“ఆశ్చర్యార్థకాలను, హర్షాతిరేకాలను, బాధను దుఃఖాన్ని తెలిపేటప్పుడు బంధుత్వ పదాలను వాడడం ద్రావిడ భాషల ప్రత్యేకత అని మీకు తెలుసా?”
నిజంగా తెలియదు మీరు చెప్పేదాకా. తమిళులు “అబ్బాడీ, అమ్మాడీ” అని ఆశ్చర్యపోవడం చూసాను. హిందీలో సైతం బాప్‌రే బాప్ అని గుండెలు బాదుకుంటారు కదా? 🙂
సురేశ్ గారూ, మరో మాట – సంఖ్యాపదాల మీద రాసిన వ్యాసంలో మీరు – “ఏడుకొండల గురించి అన్నమయ్య” ప్రస్తావించాడా ఏ పదంలోనైనా?” అని అడిగారు. కొండలరాయడు, కొండలయ్య అనే మాటలను చూసిన జ్ఞాపకం. కానీ ఏడుకొండలు అనే మాట ఆయన వాడినట్లు అనిపించలేదు. అది ఇటీవలి పదబంధమా?
@nagamurali “అలాగా? మరి ఈ ‘సర్కసు’ శబ్దమునకు అర్థముమాట?” అని అడిగితే, పానుగంటి వారు సరైన సమాధానం ఇవ్వలేదు కానీ నా సమాధానం ఇలా ఉండేది:
నాయనా, ఈ శర్కస్- శబ్దము అతి ప్రాచీనమైనది. ఈ రకమైన కసరత్తులను నెరపడంలో శర్కరాక్షుడనే మహర్షి మహాప్రసిద్ధిని చెందినవాడు. కావుననే, ఆతని పేరిట వీటిని శర్కరాక్ష ప్రక్రియలు అని పిలిచేవారు. ఆయుర్వేదాన్ని నిర్వచించిన పెక్కు మహర్షులలో ఆయన ఒకరని చరకసంహిత మనకు చెబుతుంది::
ఈ మ్లేచ్ఛులకు శర్కరాక్ష ప్రక్రియలు అనుటకు నోరు తిరగక వాటిని శర్కస్ అనియు సర్కస్ అనియు మార్చుకున్నారు. చూసావా నాయనా, తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకు అని ఇప్పుడైనా ఒప్పుకుంటావా?
సురేశ్ గారూ, ఏమిటో ఈ పదాల మూలాలు తెలుసుకోడానికి మీరెంత కష్టపడుతున్నారో కదా అనిపిస్తుంది ఒక్కోసారి. ‘కంఠాభరణం’ నాటకంలో ఒక సులభమైన సూత్రం చెప్పారండీ. మీకు ఉపయోగపడొచ్చని ఆశిస్తున్నా.
“ఈ ‘సర్కసు’ శబ్దమేభాష అని మీ మతము?”
“ఒక సూత్రము చెప్పెదను వినుము. కఠినమైన శబ్దమేదియైననూ సంస్కృతమే.”
చాల బావుంది బృందావనరావు గారు! నాకు కూడ విజయవిలాసము అంటే పక్షపాతమే 🙂 తెలుగు సంధితో ఆడుకొనడములో ఇతనికి సాటి మరెవ్వరూ లేదనడములో అతిశయోక్తి లేదు. విధేయుడు – మోహన
పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
05/02/2012 1:00 pm
“ఆశ్చర్యార్థకాలను, హర్షాతిరేకాలను, బాధను దుఃఖాన్ని తెలిపేటప్పుడు బంధుత్వ పదాలను వాడడం ద్రావిడ భాషల ప్రత్యేకత అని మీకు తెలుసా?”
నిజంగా తెలియదు మీరు చెప్పేదాకా. తమిళులు “అబ్బాడీ, అమ్మాడీ” అని ఆశ్చర్యపోవడం చూసాను. హిందీలో సైతం బాప్‌రే బాప్ అని గుండెలు బాదుకుంటారు కదా? 🙂
సురేశ్ గారూ, మరో మాట – సంఖ్యాపదాల మీద రాసిన వ్యాసంలో మీరు – “ఏడుకొండల గురించి అన్నమయ్య” ప్రస్తావించాడా ఏ పదంలోనైనా?” అని అడిగారు. కొండలరాయడు, కొండలయ్య అనే మాటలను చూసిన జ్ఞాపకం. కానీ ఏడుకొండలు అనే మాట ఆయన వాడినట్లు అనిపించలేదు. అది ఇటీవలి పదబంధమా?
పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
05/02/2012 11:19 am
@nagamurali “అలాగా? మరి ఈ ‘సర్కసు’ శబ్దమునకు అర్థముమాట?” అని అడిగితే, పానుగంటి వారు సరైన సమాధానం ఇవ్వలేదు కానీ నా సమాధానం ఇలా ఉండేది:
నాయనా, ఈ శర్కస్- శబ్దము అతి ప్రాచీనమైనది. ఈ రకమైన కసరత్తులను నెరపడంలో శర్కరాక్షుడనే మహర్షి మహాప్రసిద్ధిని చెందినవాడు. కావుననే, ఆతని పేరిట వీటిని శర్కరాక్ష ప్రక్రియలు అని పిలిచేవారు. ఆయుర్వేదాన్ని నిర్వచించిన పెక్కు మహర్షులలో ఆయన ఒకరని చరకసంహిత మనకు చెబుతుంది::
కాంకాయనః కైకశేయో ధౌమ్యో మారీచకాశ్యపౌ
శర్కరాక్షో హిరణ్యాక్షో లోకాక్షః పైంగిరేవ చ
(చరకసంహిత సూత్ర స్థానః 1.12)
ఈ మ్లేచ్ఛులకు శర్కరాక్ష ప్రక్రియలు అనుటకు నోరు తిరగక వాటిని శర్కస్ అనియు సర్కస్ అనియు మార్చుకున్నారు. చూసావా నాయనా, తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకు అని ఇప్పుడైనా ఒప్పుకుంటావా?
:-).
చందవరం, ప్రకాశం జిల్లా గురించి Parvatha Sekhar అభిప్రాయం:
05/02/2012 10:52 am
చాల బాగుంది ఇంద్రాణి గారూ! అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు, వాహ్. వాహ్! నాకు బాగా నచ్చింది! మీరూ చందవరం లోనే పెరిగారా?
తేనీటి సమయం గురించి Giri అభిప్రాయం:
05/02/2012 9:49 am
వైదేహి గారు,
చాలా బాగుంది మీ తేనీటి కవి సమయం. ఒక సాధారణ సన్నివేశాన్ని మరల మరల చూడాలనిపించే చిత్తరువుగా తీర్చిదిద్దడం బాగుంది.
అభినందనలు.
– గిరిధరరావు.
చందవరం, ప్రకాశం జిల్లా గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
05/02/2012 9:36 am
> రాయెత్తి కొట్టకుండా.. దీనికి అర్ధం ఏంటో వివరిస్తారా?
ఆవు సినిమా పోస్టర్‌ను తిని నెమరేస్తుందని అర్థం కాదా?
చందవరం, ప్రకాశం జిల్లా గురించి nadeem ansari అభిప్రాయం:
05/02/2012 9:23 am
చక్కని కవిత్వం చాలా రోజులకు. కోస్తావాండ్లకు తెలుగు వచ్చుననే అనిపించుచున్నది. పలుకుబడిలో కాకున్నా కవుల మనసులలొ తెలుగు ఉన్నది. కవికి ధన్యవాదాలు.
హాబూ నిప్పు గురించి మోహన అభిప్రాయం:
05/02/2012 7:10 am
తమ్మి రెడ్డిగారు, మంచి ఊహ, ఏనుగులాటి పెద్ద ఊహ. నాకు కొద్దిగా 2001 A space odyssey చిత్రము జ్ఞాపకము వచ్చినది. విధేయుడు – మోహన
చందవరం, ప్రకాశం జిల్లా గురించి బొక్కా ప్రేమ్ కుమార్ అభిప్రాయం:
05/02/2012 6:44 am
పురుగును పొడుస్తుంది
బిత్తర చూపుల కోడిపుంజు.
కోడిపుంజు బిత్తర చూపులు కూడా క్యాచ్ చేసి కవిత రాయడం కేక.
అత్తకు యముడు-అమ్మాయికి మొగుణ్ణి
తీరుబడిగా నెమరువేస్తుంది ఆవు.
రాయెత్తి కొట్టకుండా.. దీనికి అర్ధం ఏంటో వివరిస్తారా?
సాయంకాలం పూట
నాసిరకం పుణుగులు పొంగణాలకి
గలగల్లాడతాయి రూపాయలు
ఏసీ హోటల్లో కూకోని..కయితలు రాసేవారికి నాసిరకం ఏమో కాని, తినేవాళ్ళు నాసిరకం తింటున్నాం అని అనుకోరు.
ఇంకా ఏమన్నారు మీరు
పొద్దుటి పూట
పొగలు కక్కే చౌకరకం తేనీరు
ఆరారగా తాగుతుంది ఊరు
మీరు షుగర్-ఫ్రీ బూస్టు తాగుతూ రాసుంటారు ఈ లైను
మొత్తానికి మీ ఈ కయిత కెవ్వు కేక కేకస్యః
పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి nagamurali అభిప్రాయం:
05/02/2012 5:39 am
సురేశ్ గారూ, ఏమిటో ఈ పదాల మూలాలు తెలుసుకోడానికి మీరెంత కష్టపడుతున్నారో కదా అనిపిస్తుంది ఒక్కోసారి. ‘కంఠాభరణం’ నాటకంలో ఒక సులభమైన సూత్రం చెప్పారండీ. మీకు ఉపయోగపడొచ్చని ఆశిస్తున్నా.
“ఈ ‘సర్కసు’ శబ్దమేభాష అని మీ మతము?”
“ఒక సూత్రము చెప్పెదను వినుము. కఠినమైన శబ్దమేదియైననూ సంస్కృతమే.”
నాకు నచ్చిన పద్యం: అర్జునుని వర్ణన గురించి మోహన అభిప్రాయం:
05/01/2012 6:58 pm
చాల బావుంది బృందావనరావు గారు! నాకు కూడ విజయవిలాసము అంటే పక్షపాతమే 🙂 తెలుగు సంధితో ఆడుకొనడములో ఇతనికి సాటి మరెవ్వరూ లేదనడములో అతిశయోక్తి లేదు. విధేయుడు – మోహన