పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ప్రాచీన తెలుగు కొలమానం గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    04/08/2012 12:05 am

    Nagarjuna Garu,

    Archival revenue records such as Siddhavatam kaifeeyat is said to contain many reverences to types of land and measuring units of land, purportedly for laying down the rate of cess in pecuniary units. I wish some one had researched the monetary area. A lot of research is yet to be done on the linguistic aspect of the terminology and on the social conditions in which the units were in usage.

    Units like ‘mandya’ and ‘ankanam’ are referred to in Telugu and Kannada areas. Copper plate inscription NO: 1, collected in “Copper – Plate and Stone Inscriptions of South India “, By Alan Butterworth And V. Chetty Venugopal cites the inscription named “ Parachur Grant “ of Devaraya given to be of S S 1 312. corresponding to 1309 A D.

    The Sanskrit text in Telugu script is crammed with Telugu names and terminology. It mentions he grant , to one Chennu Bhatta of Bharadwaja Gotra ,of a village measuring fifteen mandyas in extent, lying on either side of the river named Audala near Parachur[ with a consonantal ending] in Addanki Seema. These units of measurement for area of arable land is left undefined. Could these units of measure be explained?

    Yours faithfully,
    Siddineni Bhava Narayana

  2. చేపలార్బరు దినాలు గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:

    04/06/2012 3:30 pm

    ‘పరలొక రాజ్యము మనది సిద్దంగాఉండు’
    ‘తలుపులను తట్టుము’ అవి తెరువబడును
    ‘వెతుకుము’ అది నీకు దొరుకును
    ‘అడుగుము’ అవి నీకు ఈయబడును
    అంటాడు ఏసు తన జాలర్లతొ

    చేపల హార్బరునుంచి జాలరి
    ఇంటికి వట్టిచెతులతొ వస్తాడు
    తన తల్లి, ఆలి, పిల్లజల్ల ఆశతొ
    తెల్లవారుజాముదాకా ఎదురుచూస్తారు
    ఎదురుచుస్తూనె ఉంటారు

    ఇంటికి తిరిగి వస్తారొ లెదొ తెలియని జాలర్లకు
    పరలొకానికి తలుపు ఎప్పుడు తెరచి ఊంటుంది
    తనను నమ్మిన జాలర్లకు ఏసు ప్రభువు
    ఇచ్చిన వరం పర లొకానికి మార్గం

  3. రచయితలకు సూచనలు గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:

    04/06/2012 2:55 pm

    గౌరవనీయులైన సంపాదకులకు నమస్కరించి వ్రాయునది:

    మనలొ ‘మనమాట’ గా చెబుతున్నా
    మీ ‘ఈమాట’ లొ ‘మామాట’ ‘ఏమాట’ తీయకుండా
    ప్రతి మాట అదె మాటగా ప్రచురిస్తారని ఆశిస్తూ
    ఈమాట సాక్షిగా మీ దగ్గర మాట తీసుకుంటున్నా

    మా స్నెహితుడి ‘మాట’ విన్నాను
    ఎల్లలులేని ప్రపంచానికి ఎలెక్ట్రానిక్ తెలుగు పత్రిక ‘ఈమాట’
    ఎలా సేవ చెస్తుందొ మంచి మంచి మాటలు చదివి చూసాను
    ఈమాటలోని మర్మాన్ని తెలుసుకొవడం ఇప్పుడె మొదలుపెట్టాను
    ఈమాటని మావాడికి అందరికి మీ ఈమాటగా చెబుతాను
    ఇట్లు
    మీ ‘ఈమాట’ అభిమాని
    -దడాల వెంకటెశ్వరరావు
    అసిస్టంట్ కమిషనర్
    న్యూ దిల్లీ

  4. రచయితలకు సూచనలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    04/06/2012 10:29 am

    రాధాకృష్ణగారూ,
    నాకు ఈమాటతో 1999 ప్రాంతాలనుంచీ పరిచయం ఉంది. క్రమంగా విష్ణుభొట్ల లక్ష్మన్న, సురేశ్ కొలిచాల, పరుచూరి శ్రీనివాస్ తదితరులతో సంపర్కం మొదలయింది.

    మునుపు బొంబాయిలోనూ, తరవాత ఇతర ప్రాంతాల్లోనూ తెలుగువారిలో కనబడ్డ ‘ఆముదపు వృక్షా’లను చూసి నిరాశ పడుతున్న సందర్భంలో వీరంతా నాకు దూరంగా మినుకుమినుకుమనే ఆశాదీపాల్లా కనిపించసాగారు.

    వీరితో ఈమెయిల్ తదితర పద్ధతుల్లో తరుచుగా సంభాషించడం, వ్యాసాల ద్వారా నా ఆసక్తిని పంచుకోవడం మొదలైన పనులు చేస్తున్నకొద్దీ life is worth living అని నాకనిపించసాగిందంటే అందులో అతిశయోక్తి ఏమీలేదు.

    మన పొరుగింటివాడు సంగీతంలోనో, సాహిత్యంలోనో ఆసక్తి కనబరుస్తాడనుకోవడం ప్రస్తుతకాలంలో పేరాశే అవుతుంది కనక ఇలాంటి వ్యక్తులే మన సాంస్కృతిక జీవితానికి కొంతవరకూ ఆధారం అని నేననుకుంటాను. మరీ నిస్పృహకు లోనైనవారికి నేనిచ్చే సలహా కూడా ఇదే.

  5. శివోహం! శివోహం! గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    04/05/2012 10:48 am

    Sreedhar-gaaru: That’s a pleasant surprise! So, you read this magazine :).

    మీరడిగిన “శివాయ చంద్రశేఖరాయ నమ ఓం” గతంలో మాగంటి వంశీ గారికి పంపాను. అక్కడే మరిన్ని భక్తిరంజనిలో ప్రసారమయినవి వినవచ్చు.

    – శ్రీనివాస్

  6. కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి విజయ్ అభిప్రాయం:

    04/05/2012 9:48 am

    చిన్నప్పుడెప్పుడో కొంత చదివినట్టు గురుతు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇక్కడ చదివాను, మొదలు నుంచి కొస దాక నడుమ తెరిపి లేకుండా. మీకు నెనర్లు.

  7. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి Subrahmanya Sarma అభిప్రాయం:

    04/05/2012 6:11 am

    మీరు చెప్పిన కధ చాల బాగుంది. మాది కూడా అమలాపురం స్వస్థలం. మంచి కాఫీ తాగిన అనుభుతి కలిగింది మీ కధ చదివిన తరువాత.

  8. శివోహం! శివోహం! గురించి Balakrishna Pillalamarri అభిప్రాయం:

    04/05/2012 12:23 am

    ధన్యవాదాలు. ఉదయం భక్తిరంజని లొ వచ్చే “శివోహం శివోహం” Internet లో చాల వెదికాను. ఆ recording దొరకలేదు, మళ్ళి ఇప్పుడే వినటం.
    వేరె వాళ్ళు ముఖ్యంగా హిందుస్తాని సాంప్రదాయం వాళ్ళు పాడినవి Internet లొ చాల ఉన్నాయి. మచ్చుకి ఇవి చూడండి.
    పండిట్ జస్ రాజ్ గారి అద్భుతమైన Rendition. ఎవరు పాడారో తెలియదు కాని చాల మంచి rendition. Visuals are very good and add value to the song.

    I think the opinion expressed by Srinivas Nagulapalli is that what I feel after listening to the older version of T Sooryakumaari. I feel a strong sorrow feeling when I here this song. All said and I would like to thank you very much for uploading this rare recording.

    Balakrishna

  9. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    04/04/2012 6:06 pm

    భావనారాయణగారు: ఈరోజు “బహుత్ దిన్ హుయె”లో పాటలన్నీ (త్వరత్వరగా – fast forward చేసుకుంటూ) విన్నాను. “చందా చమ్‌ కే నీల్ గగన్ మె” అన్న పాట నిస్సందేహంగా శంకరశాస్త్రిగారి బాణీనే. ఆపాటలో ఆయన వీణ వాయించడం కూడా వినవచ్చు. లత చాలా గొప్పగా పాడిన పాట!

    రాజా నాకు తెలిసి ఈ సినిమాలో ఒక్క పాటే పాడాడు. చాలా చిన్న బిట్: “ఓ చలా అకేలా నిర్జన్ వన్ మె” అన్నది. తెలుగు “బాలనాగమ్మ” ఆధారంగా తీయబడ్డ ఈ సినిమాలో యుగళ గీతాలు లేవు.
    ఇంక మీరడిగిన ప్రశ్నకి జవాబు, క్లుప్తంగా, రాజాకి, జెమినీ సంస్థకి మొదటి నుంచి వున్న మంచి సంబంధమే. ఆయనకు సినిమాల్లో మొదటి అవకాశమిచ్చింది జెమినీ వాసన్. (సంసారం – 1950, తమిళంలో; చూ: రాజాపైన ఇదే పత్రికలో వచ్చిన వ్యాసం. తరువాత కొద్ది కాలానికే “సంసారం” హిందీలో (1951) తీయదలచినప్పుడు రాజా గొంతు ఆడిషన్ చేయడం జరిగింది. అప్పట్లో జెమినీలో హిందీ విభాగానికి incharge గా ఉన్న ప్రముఖ గాయని: వక్కలంక సరళగారు రాజా గాత్రం హిందీలో ఒప్పటంలేదని అనడంతో అవకాశం దొరకలేదు. ఆ తరువాతి సంవత్సరం తీసిన “మిస్టర్ సంపత్”లో మరొక కొత్త గాయకుడికి (పి.బి.శ్రీనివాస్) హిందీలో పాడే అవకాశం దొరికింది. 1953లో, హిందీలో పాడకపోయినా, రాజ్ కపూర్ ఏక కాలంలో 3 భాషల్లో నిర్మించదలచిన “ఆహ్/ప్రేమలేఖలు” తెలుగు తమిళ వెర్షన్లకు పాడటంకోసం జిక్కి, రాజాలు బొంబాయిలో ఉన్నారు. (Check Arudra’s essay on this film production in his “సినీమినీ కబుర్లు” for fascinating anecdotal information.) చివరిగా 1954లో జెమినీ ద్వారానే హిందీలో పాడే అవకాశం దొరికింది. I don’t think that any north Indian producer”d have taken him :).

    As to the “equation between Saluri and Eemani” I can’t say much. Nor do I think that there is much to say. Saluri was certainly *the* lead composer for Gemini between 1942 and 1948/49 (he did one more film: మంగళ-1951). The other two in the music department; viz. M.D. Parthasaradhi and Eemani took care of orchestration and at times background music. SS Vasan, the totalitarian, didnot duely credit the talent (not only i.r.t music but in other departments too!). During his 7 year stay at Gemini Saluri did just 4 films, for he couldnot work for any other companies.

    Regards, — Sreenivas

  10. కొవ్వుపుంజి గురించి Narayanaswamy అభిప్రాయం:

    04/04/2012 5:37 pm

    చలం కథ ఒకటి లేదూ ఇదే సంఘటనని తెలుగునాటికి దిగుమతి చేస్తూ? మీ అనువాదం బావుంది. అక్కడక్కడా తెలుగుజాతీయాలు చక్కగా వాడారు. కోడి అంటే మోటుగా ఉంటుందనా, చికెన్ అని రాశారు?