పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. రచయితలకు సూచనలు గురించి kameswari అభిప్రాయం:

    09/16/2010 2:30 pm

    ప్రతి శీర్షికకీ అభిప్రాయాల పెట్టె ఉన్నట్లే ,పత్రికలో ప్రచురణకోసం కవితల కు ఒక పెట్టె, కథలకు ఒకపెట్టె, వ్యాసాలకు ఒకపెట్టె ఉంచితే రచయితలకు రచనలను పంపటం తేలిక అవుతుంది కదా!
    యద్దనపూడి కామేశ్వరి

  2. మంచి కవి, మంచి స్నేహితుడు గురించి kameswari అభిప్రాయం:

    09/16/2010 2:18 pm

    ఆధునిక కవిత్వ పరిణామంలో పద్య గేయ కవిత్వాల నుండి వచన పద్యం రూపు దిద్దుకొనేవేళ, ఆ ప్రక్రియకొక అందమైన వెన్నెల జలతారు చీర కట్టి వచనకవితకొక స్థిరమైన రూపునిస్తూ, అదే సమయంలో తనకంటూ ఒకశైలిని ఏర్పరచుకొన్న ఆధునిక కవితా మాంత్రికుడు తిలక్ . మంద్రంలో ప్రారంభమై క్రమక్రమంగా ఆరోహణం సాగించి తారస్థాయిని అందుకోవటం వారి కవిత్వంలో భావవిన్యాసపు సామాన్యలక్షణం. గాఢానుభూతిని సంస్కృతసమాసాల జరీ పనితనంతో అలంకరించటం అతనికి ఇష్టం. అది అతని భావనాస్థాయికి గాఢత్వాన్ని కలుగజేస్తూ ఉండటం ఇంచు మించు అలాటి అలంకరణ ఉన్నఅన్ని కవితలలో కనిపిస్తూ ఉంటుంది. తన కవిత్వపు ఒరవడితో ఆధునిక కవిత్వానికొక ఉరవడిని కల్పించిన ఆధునిక కవితాబ్రహ్మ తిలక్ కవిత్వాన్ని మరొక్కమాటు చదివించినందుకు ధన్యవాదాలు.
    యద్దనపూడి కామేశ్వరి

  3. కుప్పిగంతులు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    09/16/2010 1:24 pm

    క్లిక్‌ చేయండి: సుందోపసుందులు

  4. మారుపేర్ల మాయువు గురించి kameswari అభిప్రాయం:

    09/16/2010 11:04 am

    ఏది ఏమయినా పేరంటే గుర్తింపు. ఆ పేరును ఎందుకు వదిలివేసినా అది అస్తిత్వ త్యాగమే. భారతీయుల్లో ఆధ్యాత్మికత ఇందుకు కారణమా? దాన్ని వదలకపోతే అంత ప్రమాదమా? ప్రమాదమే అయితే భయంతో ఏ పనయినా ఎందుకు చేయాలి?
    కొత్తపేరు పై మోజు , కొత్త పదాన్ని కూర్చటం పై మోజు , తనలోని మరో కోణాన్ని ఆవిష్క రించాల అనే సరదా కూడా ఇందుకు దారి తీస్తాయనుకుంటాను.
    యద్దనపూడి కామేశ్వరి.

  5. కుప్పిగంతులు గురించి చక్రవర్తి అభిప్రాయం:

    09/16/2010 9:37 am

    నా ఈ స్పందన కధకి సంబందించినది కాదు, కానీ ఓ చోట యధాలాపంగా వాడుక జరిగిన వ్యక్తుల విషయమై మనవి చేసుకుందాం అని మాత్రమే అని గమనించగలరు.

    కొన్ని కొన్ని చోట్ల మనం తెలియకుండానే, సుందోపశుందులు అని ఉదహరిస్తుంటాము.. ఇంతకీ వీరెవ్వరు? వీరిపై ఏవైనా కధలు మనకు దొరుకుతాయా?

  6. ప్రేమ కవితలు గురించి harish అభిప్రాయం:

    09/15/2010 4:18 pm

    బాగున్నది

  7. ఆర్ యూ రెడీ? గురించి akella l m అభిప్రాయం:

    09/15/2010 8:06 am

    Timely story, must be an eye opener for the present gen young folks.

  8. ప్రేమ కవితలు గురించి lalitha అభిప్రాయం:

    09/15/2010 7:04 am

    నా మనసులొని భావాలు మీ కవితలొ వెల్లువెత్తాయి
    నా ప్రేమ కలలు మీ కలమున జాలువారాయి
    ప్రేమను ప్రేమతొ ప్రేమిస్తున్న ఓ నేస్తమా నీకు నా జోహార్లు

    …నేను మీలాగే ఒక ప్రేమ పిపాసిని,
    నా ప్రియుని కోసం ఇలాగే కవితలు రాస్తున్నాను.

    లలిత

  9. కవితా సుమశరుడు తిలక్ గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    09/14/2010 12:59 pm

    “వార్షుకాభ్రం నాకు యక్షపతీ సౌందర్యాన్ని రచిస్తుంది” అంటే? యక్షపతి అంటే కుబేరుడని తెలుసు. యక్షపతీ సౌందర్యం అంటే? సంపద్వంతమైన సౌందర్యమా?కాదేమో!

  10. ప్రేమ కవితలు గురించి anitha అభిప్రాయం:

    09/14/2010 5:00 am

    మీ కవిత చాలా బాగుంది.