ఆర్యు లారా,
అల్లసానిపెద్దన్న ఆసువుగా చదివి గండపెండేరం సంపాదించిన పద్యము…పూతమెరుంగులు…భారతీ వధూనికటి….బహుభంగ …..(నాకు పూర్తిగా గుర్తులేదు)… దయచేసి ఎవరైనా నాకు మెయిల్ చేయగలరా?
మీకు అనేక ధన్యవాదాలు.
నారాయణమూర్తి
టి. శ్రీవల్లీ రాధిక -కవితలన్నీ బాగున్నాయి. వీరు రాసిన “అర్హత” కథ ఇంతవరకూ ఈ పత్రికలో చదివిన కథలన్నిటిలోకీ నాకు నచ్చిన కథ.
“నా స్నేహితుడు” అన్న కథ ఇక్కడ ప్రచురించగలరా? థేంక్స్.
Thanks for the link on Sri Adinarayana rao. My request to you is to write in Telugu,in eemaata about his good work in detail based on Hindustani style, giving some audio clips.
బాబ్జీలు గారూ,
వ్యాసం చివర ఉన్న మూడవ రెఫరెన్సు – ‘చివరి మాట’ ఆఖరి పేరాలో చూడండి. బాలగోపాలు మార్క్సిజం పట్ల తనకున్న అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తారు. గమనించ వలసిన విషయం ఒకటున్నది. ఎవరైనా చీకట్లో బయల్దేరేటప్పుడు ఏదో ఒక దీపం పట్టుకుని బయల్దేరుతారు. దారి మధ్యలో దాని వెలుగు సరిపోవటం లేదంటే దాన్ని బాగు చేసుకుంటారు. లేకపోతే వేరే దీపం ఏదైనా ఏర్పాటు చేసుకుంటారు. మార్క్సిజం వెలుగులో తనకి కనపడిన సత్యాలను ఎంత నిక్కచ్చిగా చెప్పారో, అంతే నిక్కచ్చిగా దాని పరిమితులు కనపడినప్పుడు కూడా బాలగోపాలు చెప్పారు. మూడు దశాబ్దాల పాటు అవిరామంగా తెలుగులోనూ ఇంగ్లీషులోనూ రాసిన మనిషి కాబట్టి, ఆయన ఎప్పుడూ ఎట్లా ఆలోచించారన్నది పట్టుకోవటం కష్టం కాదు.
మాలతి గారూ అడిగారు కాబట్టి చెప్పే సాహసం చేస్తున్నాను.
ఈ కథలో – పైనించి కింద వరకు కనపడేది రంగశయనం వ్యక్తిత్వం. మిగిలిన వారందరూ కూడా రంగశయనం మీద ఒక సారి టార్చి లైటు వేసి మనకు చూపించి వెళ్లిపోతారు. ఇంతమంది భుజాల మీదుగా రంగశయనం మీద దాడి చేశారు కాబట్టి మీకు రంగశయనం పట్ల చాలా అయిష్టం ఉండి ఉంటుంది అని అనుకుంటున్నాను. రంగశయనాన్ని మూర్ఖుడుగా చూపించటం వరకే ఈ కథ పరిమితమయితే చెప్ప వలసినదేమీ ఉండదు. కానీ కథ చివర్న ఆ యువకుడి అభిప్రాయం ఆ పెద్దమనిషికి అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు అన్న మాట వచ్చింది కాబట్టి, ఆ మూర్ఖత్వానికి కారణం ఆయన ఒక తరానికి చెందిన మనిషి కావటం అన్న అభిప్రాయం కలుగుతుంది. నిజానికి కథలో ఆయన తరానికి చెందిన వారు మరెవరూ కనపడరు. ఎదురింటి ఎల్లమ్మ అనే ఒక మనిషీ, పక్కింటాయన ఇంకొకరెవరో తప్ప! స్పష్టా స్పష్టమైన జ్ఞాపకాల ద్వారా తల్లి వ్యక్తిత్వమేమిటో కొంత కనపడుతుంది. (అది కథ చివర్లో కొడుక్కి సాక్షాత్కారమవుతుందని మీరంటారు – ఆ మాటని మీ మాట భరోసా మీద తీసుకుంటాను) ఆ అభిప్రాయం కలగగానే మళ్ళీ చదివితే దాన్ని నిరూపించే ఆధారాలు ఇంకేవీ కనపడవు. చివరికి రంగశయనం పట్ల మీకు తీవ్రమైన అయిష్టమో అసంతృప్తో ఉన్నదని , అందువల్లనే మీరు ఆ పాత్రని పరమ మూర్ఖుడిగా, స్వార్ధ పరుడుగా చిత్రీకరించారనీ అనిపిస్తుది. ఇతర పాత్రల పట్ల మీకు శ్రద్ధ లేదనీ అనిపిస్తుంది. వాళ్ళ పేర్లు కూడా వెతుక్కుని చూసుకుంటే తప్ప తెలియవు. ఈ కథని నేను రాస్తానని అనుకోను కానీ, ఇలాంటి కథ రాసే పని పడ్డప్పుడు, పాత్రల పట్ల నాకున్న రాగద్వేషాలకు మూలం ఏమిటో తేల్చుకున్నాకనే రాస్తాననుకుంటాను.
ఇక పోతే, రివ్యూ విషయం లో – నిజానికి కథలకి పీర్ రివ్యూ సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. కథలకి నప్పేది వర్క్ షాపు పద్ధతి. కథల్లోనూ కవితల్లోనూ రచయితలు తనకి చాలా ఆంతరంగికమైన విషయాలతో పని చేస్తారు. వాటిని మలిచే ప్రయత్నంలో ఇంకొకళ్లెవరైనా పాల్గొనాలంటే – దానికి తగిన వాతావరణం చాలా జాగ్రత్త గా ఏర్పరుచుకోవాలి. పీర్ రివ్యూ తప్ప మరొక మార్గం లేదనుకుంటే – మీకు ఎటువంటి విమర్శో, అభిప్రాయమో కావాలన్నది ఆలోచించుకుని ముందుగానే మీరు చెప్తే ఇతరులకి తమ తమ హద్దులు పరిమితులు, దేని గురించి మాట్లాడ వచ్చును, ఏది అంగీకారం కాకపోవచ్చును ఇట్లాంటివి తెలుస్తాయి. ఆ పైన మీకు పనికొచ్చే విధంగా విమర్శించటానికి వీలవుతుంది.
ఉదాహరణకి, ఈ కథ గురించి నేను పైన చెప్పినది మీకు ఏరకంగానూ ఉపయోగ పడక పోవచ్చును. మీరు రాసిన కథ పట్ల అందులో పాత్రల పట్ల మీకు ఏ అభిప్రాయం ఉందో, మీరు విమర్శనించి ఏమీ ఆశిస్తున్నారో నాకు తెలియక పోవటం వలన వచ్చిన చిక్కు ఇది. 🙂
ముందే చెప్పినట్టుగా, అడిగారు కాబట్టి చెప్పే సాహసం చేశాను. అన్యధా భావించరనే ఆశ.
ఎలానూ మిగతా పాఠకులతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టీ ఇక పొడిగించనును, కానీ…
1. మీ బ్లాగుపాఠకులంతా మీ పీర్లనే మీకు అనిపిస్తే మరీ మంచిది. మీ బ్లాగు చదివేవాళ్ళంతా క్రిటికల్గా చదవరేమో అన్నాను. దానితో, పీర్ల గురించి నా నిర్వచనం ఏవని మీకు తెలిసిందో నాకు తెలవడం లేదు. అయినా పర్లేదు.
2. మీ కథను ఎలా మార్చాలో పాఠకులకు ఇవ్వకుండానే వచ్చే హోంవర్క్ మీ కథలు రాయడములో మీరాశించే ఒక ప్రయోజనమని నాకు నిజంగా తెలియదు. ఇప్పుడర్థమయింది, మీరు కావాలనే అపరిపక్వత (raw ness)ని కొంత ఒదిలిపెడుతున్నారని మీ కథల్లో.
3. కథ మెరుగు పెట్టడానికి ఖచ్చితమైన కొలమానాలు ఉన్నాయి. ఉంటాయి. అవి సాపేక్షికమైనవి కావు. ఏ కథకు ఆ కథ, ఆకథ చుట్టూ అల్లబడివున్న వాతావరణం అంతర్లీనంగా వాటిని నిర్దేశిస్తూ ఉంటాయి. వాటి ఆధారంగానే ఆ కథాకథనశైలీశిల్పాల్లో హెచ్చుతగ్గుల్ని అంచనా వేస్తారు.
నేను మెరుగు పెట్టడం అన్నదానికి మీరు తీసుకున్న అర్థమ్ సరి అయినది కానే కాదు. మీ శైలిలోనే, మీ భాషలోనే మీరు చెప్పిందే మరింత బాగా పాఠకులు ఎక్కువమందికి మీరనుకున్న అర్థంలోనే చేరడానికి చేసే మార్పు మెరుగు పెట్టడం అంటే. మిమ్మల్ని నా భాషలో మాట్లాడమని కాదు. (పెళ్ళికి మీ అమ్మాయిని నేను అలంకరించటం అంటే మీ అమ్మాయిని మా అమ్మాయిగా చేసుకోడం కాదు. చాలా మంది, చాలా మంచి అమ్మలకి కూడా కూతుళ్ళకి పెళ్ళి ముస్తాబు రాక, వేరేవారితో చేయిస్తారు. చిన్నపట్నించీ మొఖం కడిగి జడేసి బడికి పంపాను కాబట్టీ పెళ్ళి ముస్తాబు కూడా నేనే చేయగలను అనుకోడమే కాదు, నాకంటే నా కూతురిని ఇంకెవరూ ఇంత బాగా అలంకరించలేరు అని కూడా అనుకోడం సరి అయినది కాదు. అలంకరణలో లోపాలుంటే పెళ్ళాగిపోదు కదా, పెళ్ళయింది కదా అని అలంకరణ గొప్పగా ఉన్నట్టూ కాదు, కథలూ అలాగే. అలంకరణ చక్కగా ఉండటం ఆ కళాకారుడికి కళకు ఉన్న బంధం మీద ఆధారపడి ఉంటుంది… కదా?)
పాఠకులు చదివే కథని తమ భాషలోకి మార్చుకోడమూ, కథని అలా తమ లోకానికి అన్వయించుకోడమూ అనె ప్రక్రియ చాలా లోతైన విషయం. కథని మెరుగు పెట్టడం చాలా మొదట్లో జరిగే (ప్రిలిమినరీ) తంతు. ఇదే తేలుతున్నట్టులేదు సరిగ్గా, అంతదాకా ఎందుకు లేండి.
శైలి అంటే నాకు తెలుసనే అనుకుంటాను. మళ్ళి చెప్పినందుకు కృతజ్ఞతలు.వినదగు నెవ్వరు చెప్పిన… ముందే చెప్పాను గదా నా చాదస్తాలు చాలా ఉన్నాయని. మీకేమో చాలా అధునాతన భావాలు ఉన్నై, ఈ తరంలో చాలా మందికి మల్లే. తాను ముణిగిందే గంగ, తాను వలచిందే రంభ తరహాలో. శుభం. అలానే కానీయండి, ముణిగిపోయిందేమీ లేదు ఎలానూ.
ఇంక ఎలతానండీ, మీరు చెప్పినట్టుగానే “… పెరవారికి చోటొసంగుచున్”
సంచారి.
@సంచారి, ముందు మీవ్యాఖ్యకి ధన్యవాదాలు. మిగతా విషయాలు వరసగా,
1. సంపాదకులు శ్రద్ధగానే చదివేరనుకుంటున్నాను, ప్రచురణకి అంగీకరించేముందు. వారు రెండు సూచనలు చేసేరు. ఒకటి తీసుకున్నాను. ఒకటి తీసుకోలేదు.
2. నాబ్లాగులో చదివేవారు పీర్లు కాకపోవచ్చు అన్నారు. (ఔచ్.) ఈ వాక్యంలో పీర్లు అన్నపదానికి మీనిర్వచనం ఏమిటో తెలుస్తోంది. అది సరైన నిర్వచనం అనుకోను. నాకు సంబంధించినంతవరకూ, నాకథలు నేను రాసినట్టు నచ్చితేనే చదువుతారు. మీరూ చదువుతున్నట్టే కనిపిస్తోంది. మీరు నాకథ చదివినప్పుడల్లా ఇలా ఎక్కడ మార్చవచ్చో ఆలోచించుకుంటుంటే, అదే నాకథ సాధించిన ప్రయోజనం అనుకుంటాను. మరో కారణం ఉంటే మీరే చెప్పండి.
3. ఇప్పుడు నాఅభిప్రాయం చెప్తాను. ప్రతి మనిషికి ఎవరిభాష, ఎవరి పదకోశం వారికి ఉంటుంది. పాఠకుడు చదువుతున్నప్పుడు తనమనసులో నా కథని తనభాషలోకి అంటే తనకి నచ్చని లేదా కొత్తమాటని తనకి తెలిసినమాటకి మార్చుకుంటాడు. నా ఈకథని మీరు మరొకరికి చెప్తే, అందులో ఒక్కవాక్యం కూడా నేను రాసినట్టు ఉండదు. దాన్నే శైలి అంటారు. ఇది నా శైలి.
మీరు మెరుగుపెట్టడం అంటున్నది మరొకరికి మెరుగు కాకపోవచ్చు. లేదా, మరొకరు ఈ మెరుగుపెట్టడం మరోచోట చెయ్యొచ్చు. నిజానికి ఇది మెరుగుపెట్టడం కాదు. మీరు చేస్తున్నది – నన్ను మీభాషలో మీకు కావలిసినట్టు, మీకు కావలిసిన సమాచారం మాత్రమే చెప్పమనడం.
నా అభిప్రాయంలో కథ “మెరుగు పెట్టడానికి” నిజంగా ఖచ్చితమైన కొలమానాలు లేవు బంగారానికి 24 కేరట్లు, వెండికి స్టెర్లింగ్ లాగ.
తా.క. మిగతా పాఠకులు కూడా ఈకథ మెరుగు పరచడానికి ఏ మార్పులు సూచిస్తారో తెలుసుకోవాలని ఉంది. ఇదొక exercise అనుకుందాం. చెప్పండి.
ఉపేంద్ర గారూ,
మీలాటి వారు రాయడం, పీట ముడితో సహా, నాలాటి వాళ్ళ అద్రుష్టం. దానికి తోడు నాలాటివాళ్ళ (తెలుగులో సిల్లీ) సందేహాలకి ఓపికగా సమాధానాలు ఇవ్వడం ఇంకా గొప్ప. దీన్నే కదా మీరు (తెలుగులో) డైలాగు అన్నారు. కాదా?
మీ వ్యాసం క్షమార్హం ఎలా అవుతుంది? అది చదివి డైలాగు మొదలెట్టకపోతే తప్పున్నర మాది.
5. బాలగోపాల్ గారు అంత ఎక్సిప్లిసిట్ గా అన్నారా? అన్లేదేమో!
దేన్ని ఎట్లా అనుసంధానం చేసుకోవాలి అన్నది మిలియన్ డాలర్ల ప్రెశ్న. కదండీ.
మన ఖర్మ, ఎవరి ఖర్మ కెవరు బాధ్యులూ అనో; ఆళ్ళు మన్ని దెబ్బ తీసేరు, దెబ్బకి దెబ్బ, అయితే నాటె పెన్నీ మోర్ నాటే పెన్నీ లెస్ అనో; సహేంద్ర తక్షకాయస్వాహా అనో; ఇలా రకరకాలుగా కదా ప్రెతీ ఇబ్బందినీ ఇబ్బందిపడ్డ ప్రెతివాడూ అనుసంధానించుకుంటాడు వాడి సత్తువని బట్టి.
అంతేగానీ, మార్కెట్టు రాజ్యంలో ఇలా అయిన్నీకాబట్టి ఈ మార్కెట్లని దుంప నాశనం చేసెయ్యాలి అనిన్నీ; కొత్త వ్యవస్థ మొదలెట్టాలి అనిన్నీ; యెజ్నంలో కుర్రాడి లాగ నా పిల్లలు ఇలాటి బతుకు బతక కూడదనిన్నీ; రాకెట్టప్పారావులాగ ఇలాటి బతుకు ఇలాగే బతకాలనిన్నీ; ఇలాటి బతుకులో పోలీసోడి “అక్కరెన్సు” రిపోర్టు ని ఏ జడ్జీ కాదంటాడో సూద్దారి అనిన్నీ; లాయరు మూర్తి గారి లాగ ఇలాగెలా బతకడం అనిన్నీ; ముత్తేలమ్మలాగ ఇలాక్కూడా బతకొచ్చనిన్నీ; ఆ జడ్జీ గోరిలాగ పిచ్చెక్కకపోతె బతకలేవఁనిన్నీ; ఇంకా బోల్డన్ని ….. లాగెలా అనుసంధానించుకోగలరు?
With regard to the comments from READER, every great thing shall start from a small initiation. So, it started from this.
I want to quote this line which I dont recall the source (but was in Hindi). I am translating this in to English for easy reference
“I know that with a small drop of water, I can not fill the river,
I know with a small piece of bread, I can not cater to the hunger of the world
I know with a small amount of money, I can not fulfill the need of all poor
However, when the history of mankind will be written, my name will not be under the destructors, but will be on the side of constructors”
Want to close with the comment that we need to start somewhere on our own instead of waiting for the politicians, rich people, god. If you start, I am sure there are many out there who want to join & support.
నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
05/18/2010 1:45 pm
వికీపీడియా లింకు పట్టుకుని వెడితే, పెద్దగారి పద్యం ఇక్కడ దొరికింది.
నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి J.Narayana Murthy అభిప్రాయం:
05/18/2010 6:37 am
ఆర్యు లారా,
అల్లసానిపెద్దన్న ఆసువుగా చదివి గండపెండేరం సంపాదించిన పద్యము…పూతమెరుంగులు…భారతీ వధూనికటి….బహుభంగ …..(నాకు పూర్తిగా గుర్తులేదు)… దయచేసి ఎవరైనా నాకు మెయిల్ చేయగలరా?
మీకు అనేక ధన్యవాదాలు.
నారాయణమూర్తి
సుగమం గురించి lyla yerneni అభిప్రాయం:
05/16/2010 11:04 am
సంపాదకులకు:
టి. శ్రీవల్లీ రాధిక -కవితలన్నీ బాగున్నాయి. వీరు రాసిన “అర్హత” కథ ఇంతవరకూ ఈ పత్రికలో చదివిన కథలన్నిటిలోకీ నాకు నచ్చిన కథ.
“నా స్నేహితుడు” అన్న కథ ఇక్కడ ప్రచురించగలరా? థేంక్స్.
లైలా
మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి T.Raja gopal అభిప్రాయం:
05/15/2010 11:43 pm
Srinivas garu,
Thanks for the link on Sri Adinarayana rao. My request to you is to write in Telugu,in eemaata about his good work in detail based on Hindustani style, giving some audio clips.
Regards,
Raja gopal.
వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి చాకి రేవు ఉపేంద్ర అభిప్రాయం:
05/15/2010 9:01 pm
బాబ్జీలు గారూ,
వ్యాసం చివర ఉన్న మూడవ రెఫరెన్సు – ‘చివరి మాట’ ఆఖరి పేరాలో చూడండి. బాలగోపాలు మార్క్సిజం పట్ల తనకున్న అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తారు. గమనించ వలసిన విషయం ఒకటున్నది. ఎవరైనా చీకట్లో బయల్దేరేటప్పుడు ఏదో ఒక దీపం పట్టుకుని బయల్దేరుతారు. దారి మధ్యలో దాని వెలుగు సరిపోవటం లేదంటే దాన్ని బాగు చేసుకుంటారు. లేకపోతే వేరే దీపం ఏదైనా ఏర్పాటు చేసుకుంటారు. మార్క్సిజం వెలుగులో తనకి కనపడిన సత్యాలను ఎంత నిక్కచ్చిగా చెప్పారో, అంతే నిక్కచ్చిగా దాని పరిమితులు కనపడినప్పుడు కూడా బాలగోపాలు చెప్పారు. మూడు దశాబ్దాల పాటు అవిరామంగా తెలుగులోనూ ఇంగ్లీషులోనూ రాసిన మనిషి కాబట్టి, ఆయన ఎప్పుడూ ఎట్లా ఆలోచించారన్నది పట్టుకోవటం కష్టం కాదు.
ఉత్తమాయిల్లాలు గురించి చాకి రేవు ఉపేంద్ర అభిప్రాయం:
05/15/2010 8:54 pm
మాలతి గారూ అడిగారు కాబట్టి చెప్పే సాహసం చేస్తున్నాను.
ఈ కథలో – పైనించి కింద వరకు కనపడేది రంగశయనం వ్యక్తిత్వం. మిగిలిన వారందరూ కూడా రంగశయనం మీద ఒక సారి టార్చి లైటు వేసి మనకు చూపించి వెళ్లిపోతారు. ఇంతమంది భుజాల మీదుగా రంగశయనం మీద దాడి చేశారు కాబట్టి మీకు రంగశయనం పట్ల చాలా అయిష్టం ఉండి ఉంటుంది అని అనుకుంటున్నాను. రంగశయనాన్ని మూర్ఖుడుగా చూపించటం వరకే ఈ కథ పరిమితమయితే చెప్ప వలసినదేమీ ఉండదు. కానీ కథ చివర్న ఆ యువకుడి అభిప్రాయం ఆ పెద్దమనిషికి అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు అన్న మాట వచ్చింది కాబట్టి, ఆ మూర్ఖత్వానికి కారణం ఆయన ఒక తరానికి చెందిన మనిషి కావటం అన్న అభిప్రాయం కలుగుతుంది. నిజానికి కథలో ఆయన తరానికి చెందిన వారు మరెవరూ కనపడరు. ఎదురింటి ఎల్లమ్మ అనే ఒక మనిషీ, పక్కింటాయన ఇంకొకరెవరో తప్ప! స్పష్టా స్పష్టమైన జ్ఞాపకాల ద్వారా తల్లి వ్యక్తిత్వమేమిటో కొంత కనపడుతుంది. (అది కథ చివర్లో కొడుక్కి సాక్షాత్కారమవుతుందని మీరంటారు – ఆ మాటని మీ మాట భరోసా మీద తీసుకుంటాను) ఆ అభిప్రాయం కలగగానే మళ్ళీ చదివితే దాన్ని నిరూపించే ఆధారాలు ఇంకేవీ కనపడవు. చివరికి రంగశయనం పట్ల మీకు తీవ్రమైన అయిష్టమో అసంతృప్తో ఉన్నదని , అందువల్లనే మీరు ఆ పాత్రని పరమ మూర్ఖుడిగా, స్వార్ధ పరుడుగా చిత్రీకరించారనీ అనిపిస్తుది. ఇతర పాత్రల పట్ల మీకు శ్రద్ధ లేదనీ అనిపిస్తుంది. వాళ్ళ పేర్లు కూడా వెతుక్కుని చూసుకుంటే తప్ప తెలియవు. ఈ కథని నేను రాస్తానని అనుకోను కానీ, ఇలాంటి కథ రాసే పని పడ్డప్పుడు, పాత్రల పట్ల నాకున్న రాగద్వేషాలకు మూలం ఏమిటో తేల్చుకున్నాకనే రాస్తాననుకుంటాను.
ఇక పోతే, రివ్యూ విషయం లో – నిజానికి కథలకి పీర్ రివ్యూ సరైన పద్ధతి కాదని నా అభిప్రాయం. కథలకి నప్పేది వర్క్ షాపు పద్ధతి. కథల్లోనూ కవితల్లోనూ రచయితలు తనకి చాలా ఆంతరంగికమైన విషయాలతో పని చేస్తారు. వాటిని మలిచే ప్రయత్నంలో ఇంకొకళ్లెవరైనా పాల్గొనాలంటే – దానికి తగిన వాతావరణం చాలా జాగ్రత్త గా ఏర్పరుచుకోవాలి. పీర్ రివ్యూ తప్ప మరొక మార్గం లేదనుకుంటే – మీకు ఎటువంటి విమర్శో, అభిప్రాయమో కావాలన్నది ఆలోచించుకుని ముందుగానే మీరు చెప్తే ఇతరులకి తమ తమ హద్దులు పరిమితులు, దేని గురించి మాట్లాడ వచ్చును, ఏది అంగీకారం కాకపోవచ్చును ఇట్లాంటివి తెలుస్తాయి. ఆ పైన మీకు పనికొచ్చే విధంగా విమర్శించటానికి వీలవుతుంది.
ఉదాహరణకి, ఈ కథ గురించి నేను పైన చెప్పినది మీకు ఏరకంగానూ ఉపయోగ పడక పోవచ్చును. మీరు రాసిన కథ పట్ల అందులో పాత్రల పట్ల మీకు ఏ అభిప్రాయం ఉందో, మీరు విమర్శనించి ఏమీ ఆశిస్తున్నారో నాకు తెలియక పోవటం వలన వచ్చిన చిక్కు ఇది. 🙂
ముందే చెప్పినట్టుగా, అడిగారు కాబట్టి చెప్పే సాహసం చేశాను. అన్యధా భావించరనే ఆశ.
ఉత్తమాయిల్లాలు గురించి సంచారి అభిప్రాయం:
05/15/2010 5:46 pm
ఎలానూ మిగతా పాఠకులతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టీ ఇక పొడిగించనును, కానీ…
1. మీ బ్లాగుపాఠకులంతా మీ పీర్లనే మీకు అనిపిస్తే మరీ మంచిది. మీ బ్లాగు చదివేవాళ్ళంతా క్రిటికల్గా చదవరేమో అన్నాను. దానితో, పీర్ల గురించి నా నిర్వచనం ఏవని మీకు తెలిసిందో నాకు తెలవడం లేదు. అయినా పర్లేదు.
2. మీ కథను ఎలా మార్చాలో పాఠకులకు ఇవ్వకుండానే వచ్చే హోంవర్క్ మీ కథలు రాయడములో మీరాశించే ఒక ప్రయోజనమని నాకు నిజంగా తెలియదు. ఇప్పుడర్థమయింది, మీరు కావాలనే అపరిపక్వత (raw ness)ని కొంత ఒదిలిపెడుతున్నారని మీ కథల్లో.
3. కథ మెరుగు పెట్టడానికి ఖచ్చితమైన కొలమానాలు ఉన్నాయి. ఉంటాయి. అవి సాపేక్షికమైనవి కావు. ఏ కథకు ఆ కథ, ఆకథ చుట్టూ అల్లబడివున్న వాతావరణం అంతర్లీనంగా వాటిని నిర్దేశిస్తూ ఉంటాయి. వాటి ఆధారంగానే ఆ కథాకథనశైలీశిల్పాల్లో హెచ్చుతగ్గుల్ని అంచనా వేస్తారు.
నేను మెరుగు పెట్టడం అన్నదానికి మీరు తీసుకున్న అర్థమ్ సరి అయినది కానే కాదు. మీ శైలిలోనే, మీ భాషలోనే మీరు చెప్పిందే మరింత బాగా పాఠకులు ఎక్కువమందికి మీరనుకున్న అర్థంలోనే చేరడానికి చేసే మార్పు మెరుగు పెట్టడం అంటే. మిమ్మల్ని నా భాషలో మాట్లాడమని కాదు. (పెళ్ళికి మీ అమ్మాయిని నేను అలంకరించటం అంటే మీ అమ్మాయిని మా అమ్మాయిగా చేసుకోడం కాదు. చాలా మంది, చాలా మంచి అమ్మలకి కూడా కూతుళ్ళకి పెళ్ళి ముస్తాబు రాక, వేరేవారితో చేయిస్తారు. చిన్నపట్నించీ మొఖం కడిగి జడేసి బడికి పంపాను కాబట్టీ పెళ్ళి ముస్తాబు కూడా నేనే చేయగలను అనుకోడమే కాదు, నాకంటే నా కూతురిని ఇంకెవరూ ఇంత బాగా అలంకరించలేరు అని కూడా అనుకోడం సరి అయినది కాదు. అలంకరణలో లోపాలుంటే పెళ్ళాగిపోదు కదా, పెళ్ళయింది కదా అని అలంకరణ గొప్పగా ఉన్నట్టూ కాదు, కథలూ అలాగే. అలంకరణ చక్కగా ఉండటం ఆ కళాకారుడికి కళకు ఉన్న బంధం మీద ఆధారపడి ఉంటుంది… కదా?)
పాఠకులు చదివే కథని తమ భాషలోకి మార్చుకోడమూ, కథని అలా తమ లోకానికి అన్వయించుకోడమూ అనె ప్రక్రియ చాలా లోతైన విషయం. కథని మెరుగు పెట్టడం చాలా మొదట్లో జరిగే (ప్రిలిమినరీ) తంతు. ఇదే తేలుతున్నట్టులేదు సరిగ్గా, అంతదాకా ఎందుకు లేండి.
శైలి అంటే నాకు తెలుసనే అనుకుంటాను. మళ్ళి చెప్పినందుకు కృతజ్ఞతలు.వినదగు నెవ్వరు చెప్పిన… ముందే చెప్పాను గదా నా చాదస్తాలు చాలా ఉన్నాయని. మీకేమో చాలా అధునాతన భావాలు ఉన్నై, ఈ తరంలో చాలా మందికి మల్లే. తాను ముణిగిందే గంగ, తాను వలచిందే రంభ తరహాలో. శుభం. అలానే కానీయండి, ముణిగిపోయిందేమీ లేదు ఎలానూ.
ఇంక ఎలతానండీ, మీరు చెప్పినట్టుగానే “… పెరవారికి చోటొసంగుచున్”
సంచారి.
ఉత్తమాయిల్లాలు గురించి నిడదవోలు మాలతి అభిప్రాయం:
05/15/2010 1:08 pm
@సంచారి, ముందు మీవ్యాఖ్యకి ధన్యవాదాలు. మిగతా విషయాలు వరసగా,
1. సంపాదకులు శ్రద్ధగానే చదివేరనుకుంటున్నాను, ప్రచురణకి అంగీకరించేముందు. వారు రెండు సూచనలు చేసేరు. ఒకటి తీసుకున్నాను. ఒకటి తీసుకోలేదు.
2. నాబ్లాగులో చదివేవారు పీర్లు కాకపోవచ్చు అన్నారు. (ఔచ్.) ఈ వాక్యంలో పీర్లు అన్నపదానికి మీనిర్వచనం ఏమిటో తెలుస్తోంది. అది సరైన నిర్వచనం అనుకోను. నాకు సంబంధించినంతవరకూ, నాకథలు నేను రాసినట్టు నచ్చితేనే చదువుతారు. మీరూ చదువుతున్నట్టే కనిపిస్తోంది. మీరు నాకథ చదివినప్పుడల్లా ఇలా ఎక్కడ మార్చవచ్చో ఆలోచించుకుంటుంటే, అదే నాకథ సాధించిన ప్రయోజనం అనుకుంటాను. మరో కారణం ఉంటే మీరే చెప్పండి.
3. ఇప్పుడు నాఅభిప్రాయం చెప్తాను. ప్రతి మనిషికి ఎవరిభాష, ఎవరి పదకోశం వారికి ఉంటుంది. పాఠకుడు చదువుతున్నప్పుడు తనమనసులో నా కథని తనభాషలోకి అంటే తనకి నచ్చని లేదా కొత్తమాటని తనకి తెలిసినమాటకి మార్చుకుంటాడు. నా ఈకథని మీరు మరొకరికి చెప్తే, అందులో ఒక్కవాక్యం కూడా నేను రాసినట్టు ఉండదు. దాన్నే శైలి అంటారు. ఇది నా శైలి.
మీరు మెరుగుపెట్టడం అంటున్నది మరొకరికి మెరుగు కాకపోవచ్చు. లేదా, మరొకరు ఈ మెరుగుపెట్టడం మరోచోట చెయ్యొచ్చు. నిజానికి ఇది మెరుగుపెట్టడం కాదు. మీరు చేస్తున్నది – నన్ను మీభాషలో మీకు కావలిసినట్టు, మీకు కావలిసిన సమాచారం మాత్రమే చెప్పమనడం.
నా అభిప్రాయంలో కథ “మెరుగు పెట్టడానికి” నిజంగా ఖచ్చితమైన కొలమానాలు లేవు బంగారానికి 24 కేరట్లు, వెండికి స్టెర్లింగ్ లాగ.
తా.క. మిగతా పాఠకులు కూడా ఈకథ మెరుగు పరచడానికి ఏ మార్పులు సూచిస్తారో తెలుసుకోవాలని ఉంది. ఇదొక exercise అనుకుందాం. చెప్పండి.
నిడదవోలు మాలతి
వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి baabjeelu అభిప్రాయం:
05/14/2010 12:29 pm
ఉపేంద్ర గారూ,
మీలాటి వారు రాయడం, పీట ముడితో సహా, నాలాటి వాళ్ళ అద్రుష్టం. దానికి తోడు నాలాటివాళ్ళ (తెలుగులో సిల్లీ) సందేహాలకి ఓపికగా సమాధానాలు ఇవ్వడం ఇంకా గొప్ప. దీన్నే కదా మీరు (తెలుగులో) డైలాగు అన్నారు. కాదా?
మీ వ్యాసం క్షమార్హం ఎలా అవుతుంది? అది చదివి డైలాగు మొదలెట్టకపోతే తప్పున్నర మాది.
5. బాలగోపాల్ గారు అంత ఎక్సిప్లిసిట్ గా అన్నారా? అన్లేదేమో!
దేన్ని ఎట్లా అనుసంధానం చేసుకోవాలి అన్నది మిలియన్ డాలర్ల ప్రెశ్న. కదండీ.
మన ఖర్మ, ఎవరి ఖర్మ కెవరు బాధ్యులూ అనో; ఆళ్ళు మన్ని దెబ్బ తీసేరు, దెబ్బకి దెబ్బ, అయితే నాటె పెన్నీ మోర్ నాటే పెన్నీ లెస్ అనో; సహేంద్ర తక్షకాయస్వాహా అనో; ఇలా రకరకాలుగా కదా ప్రెతీ ఇబ్బందినీ ఇబ్బందిపడ్డ ప్రెతివాడూ అనుసంధానించుకుంటాడు వాడి సత్తువని బట్టి.
అంతేగానీ, మార్కెట్టు రాజ్యంలో ఇలా అయిన్నీకాబట్టి ఈ మార్కెట్లని దుంప నాశనం చేసెయ్యాలి అనిన్నీ; కొత్త వ్యవస్థ మొదలెట్టాలి అనిన్నీ; యెజ్నంలో కుర్రాడి లాగ నా పిల్లలు ఇలాటి బతుకు బతక కూడదనిన్నీ; రాకెట్టప్పారావులాగ ఇలాటి బతుకు ఇలాగే బతకాలనిన్నీ; ఇలాటి బతుకులో పోలీసోడి “అక్కరెన్సు” రిపోర్టు ని ఏ జడ్జీ కాదంటాడో సూద్దారి అనిన్నీ; లాయరు మూర్తి గారి లాగ ఇలాగెలా బతకడం అనిన్నీ; ముత్తేలమ్మలాగ ఇలాక్కూడా బతకొచ్చనిన్నీ; ఆ జడ్జీ గోరిలాగ పిచ్చెక్కకపోతె బతకలేవఁనిన్నీ; ఇంకా బోల్డన్ని ….. లాగెలా అనుసంధానించుకోగలరు?
బాబ్జీలు
తడి గురించి Venkata Sudhakar అభిప్రాయం:
05/14/2010 4:09 am
I really appreciate the story and the concluion.