పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16458

  1. ఉత్తమాయిల్లాలు గురించి నిడదవోలు మాలతి అభిప్రాయం:

    05/20/2010 7:55 pm

    లైలా గారూ,
    మీకు కథ అర్థమయినందుకు సంతోషం.

    టైంలైను, శ్రాద్ధకర్మల విషయంలో మీరు అడిగిన ప్రశ్నలు – నేను అంతగా ఆలోచించలేదండీ. నేను 1956లో ఇంటరు పూర్తి చేసేను. అదే ఆఖరిబాచ్ అన్నారు. కానీ తరవాత ఇంటరూ, పియూసీ చాలా రకాలుగా మారేయి. వాటివివరాలు నాకు తెలీవు. ఈకథ సుమారుగా గత 30 ఏళ్లలో జరిగినట్టు ఊహించుకున్నాను కానీ అప్పటికి రిక్షాలు లేవేమో. నేను ఇండియా వెళ్లడం చాలా తక్కువ. అంచేత ఇలాటి విషయాలు నాఊహకి ఎలా తోస్తే అలా రాసేస్తాను. చాలామంది పాఠకులకి అది చిరాకే కానీ కానీ నా పరిమితులు అవి. మీరు క్షమించి కథ చదవడానికి సిద్ధపడ్డారు.. థాంక్స్.

    శ్రాద్ధకర్మ చేసినప్పుడు, భార్య అనే కాదు, ఎవరు చనిపోయినా, కర్మ చేసేవారు తలనీలాలు తీయించుకోడం బ్రాహ్మణకుటుంబాల్లో ఉంది. ఇది ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. మిగతా కులాల ఆచారేలేమిటో నాకు తెలీదు. మరొకసారి, కథలో ప్రధానాంశం గుర్తించినందుకు థాంక్స్. నిజానికి, నేను అనుకున్నదానికంటే మీరు ఎక్కువే చదివేరు అందులో.

    మాలతి

  2. కళావసంతము గురించి mOhana అభిప్రాయం:

    05/20/2010 10:10 am

    దేశికాచారి గారూ, మీ పుస్తకం గురించి నాకు తెలీదు, అందువల్ల దానిని ప్రస్తావించలేదు, క్షమించాలి. వేణుగోపాల్ గారూ, నా ఉద్దేశంలో సంగీతము, శాస్త్రము, సాహిత్యము అన్నీ ముడి వేసికొని ఉంటాయి. అందువల్ల అన్నిటిని ఒకే చోట ఉంచినాను. అస్ట్రానమీ గురించి ఇంకా తేటతెల్లముగా వ్రాయనిది నా లోటే, క్షమించాలి. శ్రీనివాసద్వయానికి నా హార్దిక వందనాలు, మీకు ఈ వ్యాసం నచ్చినందులకు నాకు ఎంతో సంతోషం. శ్రీనివాస్ కొమ్మరుగారూ, ఆ పాటను పాడింది శ్రీమతులు MS సుబ్బులక్ష్మి, రాధా విశ్వనాథన్, రాధాజయలక్ష్మి కాదు. అందరికీ మీ ప్రోత్సాహానికి సహస్ర నమస్కృతులు. విధేయుడు – మోహన

  3. ఈ మాసపు పాట గురించి Mohan అభిప్రాయం:

    05/20/2010 5:02 am

    ఉదయకల గారు – మీరు రాసిన ఈ కథ చాలా బాగుంది

  4. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి geyamala అభిప్రాయం:

    05/20/2010 1:44 am

    ఒక చలం, ఒక బుచ్చి బాబు ఒక జేమ్స్ జాయిస్, ఒక తాత్విక స్వప్నం, వీటి అన్నింటికీ అక్షర రూపం ఇస్తే , చండీదాసు అవుతాడు. కేవలం రెండు నవలలతో,తెలుగు సాహిత్య లోకంలో తనదయిన స్థానాన్ని పొందిన వ్యక్తి చండీదాసు. హిమజ్వాల ఒక స్వప్నం. అనుక్షణికం ఒక సామాజిక సత్యం.

  5. కళావసంతము గురించి Srinivas Kommu అభిప్రాయం:

    05/19/2010 10:06 pm

    అద్భుతంగా ఉన్నది. సాహిత్యం, సంగీతాలతో చాలా సమగ్రంగా ఉంది. రాధాజయలక్ష్మికి బదులు రాధాసుబ్బులక్ష్మి అని రాశారు.

    శ్రీనివాస్‌

  6. ఉత్తమాయిల్లాలు గురించి lyla yerneni అభిప్రాయం:

    05/19/2010 6:26 pm

    “శ్రీరంగశయనం” ఉత్త వెర్రి పుచ్చకాయ. అగ్నిహోత్రావధానులుకి, ఒకటో రెండో స్టెప్పులు తక్కువలో ఉన్నాడు. అతనికి శాలువా ఎందుకు కప్పారో బెజవాడలో. ఏం ఘనకార్యం చేసి ఉంటాడు? ఆ సభలో గంగిరెద్దులా ప్రవర్తించాడేమో, అసహ్యం పుట్టి ఇంటికి వచ్చి తన శాలువాని ఎద్దు మీదకి విసిరింది వేదవల్లి. ఎందుకు విసిరిందో కూడా గ్రహించుకోలేని మొద్దు మొగుడు.

    ఇక ఆమె చనిపోయాక -వేదవల్లి identity ని తన ఇష్టారీతిగా మార్చేసి , చుట్టూ ఇతరులకు ఏమి ప్రదర్శన చేస్తున్నాడీ శ్రీరంగశయనం. పూర్తిగా తన సేవకురాలిగా, భక్తురాలిగా తనలో ఐక్యం చేసేసుకోటంలో ఏమి ‘లాయరు చాకచక్యం’. దానికి తోడ్పాటు నిచ్చే పొరుగువారు కొందరు. అదేంటండీ అని ఏ ఒక్కరో అనబోయినా లాయరు -తన వెధవ ఆలోచన, ఆర్గుమెంట్ తనదే.

    ఫిజిక్స్ లెక్చరర్, రచయిత్రి ఐన, -వేదవల్లి ఎఛీవ్మెంట్స్ తన ఖాతాలోకి transfer చేసేసుకుని కేవలం వంటపుట్టిగా, తన caregiver గా ఆమె స్వరూపాన్ని తన మాటల్తో క్విక్ గా మార్చేసి, తను ఇకపైన ఎంచుకున్న కాబొయే భార్య లక్షణాలు, డ్యూటీలు చనిపోయిన ఆమెకు transfer చేసేస్తున్నాడు. ఏం తెలివి! కొడుక్కు దిమ్మ తిరిగి పోయి ఉండాలి, తండ్రిగారు తల్లిని అంత fast గా efface చేసేస్తుంటే. నాకే ఆశ్చర్యంగా ఉంది శ్రీరంగశయనం సంభాషణలు వింటే. శ్రీరంగశయనం దృష్టిలో ఆ పక్కింట్లో ఉన్న స్త్రీకి కూడా identity లేదు. ఆమె ఎప్పుడో చచ్చిన ఎవరో మొగాడి విడో. ఇతడు నిత్య పెళ్ళికొడుకు. భలె. భలే.

    ఈ కథ అర్థం కాకేం. 🙂 నాకు బాగా అర్థమయ్యింది.

    ‘చావు’ ఒక కాలక్షేపంగా పరిగణించే ఒక తెలుగు సమాజ కాలము, ప్రైవసీ అనేదే లేకుండా, తెలిసిన వాళ్ళూ తెలియని వాళ్ళూ ఎవరు పడితే వాళ్ళు వచ్చి, – కట్టెగా పడిఉన్న స్థితిలో ఒక మనిషిని చూసిపోటమూ, -ఆ వ్యక్తిని గూర్చి ఆ క్షణాన తమ కేది నోటికి వస్తే అది మాట్లాడటమూ – ఆ “పరామర్శ” అనే సామాజిక అమర్యాద, కథ చిన్నదైతేనేం నాకు స్పష్టంగా అర్థమయ్యింది.

    వేదవల్లికి, గౌతమికి పరిచయం -గౌతమి ఇంటర్లో చేరినప్పుడు జరిగింది. కాలేజీల్లో 1960 తర్వాత ఇంటర్ లేదు. P.U.C. వచ్చింది. కాబట్టి వారి పరిచయం అంతకు ముందే అయ్యుండాలి. కాని ఆంధ్రా కాలేజీల్లో ఇంటర్ ఏ సంవత్సరంలో మొదలయ్యిందో నాకు తెలీదు. కథాకాలం 1920- 1980ల మధ్యన అనుకుంటున్నాను. ఆ కాలంలో ఒక స్త్రీ మరణిస్తే, భర్త, కొడుకు, బోడిగుండు చేయించుకునే వారా? అది నిజమా? లేక కల్పనా? రచయిత్రికి ఇష్టమున్నచో తెలుపగలరు.

    లైలా

  7. లింకన్ తో ఓ రాత్రి గురించి సౌమ్య అభిప్రాయం:

    05/19/2010 10:53 am

    చాలా నెలల తరువాత ఈ కథ వద్దకు వచ్చాను. వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఆశ్చర్యమేసి మళ్ళీ వ్యాఖ్య రాస్తున్నా. “లింకనే ఎందుకు” అన్నది పదే పదే వినిపిస్తున్న ప్రశ్న. దానికి సమాధానం – ఆన్లైన్ లంకెలతో సహా ముందే చెప్పానే…. ఇంకా వివరాలు కావాలంటే – పుస్తకమహల్ వారనుకుంటాను -“World Famous Ghosts” అని ఓ పుస్తకం వేశారు. అందులో వివరంగా ఉంది లింకన్ దయ్యం కథ. గుర్రుగా చూశే ఫొటోతో సహా. ఇదంతా – కథలో కూడా చెప్పాను…ఇంత వివరంగా కాకపోయినా. అయినా – మళ్ళీ డౌట్లొస్తున్నాయంటే – ఇంక ఏమని అర్థం చేస్కోవాలో అర్థం కావడం లేదు… 🙁

  8. రవీంద్రధనుస్సు గురించి chavakiran అభిప్రాయం:

    05/19/2010 10:28 am

    ఎక్కడ మనసుకు అభయమో,
    శిరసుకు ఉన్నత స్థానమో,
    ఎక్కడ సరస్వతి స్వేచ్చగా సాగునో,
    ఎక్కడ యిరుకు ప్రాంతీయ కుడ్యాలతో-
    ప్రపంచం ముక్కచెక్కలవ్వలేదో,
    ఎక్కడ వాక్యాలకు మూలం సత్యమో,
    ఎక్కడ అలసటలేని చేతులు పూర్ణత్వంకై –
    నిరతమూ పాటుపడతాయో,
    ఎక్కడ స్పష్ట తర్కం, కాష్టంలో కాలిపోలేదో,
    ఎక్కడ మనసు స్వయంగా నీచే విశాలాలోచన –
    కార్యాలవైపు నడిపించబడుతుందో,
    అట్టి స్వర్గంలో ప్రభూ! నా దేశాన్ని మేల్కొలుపు.


    And here is my version 🙂

  9. ఉత్తమాయిల్లాలు గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    05/19/2010 3:01 am

    మాలతి గారూ,

    నేను శ్రీరంగశయనం పాత్రని పోలి ఉంటానా అని మీరు అనుకోవటంలో అన్యాయం ఏమీ లేదు. 🙂 పాత్రకి సార్వత్రికమైన పార్శ్వం లేక పోతే అది నమ్మదగ్గదిగా మాత్రం ఎట్లా అవుతుంది? (నమ్మనలవి కాని పాత్రలతో కథ చెప్పలేమా అన్నది వేరే విషయం.)

    సంచారి గారు చెప్పినది రూపం గురించి. నేను చెప్పినది సారం గురించి. ఎటు నించి నరుక్కు వచ్చామన్నదే తేడా – ఎంత వరకు ఎట్లా ఉపయోగ పడగలిగాము అన్నదానికి అవధి మీరే.

    మీరు రాసినది మీకు తృప్తిగా ఉంటే అంతే.

    ఉపేంద్ర

  10. ఉత్తమాయిల్లాలు గురించి నిడదవోలు మాలతి అభిప్రాయం:

    05/18/2010 7:20 pm

    సంచారి గారూ,
    మీజవాబుకి థాంక్స్. మీరెండు వ్యాఖ్యలు చూసినతరవాత, క్రిటికల్‌గా చదవడం అంటే కథ మెరుగుపరచడానికో మరోకారణంగానో సలహాలు యివ్వడమే అనిపిస్తోంది. నేను పరీక్షకో పోటీకో అయితే, లేదా ఎవరైనా అదే పనిగా అడిగినప్పుడు మాత్రమే అలా చేస్తాను.

    మీరు నా రెండుకథల్లోనూ చివరి వాక్యాలమూలంగా క్లుప్తత దెబ్బ తింది అన్నారు. పెంపకం కథలో ’మెరుగుపరచడానికి’అని మీలాటివారు ఇచ్చిన సలహాననుసరించే చివర మార్చేను. నామొదటి డ్రాఫ్టులో అది లేదు. ఇలాటివి తెలుస్తాయనే మిగతా పాఠకులని కూడా అభిప్రాయాలు రాయమని అడిగేను.

    ఉపేంద్ర గారూ,
    మీరు కథలో ఏం చెప్పేరనే దృష్టితోనే చదివారు. అందుకు ధన్యవాదాలు. నాకథలో ఒక పాత్రని చిత్రించడమే నా ధ్యేయం. అంచేత మిగతా పాత్రలని డెవలప్ చెయ్యలేదు. చిన్నకథలో అంతే జరుగుతుంది అని నేను అనుకుంటాను. నిజానికి బుచ్చిబాబుగారి చివరికి మిగిలేది నవలమీద నా వ్యాఖ్యానం కూడా అదే. బహుశా అది నాకు గుర్తొచ్చిందేమో కూడా ఇది రాస్తున్నప్పుడు.

    మీ రెండో పాయింటు. నాకేదో ఆపాత్రమీద కోపం ఉన్నట్టుంది అన్నారు. నేను రచయిత వేరూ, కథకుడు వేరూ అనుకుంటాను. మీవ్యాఖ్య చూసి మీరు శ్రీరంగశయనంలాటివారు కాబోలు అనుకోడం న్యాయం కాదు కదా.

    పైన చెప్పినట్టే, మీరూ నేనూ కథ చదివేతీరులో తేడా అది. అబ్జెక్టివ్‌గా ఆలోచిస్తే, రచయిత ఒక పాత్రని నమ్మదగ్గపాత్రగా చిత్రించేడా లేదా అని అడగడానికీ, ఆపాత్రమీద రచయితకి సానుభూతి ఉందా లేదా అని అడగడానికీ తేడా వుంది కదా.
    మీవ్యాఖ్యకి ధన్యవాదాలు.