రవిగారు,
1) నారాయణాచార్యుల పద్యాలను అందజేసినందులకు ధన్యవాదాలు. విశ్వనాథ మధ్యాక్కరలలోని ఒక గొప్ప విశేష మేమంటే, వారు మధ్యాక్కరకు నన్నయలా ఐదవ గణముతో యతినుంచారు, అంతేకాక, తరువాతి కవులలా నాలుగవ గణానికి కూడ యతి నుంచారు. అంటే ఒకే పాదములో రెండు యతులను పాటించారు. శాసనాలలో (బెజవాడ శాసనము), నన్నయ భారతములో యతి ఐదవ గణముతో మాత్రమే.
2) మీరు ఉదహరించిన షట్పది కన్నడ తెలుగు ఛందస్సు పుస్తకాలలో ఇవ్వబడిన షట్పది కాదు. దీనికి ఆరు పాదాలు ఉన్న మాట నిజము ఆచార్యులవారిది పూర్తిగా పంచమాత్రాబద్ధమైన షట్పది. ఇందులో మొదటి రెండు పాదాలలో రెండు పంచమాత్రలు, తరువాతి పాదాలలో పాదానికి నాలుగు పంచ మాత్రలు ఉన్నాయి. ఇది బహుశా వారి సృష్టి అయి ఉండవచ్చును.
విధేయుడు – మోహన
ఎంతో శ్రమతో, సాహితీ ప్రేమతో తెలుగు పత్రికనందిస్తున్న “ఈమాట” మిత్రులకు హార్థిక తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. వాళ్ళు శుభాకాంక్షలు చెప్పలేదని చదివి, మరి వాళ్ళకు కూడా ఎవ్వరు చెప్పలేదని చెప్పడం, ఆలస్యంగానైనా. వేరే వాటికి మరెవ్వరైనా మరెక్కడైనా మరెప్పుడైనా చెప్పుకోవచ్చు, కాని ఉగాది శుభాకాంక్షలను తెలుగులో తెలుగువాళ్ళు చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు ఇంకెవరికి చెప్తారు?!
ఉగాది ఏ మతస్థుల పండగ అవుతుందా అనే సందేహం ఇంకా మిగిలే ఉంది.
ఈ నా అభిప్రాయము పై వాక్యము పైన మాత్రమే. మౌలికముగా పరిశీలిస్తే ఉగాది ఒక మత సంబంధమైన పండుగే. ఇది తెలుగువాళ్లకు మాత్రమే పండుగ కాదు, కర్ణాటక (యుగాది), మహారాష్ట్ర (గుఢి పాడ్వా) గోవా రాష్ట్రాలలో కూడ ఇది పండుగే. ఇది హిందువులలో శాలివాహనశకమును అనుసరించే వారికి చాంద్రమాన సంవత్సరాది. ఉత్తరదేశములో విక్రమశకమును అవలంబిస్తారు, వారి సంవత్సరాది పౌర్ణమి తరువాతి దినము. కాని సాంస్కృతికపరముగా హిందువులు మాత్రమే కాదు మిగిలినవారు కూడ శుభాకాంక్షలను అందించవచ్చును, అంత మాత్రాన వాళ్లు వారి ఆలయాలలో పండుగను జరుపుకొంటారా అనే విషయము సందేహమే. ప్రథమముగా యిది హిందువుల పండుగ, కాని తెలుగు మాట్లాడేవాళ్లలో ఎక్కువ మంది హిందువులు కాబట్టి ఇది తెలుగువాళ్ల పండుగ అయినది. అలాగే యిది నాలా కన్నడము మాట్లాడే హిందువులకు, మరాఠీ మాట్లాడే హిందువులకు పండుగ అయినది. యూదులు వాళ్ల సంవత్సరాదిని సెప్టెంబరు నెలలో చేసికొంటారు, సుమారు ఆరు నెలల తరువాత. ఈ విషయాలను కొన్నిటిని కళావసంతము వ్యాసములో చర్చించాను.
1. చర్చలో కొన్ని మాటలు పడక తప్పదు. ‘సీత గడియ’ లో నాకు, నా అభిప్రాయంలో, ఒక ‘నిరర్ధకమైన’, వాక్యం కనపడింది,”ఈ రామాయణంలో దశరథుడు పెద్ద భార్య దగ్గిరే వుంటాడు” అన్నది. ఈ కథ లో ఉన్నది నలుగురు, ఒక స్త్రీ ఒక పురుషుడూ, వీళ్ళు వయసులో ఉన్న దంపతులు. మిగతా ఇద్దరూ ఆ స్త్రీ అత్తా మామలు [అందరూ తెలుగు వాళ్ళు] అంతే. రామాయణ పాత్రలుగా చూపినంత మాత్రాన ఇక్కడ పెద్ద భార్య, మిగతా భార్యల ప్రసక్తి అక్కర లేదు. ఇలాంటి వాక్యాలు రావడానికి కారణం వీటిని రామాయణ పాటలు అనడమే. ఈ పాటలని రామాయణ పాటలని అనడం ఒక సౌలభ్యం కోసమే. ‘నిజంగా’ కాదు. ఈ విషయాన్ని శ్రీ వెల్చేరు ముగింపు వాక్యాలలో చెప్పారు/ సూచించారు కానీ రామాయణంతో కావలిసినదాని కన్నా ఎక్కువగా ముడి పెట్టడంతో ఇటువంటి వాక్యాలు చేరిపోతాయి. రామాంజనేయ యుద్ధాన్ని [వాల్మీకి] రామాయణ నాటకం అనీ గయోపాఖ్యానాన్ని, శశిరేఖా పరిణయాన్నీ [వ్యాస] మహాభారత నాటకాలనీ అనగలమా. భాస కాళిదాసాదులు అలా అన్నారో లేదో నాకు తెలీదు ఒకవేళ అని ఉంటే అదీ సౌలభ్యం కోసమే అని అనుకుంటాను.
2. మొగుడు వేసిన గడియ కళ్ళకు కనపడేది అసలు గడియ వేసింది పెళ్ళామే. మొగుడు తను వేశాననుకోవడం ‘భ్రమ’.
ఈ పాటలో నాకు స్పష్టంగా కనపడుతున్నది ‘role reversal’. ఇక్కడ పెళ్ళాం మొగుడి లాగా ప్రవర్తిస్తున్నది తన పనులన్నీ చేసుకుంటూ ఇంటికి ఎప్పుడు తనకు కావలసివస్తే అప్పుడు వెళ్ళొచ్చు అనుకుంటూ, పెళ్ళాలని ‘సుఖపెడుతున్నా’మని అనుకునే మొగుడి పాత్రని ఇక్కడ పెళ్ళాం ధరించింది. పెళ్ళాం సంగతి పట్టించుకోకుండా తనకి కావలసినవి తను – ఇంటి బయట స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ – ఇంటికి తనకి అవసరమున్నప్పుడు వచ్చే మొగుడుగా పెళ్ళాం ‘అత్తమామల సేవ చేసుకుంటూ’ తనకు కావలిసినట్టు – మెడలో నాను తాడు కూడా లేకుండా అత్తా మామల ఎదుట తిరుగుతూ గడిపి ‘తనకు కావలిసివచ్చినప్పుడు’ తను గదిలోకి వెళ్ళింది . ఇలాంటి సందర్భాలలో పెళ్ళాం తలుపు మూసి మొగుణ్ణి రానీయక పోవడం చెంచు లక్ష్మి పాట. ఇక్కడ పెళ్ళాం గదిలోకి వెళ్ళిన తర్వాత చూపిన ‘సిగ్గు’ కూడా తను మొగుణ్ణి సుఖపెడుతున్నట్టుగా తనకు తెలుసు కాబట్టి.
3.సీత గడియ లో ‘గడియ ‘ కాల సంబంధిగా కన పడుతోంది . దూరాన్వయం గా కనపడుతుంది గానీ కాదు . ఇక్కడ సీత గడియ her hour of triumph. దివ్వె నవ్వు ఆమె ఎగరేసిన విజయ కేతనం .
నిజంగా దూరాన్వయం: ఐశ్వర్యవంతులై అతివలుండెదరు – ఐశ్వర్యం ఈశ్వరభావం lordship over their husbands.
రంజాన్ ముస్లిముల పండగ. క్రిస్మస్ క్రైస్తవుల పండగ. హానుక్కా (నిజానికి ఈ పేరు ఇదివరకెప్పుడూ వినలేదు, చూడలేదు, ఇప్పుడే గూగుల్లో వెదికి కనుక్కున్నా) యూదుల పండగ.
మీరు ఉదహరించినవన్నీ ఏదో ఒక మతానికి సంబంధించిన పండగలు. ఉగాది తెలుగువారి పండగ అనే అనుకున్నా. కాదు అది ఒక మతసంబంధమైన పండగ అని ఇప్పుడే మీరిచ్చిన ఉదాహరణలను బట్టి తెలుసుకున్నా. నా కళ్ళు తెరిపించినందుకు ఈమాట సంపాదకబృందానికి ధన్యవాదాలు. ఐనా ఉగాది ఏ మతస్థుల పండగ అవుతుందా అనే సందేహం ఇంకా మిగిలే ఉంది. తీరుస్తారనే ఆశిస్తున్నా.
అనువాదంలో మెలకువలు గురించి V.K.Ashok Kumar అభిప్రాయం:
03/14/2012 2:59 am
This article is very good. And useful too.
సీత గడియ గురించి lyla yerneni అభిప్రాయం:
03/13/2012 5:39 pm
A gentle and gracious telling of a lore. Deeply satisfying to my senses and my woman’s soul.
Many Happy Returns of Your Birthday! Narayana Rao. Happy Writing!
లైలా
ఛందస్సు కొక కొండ కొక్కొండ గురించి మోహన అభిప్రాయం:
03/13/2012 3:27 pm
రవిగారు,
1) నారాయణాచార్యుల పద్యాలను అందజేసినందులకు ధన్యవాదాలు. విశ్వనాథ మధ్యాక్కరలలోని ఒక గొప్ప విశేష మేమంటే, వారు మధ్యాక్కరకు నన్నయలా ఐదవ గణముతో యతినుంచారు, అంతేకాక, తరువాతి కవులలా నాలుగవ గణానికి కూడ యతి నుంచారు. అంటే ఒకే పాదములో రెండు యతులను పాటించారు. శాసనాలలో (బెజవాడ శాసనము), నన్నయ భారతములో యతి ఐదవ గణముతో మాత్రమే.
2) మీరు ఉదహరించిన షట్పది కన్నడ తెలుగు ఛందస్సు పుస్తకాలలో ఇవ్వబడిన షట్పది కాదు. దీనికి ఆరు పాదాలు ఉన్న మాట నిజము ఆచార్యులవారిది పూర్తిగా పంచమాత్రాబద్ధమైన షట్పది. ఇందులో మొదటి రెండు పాదాలలో రెండు పంచమాత్రలు, తరువాతి పాదాలలో పాదానికి నాలుగు పంచ మాత్రలు ఉన్నాయి. ఇది బహుశా వారి సృష్టి అయి ఉండవచ్చును.
విధేయుడు – మోహన
ఛందస్సు కొక కొండ కొక్కొండ గురించి రవి అభిప్రాయం:
03/13/2012 12:31 pm
మధ్యాక్కరలను నవీన కవి, పండితుడు శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు తమ శ్రీనివాస ప్రబంధంలో అక్కడక్కడా ఉపయోగించారు.
(కుమారసంభవ ఘట్టం)
పార్వతీ పరమేశ మదన పరవశతావృత్తి జెల్లె
యోర్వంగ రాక బెక్కేడు, లుద్రిక్తులై సురలెల్ల
శర్వుని భంగింపనెంచి, శతధృతి తోడన గూడి
పర్వెత్తిరుత్తాల సాలపంక్తి తుషారాద్రి గుఱిచి.
(నృసింహవర్ణన)
భయద సుందరరూప! స్వామి! భద్రమ్మె గావింతుగాక
నయవిదూరులకైన, శిక్షణాబుద్ధి, గలదె! నీయందు!
జయగర్వవిషమితచిత్తు శమలంబు దొలఁగె, నీదైన
శయసంగమునఁ జేసి, వార్ధిజాశయపూజితచరణ!
పుట్టపర్తి వారు జనప్రియరామాయణం కావ్యం మొత్తం షట్పదీవృత్తంలో వ్రాశారు. అవీనూ ఓ రెండు పద్యాలు. (ఇవి చంద్రగణములా అన్నసంగతి నాకు తెలియదు)
ప్రేమలేని జపమ్ము
ప్రేమహీనము భక్తి
వల్లకాటను మల్లెపూవూ హరికందు
లవలేశమును లేదుతావూ ప్రేమాగ్ని
జ్వలియించినప్పుడే భస్మమగు తాననెడు
భావమ్ము సర్వమ్ము వాసుదేవమయమ్ము!
ప్రేమతో బిలువవలె
ప్రేమతో నాడవలె
ప్రేమమున జపియించవలెనూ – ప్రేమ బం
ధమ్ముతో నర్చింపవలెనూ, నిజనాథు
ప్రేమాసవంబుతో రోమరోమము నింపి
తనువు మనసును వదులుకొనువాడు ధన్యుండు
ఈమాట మార్చ్ 2012 సంచికకు స్వాగతం! గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
03/13/2012 12:01 pm
ఎంతో శ్రమతో, సాహితీ ప్రేమతో తెలుగు పత్రికనందిస్తున్న “ఈమాట” మిత్రులకు హార్థిక తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. వాళ్ళు శుభాకాంక్షలు చెప్పలేదని చదివి, మరి వాళ్ళకు కూడా ఎవ్వరు చెప్పలేదని చెప్పడం, ఆలస్యంగానైనా. వేరే వాటికి మరెవ్వరైనా మరెక్కడైనా మరెప్పుడైనా చెప్పుకోవచ్చు, కాని ఉగాది శుభాకాంక్షలను తెలుగులో తెలుగువాళ్ళు చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు ఇంకెవరికి చెప్తారు?!
విధేయుడు
_శ్రీనివాస్
ఈమాట మార్చ్ 2012 సంచికకు స్వాగతం! గురించి మోహన అభిప్రాయం:
03/13/2012 11:37 am
ఉగాది ఏ మతస్థుల పండగ అవుతుందా అనే సందేహం ఇంకా మిగిలే ఉంది.
ఈ నా అభిప్రాయము పై వాక్యము పైన మాత్రమే. మౌలికముగా పరిశీలిస్తే ఉగాది ఒక మత సంబంధమైన పండుగే. ఇది తెలుగువాళ్లకు మాత్రమే పండుగ కాదు, కర్ణాటక (యుగాది), మహారాష్ట్ర (గుఢి పాడ్వా) గోవా రాష్ట్రాలలో కూడ ఇది పండుగే. ఇది హిందువులలో శాలివాహనశకమును అనుసరించే వారికి చాంద్రమాన సంవత్సరాది. ఉత్తరదేశములో విక్రమశకమును అవలంబిస్తారు, వారి సంవత్సరాది పౌర్ణమి తరువాతి దినము. కాని సాంస్కృతికపరముగా హిందువులు మాత్రమే కాదు మిగిలినవారు కూడ శుభాకాంక్షలను అందించవచ్చును, అంత మాత్రాన వాళ్లు వారి ఆలయాలలో పండుగను జరుపుకొంటారా అనే విషయము సందేహమే. ప్రథమముగా యిది హిందువుల పండుగ, కాని తెలుగు మాట్లాడేవాళ్లలో ఎక్కువ మంది హిందువులు కాబట్టి ఇది తెలుగువాళ్ల పండుగ అయినది. అలాగే యిది నాలా కన్నడము మాట్లాడే హిందువులకు, మరాఠీ మాట్లాడే హిందువులకు పండుగ అయినది. యూదులు వాళ్ల సంవత్సరాదిని సెప్టెంబరు నెలలో చేసికొంటారు, సుమారు ఆరు నెలల తరువాత. ఈ విషయాలను కొన్నిటిని కళావసంతము వ్యాసములో చర్చించాను.
విధేయుడు – మోహన
కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి Kishore Royal అభిప్రాయం:
03/13/2012 9:28 am
చదవటం చాల ఆశక్తిగా ఉంది. ఇంతకూ కన్న బాబు నిజమా ? కల్పితమా ?
సీత గడియ గురించి తః తః అభిప్రాయం:
03/13/2012 8:59 am
1. చర్చలో కొన్ని మాటలు పడక తప్పదు. ‘సీత గడియ’ లో నాకు, నా అభిప్రాయంలో, ఒక ‘నిరర్ధకమైన’, వాక్యం కనపడింది,”ఈ రామాయణంలో దశరథుడు పెద్ద భార్య దగ్గిరే వుంటాడు” అన్నది. ఈ కథ లో ఉన్నది నలుగురు, ఒక స్త్రీ ఒక పురుషుడూ, వీళ్ళు వయసులో ఉన్న దంపతులు. మిగతా ఇద్దరూ ఆ స్త్రీ అత్తా మామలు [అందరూ తెలుగు వాళ్ళు] అంతే. రామాయణ పాత్రలుగా చూపినంత మాత్రాన ఇక్కడ పెద్ద భార్య, మిగతా భార్యల ప్రసక్తి అక్కర లేదు. ఇలాంటి వాక్యాలు రావడానికి కారణం వీటిని రామాయణ పాటలు అనడమే. ఈ పాటలని రామాయణ పాటలని అనడం ఒక సౌలభ్యం కోసమే. ‘నిజంగా’ కాదు. ఈ విషయాన్ని శ్రీ వెల్చేరు ముగింపు వాక్యాలలో చెప్పారు/ సూచించారు కానీ రామాయణంతో కావలిసినదాని కన్నా ఎక్కువగా ముడి పెట్టడంతో ఇటువంటి వాక్యాలు చేరిపోతాయి. రామాంజనేయ యుద్ధాన్ని [వాల్మీకి] రామాయణ నాటకం అనీ గయోపాఖ్యానాన్ని, శశిరేఖా పరిణయాన్నీ [వ్యాస] మహాభారత నాటకాలనీ అనగలమా. భాస కాళిదాసాదులు అలా అన్నారో లేదో నాకు తెలీదు ఒకవేళ అని ఉంటే అదీ సౌలభ్యం కోసమే అని అనుకుంటాను.
2. మొగుడు వేసిన గడియ కళ్ళకు కనపడేది అసలు గడియ వేసింది పెళ్ళామే. మొగుడు తను వేశాననుకోవడం ‘భ్రమ’.
ఈ పాటలో నాకు స్పష్టంగా కనపడుతున్నది ‘role reversal’. ఇక్కడ పెళ్ళాం మొగుడి లాగా ప్రవర్తిస్తున్నది తన పనులన్నీ చేసుకుంటూ ఇంటికి ఎప్పుడు తనకు కావలసివస్తే అప్పుడు వెళ్ళొచ్చు అనుకుంటూ, పెళ్ళాలని ‘సుఖపెడుతున్నా’మని అనుకునే మొగుడి పాత్రని ఇక్కడ పెళ్ళాం ధరించింది. పెళ్ళాం సంగతి పట్టించుకోకుండా తనకి కావలసినవి తను – ఇంటి బయట స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ – ఇంటికి తనకి అవసరమున్నప్పుడు వచ్చే మొగుడుగా పెళ్ళాం ‘అత్తమామల సేవ చేసుకుంటూ’ తనకు కావలిసినట్టు – మెడలో నాను తాడు కూడా లేకుండా అత్తా మామల ఎదుట తిరుగుతూ గడిపి ‘తనకు కావలిసివచ్చినప్పుడు’ తను గదిలోకి వెళ్ళింది . ఇలాంటి సందర్భాలలో పెళ్ళాం తలుపు మూసి మొగుణ్ణి రానీయక పోవడం చెంచు లక్ష్మి పాట. ఇక్కడ పెళ్ళాం గదిలోకి వెళ్ళిన తర్వాత చూపిన ‘సిగ్గు’ కూడా తను మొగుణ్ణి సుఖపెడుతున్నట్టుగా తనకు తెలుసు కాబట్టి.
3.సీత గడియ లో ‘గడియ ‘ కాల సంబంధిగా కన పడుతోంది . దూరాన్వయం గా కనపడుతుంది గానీ కాదు . ఇక్కడ సీత గడియ her hour of triumph. దివ్వె నవ్వు ఆమె ఎగరేసిన విజయ కేతనం .
నిజంగా దూరాన్వయం: ఐశ్వర్యవంతులై అతివలుండెదరు – ఐశ్వర్యం ఈశ్వరభావం lordship over their husbands.
యానాం బోటులో.. గురించి swarna అభిప్రాయం:
03/13/2012 7:18 am
చాలా బావుంది.
యుగాలుగా ఇక్కడే
సర్వస్వాన్నీసముద్రుడికి అర్పిస్తూ
ఎప్పటిదో భాష
వీడి గొంతులో
మళ్ళీ కొత్తగా ….
ఈమాట మార్చ్ 2012 సంచికకు స్వాగతం! గురించి మాన్యత అభిప్రాయం:
03/13/2012 6:48 am