 pm

    మోహన గారూ, నమస్తే.

    మీ స్పందన తెలియ చేసినందుకు ముందుగా నా కృతజ్ఞతలు! మీరన్నది నిజమే. ‘చెట్టు ఆకులను రాల్చడం ప్రకృతి ధర్మమే! ‘ అయినా, అదొక విషాద ఘట్టం లా తోస్తుంది నాకు. అది మళ్ళీ చిగిర్చాక గానీ… ప్రాణం స్థిమిత పడదు.
    ‘నందన మందిస్తుంది ఆనందాన్ని సుఖశాంతులను, మీకు, ఈమాట పాఠకులకు తప్పక ..’ – మీ శుభాకాంక్షలకు చాలా సంతోషమైంది. ఈ మాట పాఠకుల తరఫున కూడా మీకు నా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ..
    శుభాభినందనలతో-
    ఆర్.దమయంతి.

  6. శివోహం! శివోహం! గురించి Sambasiva Rao అభిప్రాయం:

    03/02/2012 1:05 pm

    శ్రీనివాస్ గారు, ఈ శివోహం చాలా బాగుంది. దీనిని వినటము చాలా ఆనందము గా ఉంది. సాహిత్యం లొ నాకు అంత ప్రావీణ్యము లేదు కాని భక్తి పాటలు వింటాను. ఈ నిర్వాణ శతకాన్ని ఆందించినందుకు గాను మీకు కృతజ్ఞతలు.

    సాంబశివ

  7. పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి మోహన అభిప్రాయం:

    03/02/2012 12:40 pm

    ఈ వడుగు గురించి ఒక మాట. ఏది తెర్కు (దక్షిణము) ఏది వడక్కు (ఉత్తరము) అనేది సాపేక్షమైనది. ఇప్పటి కోయముత్తూరుకు (అప్పటి చేర రాజ్యము) కన్నడము మాట్లాడే మైసూరు ప్రాంతము ఉత్తరము, కాని ఇప్పటి చెన్నైకి అది దక్షిణపశ్చిమము. చెన్నై మదురైకి ఉత్తరము, కాని చెన్నైని ఉత్తరదేశము అని చెప్పలేము కదా? తిరుపతి ఉత్తరమే తమిళ ప్రాంతానికి, అందుకే వేంకటేశ్వరస్వామిని వడమలయాన్ అంటారు. కాబట్టి చేర ప్రాంతానికి మైసూరు వడుగు, చెన్నై ప్రాంతానికి తిరుపతి, నెల్లూరు వడుగు! ఈ వడుగు అనేది సంస్కృతానికి కూడ ఉపయోగిస్తారు. అందుకే వడగలై, తెన్గలై శాఖలు వచ్చాయి. మరాఠీ ప్రాకృతము కూడ వడుగే. కన్ఫ్యూస్డ్? విధేయుడు – మోహన

  8. పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి తః తః అభిప్రాయం:

    03/02/2012 12:10 pm

    సురేశ్ గారూ
    నతి సూత్రాలను ఉదాహరణలతొ వివరిస్తూ మీరు రాసిన వ్యాసం చాలా విలువైనది. ఈ వ్యాసాన్ని రాయటంలో మీరు చూపిన ఓర్పు గొప్పది. పూర్తిగా చదివి అర్థం చేసుకొవటానికి వేద (దేవ) భాషా పరిచయం లేని నాలాంటివాళ్ళు చాలా [ఆనందదాయకమైన] శ్రమ పడాలి. మీరు ముఖ్యమైనవి అని అనుకున్న ఇతర సూత్రాలను వివరిస్తూ ఇటువంటివి మరిన్ని రాయాలని కొరుతున్నాను.

  9. వఱడు: కథ నచ్చిన కారణం గురించి మోహన అభిప్రాయం:

    03/02/2012 11:59 am

    గొప్ప కథ, సందేహము లేదు. కీకారణ్యమైనా, మరుభూమియైనా మానవుడు ఆ ప్రదేశాన్ని ఆక్రమించిన తరువాత మానవుడి స్వభావాలు అక్కడ ప్రతిబింబిస్తాయి. ఒక్కొక్కప్పుడు అవి ఉదాత్తమైనవి, ఒక్కొక్కప్పుడు అవి నీచమైనవి. రెంటినీ ఈ కథలో మనము గమనించవచ్చును. ఊసరవెల్లి అని కూడ దీనికి పేరు పెట్టవచ్చును. 1971 కాలానికి ఇంకా బండి ర సజీవమై ఉండడము ఒక విధమైన ఆనందాన్ని తృప్తిని కలిగించింది. విధేయుడు – మోహన

  10. పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి తః తః అభిప్రాయం:

    03/02/2012 11:46 am

    రమ [భరద్వాజ్] గారూ: మీ – “తమిళం కూడా మాట్లాడగలిగిన తెలుగు పడుచులు” నుంచి “కర్ణాటకం అనే అనడం ఇక్కడ సముచితం” దాకా -దాదాపుగా అంతా -నేను రాసిన అభిప్రాయలలో అంతర్లీనంగా ఉన్నదనిపించటం లేదా?వాటిని మీరు విస్తరించినట్టుగా సురేశ్ గారికి వివరించ నక్కరలేదనే నేను నాకు సాధ్యమైనంత క్లుప్తంగా రాశాను. నా మూర్ఖతకు నేను బానిసనే. సంగీత పరంగా ‘కర్ణాటక’ శబ్దం మార్జాలీకరించిన పిల్లి అనే అనుకుంటాను దానికి తిరిగి కర్ణ అటతి భాష్యం! అయినా ఇప్పటికి – సంగీత సారస్వతులు వేరె విధంగా చెప్పి ఒప్పించే దాకా – ఇదే మేలనిపిస్తోంది. తమిళ పద్యానికి తెలుగు అనువాదం మీరన్నట్టు పుట్టపర్తి వారిది కాదు ఆరుద్రది.