పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16458

  1. “ఎవరో!” – ఒక నిసీ షామల్ కథ గురించి kavitha అభిప్రాయం:

    05/28/2010 4:16 pm

    Kayakay గారు, కథ మళ్ళీ చదివాను..మీ అభిప్రాయం చూసాక.మబ్బు విడినట్టుగా ఉంది!

  2. ఇంకా ఎందుకు మిగిలావు గురించి gana అభిప్రాయం:

    05/28/2010 12:33 pm

    కవితాత్మక నింద లేక నిరసన.

    ‘ఆది భిక్షువు వాడినేది కోరేదీ’ లేక
    ‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ ‘ కన్నా
    మీ కవిత ఘాటుగానే ఉంది.

    ఏదనుకున్నా బాగా వ్రాసారు.

  3. మరో ప్రపంచం పిలిచింది గురించి Dr Tatiraju Venugopal అభిప్రాయం:

    05/28/2010 11:52 am

    1979లో బరంపురంలో అఖిలాంధ్ర రచయితల సమ్మేళనం మార్చి 20-22 ల మధ్య జరిగినప్పుడు మహాకవి ‘ అల్లూరికి వారసుడా శ్రీశ్రీ కవితా లాలసుడా, దేర్ ఫోర్ ఊగరా ఊగరా’ అని ప్రసన్న వదనంతో చదవడం, ‘ఒక్క మతితోనే సతమతమౌతుంటే నాకీ బహు మతులెందుకూ’ ‘ అన్న పానుగంటి వారి జోక్ ని వినిపించి ‘సాక్షి’ వ్యాసాలు ప్రస్తావించడం- ఇవన్నీ మననం చేసుకుంటుంటే అటువంటి ‘మూవింగ్ ఎన్ సైక్లోపీడియా’ కవి 20వ శతాబ్దంలోనే కాదు, ఇప్పుడూ లేడు అనిపిస్తుంది. మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది- ఈ గేయం ఎన్నో రూపాలతో సినీ గీతంగా మళ్ళీ మళ్ళీ శ్రీశ్రీ కలంనుండే రావడం బహుశ: గిన్నీసు వారి దృష్టికి రాలేదేమో. రణ భేరి చిత్రంలో కొంత భాగం ‘మార్చింగ్ సాంగ్’ గా, మిగతా భాగం బుర్ర కథ గా మలిచారు. ఇవన్నీ ఒక చోటికి తీసుకు రాగలిగేది, ఏ మాటకా మాటే చెప్పుకోవాలి, ఈ మాటే!
    -వేగోతారా

  4. ఉత్తమాయిల్లాలు గురించి Sam అభిప్రాయం:

    05/28/2010 4:47 am

    నాకు కథ అసలు అర్దము కాలేదు. మన్నించెదరు.

  5. ఇంకా ఎందుకు మిగిలావు గురించి మందాకిని అభిప్రాయం:

    05/28/2010 4:08 am

    బావుందండీ!

  6. ఇంకా ఎందుకు మిగిలావు గురించి Srinivas Varma అభిప్రాయం:

    05/26/2010 10:49 pm

    చాలా బావుంది మాస్టారు. మరో సీతారామ శాస్త్రి గారు కనిపిస్తున్నారు, ఆ పదాలు, లోతైన భావం. Keep it up. Thank you.

  7. ఉత్తమాయిల్లాలు గురించి lakshmi అభిప్రాయం:

    05/25/2010 6:32 pm

    కథలకు ఇంతగా స్పందిస్తారని తెలియదు..ఒక రచయితని అభిమానిస్తే అన్నీ బాగా కనబడతాయనే నమ్మాను …
    లక్ష్మిరాఘవ

  8. వ్రాస్తున్నాను మహా ప్రభూ వ్రాస్తున్నాను: రెండు చెదురుతున్న సంభాషణలూ, ఒక కవి పరిచయమూ గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    05/25/2010 5:45 am

    బాబ్జీలు గారూ
    గురజాడ గొప్పదనంలో ఆయన ఆధునికత వైపు మొగ్గటం అన్నది అంత ముఖ్యం కాదు. అట్లానే విశ్వనాథ ని అంచనా వేసే టప్పుడు ఆయన యుద్ధంలో ఎటు మొగ్గాడు అన్నది అంత ముఖ్యం కాదు. రెండు మహోన్నతమైన విలువల మధ్యన తీవ్రమైన ఘర్షణ జరుగుతున్న చారిత్రక సందర్భంలో ఆ కాలంలో బతికిన వారికి చాలా విషయాలు తేలికగా కనపడతాయి (అప్పుడు కూడా చూడలేని వారుంటారన్నది కాదనలేని సత్యం). ఘర్షణ తీవ్ర స్థాయిలో లేనప్పుడు విషయం ఏమిటో అర్థం కావటం అంత తేలిక కాదు. గురజాడ ఆధునికత పేరు చెప్పుకుని తిరిగే నేలబారు మనుషులూ, సాంప్రదాయికత పేరున బతుకుతున్న నేల బారు మనుషులూ – ఇరు పక్షాల కూడా ఉన్న మంచి మనుషులూ అందరినీ కళ్ళు విప్పార్చుకుని చూశాడు. విశ్వనాథ (బాలగోపాల్ చదివినంత మేరకూ) ఆధునికత పక్షాన నిలబడే మనుషులంతా నీచులుగానూ, సంప్రదాయికత పక్షాన నిలబడ్డ వారంతా ఉదాత్తులుగానూ చిత్రీకరించారు. అందు చేత ఆయన రచన బలంగా ఉండదు.

    మీరు చెప్పిన ఇంటర్వ్యూలో స్థూలంగా బాలగోపాల్ చెప్పిన అభిప్రాయం అదీ అని నాకు అర్థమయింది. దానితో నేను ఏకీ భవిస్తాను. తెలుగు కవులు ఇతర భాషల్లో కవుల కన్నా రెండాకులు ఎక్కువే చదివారు అన్న అభిప్రాయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు నిజంగానే తెలియదు – కాబట్టి మీ ఆఖరి ప్రశ్నకి సమాధానం చెప్పలేను.

  9. ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గురించి gks raja అభిప్రాయం:

    05/25/2010 3:07 am

    శ్రీనివాస్ గారూ! మీరు అభినందనీయులు. రమేష్ నాయుడు గారి ఇంటర్వ్యూ మాకు అనుకోకుండా లభించిన వరం. ధన్యవాదాలు.
    రాజా

  10. మరో ప్రపంచం పిలిచింది గురించి madhavi godavarthy అభిప్రాయం:

    05/24/2010 7:58 am

    శ్రీ శ్రీ గారిని చూస్తూ వినడం గొప్ప అనుభూతి.