“సృజనల ప్రసారాల్లో భాష – అంటే వర్ణమాల, నిఘంటువు, ప్రతి పదార్ధ విశ్లేషణ మొదలైనవి, టెలిఫోన్ తీగెలు చేసే పని లాంటిదే చేస్తున్నాయి. భాష, ఆలోచన పకోడీలను, పళ్ళ రసాన్నీ కట్టిచ్చే పొట్లాల్లాంటివి. వాటిని విప్పి అవతల పారేసి, లోనున్నదాన్ని ఆస్వాదించవలసి ఉంది. ఈ అనుభవం ఆ సృజనే సాధించుకోవాలి తప్ప, దానిపైన మరిన్ని వివరణలతో ప్రయోజనం లేదని నా అనుమానం”
చాలా విలువైన మాట కనకప్రసాదు గారు. మీ తదుపరి వివరణ కోసం ఎదురుచూస్తూ..
ఈ మీ ఈమాటలో ఒకప్పుడు, అనగా బాగున్న రోజుల్లో చిక్కని ఉపదేశాల్లాంటి మంచి సరుకులు, అంతే చక్కని కామెంట్లు ఉండేవి. ఇప్పుడు ఉపదేశాల సంగతి ఎలాగున్నా కమెంట్లు మటుకు మతప్రబోధకులు చేసే “బ్రెయిన్ వాషింగ్” ఉపన్యాసాల్లాగా తయారైనాయి. ఆపైన “వాషింగ్” కాకపోగా “డ్రెయినింగు” ఎక్కువైపోయింది.
కొన్ని ఉపన్యాసాలు వింటే దెబ్బలూ, గాయాలు తగిలినా ఆ నొప్పులు అనుభవించటానికి బాగుంటాయి. మరి కొన్నేమో మొక్కపాటివారు అప్పుడెప్పుడో చెప్పినట్టు “అధ్యక్ష సమక్షమందు నిరక్షరకుక్షి నైన నేను, నా కుక్షింభరత్వము కొరకు ప్రత్యక్ష సాక్షీభూతముగా……” రీతిలో సాగుతుంటయి……
పత్రికను, మాబోటి పాఠకులని ఈ ప్రబోధకోపన్యాసాల కామెంట్ల నుండి రక్షించటానికి సంపాదకులకు శక్తి ప్రసాదించు మహాప్రభో!…..
విజ్ఞప్తి – ఒక వేళ ఈ కామెంటు కత్తిరించాలనుకుంటే, అసలు ప్రచురించకండి….
భవదీయుడు
వంశీ
[కామెంటు పెట్టి ఏం చేయాలో మాకూ దయచేసి చెప్పకండి – సం.]
Sometimes it is necessary to introduce a creative work. More precisely, it is necessary to place it in a contextual frame work. ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగులకు పేర్లెందుకు పెడతారూ? ఇందుకే, ఆ చిత్ర రచనకి ఒక కాంటెక్స్ట్ ఇవ్వటానికే. ఆ రచనని స్వీకరించే వాళ్ళకి ఒక బాణం గుర్తుగా, ఇటేపెళ్ళండి బాబులూ అని. ఇది తన సృజనకు వివరణ ఇవ్వడం కాదు. సృజనాత్మక రచనలకు – చిత్రమైనా, గానమైనా, పదమైనా – ఆ రచనలకు వెలుపలగా రచయిత నుంచి ఎటువంటి వివరణ ఉండకూడదు అని నాకు బలమైన నమ్మకం. కొన్నిటికా బాణం గుర్తు అవసరం ఉండదు. కొన్నింటికుంటుంది. నా ఉద్దేశంలో దీపఖేల కు ఆ అవసరం ఉన్నది ఈ పాటకంటే ఎక్కువగా.
సృజనాత్మకమైన ప్రసారాల్లోన పాట అన్నింటికంటే ఎక్కువ సాంద్రతను, అంటే signal to noise ratioను సాధిస్తుందని నా సిద్ధాంతం.
నిజమే. దీనిక్కారణం సాహిత్యంలో ఉన్న రసం సంగీతంలో ఉన్న రసంతో కలిసి రెట్టింపవుతున్నది. అందువల్ల, కోలా కలిపిన మందులా తాగడానికి మరింతగా వీలవుతున్నది. ఇది ఉర్దూ ఘజల్ వినే వారికి అనుభవమే. చాలామంది ఘజల్ కేవలం చదివి పూర్తిగా ఆస్వాదించలేరు, అది పాటలా వస్తే తప్ప. కేవలం సాహిత్యాన్ని చదివి ఆస్వాదించడమనేది వారి సాధన బట్టి వుంటున్నది.
(నాకింకా నోరు నొప్పి పుట్టలేదని మీకు అర్థమౌతున్నది కూడా :-))
తెల్లారి లెగిసేను. చికరీ కలపని కాఫీ తాక్కుంటూ కిరణ్ కుమార్ రెడ్డీ గారి గురించి చదవబోయి తుళ్ళిపడిపోయి, ‘అమ్మ! రమ గారి వ్యంగాస్త్రాలు మనమీదికి మళ్ళేయా!?’ అని నవ్వుకుంటున్నాను. ‘జవాబు’ రాసీదా వొద్దా రాసీదా వొద్దా అనీసి మల్లగుల్లాలు పడుతున్నాను. ఇలాటి ప్రశ్నలే సురేష్ కొలిచాల అడిగితే దబాయించి ఊరుకోమన్నాను. బ్రహ్మానందం గారు అడిగేరు. మాధవ్ మాచవరం గారు అడిగడిగి ఇంక నోరు నొప్పెట్టి ఊరేకున్నారు. రమగారు కుండ బదలుగొట్టినట్టుగ అన్నా సరే ఆవిడ లేవదీసిన రెండు అభ్యంతరాలూ చాల నిశితమైనవి. వీటికి జవాబు చెప్పుకోవలసిన బాధ్యత, సంజాయిషీ ఇచ్చుకోవలసిన మర్యాద మామూలుగా అయితే రాసేవాళ్ళకి తప్పకుండా ఉన్నాయి. నాకు మర్యాదా అంటే అమర్యాద. రాయటం కష్టం, ఊరుకోడం సుళువు. అవతల బోల్డు పన్లున్నాయి. ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు ఒద్దనీసే ‘గట్టి నిర్ణయం’ చేసుకుని, ‘స్వాంత: సుఖాయ తులసీ రఘునాధ గాధా!’ అనుకోని ఒగిలీబోయేను.
ఇంతట్లోకి నాకు ఫోనొచ్చింది. మా అమ్మ కాశీ నుండి చేసిందనీసి హలో అనీసి సగంత్రంగా మా అమ్మమీద లెగిసినట్టు లెగిసేను. అవతల్నుండి ఒకాయన – నెల్లూరోడు, “ఎవరండి మీరూ? మీదే ఊరండీ?” అని కోపంగా దబాయిస్తున్నాడు. నేను మర్యాద్తెచ్చుకోని “మాది హైడ్రాబాదండీ. మీకు రాంగు నెంబరొచ్చీసింది!” అని ఇంక తట్టుకోలేక ఫోన్లోనే నవ్వటం మొదలెట్టేను. ఆయన మా అమ్మ కాదు, నేను ఆయన వెతుక్కుంటున్న మనిషిని కాదు. అది ఆయనకీ అర్ధమయిపోయి “సరే అలాగండి..?” అని ఫోను పెట్టీసేడు గాని ‘ఈడు ఈపాటిదానికే అంతలాగ ఎందుకు నవ్వుతున్నాడు..?’ అని ఇదవుతున్నాడు.
నాకు ఈ దునియాలో ఫోన్లు చేసేవోలు ముగ్గురే ముగ్గురు – మా అమ్మ, మా ఆవిడ, మూడోది వోడాఫోన్లో జాగాలు, ఇన్వెస్ట్మెంట్లు అమ్మే ఆడమనిషి. అలాంటిది, ‘ఇదేంటి, సరిగ్గా టైము చూసుకునే రాంగు నెంబరోడు ఇలా చేస్సేడు?’ అని మరీ కులికి చస్తున్నాను. నేను సాధన చెయ్యవల్సిన తరంగం ‘దేవదేవం క్వేతితం మృగయామా..’ బదులు ‘రాంగు నెంబరు రవణమ్మా..!’ అనే వస్తుంది. నెల్లొరోడి ఫోను ఒక ‘సూచన’ అని ఇంకా కులుక్కుంటున్నాను. ఇంక రాయక తప్పించుకునే వీలు లేదు. నేను రాసినవాటికి సంజాయిషీ కాదు, రాతలగురించే. ఒక రచన, అంటే narrative, ప్రారంభమయి, పూర్తయి, ఆకృతి తీసుకొనే పద్ధతీ, దాన్ని చదివేవాళ్ళు స్వీకరించే పద్ధతీ, ఇవి రెండూ మార్మికమైనవి, ఇంద్రజాలం వంటివి. వీటి అనుభవం నిగూఢమైనది, అర్ధం చేసుకొనే ప్రక్రియ చాల లోతైనది. వీటిని గురించి నాకు obsession లాగ ఉంటుంది. ఈ రెండింటి తరువాత, ఆ సృజనను సారస్వత సమాజం ఒప్పుకోవటం, లేదా తిరస్కరించటం అనేది ఒకటి ఉంది. మొదటి రెంటిని గురించి కూలంకషమైన చర్చ, అవగాహన లేనిదే మూడవదాన్ని స్పృశించకూడదు అని నా సిద్ధాంతం. ఇటీవలంతా నేను వీటి గురించే చదివి చదివి ఇవే చర్చలు చేస్తున్నాను. బిపిన్ ఇందుర్ఖ్యతో, త్రిపురతో, కేవీయెస్ రామారావుతో; Communication theory, Persuation Tehory అని అవీ. సృజనల్లో పాట పద్ధతి మరీ చిత్రంగా ఉంటుంది. సృజనాత్మకమైన ప్రసారాల్లోన పాట అన్నింటికంటే ఎక్కువ సాంద్రతను, అంటే signal to noise ratioను సాధిస్తుందని నా సిద్ధాంతం. సృజనల ప్రసారాల్లో భాష – అంటే వర్ణమాల, నిఘంటువు, ప్రతి పదార్ధ విశ్లేషణ మొదలైనవి, టెలిఫోన్ తీగెలు చేసే పని లాంటిదే చేస్తున్నాయి. భాష, ఆలోచన పకోడీలను, పళ్ళ రసాన్నీ కట్టిచ్చే పొట్లాల్లాంటివి. వాటిని విప్పి అవతల పారేసి, లోనున్నదాన్ని ఆస్వాదించవలసి ఉంది. ఈ అనుభవం ఆ సృజనే సాధించుకోవాలి తప్ప, దానిపైన మరిన్ని వివరణలతో ప్రయోజనం లేదని నా అనుమానం.
ఇప్పుడు ఎంచిన పాటను పూర్తి చెయ్యటానికి నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఇది సంగీతపరంగా, సాహిత్యపరంగా కూడా Long Long Ago ప్రేరణతో కట్టింది కాబట్టి అనుసృజనను గురించి కూడా వివరించవలిసే ఉంది. ఇన్ని సంగతులున్నాయి. చౌ చౌగా చెప్పుకుంటే సంతృప్తి లేదు.
ఈ అభిప్రాయాలలోంచి ఈవ్యాసకర్తకి ఇస్మాయిల్ గారన్నా ..ఆయన కవిత్వమన్నా ఎక్కువ ఇష్టమన్న సంగతి అర్ధమవుతూందే గానీ ఆయన నిర్వచించిన కారణాలకే ఇస్మాయిల్ గారి కవితా విశిష్టత నిజంగా బోధపడదు. ఎప్పుడైనా కవితాభిమానం వ్యక్తిగత అభిరుచికి సంబంధించినదే గనక అది అన్నిసార్లూ అందరికీ సంబంధించిన సత్యమ్ కానేరదు. స్థాయి అన్నది కూడా అలాంటిదే గనక దాన్ని గురించి నిర్వచించడమ్ అంత సులువేమీ కాదనుకుంటాను.
జీనో పేరడాక్సు గురించి Sowmya అభిప్రాయం:
11/28/2010 11:52 am
“భక్తి తలకెక్కిన చరిత్రకారుడెవడో
రక్త సిక్తమైన ఆ మాంసపుముద్దని
ఎర్ర మందారఁవనో
మోదుగపూవనో కీర్తిస్తాడు.”
– నాకసలు పైదంతా వద్దు. ఇదొక్కటే చాలు! 🙂
ఏ నడలో ఏ ఎడలో! గురించి సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
11/27/2010 6:27 am
చాలా విలువైన మాట కనకప్రసాదు గారు. మీ తదుపరి వివరణ కోసం ఎదురుచూస్తూ..
– సుబ్రహ్మణ్యం.
ప్రేమ కవితలు గురించి RAMAKRISHNA అభిప్రాయం:
11/27/2010 1:17 am
చాల చాల బాగున్నై
నువ్వు గురించి srinivas అభిప్రాయం:
11/26/2010 1:45 am
it is nice very good
కుతంత్రం గురించి Kumar N అభిప్రాయం:
11/26/2010 1:25 am
Wonderful and ofcourse sweet too..I fell in love with the girl.
And Aruna Pappu’s comment is adorable
ఇస్మాయిల్ గారితో నా పరిచయం గురించి వంశీ అభిప్రాయం:
11/25/2010 4:16 pm
ఈ మీ ఈమాటలో ఒకప్పుడు, అనగా బాగున్న రోజుల్లో చిక్కని ఉపదేశాల్లాంటి మంచి సరుకులు, అంతే చక్కని కామెంట్లు ఉండేవి. ఇప్పుడు ఉపదేశాల సంగతి ఎలాగున్నా కమెంట్లు మటుకు మతప్రబోధకులు చేసే “బ్రెయిన్ వాషింగ్” ఉపన్యాసాల్లాగా తయారైనాయి. ఆపైన “వాషింగ్” కాకపోగా “డ్రెయినింగు” ఎక్కువైపోయింది.
కొన్ని ఉపన్యాసాలు వింటే దెబ్బలూ, గాయాలు తగిలినా ఆ నొప్పులు అనుభవించటానికి బాగుంటాయి. మరి కొన్నేమో మొక్కపాటివారు అప్పుడెప్పుడో చెప్పినట్టు “అధ్యక్ష సమక్షమందు నిరక్షరకుక్షి నైన నేను, నా కుక్షింభరత్వము కొరకు ప్రత్యక్ష సాక్షీభూతముగా……” రీతిలో సాగుతుంటయి……
పత్రికను, మాబోటి పాఠకులని ఈ ప్రబోధకోపన్యాసాల కామెంట్ల నుండి రక్షించటానికి సంపాదకులకు శక్తి ప్రసాదించు మహాప్రభో!…..
విజ్ఞప్తి – ఒక వేళ ఈ కామెంటు కత్తిరించాలనుకుంటే, అసలు ప్రచురించకండి….
భవదీయుడు
వంశీ
[కామెంటు పెట్టి ఏం చేయాలో మాకూ దయచేసి చెప్పకండి – సం.]
ఏ నడలో ఏ ఎడలో! గురించి Madhav అభిప్రాయం:
11/25/2010 3:57 pm
‘To introduce’ is not ‘to explain’
చౌరస్తాలో ఎటెళ్ళాలో దారి చూపించే బాణం మనల్ని గమ్యం దగ్గరిదాకా తీసుకొచ్చి ఒదిలిపెట్టదు. ఎటేపెళ్ళాలో చెబుతుందంతే.
Sometimes it is necessary to introduce a creative work. More precisely, it is necessary to place it in a contextual frame work. ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగులకు పేర్లెందుకు పెడతారూ? ఇందుకే, ఆ చిత్ర రచనకి ఒక కాంటెక్స్ట్ ఇవ్వటానికే. ఆ రచనని స్వీకరించే వాళ్ళకి ఒక బాణం గుర్తుగా, ఇటేపెళ్ళండి బాబులూ అని. ఇది తన సృజనకు వివరణ ఇవ్వడం కాదు. సృజనాత్మక రచనలకు – చిత్రమైనా, గానమైనా, పదమైనా – ఆ రచనలకు వెలుపలగా రచయిత నుంచి ఎటువంటి వివరణ ఉండకూడదు అని నాకు బలమైన నమ్మకం. కొన్నిటికా బాణం గుర్తు అవసరం ఉండదు. కొన్నింటికుంటుంది. నా ఉద్దేశంలో దీపఖేల కు ఆ అవసరం ఉన్నది ఈ పాటకంటే ఎక్కువగా.
నిజమే. దీనిక్కారణం సాహిత్యంలో ఉన్న రసం సంగీతంలో ఉన్న రసంతో కలిసి రెట్టింపవుతున్నది. అందువల్ల, కోలా కలిపిన మందులా తాగడానికి మరింతగా వీలవుతున్నది. ఇది ఉర్దూ ఘజల్ వినే వారికి అనుభవమే. చాలామంది ఘజల్ కేవలం చదివి పూర్తిగా ఆస్వాదించలేరు, అది పాటలా వస్తే తప్ప. కేవలం సాహిత్యాన్ని చదివి ఆస్వాదించడమనేది వారి సాధన బట్టి వుంటున్నది.
(నాకింకా నోరు నొప్పి పుట్టలేదని మీకు అర్థమౌతున్నది కూడా :-))
పాప మనసు గురించి ns murty అభిప్రాయం:
11/25/2010 12:29 am
చాలా బాగుంది. పిల్లలను అర్థంచేసుకుందికి చాలా పెద్ద మనసుండాలి.
మీ కవిత లో ఆర్గ్రత కనిపిస్తోంది.
అభినందనలు
ఏ నడలో ఏ ఎడలో! గురించి kanakaprasAdu అభిప్రాయం:
11/24/2010 11:10 pm
తెల్లారి లెగిసేను. చికరీ కలపని కాఫీ తాక్కుంటూ కిరణ్ కుమార్ రెడ్డీ గారి గురించి చదవబోయి తుళ్ళిపడిపోయి, ‘అమ్మ! రమ గారి వ్యంగాస్త్రాలు మనమీదికి మళ్ళేయా!?’ అని నవ్వుకుంటున్నాను. ‘జవాబు’ రాసీదా వొద్దా రాసీదా వొద్దా అనీసి మల్లగుల్లాలు పడుతున్నాను. ఇలాటి ప్రశ్నలే సురేష్ కొలిచాల అడిగితే దబాయించి ఊరుకోమన్నాను. బ్రహ్మానందం గారు అడిగేరు. మాధవ్ మాచవరం గారు అడిగడిగి ఇంక నోరు నొప్పెట్టి ఊరేకున్నారు. రమగారు కుండ బదలుగొట్టినట్టుగ అన్నా సరే ఆవిడ లేవదీసిన రెండు అభ్యంతరాలూ చాల నిశితమైనవి. వీటికి జవాబు చెప్పుకోవలసిన బాధ్యత, సంజాయిషీ ఇచ్చుకోవలసిన మర్యాద మామూలుగా అయితే రాసేవాళ్ళకి తప్పకుండా ఉన్నాయి. నాకు మర్యాదా అంటే అమర్యాద. రాయటం కష్టం, ఊరుకోడం సుళువు. అవతల బోల్డు పన్లున్నాయి. ఎప్పుడూ లేనిది ఇప్పుడెందుకు ఒద్దనీసే ‘గట్టి నిర్ణయం’ చేసుకుని, ‘స్వాంత: సుఖాయ తులసీ రఘునాధ గాధా!’ అనుకోని ఒగిలీబోయేను.
ఇంతట్లోకి నాకు ఫోనొచ్చింది. మా అమ్మ కాశీ నుండి చేసిందనీసి హలో అనీసి సగంత్రంగా మా అమ్మమీద లెగిసినట్టు లెగిసేను. అవతల్నుండి ఒకాయన – నెల్లూరోడు, “ఎవరండి మీరూ? మీదే ఊరండీ?” అని కోపంగా దబాయిస్తున్నాడు. నేను మర్యాద్తెచ్చుకోని “మాది హైడ్రాబాదండీ. మీకు రాంగు నెంబరొచ్చీసింది!” అని ఇంక తట్టుకోలేక ఫోన్లోనే నవ్వటం మొదలెట్టేను. ఆయన మా అమ్మ కాదు, నేను ఆయన వెతుక్కుంటున్న మనిషిని కాదు. అది ఆయనకీ అర్ధమయిపోయి “సరే అలాగండి..?” అని ఫోను పెట్టీసేడు గాని ‘ఈడు ఈపాటిదానికే అంతలాగ ఎందుకు నవ్వుతున్నాడు..?’ అని ఇదవుతున్నాడు.
నాకు ఈ దునియాలో ఫోన్లు చేసేవోలు ముగ్గురే ముగ్గురు – మా అమ్మ, మా ఆవిడ, మూడోది వోడాఫోన్లో జాగాలు, ఇన్వెస్ట్మెంట్లు అమ్మే ఆడమనిషి. అలాంటిది, ‘ఇదేంటి, సరిగ్గా టైము చూసుకునే రాంగు నెంబరోడు ఇలా చేస్సేడు?’ అని మరీ కులికి చస్తున్నాను. నేను సాధన చెయ్యవల్సిన తరంగం ‘దేవదేవం క్వేతితం మృగయామా..’ బదులు ‘రాంగు నెంబరు రవణమ్మా..!’ అనే వస్తుంది. నెల్లొరోడి ఫోను ఒక ‘సూచన’ అని ఇంకా కులుక్కుంటున్నాను. ఇంక రాయక తప్పించుకునే వీలు లేదు. నేను రాసినవాటికి సంజాయిషీ కాదు, రాతలగురించే. ఒక రచన, అంటే narrative, ప్రారంభమయి, పూర్తయి, ఆకృతి తీసుకొనే పద్ధతీ, దాన్ని చదివేవాళ్ళు స్వీకరించే పద్ధతీ, ఇవి రెండూ మార్మికమైనవి, ఇంద్రజాలం వంటివి. వీటి అనుభవం నిగూఢమైనది, అర్ధం చేసుకొనే ప్రక్రియ చాల లోతైనది. వీటిని గురించి నాకు obsession లాగ ఉంటుంది. ఈ రెండింటి తరువాత, ఆ సృజనను సారస్వత సమాజం ఒప్పుకోవటం, లేదా తిరస్కరించటం అనేది ఒకటి ఉంది. మొదటి రెంటిని గురించి కూలంకషమైన చర్చ, అవగాహన లేనిదే మూడవదాన్ని స్పృశించకూడదు అని నా సిద్ధాంతం. ఇటీవలంతా నేను వీటి గురించే చదివి చదివి ఇవే చర్చలు చేస్తున్నాను. బిపిన్ ఇందుర్ఖ్యతో, త్రిపురతో, కేవీయెస్ రామారావుతో; Communication theory, Persuation Tehory అని అవీ. సృజనల్లో పాట పద్ధతి మరీ చిత్రంగా ఉంటుంది. సృజనాత్మకమైన ప్రసారాల్లోన పాట అన్నింటికంటే ఎక్కువ సాంద్రతను, అంటే signal to noise ratioను సాధిస్తుందని నా సిద్ధాంతం. సృజనల ప్రసారాల్లో భాష – అంటే వర్ణమాల, నిఘంటువు, ప్రతి పదార్ధ విశ్లేషణ మొదలైనవి, టెలిఫోన్ తీగెలు చేసే పని లాంటిదే చేస్తున్నాయి. భాష, ఆలోచన పకోడీలను, పళ్ళ రసాన్నీ కట్టిచ్చే పొట్లాల్లాంటివి. వాటిని విప్పి అవతల పారేసి, లోనున్నదాన్ని ఆస్వాదించవలసి ఉంది. ఈ అనుభవం ఆ సృజనే సాధించుకోవాలి తప్ప, దానిపైన మరిన్ని వివరణలతో ప్రయోజనం లేదని నా అనుమానం.
ఇప్పుడు ఎంచిన పాటను పూర్తి చెయ్యటానికి నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఇది సంగీతపరంగా, సాహిత్యపరంగా కూడా Long Long Ago ప్రేరణతో కట్టింది కాబట్టి అనుసృజనను గురించి కూడా వివరించవలిసే ఉంది. ఇన్ని సంగతులున్నాయి. చౌ చౌగా చెప్పుకుంటే సంతృప్తి లేదు.
(ఇంకా ఉంది)
ఇస్మాయిల్ గారితో నా పరిచయం గురించి rama bharadwaj అభిప్రాయం:
11/24/2010 9:54 pm

రమ.