ఈ వ్యాసము నచ్చినందులకు చంద్రమోహన్ గారికి, Indian Minerva గారికి నా కృతజ్ఞతలు. చంద్రమోహన్ గారు, మీరు చెప్పిన కుఱళుకు (కామవేదములో 1291వ పద్యానికి) అనువాదము గ్రంథాలయములోని కామవేదములో 9వ పుటలో ఉన్నది.
విధేయుడు – మోహన
పిచ్చి అనండి ఇంకేమైనా అనండి. చిన్నప్పుడు రహస్యం అనే సీరియల్ వస్తుండేది. చివర్లో ఒక పద్యం వినిపించేవారు. కేవలం దానికోసమే ఆ సీరియల్ ముగింపు miss అవకుండా చూసేవాడిని. తరువాతెవరో చెప్పారు అవన్నీ తిరుక్కురళ్ కావ్యం నుండి సేకరించబడినవని. ఆ తెలిసీ తెలియని వయసులో ఒక పిచ్చి పుట్టింది ఏనాటికైనా తమిళ్ నేర్చుకొని ఆ తిరుక్కురళ్ ఏంటో చదవాలని. కానీ ఆ వుత్సాహం కాస్తా వాడుక భాష నేర్చుకోవడంలోనే ఆవిరైపోయింది. తిరుక్కురళ్ గురించి, కవి గురించి చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఈ దక్షిణ వేదం విన్నానుగానీ “ఉత్తర వేద”మేంటో అస్సలు అంతుబట్టలేదు వివరించగలరు. కన్యాకుమారిని సందర్శించి అక్కడి విగ్రహాన్ని చూసి అప్రయత్నంగా నమస్కరించినప్పుడు నా స్నేహితుడు అవాక్కయ్యాడు -కారణం నేను దైవాన్ని నమ్మను దాదాపు ఎవరికీ నమస్కరించను.
@చంద్రమోహన్ గారు : ” అతని హృదయం మాత్రం అతను చెప్పినట్లు విని అతడినే అంటిపెట్టుకొని ఉంది. మరి నువ్వు మాత్రం నామాట వినక నన్నొదిలి అతడి దగ్గరకు వెళ్ళిపోతావెందుకు?”
వాహ్ వాహ్… నాకెందుకో ఘాలిబ్ గుర్తొచ్చాడు. Thank you
I must have “Breakfast with Jayaprabha” over a few days. I think I have all her published books. కొనుక్కున్నాను. కొన్ని నేనడిగితే :-)ఆనంద స్వరూప్ ఇండియాలో కొని పంపించాడు.
జయప్రభ థీసెస్ కొన్ని ఉన్నాయని తెలుసు. చదవాలని కోరికా ఉన్నది. ఐనా ఒకరి ‘intellectual property’ వారి పర్మిషన్ లేకుండా, లేదా అడిగిన మూల్యం చెల్లించకుండా చదవటం న్యాయం కాదు. నాకు అలా చేయటం ఇష్టం ఉండదు.
రచయిత రచనకు సరైన ధర వారే నిర్ణయించాలి. పుస్తకమైనా. PDF file ఐనా సరే. ఎప్పటికప్పుడు మంచి రచనకై ఎదురు చూసే పబ్లిక్ కి అందజెయ్యాలి. పాఠకులు ఆ విలువ చెల్లించి, విలువైన రచనలను సేకరించుకుని చక్కని వాతావరణంలో చదువుకోవాలి. అప్పుడు కదా నా లాటి పాఠకులకు సంతృప్తి.
ఈ పరిచయం లో కన్న ఇంకా అందమైన పొయెట్రీ ఉందనుకుంటే రచయిత్రి తప్పక తెలియచెయ్యాలి. C-span, book T.V. Charlie Rose writers’ interview లు నాలాటి వాళ్ళు చూసేది ఎందుకు? పుస్తకాల్లో కొన్ని భాగాలు రచయితలు స్వయంగా చదివి వినిపించి, వివరించినప్పుడు – నచ్చితే ఆ పుస్తకాలు కొనుక్కోటానికే కదా.
తమ్మినేని యదుకులభూషణ్ ఈ వ్యాసంలో ఉదహరించిన ఇతరులను గూర్చి కూడా తెలుసుకోవాలని ఉంది.
కొన్ని వారాలుగా ‘ఈ మాట’ లో అభిప్రాయ సహితంగా చక్కని రచనలను చదివిస్తున్నారు.
This magazine makes the holiday season so much more festive. Enjoying. Thanks.
యశస్వి గారికి ఈ వ్యాసంలో అంతా సవ్యంగానే కన్పించడమ్ వారి భావ సానుకూలతకి నిదర్శనంగా అనుకుంటాను. నాకు వ్యాసం అర్ధమ్ అయిన తీరు మీదనే నేను ప్రతిస్పందించినది.
మనకి నప్పని ఆహార్యాన్ని ధరించి ప్రదర్శనని మొదలుపెడితే అది ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఈ వ్యాసమూ అలాగే ఉంది. ఇంత వాచాలత్వాన్ని తన వ్యాసంలో చూపించిన యదుకులభూషణ్ తన కవిత్వంతో ఎందరిని ఆకట్టుకున్నాడో.. తన విమర్శనాచతురతతో ఎందరికి జ్ఞానం కల్గించాడో ఎవరైనా వివరిస్తే సంతోషిస్తాను. జయప్రభ గారి కవిత్వాన్ని ఇష్టపడ్డవారంతా మరి ఈయన అంచనా ప్రకారము అజ్ఞానులూ, శబ్దలోలులూ అకవిత్వానికి పోషకులూను. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక్క యదుకుల భూషణుడే మరో ఉమాకాంతుడూనూ !!
అంతటి ఉమాకాంతవిద్యాశేఖరులకే దిక్కులేకపోయింది. ఆయన ఎంత తిట్టినా కృష్ణశాస్త్రినే నిలబెట్టుకుంది గానీ తెలుగు సాహిత్యం ఆయన విమర్శని కాదు. ఎప్పుడో కాలంచెల్లిన భావాలని జనం దృష్టిని తనవైపుకి తిప్పుకోడానికి కాబోలు ఈయన ఈ వ్యాసంలో చాలా ప్రయత్నమ్ చేసాడు. పద్యాల్ని తెగ ప్రస్తుతించేశాడు:) ఈ వ్యాసం రాసి ఇన్నేళ్ళు గడిచినా దీనిమీద నేను ప్రతిస్పందించే దాకా ఒక్క అభిప్రాయం కూడా లేదంటేనే ఈయన మాటలకి పాఠకులు ఏపాటి విలువనిచ్చారో అర్ధమౌతూంది మరి.
రమగారి ప్రతిస్పందనలో ఉన్న జోరు ఎందుకని ఎక్కువగా ఉందో నాకు సరిగ్గా అర్ధమ్ కాలేదు. యదుకుల భూషణ్ గారు జయప్రభ గారి కవిత్వమ్ నించి తనకి నచ్చిన కొన్ని పద్యాలని ఎంచుకుని వానిలోని అందచందాలనో ఇబ్బందులనో విశ్లేషణ చేసారు. అందులో ఆయన దృష్టి మిగతా వారి దృష్టి కన్నా భిన్నమైనది కావొచ్చు కదా?? అందులో రమ గారు చెప్పిన భావాలేమీ లేవే?? అయితే జయప్రభ గారి కవిత్వంలో భిన్న కోణాలున్నాయి. వాటిని యదుకులభూషణ్ గారు చూపించలేకపోయి ఉండొచ్చు. కానీ నాకైతే ఈ విమర్శలో యదుకులభూషణ్ ని జ్వాలాముఖితో పోల్చదగ అంశమేదీ చూపుకు తోచలేదు. పైగా ఆయన ఎంపిక చేసి ఇచ్చిన జయప్రభ గారి కవితలన్నీ చదవడానికి ఇంపుగాఉన్నాయి కూడా!! అందుకు యదుకులభూషణ్ గారి అభిరుచిని రమ గారు మెచ్చుకోక తప్పుపట్టడమ్ ఎందుకని జరిగిందో??
రాజకీయాతీతమైన దృష్టి ఉన్నవాడు అరాచకీయమైన తూకానికి పూనుకుంటే సరిగ్గా ఇదిగో ఈ విమర్శ లాగే ఉంటుంది. జయప్రభ కవిత్వం మీద ఇలాంటి వ్యాఖ్యానాలని చేసిన వాళ్ళలో ఈ యదుకుల భూషణ్ మొదటివాడేమీ కాదనుకుంటాను. జయప్రభ కవితాసంకలనాల మీద మగవాళ్ళు ఏదో ఒక పేరు పెట్టుకుని ఇలాంటి రాతలు రాసి ఏదో ఒక తరహా గుర్తింపుకోసం ప్రయత్నించడం చాలాసార్లు జరిగింది కూడా !! ఈయనకి స్త్రీవాదమో లేక మరో వాదమో నచ్చలేదు గనక వాటిని కవిత్వంలోంచి ఎంచి ఖండించడానికి పూనుకుంటే ఆ విమర్శ ఏ తోవలో సాగాలో ఆ తోవలోనే సాగింది ఇది కూడా !! జ్వాలాముఖి మొదలుకుని మరి కొందరు కుర్ర జ్వాలాముఖుల దాకా ఈ తరహా గొంతు ఆమె కవిత్వం విషయంలో “విమర్శ” పేరున రావడం కొత్త ఏమీ కాదు కూడాను. అయితే అవన్నీ ఎంతమేరకి నిలబడ్డాయో దీనికీ అంతే స్థానం ఉంటుంది.
ఆవిడ కవిత్వాన్ని విమర్శ పరిధిని కూడా దాటిపోయి ఆరుద్ర రివ్యూ పేర బోలెడంత తిట్లు కుమ్మరించిన సందర్భమ్ ఉంది. ఆరుద్ర దృష్టి ఏ తోవలో నడిచిందో అది చూపించి ఆయన నీరస దృష్టికి ఆ రాత నిదర్శనంగా నిలిచిందే తప్ప ఆ అభిప్రాయం జయప్రభ కవిత్వాన్ని తక్కువ చేయలేకపోయింది. పాక్షిక దృష్టితో రాసిన ఎన్నో రాతలు ఆవిడ కవిత్వం మీద ఇదివరలో కూడా రాకపోలేదు. ఆ తరహా రాతల్లో ఇది ఒకటి. ఐతే స్త్రీవాదులు ఇటువంటి రాతలని పరిగణన లోకి తీసుకుంటారా?? అన్నదానికి సైతం వాళ్ళ అనేక ప్రతిస్పందనలు జవాబులుగా ఉన్నా ఇంకా ఇటువంటి స్త్రీల రాజకీయ కవిత్వాలని వ్యతిరేకించే వాళ్ళున్నారంటే ఇంకా తెలుగు సాహిత్య రంగంలో తరవాతి తరాలలో సైతం ఎంత వెనకబాటుతనం ఉందో స్పస్టపడుతోంది.
మనకి అన్నా అఖ్మతోవా నచ్చుతుంది. కానీ మన సమకాలంలో మనతో పాటు నడిచే ఒక అన్నా అఖ్మతోవా, ఒక మాయా యాంజిలో నచ్చలేదు. అది తెలుగువిమర్శలో ఉన్న ఒక జాఢ్యం. పేరొచ్చిన వారిని విమర్శించి తానూ పేరు తెచ్చుకోవాలన్న ఒక అతి పాత పాత జాఢ్యం. అందుకు అనేకసార్లు అనేక మందికి జయప్రభ కవిత్వం ఎంతో ఉపయోగపడటం అన్నదే ఆమె కవిత్వానికి ఉన్న బలాన్ని చెప్పకనే చెబుతోంది. ఏమీ లేని పుస్తకాన్ని చదివి అవతల పడేయాలి. కానీ దాన్ని అంత సుదీర్ఘంగా అంత బలంగా కాదని అనవలసి రావడమ్ అంటేనే అందులో ఉన్న విశిష్టతని ఒప్పుకోవడం అన్నమాట. పండితుని వేషం వేసుకున్న వాడు పండితుడు కానట్టే ఈ తెచ్చికోలు హడావిళ్ళూ ఈ డొల్లమాటలూ సైతమ్ అతుకులబొంతలాంటివని అర్ధమ్ అవుతుంది. రాజకీయాతీతమైన జీవితమూ లేదు. రాజకీయాతీతమైన కవిత్వమూ ఉండదు. అది అఖ్ఖరలేని వాళ్ళు ఆ తరహా కవిత్వాన్ని విమర్శించపూనుకోవడం లోనే వారి చూపు లోని అంతరార్ధమ్ అర్ధమవుతుంది ఎవరికైనా !!
అయితే ఈ పరిస్థితి ప్రపంచ సాహిత్యంలో స్త్రీల వ్యక్తీకరణల మీద నిందాపూరిత స్వరాలతో విమర్శ పేరు పెట్టుకుని జరగడం అనేకసార్లు జరిగింది. ఇక్కడ మళ్ళీ జరిగింది. పురుష సాహిత్య ప్రపంచంలో మళ్ళి మళ్ళీ జరుగుతూనే ఉంటుంది కూడాను. ఈ తరహా సాహిత్యమ్ వచ్చిందీ అంటేనే దాని అవసరమ్ ఉందీ అని అర్ధం ! అది ఈ అరాజకీయ వాదులకి ఒప్పుదల అయ్యిందా కాదా అన్నదానితో కవయిత్రులకి ఏమీ ప్రమేయం లేదని వాళ్ళు ముక్తకంఠంతో ఇదివరకే చెప్పేసారు కూడా !!
కవిత్వం అనేక తరహాల్లో బయటికి వస్తుందని ..”శిల్పం” సారంలోనూ రూపం లోనూ భిన్నం గా ఉంటుందనీ కవితా శిల్పం నిజంగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకు సహృదయతా ఉండాలి. సంయమనమూ ..సహనమూ ఉండాలి. కానీ ఈ విమర్శలో అది కొరవడింది. ఇందులో యదుకుల భూషణ్ కి నచ్చినవి కొన్ని ఉన్నట్టే మిగతా తరహా వ్యక్తీకరణలు నచ్చిన వాళ్ళూ మరికొందరుంటారు. విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కవులు వారి తోవన వారు పాడుతూనే ఉంటారు.
నా అందం ఏమయింది? గురించి vani అభిప్రాయం:
12/08/2010 5:02 am
చాలా చాలా బాగుంది
కవిత కాదు… కన్నీరు గురించి Seetha Kumari అభిప్రాయం:
12/08/2010 3:48 am
అబ్బా…. హౄదయాన్ని తాకింది…
సామాన్యుని స్వగతం: వాహనయోగం గురించి madhurasree అభిప్రాయం:
12/07/2010 5:26 am
ఈ వ్యాసం బాగుంది
కామవేదము: పరిచయం గురించి మోహన అభిప్రాయం:
12/06/2010 1:47 pm
ఈ వ్యాసము నచ్చినందులకు చంద్రమోహన్ గారికి, Indian Minerva గారికి నా కృతజ్ఞతలు. చంద్రమోహన్ గారు, మీరు చెప్పిన కుఱళుకు (కామవేదములో 1291వ పద్యానికి) అనువాదము గ్రంథాలయములోని కామవేదములో 9వ పుటలో ఉన్నది.
విధేయుడు – మోహన
కొడుకుల శివరాం భాగవత గానం గురించి Narasimham GL అభిప్రాయం:
12/06/2010 1:25 pm
భక్తి భావముతొ యున్న ఈ పద్యములు చాలా బాగున్నాయి. ఎన్నొ అభినందనలు
కామవేదము: పరిచయం గురించి Indian Minerva అభిప్రాయం:
12/05/2010 7:03 am
పిచ్చి అనండి ఇంకేమైనా అనండి. చిన్నప్పుడు రహస్యం అనే సీరియల్ వస్తుండేది. చివర్లో ఒక పద్యం వినిపించేవారు. కేవలం దానికోసమే ఆ సీరియల్ ముగింపు miss అవకుండా చూసేవాడిని. తరువాతెవరో చెప్పారు అవన్నీ తిరుక్కురళ్ కావ్యం నుండి సేకరించబడినవని. ఆ తెలిసీ తెలియని వయసులో ఒక పిచ్చి పుట్టింది ఏనాటికైనా తమిళ్ నేర్చుకొని ఆ తిరుక్కురళ్ ఏంటో చదవాలని. కానీ ఆ వుత్సాహం కాస్తా వాడుక భాష నేర్చుకోవడంలోనే ఆవిరైపోయింది. తిరుక్కురళ్ గురించి, కవి గురించి చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఈ దక్షిణ వేదం విన్నానుగానీ “ఉత్తర వేద”మేంటో అస్సలు అంతుబట్టలేదు వివరించగలరు. కన్యాకుమారిని సందర్శించి అక్కడి విగ్రహాన్ని చూసి అప్రయత్నంగా నమస్కరించినప్పుడు నా స్నేహితుడు అవాక్కయ్యాడు -కారణం నేను దైవాన్ని నమ్మను దాదాపు ఎవరికీ నమస్కరించను.
@చంద్రమోహన్ గారు : ” అతని హృదయం మాత్రం అతను చెప్పినట్లు విని అతడినే అంటిపెట్టుకొని ఉంది. మరి నువ్వు మాత్రం నామాట వినక నన్నొదిలి అతడి దగ్గరకు వెళ్ళిపోతావెందుకు?”
వాహ్ వాహ్… నాకెందుకో ఘాలిబ్ గుర్తొచ్చాడు. Thank you
జయప్రభశబ్ద కవిత్వం గురించి lyla yerneni అభిప్రాయం:
12/04/2010 4:43 pm
చాలా అందమైన పొయెట్రీ. మేలు పరిచయం.
I must have “Breakfast with Jayaprabha” over a few days. I think I have all her published books. కొనుక్కున్నాను. కొన్ని నేనడిగితే :-)ఆనంద స్వరూప్ ఇండియాలో కొని పంపించాడు.
జయప్రభ థీసెస్ కొన్ని ఉన్నాయని తెలుసు. చదవాలని కోరికా ఉన్నది. ఐనా ఒకరి ‘intellectual property’ వారి పర్మిషన్ లేకుండా, లేదా అడిగిన మూల్యం చెల్లించకుండా చదవటం న్యాయం కాదు. నాకు అలా చేయటం ఇష్టం ఉండదు.
రచయిత రచనకు సరైన ధర వారే నిర్ణయించాలి. పుస్తకమైనా. PDF file ఐనా సరే. ఎప్పటికప్పుడు మంచి రచనకై ఎదురు చూసే పబ్లిక్ కి అందజెయ్యాలి. పాఠకులు ఆ విలువ చెల్లించి, విలువైన రచనలను సేకరించుకుని చక్కని వాతావరణంలో చదువుకోవాలి. అప్పుడు కదా నా లాటి పాఠకులకు సంతృప్తి.
ఈ పరిచయం లో కన్న ఇంకా అందమైన పొయెట్రీ ఉందనుకుంటే రచయిత్రి తప్పక తెలియచెయ్యాలి. C-span, book T.V. Charlie Rose writers’ interview లు నాలాటి వాళ్ళు చూసేది ఎందుకు? పుస్తకాల్లో కొన్ని భాగాలు రచయితలు స్వయంగా చదివి వినిపించి, వివరించినప్పుడు – నచ్చితే ఆ పుస్తకాలు కొనుక్కోటానికే కదా.
తమ్మినేని యదుకులభూషణ్ ఈ వ్యాసంలో ఉదహరించిన ఇతరులను గూర్చి కూడా తెలుసుకోవాలని ఉంది.
కొన్ని వారాలుగా ‘ఈ మాట’ లో అభిప్రాయ సహితంగా చక్కని రచనలను చదివిస్తున్నారు.
This magazine makes the holiday season so much more festive. Enjoying. Thanks.
లైలా
జయప్రభశబ్ద కవిత్వం గురించి rama bharadwaj అభిప్రాయం:
12/04/2010 2:45 pm
యశస్వి గారికి ఈ వ్యాసంలో అంతా సవ్యంగానే కన్పించడమ్ వారి భావ సానుకూలతకి నిదర్శనంగా అనుకుంటాను. నాకు వ్యాసం అర్ధమ్ అయిన తీరు మీదనే నేను ప్రతిస్పందించినది.
మనకి నప్పని ఆహార్యాన్ని ధరించి ప్రదర్శనని మొదలుపెడితే అది ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఈ వ్యాసమూ అలాగే ఉంది. ఇంత వాచాలత్వాన్ని తన వ్యాసంలో చూపించిన యదుకులభూషణ్ తన కవిత్వంతో ఎందరిని ఆకట్టుకున్నాడో.. తన విమర్శనాచతురతతో ఎందరికి జ్ఞానం కల్గించాడో ఎవరైనా వివరిస్తే సంతోషిస్తాను. జయప్రభ గారి కవిత్వాన్ని ఇష్టపడ్డవారంతా మరి ఈయన అంచనా ప్రకారము అజ్ఞానులూ, శబ్దలోలులూ అకవిత్వానికి పోషకులూను. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక్క యదుకుల భూషణుడే మరో ఉమాకాంతుడూనూ !!
అంతటి ఉమాకాంతవిద్యాశేఖరులకే దిక్కులేకపోయింది. ఆయన ఎంత తిట్టినా కృష్ణశాస్త్రినే నిలబెట్టుకుంది గానీ తెలుగు సాహిత్యం ఆయన విమర్శని కాదు. ఎప్పుడో కాలంచెల్లిన భావాలని జనం దృష్టిని తనవైపుకి తిప్పుకోడానికి కాబోలు ఈయన ఈ వ్యాసంలో చాలా ప్రయత్నమ్ చేసాడు. పద్యాల్ని తెగ ప్రస్తుతించేశాడు:) ఈ వ్యాసం రాసి ఇన్నేళ్ళు గడిచినా దీనిమీద నేను ప్రతిస్పందించే దాకా ఒక్క అభిప్రాయం కూడా లేదంటేనే ఈయన మాటలకి పాఠకులు ఏపాటి విలువనిచ్చారో అర్ధమౌతూంది మరి.
రమ
[comment edited – Eds.]
జయప్రభశబ్ద కవిత్వం గురించి yasasvi అభిప్రాయం:
12/04/2010 1:10 pm
రమగారి ప్రతిస్పందనలో ఉన్న జోరు ఎందుకని ఎక్కువగా ఉందో నాకు సరిగ్గా అర్ధమ్ కాలేదు. యదుకుల భూషణ్ గారు జయప్రభ గారి కవిత్వమ్ నించి తనకి నచ్చిన కొన్ని పద్యాలని ఎంచుకుని వానిలోని అందచందాలనో ఇబ్బందులనో విశ్లేషణ చేసారు. అందులో ఆయన దృష్టి మిగతా వారి దృష్టి కన్నా భిన్నమైనది కావొచ్చు కదా?? అందులో రమ గారు చెప్పిన భావాలేమీ లేవే?? అయితే జయప్రభ గారి కవిత్వంలో భిన్న కోణాలున్నాయి. వాటిని యదుకులభూషణ్ గారు చూపించలేకపోయి ఉండొచ్చు. కానీ నాకైతే ఈ విమర్శలో యదుకులభూషణ్ ని జ్వాలాముఖితో పోల్చదగ అంశమేదీ చూపుకు తోచలేదు. పైగా ఆయన ఎంపిక చేసి ఇచ్చిన జయప్రభ గారి కవితలన్నీ చదవడానికి ఇంపుగాఉన్నాయి కూడా!! అందుకు యదుకులభూషణ్ గారి అభిరుచిని రమ గారు మెచ్చుకోక తప్పుపట్టడమ్ ఎందుకని జరిగిందో??
యశస్వి.
జయప్రభశబ్ద కవిత్వం గురించి rama bharadwaj అభిప్రాయం:
12/04/2010 1:12 am

రమ.