పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. మల్లె అంటు గురించి Sudhakar Majety అభిప్రాయం:

    05/08/2012 11:39 pm

    జ్ఞాపకాల జవ్వాది వీచిక….
    ఎంత అందంగా రాసారు!

  2. చందవరం, ప్రకాశం జిల్లా గురించి vikas,vinnakota అభిప్రాయం:

    05/08/2012 9:16 pm

    చాలా బాగున్నది అండి..

    వికాస్ విన్నకోట

  3. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    05/08/2012 12:16 pm

    Kudos to Mohana Rao gaaru for a scholarly essay!

    కాని నాకు ఒక సందేహము మాత్రము ఉన్నది. కాళిదాసు ఉజ్జయినీవాసుడు. కాని గుప్తుల రాజధాని పాటలీపుత్రము. ఇంత దూరము ఉన్నా కాళిదాసుకు చంద్రగుప్తునికి ఎలా సంబంధాలు ఉండినవో అన్నది చర్చనీయాంశమే. ఈ రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడా అన్న విషయము ఇంకా తేలలేదు.

    సముద్రగుప్తుని కొడుకైన రెండవ చంద్రగుప్తుడు శకులను ఓడించిన తరువాత ఉజ్జయినిని తన రెండవ రాజధానిగా చేసుకున్నాడని మనకు దొరికిన శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. కొన్ని బంగారు నాణేల మీద ఒకవైపు దేవశ్రీ మహారాజాధిరాజ శ్రీ చంద్రగుప్త అని మరోవైపు శ్రీవిక్రమాదిత్య అన్న ముద్రల ఆధారంగా రెండవ చంద్రగుప్తుడే విక్రమాదిత్యుడని చెప్పవచ్చు. రెండవ చంద్రగుప్తుని రాజ్యకాలం 380–413/415 CE అని కచ్చితంగా చెప్పవచ్చు కాబట్టి కాళిదాసు 4వ శతాబ్దానికి చెందినవాడనే చెప్పడం సబబు. ఇది ప్రస్తుతం పండితులంతా (Indologists) ఒప్పుకున్న వాదం.

    కాళిదాసు కాలనిర్ణయ వివాదంపై విస్తృత చర్చకు Kālidāsa: Date, Life, and Works (1969) by Vasudev Vishnu Mirashi, Narayan Raghunath Navlekar ను చూడవచ్చు.

  4. లక్ష్మణదేవర నవ్వు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    05/08/2012 11:32 am

    దేవర అన్న పదానికి ఉన్న రెండు అర్థాలలో దేవుఁడు, ప్రభువు అన్న అర్థాలు దేవ శబ్దానికి -రు అనే బహువచన ప్రత్యయము (మహన్మహత్యర్థక బహువచన ప్రత్యయము) జత చేయడం వల్ల వచ్చింది. మనుష్య నామవాచకాలకు -రు ప్రత్యయము, ఇతర నామవాచకాలకు -గళు/-ళు జతచేయడం ఇతర ద్రావిడ భాషలలో కనిపించినా తెలుగులో మాత్రం బాలురు, పెక్కురు వంటి కొన్ని నామవాచకాలలో తప్ప ఇతర నామవాచకాలలో -లు అన్న ప్రత్యయమే కనిపిస్తుంది.

    భర్త తోబుట్టువు అన్న అర్థం ఉన్న దేవర అన్న పదానికి ధాతురూపాలు ఇండో-యూరోపియన్ భాషలన్నింటిలో ఉన్నాయి..

    గ్రీక్ — dāḗr
    అర్మేనియన్ — taigr
    స్లావిక్ — dēverь
    జర్మన్ — zeihhor
    ఇంగ్లీష్ – tacor
    పార్శీ — hīwar

    భర్త సోదరుడినే కాకుండా సహోదరి భర్తను కూడ దేవర అని సంబోధించిన సందర్భాలు కూడా సంస్కృతంలో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు భాగవతం తృతీయ స్కంధంలో 14.25వ శ్లోకం చూడండి:

    శ్మశాన చక్రానిల ధూలి ధూమ్ర వికీర్ణ-విద్యోత-జటా-కలాపః
    భస్మావగుంఠామల రుక్మ దేహోదేవస్ త్రిభిః పశ్యతి దేవరస్ తే

    కశ్యపుడు దితికి అసురసంధ్య వేళలో మైథునం కూడదని చెబుతూ, గణనాథుడైన శివుడు మూడు కళ్ళతో చూస్తుంటాడు అని హెచ్చరిస్తాడు. దితి సహోదరి భర్త అయిన శివుడిని ఇక్కడ నీ దేవరుడు (దేవరస్ తే) అని సంబోధించడం విశేషం.

  5. లక్ష్మణదేవర నవ్వు గురించి వినీల్ అభిప్రాయం:

    05/08/2012 4:58 am

    చక్కని వ్యాసం. మంచి పాటను, మాటను పరిచయం చేశారు. హిందీ దేవర్ కు, మన దేవరకు ఇంత దగ్గరి పోలిక అని ఇప్పుడే తెలిసింది. చివర్లో రచయిత అభిప్రాయం/ముగింపు మాత్రం హడావిడిగా చొప్పించినట్టుంది.

  6. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి తఃతః అభిప్రాయం:

    05/07/2012 10:41 pm

    జయప్రభ గారు అంత దీర్ఘం గా చెప్పింది ‘ఆషాఢస్య ప్రథమ దివసే’ మీద చెప్పిన అభిప్రాయమేనా? ఒక రచన మీద వచ్చినట్లుగా ప్రచురిత మైన అభిప్రాయాల్లొ యెన్ని నిజంగా ఆ రచన మీద ఉంటున్నాయి?
    అలా యేదైనా రచన మీద కాకుండా చెప్పే అభిప్రాయాలకు ‘ఈమాట’లో చోటు కలిగించే పద్ధతిని గురించి సంపాదకులు ఆలోచించాల్సిన సమయమాసన్న మైనదా?

    తఃతః

    [అటువంటి చోటు ఈమాట చర్చావేదికల పైన ఎప్పుడో కల్పించాము. కాని, పాఠకులు ఆ వేదికను సద్వినియోగం చేసుకోవడంలేదని చెప్పడానికి చింతిస్తున్నాము … సం]

  7. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    05/07/2012 10:33 pm

    మోహన రావు గారు: మీ అనుస్పందన హర్షణీయం. “ఈమాట” వ్యాసకర్తలు అందరూ మీదారిలో నడిచి ప్రతివ్యాసానికి మొదల్లో abstract రాస్తారని, అలా ఆ వ్యాసం లో వారేం సాధించదల్చుకున్నారో వారి సొంత contributions ఏవిటో స్పష్టంగా పాఠకులకు ముందుగానే తెలియపర్చే అలవాటుని పాటిస్తారని ఆశిస్తాను.

    ఇక మీ వ్యాసం గురించి: నాకు ఛందస్సు ఏమీ తెలియదు కనుక దాన్లో ఒప్పుతప్పరయు రసజ్ఞుడిని కాను. ఐతే ఛందశ్శాస్త్రం మీద మీకున్న మక్కువ అభినందనీయం, మీ కృషి, పట్టుదల శ్లాఘనీయాలు. మీరు చెప్పినదాన్ని బట్టి ఈ వ్యాసం లో చాలా విశేషాలే వున్నట్టున్నాయి.

    జయప్రభ గారు: రచయితలకు, పాఠకులకు ఉండవలసిన అర్హతల గురించి మీరన్న మాటల్తో ఏకీభవిస్తాను. ఐతే, “తెలుగున వస్తువు మీద ఒక అదుపు ఉండి దానిలోని లోతుపాతులనెరిగి శ్రమ పడి పుస్తక రచన చేసేవారు నిజం చెప్పాలంటే లేరు. తెలుగులో పుస్తక రూపంలో కాల్పనిక సాహిత్యం కాక విమర్శలు రాకపోడానికి కారణం రాయగల సత్తా ఉన్న వాళ్ళు లేకపోవడమే! అలాంటప్పుడు వచ్చిన అరుదైన రచనల విలువనెరిగి పాఠకులు వాటి పట్ల స్పందించడం చేయదగిన పని.” అంటూ మళ్లీ “అరుదైన రచనల విలువనెరిగే” పని పాఠకుల మీదే వేస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం తమ రచన అరుదైనదైతే అది ఎందుకు అరుదైందో, దాని విలువ ఏమిటో చెప్పటం లో రచయితా భాగస్వామ్యం వహించటం అవసరం. (ఈ అభిప్రాయం వ్యాసాలకే పరిమితం) అందుకే సాంకేతిక పత్రాలలోలాగా ముందుగా ఒక abstract రాయమని కోరటం.

    కొత్త పాఠకుల విషయం లో మీ ఆవేదన న్యాయమైందే. ఐతే ఇంటర్నెట్ ఈ విషయం లో చాలా మేలు చేస్తున్నదని నేను భావిస్తాను. ఎందాకో ఎందుకు, మీ అభిప్రాయాల్నిప్పుడు ప్రపంచవ్యాప్తమైన తెలుగు జాతి అంతా చదవగలుగుతున్నది కదా. పదిహేనేళ్ల క్రితం వరకు ఇది అసాధ్యం. ఈ ఇంటర్నెట్ మూలాన ఇదివరకు ద్వీపాల్లా ఉండిపోయిన సాహిత్య ఔత్సాహికులు, professionals ఒకచోట అభిప్రాయాల్ని పంచుకోగలుగుతున్నారు కదా. ఎన్నో వెబ్ పత్రికలు, బ్లాగ్ లు వచ్చాయి. ఇవి తెలుగు సాహిత్యాన్ని బతికిస్తాయో లేదో తెలియదు కాని బతికే probability ని తప్పక పెంచుతున్నాయి.

    ఆసక్తికరమైన రచనలు కనిపిస్తే వాటికి పాఠకులూ తయారౌతారు. సాహిత్యాన్ని బతికించటం లో ప్రధానపాత్ర రచయితలది. “మమ్మల్ని మెచ్చుకునే పాఠకులు వుంటేనే మేం రచనలు చేస్తాం” అని వారు భీష్మించుక్కూచుంటే పాఠకులు ఎక్కడినుంచి వస్తారు?

    చివరగా – పుస్తకాల గురించి. నా ప్రగాఢ విశ్వాసం పుస్తక రూపానికి కాలం చెల్లిపోతోందని. బహుశా ముందుముందు “పుస్తకరచన” కూడ ఒక సామూహిక క్రియగా పరిణమిస్తుందని నేననుకుంటాను. ఒక పుస్తకాన్ని “రాసే” బాధ్యతని ఒకరే మోయాల్సిన అవసరం తీరిపోతున్నది. సైద్ధాంతికంగానే కాక ఆచరణలో సైతం పుస్తక రచయితా పాఠకుడూ రచనాబాధ్యతని సంయుక్తంగా నిర్వహించే రోజు వస్తుందని నా భావన. చూద్దాం.

  8. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి jayaprabha అభిప్రాయం:

    05/07/2012 3:41 pm

    కె.యెస్. రామారావు గారూ – నిజంగా ఇది మీరు భావించేటంతటి “జటిల” సమస్య కాదు. తెలుగు సాహిత్యానికి సంబంధించి నాకున్న అనుభవం పరిశీలన ఆధారంగా నాకు అనిపించిన విషయాలు ఇవీ! ఎప్పుడైనా కూడా ఏ రంగంలోనైనా పరిశోధనకి ఒక ప్రమాణం ఉండాలి. ఏది రాసినా అది పరిశోధన అవదు. దానికి సరి అయిన ఆకరాలు చూపిస్తూ ఆ పరిశోధన ఇతరుల దృస్టికన్నా ఎలా భిన్నమైనదో తన చూపు ద్వారా అదివరకూ తెలియని కొత్త విషయాలు ఏమున్నాయో అందుకు ఆ పరిశోధకురాలు/డు బాధ్యత వహించాలి. పరిశోధన చేసే వారికి అందుకు తగిన శిక్షణా, అలాగే చాలినంత అనుభవమూ ఉండాలి. తాను రాయదలుచుకున్న విషయం మీద అదుపు ఉండాలి.

    ఇది అటుంచితే, పుస్తకాన్నీ దాని బాగోగులనీ ఎంచే వాళ్లకి కూడా తప్పకుండా ఒక స్థాయి ఉండాల్సిందే! ఒక పని లోని సాధక బాధకాలు క్షుణ్ణంగా తెలిసిన వారూ అలాగే పరిశోధనా రంగమ్లో తగిన అనుభవం ఉన్న వారూ మాత్రమే కొంత వరకూ సరి అయిన అభిప్రాయాన్ని చెప్పగలరు. మిగిలిన వారి భావాలు లేదా స్పందనలూ వారికి ఆ వస్తువు నచ్చడం లేదా నచ్చక పోవడం, అర్ధం కావడం లేదా సరిగ్గా తెలియక పోవడం మీద ఆధారపడి బయటికి వచ్చేవే అవుతాయి చాలా సార్లు. అందుకు చేయగలిగింది ఏమీ లేదు. అయితే అభిప్రాయాలు చెప్పే వీలు ఉండాలి. ఎవరినించైనా మంచి సూచనలు లభించే అవకాశం సైతం లేకపోలేదు. వాటి సాధ్యాసాధ్యాలని బట్టి రచయిత వాటిని పాటించవచ్చు లేదా చదివి ఊరుకోవచ్చు. పుస్తక రచనలో ఎప్పుడూ కూడా రచయితదీ పరిశోధకులదే అంతిమ అభిప్రాయం అవుతుంది. అది తప్పదు. పుస్తకం బాగోగుల బాధ్యత వారిదే గనక!

    ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, కనీసం తెలుగు భాషా సాహిత్యాల వరకూ అయితే, పరిశోధనా రంగంలో తగిన అనుభవమూ శిక్షణా ఉన్నవారు క్రమంగా తగ్గి పోతున్న కాలం ఇది. అందువలన వేరే రంగాలలో స్థిరపడి తెలుగు మీద ప్రేమ లేదా ఇస్టం ఉన్నవాళ్ళు రాయక తప్పని ఒక పరిస్థితి వచ్చింది ఇవాళ. వారి భావ ప్రకటనకి అనువుగా ఉండే మాధ్యమం సైతం అందుబాటులో ఉంది. “అంతర్జాతీయ ప్రమాణాలు” అంటూ ఒక కొలమానాన్ని తెలుగున తెచ్చి పెట్టిన వాళ్ళు ఇంగ్లీషులో వచ్చే పుస్తకాలలో ఎన్ని అచ్చుతప్పులు ఉంటున్నాయో, ఎన్ని విషయాలు దేశీయమైన వాటినించి గ్రహించి వేరే భాష వారి వారికి తగిన విధంగా రూపొందుతున్నాయో మాట్లాడక పోవడం విడ్డూరం. నా దృష్టిలో ఆసక్తికరమైన రచన కాని రచన అన్నవే చిట్టచివరికి ముఖ్యమైనవి అవుతాయి. అవి ఎవరు రాసినా అంతకన్నా మించిన ప్రమాణం ఏదీ ఉండదు ఎప్పుడైనా! మిగిలినవన్నీ ఊరికే చర్చిందుకుందికి పనికొస్తాయి అంతే!

    తెలుగున వస్తువు మీద ఒక అదుపు ఉండి దానిలోని లోతుపాతులనెరిగి శ్రమ పడి పుస్తక రచన చేసేవారు నిజం చెప్పాలంటే లేరు. తెలుగులో పుస్తక రూపంలో కాల్పనిక సాహిత్యం కాక విమర్శలు రాకపోడానికి కారణం రాయగల సత్తా ఉన్న వాళ్ళు లేకపోవడమే! అలాంటప్పుడు వచ్చిన అరుదైన రచనల విలువనెరిగి పాఠకులు వాటి పట్ల స్పందించడం చేయదగిన పని. సకాలంలో రాని స్పందన ఆ తరువాత వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే! మీనమేషాలు లెఖ్ఖించడాలూ లౌక్యాలు ప్రదర్శించడాలూ ఆ రంగానికి మేలు చేయగలిగిన అంశాలు కాలేవు. ఎందుకంటే తమ విలువైన కాలాన్ని ఎవరు గానీ ఒక క్రమంలో ఒక వస్తువు మీద పెట్టడం అన్నది మామూలు విషయం కాలేదు ఎప్పుడైనా కూడాను. అందునా ఏ డబ్బులూ రాని తెలుగు సాహిత్యమ్లో అంటే మరీను! అలాగే అందరూ అన్ని రకాల రచనలూ చేయలేరు. అందువలన కొన్ని తరహా రచనలు చేయగలిగిన వారే చేయాలి. అలాంటి రచనలు అంటూ అసలు వస్తే, వాటి పట్ల ఒక కుతూహలం పాఠకులకి కనీసం సాహిత్యం గురించి తెలిసిన పాఠకులకి ఉండటం సముచితం! అయితే పాఠకుల స్థాయి ఇక్కడ చాలా ముఖ్యం.

    ఎందుకంటే ప్రతీ రచనకీ ప్రతీ వాళ్ళూ పాఠకులు కారు. ఆ వస్తువుని గురించి వారికి కనీశమైన స్పస్టత అయినా ఉండాలి. spoon feedingకి అలవాటు పడిన బధ్ధకస్తులైన పాఠకులు లాభం లేదు. కస్టపడగలిగిన స్వభావం ఉన్నవాళ్లై ఉండాలి పాఠకులు కూడా! అలాగే ఒక పుస్తకం అర్ధం చేసుకోవడం వేరు. అదే పుస్తకాన్ని గురించి వ్యాఖ్యానించడానికి తగిన పరిజ్ఞానం పుష్కలంగా ఉండి వారు ఆ పని చేయడం వేరు. రెండూ భిన్నమైన విషయాలు. దురదృష్టమైన విషయం ఏమంటే తెలుగున విమర్శ అరుదైన అంశం ఎలా అయిందో, అలాగే ఆ విమర్శ గురించి చేసే పాఠక వివేచన కూడా అరుదే అయిపోయింది. సూచనలు చేయడం రాసిన విషయాన్ని విశ్లేషణ చేయడం ఒకటి కాదు. ఎప్పుడైనా ఏ పుస్తకాన్నైనా ఎప్పుడూ అనేక తీరుల్లో రాసే వీలుంది. ఏదీ కూడా “perfect” కాదు. అవదు కూడా! ప్రతీ రచనకీ ఇది వర్తిస్తుంది. ఆ రాసిన వారెవరు అన్నదానితో సంబంధం లేకుండా! అందువలన అభిప్రాయాలు ఆ రచనని బేరీజు వేయడంలో అడుగు తప్పనివి అయి ఉండాలి. అంతే!

    ఇంక చివరగా తెలుగు వరకూ పుస్తక ప్రచురణ, దానికి సంబంధించిన ఇతర అంశాలు అనేకం దుస్సాధ్యమైనవి. అయినా తెలుగున కస్టమైన అంశాల మీద ఇంకా పని చేయడం జరుగుతూ ఉందంటే, పుస్తకాలు అచ్చు అవుతున్నాయీ అంటే అది కేవలం రచయితలకి భాషా సాహిత్యాల పట్ల ఉండే ప్రేమ వల్ల మాత్రమే! మరొక్క పదేళ్ళాగండి అప్పుడు ఈ వచ్చే పుస్తకాలూ రావు. ఇంతపాటి మాట్లాడే వాళ్ళూ ఉండరు: కొత్త పాఠక వర్గం తయారైతే తప్ప.-అలా నిజంగా అయితే గనక అప్పుడు నాకన్నా సంతోషించే వాళ్ళుండరు. తెలుగు సాహిత్యం వరకూ రాసే వారిని నిలుపోగలిగితేనూ, పాఠక వర్గాన్ని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళ గలిగితేనూ తప్ప అది సాధ్యమయ్యే వ్యవహారంలా లేదు. కారణం తెలుగున ప్రవేశం ఉన్న వాళ్ళు క్రమంగా తగ్గిపోతున్నారు. దీన్ని ఏ రకంగా సరి చేయాలీ అన్నది ఆలోచించవలసిన విషయం. లేకపోతే తెలుగున పుస్తకాలు వచ్చే వీలే ఇటుపై ఉండదు. అలా జరగకుండా ఉండాలంటే ఇందుకు రచయితా పాఠకులూ విమర్శకులూ వీరందరూ తమ పాత్రలని సక్రమంగానూ నిజాయితీ గానూ పోషించాలి. సరుకున్న రచనలని దూరం పెట్టి తేలిక పాటి రచనలని గురించి బాకా కొట్టే ఒక తప్పుడు పాత్ర పోషించకుండా ఉంటే చాలు. అందులో భాగంగానే మంచి రచనలని గురించి మాట్లాడ వలసిన బాధ్యతని సైతం సాహిత్యం పట్ల మమకారం ఉన్న వారందరూ చూపించవలసి ఉంది. ఇదే మీరు మరి “జటిల”మంటారా? అయితే మరి సాహిత్యాన్ని ఏకంగా అటకెక్కించేస్తే చాలు:)

    జయప్రభ.

  9. లక్ష్మణదేవర నవ్వు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    05/07/2012 1:17 pm

    వెల్చేరు గారి రచన చదివిన తరవాత ఒక చిన్న చిరునవ్వు నవ్వుకున్నా! మళ్ళీ భయం వేసింది. “లక్ష్మణుడి నవ్వు ఎన్ని అపోహలకి దారితీసిందో ఈ రచనలో తెలిసింది కదా! మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నవ్వుతున్నావ్” అని నన్ను నేను ప్రశ్నించుకున్నా!

    చూట్టానికి ఒక్కలా కనపడే కవలలుగా జన్మించిన రామన్నా – నేనూ చిన్నప్పుడు బాగానే దెబ్బలాడుకొనే వాళ్ళం. ఐదు నిమషాలు ముందు పుట్టినందుకు నా మీద అన్నగా పెత్తనం నాకు నచ్చేది కాదు. ఈ విషయమై మా అమ్మగారితో ఫిర్యాదు చెయ్యగా, చెయ్యగా మా అమ్మగారు నన్ను సముదాయించడానికి చెప్పిన ఈ క్రింది విషయాలు మరొక రకంగా వెల్చేరు గారు ఈ రచనలో చెప్పారు.

    అసలు వనవాసానికి వెళ్ళమన్నది రాముడిని. భర్తకి తోడుగా ఉండాలని తోడు వెళ్ళింది సీత. మరి ఎవరూ లక్ష్మణుడిని వనవాసానికి వెళ్ళాలని ఆజ్ఞాపించపోయినా అన్న మీద ప్రేమ, గౌరవం కొద్దీ లక్ష్మణుడు స్వ ఇచ్ఛతో అడవులకి అన్న వెంట వెళ్ళాడు. ఇది లక్ష్మణుడు, రాముడి కంటే గొప్పవాడు అనటానికి మొదటి కారణం. (ఇది వినగానే నేను ఎంత గొప్పగా ఊహించుకున్నానో మీరు గమనించగలరు!). రాముడు వనవాసానికి చక్కగా తన భార్యతో హనీమూన్‌కి వెళ్ళినట్టు వెళ్ళాడు. మరి లక్ష్మణుడో? పెళ్ళి అయినా కూడా, భార్యని వదలి సేవకుడిలాగా అన్న వెంట నడిచాడు! ఇది లక్ష్మణుడు గొప్పవాడు అనటానికి ఇంకో కారణం! (ఇది వినగానే లక్ష్మణుడు కూడా గొప్పవాడే అన్న నిర్ధారణకి నేను వచ్చేసాను.)

    మళ్ళీ అటువంటి అనుభూతే మళ్ళీ ఇప్పుడు ఈ రచన చదువుతుంటే కలిగింది. వెల్చేరుగారికి కృతజ్ఞతలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న
    Lucky.Vishnubhotla[AT]Globalfoundries.com

  10. మాండలిక వృత్తి పదకోశం గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    05/07/2012 12:50 pm

    Dear Editor,

    Arudra, the social and literary historian! Data are concisely crammed and casually delivered; yet inferences get elaborate treatment and are empirically analyzed. The approach to a topic related to Literary history never fails to be logical. Cascading the information replete with data, fortifying with solid proof; unfolding fresh conclusion backed by solidly proven information from verifiable sources; comprehensive treatment of a given topic, offering a logical insight into the core and the peripheral issues; and drawing rational analysis are the hall marks of Arudra Garu. Infusing a conversational tone and rendering an authentic text of standard proof with readability and easeful flow are pervasive in Arudra.

    His exhaustive acquaintance with the vast areas covering the background to a topic is seldom conspicuous, but lends authenticity to the key conclusions, which gives coherence to a concept. His multi-sourced knowledge fills the gaps in the basic structure of a topic. Most often, his inferences are logically concluded; and are driven by plausible analysis. They tend to add to the corpus of the knowledge in the fundamentals of a given topic, especially in areas of social legacy and that of literary history.

    We are fortunate that Bhadriraju Krishna Murthy garu [ we saw and heard him quite recently at The Book exhibition on Necklace Road, Hyderabad] and Chekuri Rama rao garu are keeping good health. And we are unfortunate that their expertise is being left underutilized.

    I appreciate your decision to retrieve the essay. Could you please do more from the archives?

    Yours faithfully,
    Siddineni Bhava Narayana