పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16464

  1. మూడు లాంతర్లు గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/21/2011 1:26 am

    కనక ప్రసాద్ గారూ !!

    “ఇంకా ఉంది ఇంకా ఉంది ” అన్న మీ మాట వల్ల అంతా ఒక సారే చదవొచ్చు లెమ్మని ఊరుకుంటూంటే మీరు నా సహనానికి పరీక్ష పెడుతున్నారు. మీ మొత్తం చదివినా నాకు కలిగే సరికొత్త జ్ఞానమ్ ఏదో ఒహటి ఉంటుందనే నమ్మకం నాకైతే కలగడం లేదు గనక నాకు మీ అభిప్రాయాలు చదువుతూంటే కల్గిన అభిప్రాయాల్ని క్లుప్తంగా చెప్పడం ఉచితం అని అన్పించింది. గనక ఈ నాలుగు మాటలూను.

    దేవుడి సృష్టి ని గురించిన ప్రశ్నలకి మనకి దొరికే జవాబుల్లో ఎంత స్పష్టత దొరుకుతుందో కవి సృజన వెనుక లోపలి కారణాలని వెతికి పట్టుకునే పని లోనూ అంతే దొరుకుతుంది. కవి తనకే స్పష్టంగా తెలియని తన సృజన కార్యాన్ని గురించి ఇధమిథ్థంగా చెప్పగలుగుతారన్నది [ఇది వరకు కవులంతా మగవాళ్ళే గనక “డు” వాడేయడం సాధ్యమయ్యేది. ఇప్పుడది అసాధ్యం. గనక “కవి” శబ్దాన్నిక్కడ బహువచనంగా స్వీకరించండి వాక్యంలో!!:)] ఎదురు చూడగలిగే విషయం కాదు. మీరు రాసిన పాటల్లోని వాక్యాలతో పోలిస్తే మీ వచనంలోని వాక్యాలు చాలా మేలు! కనీసం అర్ధమయ్యేలా ఉన్నాయి మీ ఊహలు. మీ కవిత్వం “బొమ్మకన్నో” మరో కన్నో గాని పాఠకుల కన్నుకి కూడా అందితే బాగుణ్ణు.

    దీన్ని అలా ఉంచితే ఇంగ్లీషు వాడికి మార్మికత తెలీదు. “పెంజీకటికావల” ఒక మూర్తిని అతగాడు రాయనూ లేడు ..ఊహించనూ లేడు. గనక వాళ్ళది మేలైన కవిత్వమో మనది మేలైన కవిత్త్వమో చెప్పడం ఎప్పుడూ కుదిరేది కాదు.

    మీరే అన్నట్టు ఇవన్నీ “భాషంత పాతవే”!! వీటికి జవాబులు త్రిపురా నారాయణరావు లు గానీ మీ స్నేహితుడు బిపిన్ గానీ నిజంగా తీర్చగలవి అవునని నాకు అన్పించదు. అయితే ప్రశ్నలు అనాదిగా కలుగుతూంటాయి. వాటికి జవాబులు సైతం మీరంతా అనాదిగా వెతుక్కుంటూనే ఉన్నారు.

    ఈ ప్రశ్నల కన్నా మనసు దానిదైన ఒక వివేకంతో తనకి బాగున్న కవిత్వాన్నీ అలాగే ఏమీ పసలేని భావాన్నీ కూడా చప్పున పోల్చుకుంటుంది సహజంగానే !! అందుకే ఎక్కడైనా ఏ కాలంలోనైనా మనకి కవిత్వం అన్నది మిగిలే ఉంది. కవిత్వం కానిది సహజంగానే జారిపోతుంది. గనక మనకి కవులైన అన్నమయ్యలు శతాబ్దాల తరబడి మిగిలి ఉన్నారు. ఉంటారు కూడాను. ఉన్నతమైన సృజన అనేక కారణాలకి బాగుంటుంది. ఏ ఒక్క కారణానికో కాదు.

    రమ.

    రమ.

  2. అనుభూతి కవిత్వం గురించి chalapathy అభిప్రాయం:

    01/20/2011 8:57 am

    exellent

  3. ఈమాట గురించి గురించి Manikyamba అభిప్రాయం:

    01/20/2011 7:54 am

    సంపాదకులకు,
    ఎన్నాళ్ళనుంచో వెదుకుతున్న మంచి తెలుగు వెబ్ పేజ్ ఇన్నాళ్ళకు దొరికింది. తెలుగులో టైప్ చెయ్యాలన్న కోరిక కూడా తీరింది kaani kochemu time padutundi. Poorthi ga telugu lo rayadaniki.
    Any way meeru chestoonna ఈ sahiti seva (సాహితి సీవ) Chaala bavundi. ento vunnatamu ga vundi.

    Long Live and All the best to ఈమాట .
    Manikyamba

  4. కోనసీమ కథలు: వామనుడు గురించి Manikyamba అభిప్రాయం:

    01/20/2011 7:28 am

    కద ఆద్యంతము చాల హ్రుద్యముగ సాగింది. మా అమ్మమ్మ గారిది పేరూరు గ్రామము. అందుకోసం కథ తెలిసిన వాళ్ళదే అనిపించింది. వామనుడు పేరు కూడా బాగుంది. కోనసీమ కథలు ఇవి. ఇందులో అనుకరణ లేదు. Thanks సాయి బ్రహ్మానందం గొర్తి గారు మంచి కథ అందించినందుకు. ఇంకా మీ దగ్గరనుంచి మంచి కథలు మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నాను.

  5. ఈ శతాబ్దపు రచనా శతం గురించి prasad sharma అభిప్రాయం:

    01/20/2011 7:14 am

    ji namaskarmas, i come across this great site while searching for the authors Ashthavadhani Kavisekhara Abbaraju Hanumantha Raaya Sharma Pakayaji and shri Manchikanti Sheshachalam’s books : 1) Acchandhra Neeroshtya Nrigadya dasaradhi Charitra and shri hanumath bhagavatgita etc.,
    I shall be grateful to for this kind help.

  6. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/19/2011 8:56 pm

    ఈమధ్యనే సంగీతరావుగారి రెండవ కుమారుడు గోపాలకృష్ణగారు ఈ కింది విషయం రాసి పంపారు. పాఠకుల కోసమని దాన్ని జతచేస్తున్నాను. – రో.ప్ర.

    “నేను కూడా చాలా రోజులు పుష్పవిలాపంలో హార్మోనియం నాన్నగారే వాయించారని అనుకునే వాడిని. ముఖ్యంగా బుధ్ధదేవుని భూమిలో పుట్టినావు తరవాత వచ్చే బిట్ లో నాన్నగారి టచ్ వినిపించేది. కానీ అది మాస్టర్ వేణు అని నాన్నగారు చెప్పేరు. పుష్పవిలాపం నాన్నగారు మద్రాసు రాకపూర్వమే రికార్డయింది. కుంతీకుమారి కూడా 1952 లో నాన్నగారు మొదటిసారి మద్రాసు వచ్చివెళ్ళేక, 1954 లో శాశ్వతంగా మద్రాసులో ఉండడానికి రాకముందు రికార్డయింది. అప్పట్లో రికార్డయినవన్నీ మాస్టర్ వేణుగారివే. శ్రీ వేంకటేశ్వర ప్రభాత ప్రార్ధనలో నాన్నగారి హార్మోనియం ప్రముఖంగా వినిపిస్తుంది.” – గోపి.

  7. చెప్పులు గురించి Mahesh అభిప్రాయం:

    01/16/2011 5:07 am

    JUBV గారి కథ చదువుతుంటే కళ్ళల్లో నీళ్ళు ఒచ్చేసేలా ఉంది.
    కవిత గారు,
    పేదరికం లో, కష్టాల్లో ఉన్న ప్రతి విద్యార్థి అలాగే ఉంటారండి.
    ఆ టైం లో ఆ పుస్తకం, చెప్పులు ఎంత అవసరమో చాలా స్పష్టంగా ఉంది కథలో.
    అలాంటి టైం లో అక్క, అమ్మ చేసిన త్యాగాలకి వాళ్ళకి తర్వాత అది చేద్దాం, ఇది చేద్దాము అనుకోవటం చాలా సహజం.
    పుస్తకం, చెప్పులు అంత అవసరం కాబట్టే కధానాయకుడు కూడా వాళ్ళ త్యాగాలకి సిద్ధం అయ్యాడు.
    అదే BUS PASS కి త్యాగం చేస్తానంటే కధానాయకుడు ఆలోచించేవాడు.
    కవిత గారు మీరు బహుశా డబ్బులో పుట్టి పెరిగి ఉంటారు. ఇక్కడ కామెంట్స్ రాసిన చాలా మంది ఇంలాంటి కొన్ని అనుభవించి ఉంటారేమో…అందుకే ఇది వాళ్ళని అంత కదిలించిదేమో…!!!

  8. నాకు నచ్చిన పద్యం: శ్రీరామ ధనుష్టంకారం గురించి Sagar అభిప్రాయం:

    01/15/2011 11:07 am

    Sir / Madam, where can i get Bhaskara Ramayanam….pls tell me…am egerly waiting for the copy….thanks,
    Sagar

  9. తవ్విపోత గురించి siva vaddadi అభిప్రాయం:

    01/15/2011 6:39 am

    యాదృశ్ఛికం … స్పెల్లింగ్ కరెక్టేనా?

    జీవితానికి శెలవు చీటీ కరెక్ట్ ప్రయోగమా? I DOUBT

  10. కోనసీమ కథలు: వామనుడు గురించి siva vaddadi అభిప్రాయం:

    01/15/2011 6:22 am

    కథ బాగుంది. ఈ మధ్యన మా పసల పూడి కథలు చదివిన తర్వాత ఈ కథ లొ కూడా ఆ ప్రభావం ఉన్నట్టుగా తోస్తూంది. శైలి అలానే ఉంది, ఏది ఏమైనా ఓ మంచి కథ, అనుకరణ, అనుసరణ అన్న మీమాంస వదిలేస్తే.