పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి విజయవర్ధన్ అభిప్రాయం:

    07/22/2010 1:01 am

    అరుదైన ఈ recordingను పంచుకున్న శ్రీ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు

  2. ఎలిపోమను గురించి సుబ్రహ్మణ్యం మూలా అభిప్రాయం:

    07/21/2010 5:23 am

    మీ “గుండు గొమ్ములనుమానం” కవితగా రాసినట్టుంది! చరణాల్లో భావ పునరుక్తి ఉన్నప్పటికీ ఎక్కడా విసుగు పుట్టించ లేదు. ఉత్తరాంధ్ర మాండలికం మీద మీకున్న పట్టు అబ్బురపరుస్తుంది. తప్పక రాస్తూ ఉండండి.

  3. అ, న్యాయం గురించి సుబ్రహ్మణ్యం మూలా అభిప్రాయం:

    07/21/2010 5:17 am

    చాసో కథ “బండపాటు” గుర్తొచ్చింది ఈ కథ చదివితే.

  4. ఈమాట గురించి గురించి Srichandra అభిప్రాయం:

    07/20/2010 7:13 pm

    ఓ చక్కటి పత్రిక నందిస్తున్న మీకు నా ధన్యవాదాలు.
    శ్రీచంద్ర.

  5. నువ్వు గురించి soujanya అభిప్రాయం:

    07/20/2010 1:03 am

    చాలా బాగా రాసారు. నిజమే అతని సాన్నిహిత్యం కంటే కూడా ఎదురుచూపే మధురం మధురాతిమధురం……..!!!

  6. సామాన్యుని స్వగతం: పిల్లలు, మన అభిరుచులు గురించి గన్నవరపు నరసింహ మూర్తి అభిప్రాయం:

    07/19/2010 9:01 pm

    చాలా బాగుంది. అందరి తల్లి దండ్రుల అనుభవాలు యిలాగే వుంటాయి.

  7. ప్రేమ కవితలు గురించి JAANAKI అభిప్రాయం:

    07/19/2010 3:48 am

    when i am reading your poem i think u r searching for your lover through your poems all the best for your love.

  8. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి Sowmya అభిప్రాయం:

    07/17/2010 6:07 am

    అదేమిటి అందరూ ఈ పుస్తకం తెలుగులో రాసి ఉండాల్సినది అని రాస్తున్నారు…నేనింకా ఈ పుస్తకం గానీ, మాలతి గారి తూలిక సైటులో ఆంగ్లానువాదాలు కానీ – తెలుగు వారి కంటే కూడా, నాన్‌-తెలుగూస్ ని, తెలుగు చదవడం రాని తెలుగువారిని ఉద్దేశించి రాసినవనుకుంటున్నానే!!

  9. అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి Prof L D Sudhakara Babu అభిప్రాయం:

    07/17/2010 4:43 am

    Prof Simmanna is my colleague.

    His name was listed in google search with reference to this article was typed as SINNAMMA.

    Kindly do the needful.

  10. ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    07/17/2010 12:58 am

    సంస్కృతం దీవించడానికీ; ఇంగ్లీషు తిట్టడానికీ తెలుగు కూరగాయలు బేరం చేయడానికీ పనికొస్తాయని ఐశ్వర్యం నవలలో ఒక పాత్ర నోట విని ఇంతా సినిసిజం ఎక్కడినించి వచ్చిందబ్బా అనుకోవడం జ్ఞాపకం వస్తోంది. ఇన్నాళ్ళకి ఇంగ్లీషు స్థానాన్ని తెలుగు ఆక్రమించుకుంది కాబట్టి సంతొషించ వచ్చునేమో అన్న మాట మనసులో మెదిలి నన్ను చూసి నేనే భయ పడుతున్నాను.

    మాటని మళ్ళీ పట్టాలెక్కించినందుకు రామారావు గారికీ హనుమంతరావు గారికీ ధన్యవాదాలు.

    నాకు అర్ధమవుతున్న కొన్ని విషయాలు – రచన స్వరూపంలో వస్తున్నా మార్పులని అర్ధం చేసుకోవటానికి సందర్భం గురించి తెలిసి ఉండటం ఉపయోగ పడుతుంది. ఒక్కొక్క సారి అలాంటి అవగాహన సాహిత్యానుభావాన్ని deepen చేస్తుంది కూడాను. (అలాంటి అవగాహన లేకుండా సాహిత్యాన్ని చదివి -వినీ ఆనందించలేమని కాదు )

    ఆ సందర్భంలో టెక్నాలజీ ఒక అంశం మాత్రమె. టెక్నాలజీ అనగానే టెక్నలాజికల్ determinismగా అన్వయించుకోవలసిన పని లేదు. “ప్రింటింగు ప్రెస్సు కీలకమైన మార్పులకి నాంది పలికింది” అన్న మాటకీ “వచ్చిన మార్పులన్నిటినీ ప్రింటింగ్ ప్రెస్సుకే ఆపాదించగల” మని అన్న మాటకీ భేదం లేదా?

    ప్రింటింగు ప్రెస్సు వచ్చింది కాబట్టి కొత్త సాహిత్యం వచ్చింది. అప్పుడు అట్లా వచ్చింది కాబట్టి – ఇప్పుడు వెబ్ 2.0 వచ్చింది కాబట్టి కొత్త సాహిత్యం వస్తుందని నోర్లు తెరుచుకుని కూచోగలమా? అచ్చు యంత్రాలతో పాటు గ్రంధాలయాలూ వచ్చాయి. యువక సమాజాలూ వచ్చాయి. సాహితీ మిత్రుల సంఘాలూ వచ్చాయి. ఇందులో ఏది దేన్నీ determine చేస్తుందని చెప్పటం సబబు? దేన్నీ ఆధారంగా చేసుకుని మరొక దాన్ని predict చేయడం సమంజసం?

    వెబ్ 2.0 వల్ల తెలుగులో ప్రచురణకి అవకాశాలు లేకనో సమయం లేకనో మరుగున ఉండిన ఎంతో మంది సాహిత్య పిపాస ఉన్న వారు ఈ రోజున కొత్త ఉత్సాహంతో రాస్తున్నారు. తెలుగులో స్త్రీలు maintain చేస్తున్న బ్లాగులు ఇందుకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమె.

    విశ్లేషణకీ prediction కీ మంచీ చెడూ విచక్షణకీ మధ్యన అంతరం ఎల్ల వేళలా నిలబెట్టాలనుకోవడం విజ్ఞత కాదు కానీ అన్నిటినీ కలిపేసుకున్నందు వలన పాకం చెడిపోతుందని కూడా విస్మరించ రాదు.

    ఉపేంద్ర

    P.S. Viplav – trivia is good. trivialisation is not. 🙂 you are most welcome to bring along your laundry and you can call yourself Sir Washalot. ! 🙂