ఇన్ని దశాబ్దాల తరవాత అప్పటి విషయాలు కొన్ని ఆసక్తికరంగా అనిపిస్తాయనే ఉద్దేశంతోనే నేనివి స్కాన్ చేసి పంపుతున్నాను. వీటిలో సాహిత్యానికి సంబంధించిన విశిష్టత లేదని కోప్పడకుండా ఉంటే చాలు. రచయితగా కుటుంబరావుగారు సిగ్గుపడవలసినదేదీ చెయ్యలేదని నాకు తెలుసు కనక అటువంటి విమర్శలు కూడా అనవసరమే. ఇక నా కామెంట్లన్నీ వాటికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రమే.
నాకు ఈ మధ్యన పార్టిషన్ నేపధ్యంగా వచ్చిన సాహిత్యంపై ఆసక్తి కలిగింది. హింది, ఇంగ్లీషు భాషల్లో అలాంటి సాహిత్యం వెతుక్కుంటున్నాను, చదువుకోడానికి. ఇప్పుడీ కథ చదువుతుంటే, దీన్ని కూడా ఆ కోవకు సంబంధించినదిగా పరిగణించవచ్చునని అనిపిస్తోంది నాకు.
దేశవిభజన ప్రభావం ఉత్తరభారతంలోనే ఎక్కువని, బహుశా, దక్షిణభారతంలో దాని ధ్యాస ఎక్కువగా ఉండకపోవచ్చుననే అభిప్రాయం విన్నాను. మన సాహిత్యంలో పార్టిషన్ నేపథ్యంగా వచ్చినవాటిని గురించి వివరాలు తెలుపగలరా, ఎవరైనా?
తిలక్ కవిత్వంలో కథా లక్షణాలూ, ఆయన కథల్లో కవిత్వ చాయలూ ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. మానసిక సంఘర్షణను ఇంత శక్తిమంతంగా చూపిన రచన నా పరిమిత పఠనా జీవితంలో తారసపడలేదు. రచయిత ఉద్దేశాలతో అభిప్రాయ భేదాలున్నా ఆ శైలిని మోహించకుండా ఉండలేను.
నేను టి పద్మిని గారి పుస్తకం చదివాను. శ్రీ రాధే శ్యాం గారి ప్రమేయంతొ నవంబర్ 07 ఈమాట లొ మీ మొదటి వ్యాసం చదివా. ఇప్పుడు ఈ వ్యాసం చదవడం, ఆ గాత్రం వినడం చాలా ఆనందంగా వుంది. పాడుతా తీయగా కార్యక్రమంలొ ఈ అంశాలు శ్రోతలు వింటే మేలు.
1983-1985 లలో చికాగో తెలుగు సంఘం తరఫున నెలనెలా ఒక వ్రాత పత్రిక నా సంపాదకత్వంలో (హత విధీ!) వెలువడేది. 1983 సెప్టెంబర్ తెలుగు వెలుగు సంచికలో వెల్చేరు నారాయణ రావు గారు ‘ నవ్వకపోతే గవ్వకి కొర గావు ‘ , అనే మకుటంతో ఒక చిన్న వ్యాసం రాశారు. అందులో ‘ నవ్వు నాలుగు విధాల చేటు ‘, అనే తెలుగు సామెతకి సంబంధించిన కథ తెలిసిన వారు తెలుగు వెలుగుకి రాయండి అని కోరారు.
వెంటనే వడ్లమాని పద్మావతి గారు ఈ కింది రామాయణ కథ పంపించారు. శ్రీమతి పద్మావతి గారు వడ్లమాని కార్తీక్ అన్న పేరుతో చాలా కథలు రాశారు. ఆమె రాసిన ” పడమటి గాలులు” అనే నవలని వంగూరీ ఫౌండేషన్ వారు 2005 లో ప్రచురించారు.
శ్రీమతి పద్మావతి గారు పంపిన రామాయణ కథ 1983 డిసెంబర్ తెలుగు వెలుగులో ప్రచురించబడింది. ఇదీ ఆమె పంపిన కథ!
రాముడు రావణసంహారం తరువాత అయోధ్యకు సతీసమేతుడై వచ్చి పట్టాభిషేకం చేసుకుంటున్న సమయం అది. ఆ సమయంలో లక్ష్మణుడు పకపకమని వెకిలిగా పెద్ద నవ్వు నవ్వాడట! ఆ నవ్వు ఈ కింది నలుగురూ నాలుగు విధాలుగా భావించారుట!
‘స్వంత అన్నగారి గుట్టు (“ఇంటిగుట్టు లంకకి చేటు”) చెప్పి, రామునిచే రావణసంహారంచేయించి , రాజ్యానికి వారసుడనై, రాముని భక్తిపూర్వకంగా కొలుస్తున్నానే! ఎంతటి కపట భక్తుడవు!’ అని తలచి లక్ష్మణుడు నవ్వాడా అని విభీషణుడు అనుమానించాడు.
‘సంవత్సరమంతా పరపురుషుని ఇంటనున్న భార్యని ఏలుకుంటున్నాను ‘, అందుకని లక్ష్మణుడు పకపకనవ్వాడేమోనని శ్రీరాముడు భావించాడట!
‘స్త్రీలోలుడు, దుర్మార్గుడూ అయిన పురుషుని గూటలో ఉండి అగ్నిప్రవేశం చేసినణ్త మాత్రాన పతివ్రతవు కాగలవా? ఎంతటి అపనింద వస్తుందో ఇకముందు? ‘ అందుకని నవ్వుతున్నాడా లక్ష్మణుడు? అని జానకి అనుమానించిందట!
‘అన్నని చంపి, అన్నగారి భార్యని కట్టుకొని చేతులుజోడించి రామునికి మొక్కినంత మాత్రాన ముక్తి వస్తుందా?’ అందుకని లక్ష్మణుడు వెకిలి నవ్వు నవ్వాడేమోనని సుగ్రీవుడు సంశయాత్మకుడయ్యాడట!
అప్పుడు రాముడు ‘తమ్ముడా ! లక్ష్మణా ! ఈ శుభసమయంలో నీవు ఎందుకు వెకిలిగా నవ్వావు? కారణం చెప్పకపోతే నేను ఈ రాజ్యానికి పట్టాభిభిషిక్తుణ్ణి కాదలచుకో లేదు ‘ అని గట్టిగా ప్రశ్నించాడు.
అప్పుడు లక్ష్మణుడు, ‘అన్నా! పధ్నాలుగేళ్ళు కంటికి నిద్రరాని నన్ను కామించని ప్రేమించని ఆ నిద్రాదేవత, ఇవాళ, ఈ శుభసమయంలో నీ పట్టాభిషేకం చూడనీయకండా చేస్తున్నది. నా కళ్ళెదురుగా నిలబడ్డ ఆనిద్రాదేవతని చూసి వెకిలిగా నవ్వాను,’ అంటూ రాముని పాదాలపై మోకరిల్లాడట!
ఏ కవిత కానీ, కథానిక కానీ కొన్ని సంవత్సరముల తరువాత మరల చదివినప్పదు, మనకు ఇంకా బాగా రచయిత భావాలు అర్థమవుతాయి. మాయాబజార్ సినిమా చూచిన ప్రతిసారి మనం కొంత కొత్తది తెలుసుకుంతాము. ఇక్కడ జిన్నా గురించి రాసిన కథలొ మార్పులేదు, మార్పు మన ఆలోచనలలొ.
కినిమా పత్రిక నుంచి – 3 గురించి Rohiniprasad అభిప్రాయం:
05/03/2012 10:17 am
ఇన్ని దశాబ్దాల తరవాత అప్పటి విషయాలు కొన్ని ఆసక్తికరంగా అనిపిస్తాయనే ఉద్దేశంతోనే నేనివి స్కాన్ చేసి పంపుతున్నాను. వీటిలో సాహిత్యానికి సంబంధించిన విశిష్టత లేదని కోప్పడకుండా ఉంటే చాలు. రచయితగా కుటుంబరావుగారు సిగ్గుపడవలసినదేదీ చెయ్యలేదని నాకు తెలుసు కనక అటువంటి విమర్శలు కూడా అనవసరమే. ఇక నా కామెంట్లన్నీ వాటికి సంబంధించిన జ్ఞాపకాలు మాత్రమే.
కినిమా పత్రిక నుంచి – 3 గురించి dvrao అభిప్రాయం:
05/03/2012 8:55 am
ఈ ఫీచర్ చాలా బావుంది. అప్పటి ఇంటర్వ్యు లు దొరికితే ప్రచురించండి
అద్దంలో జిన్నా గురించి Purnima అభిప్రాయం:
05/03/2012 7:52 am
నాకు ఈ మధ్యన పార్టిషన్ నేపధ్యంగా వచ్చిన సాహిత్యంపై ఆసక్తి కలిగింది. హింది, ఇంగ్లీషు భాషల్లో అలాంటి సాహిత్యం వెతుక్కుంటున్నాను, చదువుకోడానికి. ఇప్పుడీ కథ చదువుతుంటే, దీన్ని కూడా ఆ కోవకు సంబంధించినదిగా పరిగణించవచ్చునని అనిపిస్తోంది నాకు.
దేశవిభజన ప్రభావం ఉత్తరభారతంలోనే ఎక్కువని, బహుశా, దక్షిణభారతంలో దాని ధ్యాస ఎక్కువగా ఉండకపోవచ్చుననే అభిప్రాయం విన్నాను. మన సాహిత్యంలో పార్టిషన్ నేపథ్యంగా వచ్చినవాటిని గురించి వివరాలు తెలుపగలరా, ఎవరైనా?
అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి Phaneendra అభిప్రాయం:
05/03/2012 6:56 am
తిలక్ కవిత్వంలో కథా లక్షణాలూ, ఆయన కథల్లో కవిత్వ చాయలూ ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. మానసిక సంఘర్షణను ఇంత శక్తిమంతంగా చూపిన రచన నా పరిమిత పఠనా జీవితంలో తారసపడలేదు. రచయిత ఉద్దేశాలతో అభిప్రాయ భేదాలున్నా ఆ శైలిని మోహించకుండా ఉండలేను.
చందవరం, ప్రకాశం జిల్లా గురించి బొక్కా ప్రేమ్ కుమార్ అభిప్రాయం:
05/03/2012 4:57 am
@Srinivas Vuruputuri
>ఆవు సినిమా పోస్టర్‌ను తిని నెమరేస్తుందని అర్థం కాదా?
మీరు చాల షార్ప్ సుమండీ…
-బొక్కా ప్రేమ్ కుమార్
విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి radhakrishna అభిప్రాయం:
05/03/2012 4:55 am
నేను టి పద్మిని గారి పుస్తకం చదివాను. శ్రీ రాధే శ్యాం గారి ప్రమేయంతొ నవంబర్ 07 ఈమాట లొ మీ మొదటి వ్యాసం చదివా. ఇప్పుడు ఈ వ్యాసం చదవడం, ఆ గాత్రం వినడం చాలా ఆనందంగా వుంది. పాడుతా తీయగా కార్యక్రమంలొ ఈ అంశాలు శ్రోతలు వింటే మేలు.
తెలుగు భాష వయస్సెంత? గురించి ramesh kolluri అభిప్రాయం:
05/02/2012 9:04 pm
చరిత్ర, భాషా చరిత్రల గురించి ఆసక్తి ఉన్నవారందరికీ ఎంతో పనికొచ్చే మంచి వ్యాసం తెలియని విషయాలెన్నో ఆసక్తికరంగా చెప్పారు.ధన్యవాదములు.
లక్ష్మణదేవర నవ్వు గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
05/02/2012 6:44 pm
1983-1985 లలో చికాగో తెలుగు సంఘం తరఫున నెలనెలా ఒక వ్రాత పత్రిక నా సంపాదకత్వంలో (హత విధీ!) వెలువడేది. 1983 సెప్టెంబర్ తెలుగు వెలుగు సంచికలో వెల్చేరు నారాయణ రావు గారు ‘ నవ్వకపోతే గవ్వకి కొర గావు ‘ , అనే మకుటంతో ఒక చిన్న వ్యాసం రాశారు. అందులో ‘ నవ్వు నాలుగు విధాల చేటు ‘, అనే తెలుగు సామెతకి సంబంధించిన కథ తెలిసిన వారు తెలుగు వెలుగుకి రాయండి అని కోరారు.
వెంటనే వడ్లమాని పద్మావతి గారు ఈ కింది రామాయణ కథ పంపించారు. శ్రీమతి పద్మావతి గారు వడ్లమాని కార్తీక్ అన్న పేరుతో చాలా కథలు రాశారు. ఆమె రాసిన ” పడమటి గాలులు” అనే నవలని వంగూరీ ఫౌండేషన్ వారు 2005 లో ప్రచురించారు.
శ్రీమతి పద్మావతి గారు పంపిన రామాయణ కథ 1983 డిసెంబర్ తెలుగు వెలుగులో ప్రచురించబడింది. ఇదీ ఆమె పంపిన కథ!
రాముడు రావణసంహారం తరువాత అయోధ్యకు సతీసమేతుడై వచ్చి పట్టాభిషేకం చేసుకుంటున్న సమయం అది. ఆ సమయంలో లక్ష్మణుడు పకపకమని వెకిలిగా పెద్ద నవ్వు నవ్వాడట! ఆ నవ్వు ఈ కింది నలుగురూ నాలుగు విధాలుగా భావించారుట!
‘స్వంత అన్నగారి గుట్టు (“ఇంటిగుట్టు లంకకి చేటు”) చెప్పి, రామునిచే రావణసంహారంచేయించి , రాజ్యానికి వారసుడనై, రాముని భక్తిపూర్వకంగా కొలుస్తున్నానే! ఎంతటి కపట భక్తుడవు!’ అని తలచి లక్ష్మణుడు నవ్వాడా అని విభీషణుడు అనుమానించాడు.
‘సంవత్సరమంతా పరపురుషుని ఇంటనున్న భార్యని ఏలుకుంటున్నాను ‘, అందుకని లక్ష్మణుడు పకపకనవ్వాడేమోనని శ్రీరాముడు భావించాడట!
‘స్త్రీలోలుడు, దుర్మార్గుడూ అయిన పురుషుని గూటలో ఉండి అగ్నిప్రవేశం చేసినణ్త మాత్రాన పతివ్రతవు కాగలవా? ఎంతటి అపనింద వస్తుందో ఇకముందు? ‘ అందుకని నవ్వుతున్నాడా లక్ష్మణుడు? అని జానకి అనుమానించిందట!
‘అన్నని చంపి, అన్నగారి భార్యని కట్టుకొని చేతులుజోడించి రామునికి మొక్కినంత మాత్రాన ముక్తి వస్తుందా?’ అందుకని లక్ష్మణుడు వెకిలి నవ్వు నవ్వాడేమోనని సుగ్రీవుడు సంశయాత్మకుడయ్యాడట!
అప్పుడు రాముడు ‘తమ్ముడా ! లక్ష్మణా ! ఈ శుభసమయంలో నీవు ఎందుకు వెకిలిగా నవ్వావు? కారణం చెప్పకపోతే నేను ఈ రాజ్యానికి పట్టాభిభిషిక్తుణ్ణి కాదలచుకో లేదు ‘ అని గట్టిగా ప్రశ్నించాడు.
అప్పుడు లక్ష్మణుడు, ‘అన్నా! పధ్నాలుగేళ్ళు కంటికి నిద్రరాని నన్ను కామించని ప్రేమించని ఆ నిద్రాదేవత, ఇవాళ, ఈ శుభసమయంలో నీ పట్టాభిషేకం చూడనీయకండా చేస్తున్నది. నా కళ్ళెదురుగా నిలబడ్డ ఆనిద్రాదేవతని చూసి వెకిలిగా నవ్వాను,’ అంటూ రాముని పాదాలపై మోకరిల్లాడట!
చందవరం, ప్రకాశం జిల్లా గురించి Aparna krishnavajhala అభిప్రాయం:
05/02/2012 3:57 pm
పర్వత శేఖర్ గారు, చందవరంలో పెరగనవసరం లేదు కవి అవడానికి, కాని కవి చందవరం వెళ్ళాడంటే, కవి హృదయం దాగదు.
అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి Madhava Murthy అభిప్రాయం:
05/02/2012 2:11 pm