పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. కోనసీమ కథలు: న్యాయవాదం గురించి K.VARA LAKSHMI అభిప్రాయం:

    11/01/2010 2:27 pm

    బ్రహ్మానందం గారూ!
    కోనసీమ కథల కోసం నెలనెలా ఎదురు చూసేలా చేసేంత బావుంది మీ ‘న్యాయవాదం ‘.
    మన కోనసీమ జీవితాల్ని ఇంకెన్ని కోణాల్లో చిత్రిస్తారో చూడాలి. కీపిటప్-
    -కె. వరలక్ష్మి

  2. కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం గురించి mOhana అభిప్రాయం:

    11/01/2010 2:23 pm

    మంచి శీర్షిక. కాపీరైటు పేచీలు లేకుండా ఉండాలని కాబోలు పాత కథలను ఎన్నుకోమని సలహా ఇచ్చారు. నాకో యోచన తట్టింది. అదేమంటే, మన ఈమాటలోని కథలనే ఎందుకు ఎన్నుకోరాదు అని. కథ పునర్ముద్రణ కూడా అనవసరం, అది ఇక్కడే దొరుకుతుంది. రచయితలకు కూడా ప్రోత్సాహదాయకముగా ఉంటుంది. విధేయుడు – మోహన

  3. కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం గురించి Akkiraju Bhattiprolu అభిప్రాయం:

    11/01/2010 1:35 pm

    సావిత్రి గారు లెస్స పలికారు. ఆ పాత గొప్ప పేర్లు మాకెలాగూ తెలుసు. ఇప్పటికీ నా బోంట్లం ఎవరి కథలు చదవాలీ అని ఎవరైనా అడిగితే ఇంకా ఆ పేర్లే చెప్తున్నాం. రాను రాను నా చదువు తగ్గటం ఒక సమస్య అయితే ఎంచేతనో ఓ మాదిరి కథ అయినా అప్పటిదే గుర్తుండి పోవడం, ఇవ్వాళే చదివిని గొప్ప కథ అయినా రెండ్రోజుల్లో మర్చే పోవడం రెండో కారణం. కొత్తగా వస్తున్న కథల్లో మంచి కథల్ని ఎంచటమే మరింత మంచిదని నా అభిప్రాయం. పోనీ మధ్యే మార్గంగా అసలు ఆ పాత కాలానికి ఉన్న ప్రాధాన్యత తీసేసి, రాసిన వ్యాసంలోని నాణ్యతని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోగలరేమో చూడండి. ఏ రకంగా అయినా, చక్కటి శీర్షిక అవుతుందని చెప్పడంలో నాకు సందేహం లేదు.

    – అక్కిరాజు

  4. నాటికి నేడు – రేడియో నాటిక గురించి వంశీ అభిప్రాయం:

    11/01/2010 12:36 pm

    శ్రీనివాస్ గారూ ధన్యవాదాలు.

    ఇతరులకు – ఆకాశవాణి వారి ఇతర నాటికలు, రూపకాలు, పరిచయ కార్యక్రమాలు, ఇష్టాగోష్టులు, ప్రత్యేక భక్తిరంజని కార్యక్రమాలు, శ్రోతలతో ముఖాముఖీలు, ఇక్కడ చూడవచ్చు. ఇక్కడికెళ్లాక పరిచయాలు – నాటికలు సెక్షను నొక్కండి… వినండి…

    నాదేమీ లేదని – ఒకవేళ చప్పట్లు కొట్టాలనుకుంటే – గత ఆరు నెలలుగా ఆడియోలు అందించిన వారికే కొట్టండి అని తెలియచేస్కుంటూ… 🙂

    భవదీయుడు
    వంశీ

  5. కోనసీమ కథలు: న్యాయవాదం గురించి jayaprabha అభిప్రాయం:

    11/01/2010 11:04 am

    గొర్తి బ్రహ్మనందగారూ !! మీ కధ బాగుంది. మనసుకు గుచ్చుకుంది. మరిన్ని మంచి కధలు రాయండి.

    జయప్రభ.

  6. నాకు నచ్చిన పద్యం: శ్రీరామ ధనుష్టంకారం గురించి jayaprabha అభిప్రాయం:

    11/01/2010 10:46 am

    శివధనుర్భంగ ఘట్టం లో ఇలాంటి ఉపమానాలతోనే సత్యనారాయణగారు కూడా తన కల్పవృక్షంలో రాముని ధనుష్టంకారాన్ని గురించి చాలా హడావుడి చేస్తారు. అయితే ఇక్కడ మొదటి కల్పన మరి, మల్లిఖార్జున భట్టుగారిదన్నమాట!! బాగుంది.

    జయప్రభ.

  7. జలప్రపాతము గురించి jayaprabha అభిప్రాయం:

    11/01/2010 10:18 am

    అయ్యా !! దేశికాచార్యుల వారూ !! మీ పద్యాలంటే ఇష్టం నాకు.వాటిల్లోని ధార బాగుంటుంది. పద్యానికి ప్రాణవంతమైన లక్షణం కదా అది.”” పర్వతము శాశ్వతం బట్లె వాహినియును”” అన్నారు మీరు. అవునా ?? అయితే ఎంత బాగుండునూ?? కవులం గనక అలా అనుకుంటాం కాబోలు మనం !! .కానీ అదేమిటో మా విశాఖపట్నంలో కొండల్ని తవ్వేస్తున్నారు మట్టి కోసం. మా తెలంగాణంలో లక్షల ఏళ్ళనాటి రాళ్ళగుట్టల్నీ మాయం చేసేస్తునారు. మా దేశంలో అన్ని చిన్నాచితకా నదుల్నీ ఇసక కోసమ్ తోడేస్తున్నారు. మరి మనం ఇంకిపోతున్న ఆ నదుల గురించీ.. పడక అలా ఆగిపోయిన జలప్రపాతాల గురించీ.. నానాటికీ తరిగిపోతున్న ఆ వేల ఏళ్ళ నాటి ఘనమైన రాళ్ళ గుట్టల గురించీ.. కనుమరుగైపోతోన్న ఆ మహా పర్వతాల గురించీ కూడా ముఖ్యంగా పాడాల్సి ఉంది కదా ఇవాళ?! .మీది మంచి పద్యం కదా అని మెచ్చుకునే ధైర్యం కూడా లేని ఈ రోజుల్లో ఏం చెయ్యమంటారూ?? వీటిగురించి కూడా ఇక్కడ గుర్తుచేయక తప్పింది కాదు.

    జయప్రభ

  8. కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం గురించి maachiraaju saavitri అభిప్రాయం:

    11/01/2010 9:00 am

    శీర్షిక బావుందిగానీ, పాతకథలనే ఎన్నుకోవాలనే సూచనే బాగాలేదు. 1960, 1970 తర్వాత మంచి కథలే రాలేదని మీ అభిప్రాయమా? లేకపోతే ఆ తర్వాత వచ్చిన మంచి కథలన్నీ అందరికీ ఎరుకేనని మీ నమ్మకమా? నా ఉద్దేశంలో ఈ రెండు వాదాలూ సరైనవి కావు. ఆ మాటకొస్తే, సాహిత్యం మీద ఆసక్తి, ప్రవేశం ఉన్న వారికి పాత కాలపు గొప్ప కథలతోనే ఎక్కువ పరిచయం ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటారా? ఏళ్ళ తరబడీ వాటి గొప్పదనాన్ని గురించి వింటూంటాం కాబట్టి.

    అయినా మీరడిగింది “గొప్ప”కథలని గురించి కాదు కదా? కేవలం “నచ్చిన” కథలని గురించి. అలాంటప్పుడు సమకాలీన కథలకు ప్రాముఖ్యతనిచ్చి, కొత్త కథలకూ, కొత్త రచయితలకూ గుర్తింపూ, ప్రోత్సాహమూ ఇవ్వటం మీ కర్తవ్యం కాదంటారా? గతాన్ని కీర్తించడం అందరూ, ఎల్లప్పుడూ చేసే పనే. వర్తమానాన్ని కూడా గౌరవించి, భవిష్యత్తుకి బాట చూపించటం “సాహితీ విలువలున్న” పత్రిక నడిపే సంపాదకుల బాధ్యత అనుకుంటాను.

  9. కామవేదము: పరిచయం గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:

    11/01/2010 8:11 am

    తిరుక్కురళ్ కు చాలా మంచి పరిచయం ఇచ్చారు! ధన్యవాదాలు. ఇలా రెండు పాదాల ఉపజాతి పద్యాల్లో తిరుక్కురళ్ ను అనువదించ వచ్చన్న ఆలోచన బాగుంది.

    వ్యాసంలోని ఒకటి రెండు ప్రస్తావనల గురించి నేనెరిగిన విషయాలు :
    1. తిరుక్కురళ్ రచయిత అసలు పేరేమిటో తెలియదు. వళ్ళువర్ అన్న కులనామంతోనే ఆ రచయితను పిలిచారన్నదే ప్రస్తుతం అందరూ అంగీకరిస్తున్న వాదం.
    2. తెలుగులో 19వ శతాబ్దం ఉత్తరార్థంలో వచ్చిన అనువాదమే మొదటిది అనడం కూడా చర్చనీయాంశమే. ఫాదర్ బెస్సి అనే ఇటాలియన్ మిషనరీ 1742 లో కురళ్ ను లాటిన్లోకి అనువదించాడు. (సాహిత్య అకాడెమీ వారి మోనోగ్రాఫ్ నుండి). The Kural of Thiruvalluvar – Translation by W.H. Drew అన్నద్ 1840లో ప్రచురితమైంది. డాక్టర్ గ్రాల్ 1854 లో జర్మను భాషలోనికి అనువదించాడు. జి. యు. పోప్ అనువాదం కూడా 1886 లో ముద్రితమైంది.
    3. కామవేదం అన్నమాట ఎందుకో నాకు సరియైందని అనిపించడం లేదు. చదివిన వారు అది వాత్సాయనుని కామశాస్త్రం వంటిదని పొరబడే అవకాశం ఉంది. (ప్రేమవేదం అనొచ్చేమో బహుశ 🙂 ).

    కామత్తుపాల్ నుండి ఒక కురళ్ ను ఉదహరించాలనిపిస్తోంది.
    “అవర్ నెంజు అవర్కాదల్ కండుం ఎవన్ నెంజే
    నీ ఎమక్కు ఆగా దదు.”
    నాయిక తన హృదయాన్ని ఉద్దేశించి అంటోంది – అతని హృదయం మాత్రం అతను చెప్పినట్లు విని అతడినే అంటిపెట్టుకొని ఉంది. మరి నువ్వు మాత్రం నామాట వినక నన్నొదిలి అతడి దగ్గరకు వెళ్ళిపోతావెందుకు?

    తిరుక్కురళ్ గురించి నేను చదివిన తెలుగు వ్యాసాల్లో అత్యుత్తమమైనది ఇదే అని చెప్పగలను.

  10. నాకు నచ్చిన పద్యం: మొల్ల రాకుమారుల వర్ణన గురించి Sreekanth Reddy అభిప్రాయం:

    11/01/2010 1:46 am

    ..and here’s one site where these books can be ordered. This site seems to be a treasure trove of Telugu literature books (both old & new)

    Sreekanth