పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16466

  1. సిరుల సంక్రాంతి గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    02/11/2011 11:03 pm

    థాంక్సోయి, వెంకటలక్ష్మీ.
    అప్పట్లో, నాకు తెలీకుండ నన్ను చూసేవారిలో మీరూ వున్నారని, ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషమేసింది కూడా. (మీరింతగా చెబుతున్నా, సారీ, మీరెవరో అస్సలు గుర్తుకు రావడం లేదండీ)ఎంత ధైర్యం మీకు? మీరందరూ నన్నలా పిల్చుకోడానికి? (హమ్మా!)
    ఓకే. సిరుల సంక్రాంతి నచ్చినందుకు చాలా థాంక్స్.నిజమే నగరంలో ఆవు పేడ దొరకడం కష్టమే. గోశాలల అభివృధ్ధికి అందరం సహకరించాలి.
    మీ లేఖని అందించిన ఈమాట వారికి ధన్యవాదాలు.
    అభినందనలతో-
    ఆర్.దమయంతి.

  2. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    02/11/2011 7:54 am

    వచన కవిత్వానికీ ఒక సిలబస్ వుంటే బావుణ్ణు
    ***

    గుండె , వొణికినప్పుడో, తొణికినప్పుడో
    మనసు ముసురేసినప్పుడో,, మురిసిపోయినప్పుడొ..
    కవిత్వం పుడుతుంది.
    ఉప్పొంగిన హృదయానికి కవిత్వం – ఒక ఆహ్వానం. ఒక ఆశ్రమం. ఒక ఆశ్రయం.
    ఆకాశమంత ఆవేశం – అరచేతిలో ముత్యంపూస లా మెరవడమే కవిత్వం.
    ఎంత దాహార్తికైనా..గంగాళమెత్తి వొంపము కదా నీళ్ళని?
    సాగర సౌందర్యాన్ని తిలకించాలనుకునే వారికి అలల ముద్రలే అందం. (సముద్రపు పోటు కాదు.)
    వనమల్లా పూలున్నా,, మరువమేసి కట్టిన మల్లెఫూ దండే మురిపెం.
    వజ్రం ఎంత విలువైనదే ఐనా..ఆభరణంలోనే దాని అందం.
    కవిత్వమూ అంతే. దాని కున్న ఒకానొక దివ్యాకృతిలో రూపు దిద్దుకున్నప్పుడే, ఆ సౌందర్యం, గుండెల్ని రాజేస్తుంది
    అక్షరాలెన్నున్నా..ఏర్చి కూర్చిన పద సంపద -కవితా సిరి అవుతుంది.’భావం ఒక పొంగు. అది భాషలోనె వొదిగి వుండు’ అనే చందాన..

    భావ దర్పానికి భాషా పరిధి ఒక హోదానిస్తుంది అని నా నమ్మకం. కవి తన సృష్టిని అక్షరాలలో నింపి, మనముందు ఒక చిత్ర పటాన్నుంచుతాడు. అదోఅక్షరాల వర్ణ చిత్రం. కవితాక్షరాలలో నక్షత్రాలను మెరిపించడానికి, వెన్నెలను కురిపించడానికి ఒకే ఒక మార్గం. వ్యాకరణం -.ఐతే, దాని ఆవశ్యకత వచన కవిత్వంలో ఎంత అని మాత్రం చెప్పలేను. (నాకు తెలుగు వ్యాకరణం తెలిసి వుంటే, మంచి వచన కవిత్వం రాసి వుండేదాన్నని ఇప్పటికీ భావిస్తా.).

    కారు ఓనర్ కి డ్రైవింగ్ తెలిసి వుండాలా?, అఖ్ఖర్లేదా?.. అన్నట్టె వుంటుంది. ఈ విషయం మీద చర్చించుకుంటే!

    తెల్ల దారాలు పోసి నేత నేసే నేతగాడికి- రంగులపోగులు, కల్నేతల కూర్పులు, అంచులకు జరీ పోతలూ తెలిస్తే- ఆ కోక (వస్త్రం) ఎంత వన్నె తేరుతుందో. కవిత్వ లక్షణాలు, గుణాలు, విధానాలు, పరిధులు తెలియడం వల్ల, అక్షరాల నేతలో కవిత్వమూ సింగారాల ‘సీతా కోక’ అవుతుందని నా భావన. అది పద్యమో, గద్యమో, గీతమో, గేయమో, స్తోత్రమో, శతకమో, వచనమో, దేనికైనా ఒక స్పష్టతను తెచ్చిపెట్టే శక్తి ఈ సిలబస్ కి వుంటుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం..

    గాయకునికి సంగీతం తెలిసి వుంటె, ఆ గాత్రం ఎలా గాంధర్వమౌతుందో, అలాగే- కవిత్వంలో – లయల హొయలు, పాద విభజనలో భావ భంగిమలూ వుంటే కవితా శిల్పం కూడా అత్యంతద్భుతంగా వుంటుందని నా అభిప్రాయం.
    పాటలెలా పాడాలో పాఠాలుగా చెబుతున్నారు. చూస్తున్నాం..
    రచనలెలా చేయాలో సూచిస్తున్నారు. చదువుతున్నాం..
    పద్యాలెలా రాయాలో వివరిస్తున్నారు. నేర్చుకుంటున్నాం.
    అలాగే,’వచన కవితలెలా వుండాలో తెలిపే ఒక గైడెన్స్ కూడ వుంటే బావుణ్ణు’ అని నేనెన్నాళ్ళణ్ణుంచో చూస్తున్నా.

    ‘కవిత్వం’ అనే వస్తువుకి సంబంధించిన ఒక విలువైన సమాచారాన్నిస్తోంది ఈ చర్చ. ఏ సమాచారమైన సరే, అందుబాటులో వున్నప్పుడు తెలుసుకోవడం వల్ల తెలీని తనాన్ని తగ్గించుకోవచ్చేమో! కవిత్వం రాసే వారికి, ఆస్వాదించే వారికీ, ఈ చర్చ ఉపయోగకరంగా వుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    అందరికీ, అభివందనాలు.
    ఆర్.దమయంతి.

  3. చంపకోత్పలమాలల కథ గురించి ramadevi అభిప్రాయం:

    02/11/2011 6:08 am

    వ్యాసం దాని మీద చర్చా రెండూ బావున్నాయి. కానీ, రచయిత మోహన గారు కదా మరి ఆయన సమాధానం, వివరణ ఇవ్వకుండా ప్రసాదు గారు ఎదుకు ఇచ్చారు? ఇలా చాలాసార్లు, లీల గారి వుద్దేశ్యాన్ని అపార్ధం చేసుకున్నట్లు, మామూలుగా అడిగిన దానిలో కూడా ఎదుటివారికి వ్యంగ్యం కనిపించినట్లు కాకుండా, కనిపించకుండా ఉండాలంటే ఏమి చెయ్యచ్చో తెలుగు కంప్యూటర్ లో రాయడానికి శ్రమ పడినట్లు ఒక రూలు పద్దతి పెట్టూకోవచ్చు కదా! స్వానుభవం తో చేస్తున్న విన్నపం.

  4. సంగీత పట్నం – కదనకుతూహలం గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    02/10/2011 4:02 pm

    సంపాదకులకి,

    “రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ” పాట అనుపల్లవిలో “అఘ మేఘ మారుత శ్రీకర” అనుంది. ఇది తప్పు. ఈ క్రింది విధంగా ఉండాలి. దయచేసి సవరించగలరు.
    అనుపల్లవి: ఆగ మేఘ మారుత శ్రీకర

    -బ్రహ్మానందం

    [కాదండి. “అఘ మేఘ మారుత” అన్నదే సరైనది. అఘము అంటే పాపము. – సం.]

  5. తవ్విపోత గురించి abhisapthudu అభిప్రాయం:

    02/10/2011 3:20 am

    Dear John Hyde,

    It is a good poem, a poem of nostalgia. Though the lines have been cut to form stanzas, it appears to be prosaic at some places. But, because of the over-all tenderness, the prose- patches are faded. In my observation, u take ample time to transfuse ur feelings into poem. I doubt, in this case, u might have been hasty a bit.

  6. సిరుల సంక్రాంతి గురించి venkata lakshmi అభిప్రాయం:

    02/10/2011 3:08 am

    damayanti్ garu,

    Meeru Warasiguda lo unnappudi (memu kooda akkadi vallame lendi) meeru typing classes ki poddunne veltoo unte choosthu undadam na chinna nati hobby. miru bandaru vallani telusukuni memandaram mudduga “bandaru laddu” ani piluchukonevallam. mee sankranthi varnanalo ee mathram atisayokti kaani, abaddham kaani ledu anta unnadi unnatte chepparu. aa rojulloki teesukellinanduku chala thanks. ippudu gobbemmalaki avu peda dorakani stithilo unnam mana “maha nagaramlo”. anyway congrats! chala baga undi.

    [Please write your comments either in English or in Telugu only – Eds.]

  7. చేరా కు ఒక శతమానం గురించి మోహన అభిప్రాయం:

    02/09/2011 4:10 pm

    లైలా ఉవాచ-
    (’ఆచార్యులు’ ‘ఆచార్యులు’ -అంటున్నారు మాటల్లో అక్కడక్కడా. అది ‘డా’ కి పర్యాయపదమనీ, ఈ రచయిత పేరులో భాగం కాదనీ, నా ఊహ. తప్పైతే, చెపుతారుగా.:-))
    నా ఊహలో రావు, శర్మలా ఆచార్య కూడా అతని పేరిలోని ఒక భాగమే. వైష్ణవులలో మతాచార్యుల వంశములో పుట్టిన వాళ్లు ఇలా పేరులుంచుకొంటారు. తరువాతి కాలంలో సంపత్కుమారులు నిజంగా ఆచార్యులయ్యారు. కాని ఆ ఆచార్య పట్టము పేరుకు ముందు వస్తుంది, తరువాత కాదు. మనకు స్వాతంత్ర్యము సిద్ధించిన తరువాత ఎన్నో కారణాలవల్ల శర్మ, ఆచార్య, భట్ట, అయ్యంగారు లాటి పేరులు వాడుకలో తగ్గిపోయింది. రావు, రెడ్డి ఇత్యాదులు మాత్రము ఇంకా వాడుకలో ఉంది. – మోహన

  8. సంగీత పట్నం – కదనకుతూహలం గురించి srinivasaraov అభిప్రాయం:

    02/09/2011 10:51 am

    wonderful information, thanq sir

  9. తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి pydi naidu అభిప్రాయం:

    02/09/2011 1:59 am

    చాలా బాగున్నది.

  10. చేరా కు ఒక శతమానం గురించి lyla yerneni అభిప్రాయం:

    02/08/2011 7:54 pm

    …సంపత్కుమార రాసిన పద్యాలు కవిత్వమని ఎవరూ అనుకోరనుకుంటాను.
    రమ.

    … సంపత్కుమారులే ఇది సరదా రచన అని చెప్పుకొన్నారు. …ఈ పుస్తకాన్ని ఆచార్యులు చేరాగారి సతీమణి శ్రీమతి రంగనాయకికి అంకితమిచ్చారు. ఈ శతకాన్ని ఆధారం చేసికొని ఆచార్యులను అంచనా వేయడము తప్పని నా వైయక్తిక భావన. విధేయుడు – మోహన

    రమ, మోహన, -విషయాలు కొన్ని తెలియ చెప్పినందుకు సంతోషం.
    Reading in between the lines, I get the impression neither of the two, think much of these poems.

    నాకు ఈ పద్యాలు బాగున్నయ్యి. సరదాగా ఉన్నయ్యి. పండితులకు ‘సరదా’ ఉండకూడదని నిషేధం ఏం లేదు కదా. కంద పద్యానికి విధించుకున్న నియమాలు ఉల్లంఘించారో, లేదో – అది నాకెలాగా తెలియదు. కాని సం -లు ఎంచి ఇచ్చిన ఈ పద్యాలలో నవ్వు ఉంది. నిజమూ ఉంది. మకుటంలో ‘దోస్తూ’ ‘నేస్తూ’ అన్నా, ‘చేరా’ ‘యారా’ అన్నా, పద్యంలో విషయముంది. చెప్పదల్చుకున్న విషయాలు పద్య్ర రూపంలో సంపత్ చెప్పగలిగారు. మేధావులనుంచి ప్రజలకు వచ్చే బాధలూ చెప్పారు. సమకాలీన కవులను గురించీ నవ్వారు. పిల్లలు వేళకు తిన్నారో లేదో అని పట్టించుకోక, బహుమతుల మోజులో, పిల్లల్ని ప్రైజు పిగ్గు ల్లాగా పెంచుకొనే రివాజు గురించీ చెప్పారు. అట్టి అమ్మానాన్నల పాలనలో పిల్లలకన్నా దళితులెవరురా నాయనా! -అన్నారు. మీవారూ మావారూ సాంబారు కాసుకోటానికి తప్ప నీ నా రాతలు ఎంత చేసేను – అని నవ్వుకుంటూ అంటున్నారు.

    నవ్వుతూ నవ్వుతూ రాసిన ఈ పద్యాలు నాకు బాగున్నయ్యి.

    పద్యాల్లో మైత్రి గురించి:

    ఈ పద్యాలు, ఒక మగవాడు ఇంకో మగవాడికి రాసినవి. వీరి మైత్రి ఒకటో రెండో పద్యాల్లో సూచితము. సంపాదకులు, ఇతరులు కూడా, వీరి మైత్రిని కొంత కవిత్వీకరించారు.

    Jumping to a generalisation quickly (fortified from prior reading of a few other writings in this magazine,) my impression is, friendships mostly existed ( and exist ) between ‘male’ writers. What I mean is -they are unisex friendships. There are no cross gender friendships among writers.

    డాబా మీద కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకున్నా, కాలవ గట్టులకు షికారెల్లినా, ఒక కవి ఇంకో యువక కవిని రిక్షా కట్టించుకుని చూస్తానికి వచ్చినా, ఇవన్నీ మగ-మగ స్నేహాలే. (ఈ పత్రికలో ఏ రాతల్లోనూ, మగ ఆడ రచయితల మధ్య సాహిత్యపరంగా, స్నేహం వ్యక్తం చెయ్యబడలేదు.)

    What prevails is ‘homophilia’ among male writers and poets. Telugu (Indian) people are very comfortable with such social behaviours. In life. In portraying them in arts. They understand and accept these ‘male’ friendships. There is never any suspicion of homosexuality. నేను అపోహ ప్రవేశపెడుతున్నానని అనుకోకండి. I don’t have the slightest inclination to do so. I really don’t expect it of Telugu. తెలుగులో చెప్పాలంటే – అంత సంబడం కూడానా.:-) I don’t think in Telugu, there are or there will be love sonnets from one male to the other, like from Shakespere to his young friend.

    In these Telugu poems, from one male to the other, there are no homoerotic overtones. In this set of poems, there is a sexual void.

    Overall, I am making an observation of prevalance of male friendships in Telugu writers and absence of sexuality in their writings.

    పుస్తకాల్లో, పత్రికల్లో, అంకితాల సంగతి, మరెప్పుడైనా.

    మళ్ళీ రాస్తాను.

    (‘ఆచార్యులు’ ‘ఆచార్యులు’ -అంటున్నారు మాటల్లో అక్కడక్కడా. అది ‘డా’ కి పర్యాయపదమనీ, ఈ రచయిత పేరులో భాగం కాదనీ, నా ఊహ. తప్పైతే, చెపుతారుగా.:-))

    లైలా