పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16466

  1. ఈమాట ప్రచురణలో చిన్న మార్పు గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    03/02/2011 1:20 am

    గౌరవనీయులైన సంపాదకులకు, నమస్తే!

    ముందుగా మీకు నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా. ఈమాట లో ‘మధ్యంతర రచనలకు’ స్థానాన్ని కల్పిస్తున్న వైనం బాగుంది. అలాగే- నెలకో, రెణ్నెల్లకో, ఒక చిన్న నవల కానీ, ఒక పెద్ద కథకు కానీ వీలు కల్పిస్తే మరింత బాగుంటుందనుకుంటున్నా.(చిన్న చిన్న ఇమేజెస్ తో).

    అదే విధంగా, ఈ రెండు నెలల వ్యవధిలో వచ్చే – మన తెలుగు పండగలకు సంబంధించిన ప్రత్యేక వ్యాసాలు, ప్రముఖులు పొందే ప్రతిష్టాత్మకమైన పురస్కారాల విశేషాలు,ఇంకా..తెలుగు సాహితీ వన వృక్షాలను వీడి వెళ్తూ… పరిమళాలను వెదజల్లి పోయేవారిని సంస్మరించుకునే వీలూ కల్పిస్తే మరింతగా బావుండొచ్చేమోనని ఒక చిన్న ఊహ. ..అంతే.

    (ఈమాటలో- ముళ్ళపూడి గారి మంచిని, మల్లెపూల సాహిత్య సేవని చదవాలనుంది.)

    శుభాభివందనాలతో-
    ఆర్.దమయంతి.

    [మీ అభిమానానికి కృతజ్ఞతలు. పెద్ద కథలకు ఈమాటలో ఎప్పుడూ చోటు ఉంది. నవలా సాహిత్యాన్ని ప్రోత్సహించాలని మాకూ ఎంతగానో ఉంది. కానీ సమీక్ష కోసం, నవల మొత్తం ఒకేసారి పంపమనడం, రచయితలకు కుదిరే పని కాదు. అలా అని, సమీక్ష ఏమీ లేకుండా ప్రచురించలేము కూడాను. నవలను సమీక్షించే పద్ధతిపై ఒక అవగాహనకు రాగానే తెలియజేస్తాము.

    ఇకపోతే, గత రెండేళ్ళుగా కొంతలో కొంతగా నిన్నటి ప్రముఖులనూ, వారి సాహిత్యాన్ని పునఃపరిచయం చేసే ప్రయత్నం చేశాం. అయితే, ఏదో ఒక సందర్భం వస్తేనే కాకుండా, కేవలం ఒక స్మరణ గానే కాకుండా, మన సాహిత్యాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తూ, మంచి చెడ్డలు ఎంచి చూస్తూ చేసే విమర్శనాత్మక రచనల కోసం ఈమాట ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటుంది. ఈ సాహిత్య పునర్మూల్యాంకనం గురించిన కృషి ఈమాట ప్రయత్నాల్లో ఎప్పుడూ ఒక ముఖ్యభాగమే. ఈమాట రచయితలు అందుకు మరింతగా సహకరిస్తే ఈ ప్రయత్నం సఫలమవుతుంది – సం.]

  2. కథ కథ గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    03/01/2011 11:02 pm

    బావుంది. ఆసాంతం అచ్చతెలుగులో రాయడం బావుంది. ఇంగ్లీషు పదాలు లేకుండా రాయడం అరుదవుతున్న తెలుగుకధలో ఇదొక మంచి ఉదాహరణగా చెప్పచ్చు. ఈ క్రింది నాలుగు దిష్టి చుక్కలకీ మీకు తెలుగు మాటలే దొరకలేదంటే ఆశ్చర్యం కలిగింది.

    డిస్టర్బ్, అటెన్షన్, లిప్‌స్టిక్, మిస్సయింది.

    వీటికీ తెలుగు పదాలు రాస్తే అచ్చమైన కథయ్యేది కదా?

  3. కథ కథ గురించి మోహన అభిప్రాయం:

    03/01/2011 7:49 pm

    బావుంది, ఇది కథ కాదు, కథ ఆత్మకథ 🙂
    విధేయుడు – మోహన

  4. విద్యాసుందరి గురించి seetharama rao అభిప్రాయం:

    03/01/2011 6:35 pm

    This is a fascinating and informative essay. I am indeed deeply indebted to the site and the shri Rao garu.

  5. కాలనీ భోగి గురించి Krishna Surabhi అభిప్రాయం:

    03/01/2011 6:31 pm

    సత్య గారు, చాలా బాగా రాశారు. కథ కళ్ళకు కట్టీనట్లు వున్నది. ఇంకొన్ని రాస్తారని ఆశిస్తూ….

  6. తవ్విపోత గురించి kasinadhuni అభిప్రాయం:

    03/01/2011 12:53 pm

    కనుమూరి గారు,
    మీ కవిత చదువుతున్నప్పుడు సరిపల్లి కనక ప్రసాదు గారి “Doors closing” కథ గుర్తుకొచ్చింది. బాగుంది.
    రాజాశంకర్

  7. కాలనీ భోగి గురించి Madhu Mahesh అభిప్రాయం:

    03/01/2011 11:25 am

    Probably SKC report బాబా కూల్ డ్రింక్స్ వాడిని అడిగి ఇచ్చినట్టు వున్నది 🙂

    “మా కాలనీలో ఇలాంటి తగాదాలు తీర్చడానికి సెంటర్లో బాబా కూల్ డ్రింక్స్ షాప్ దగ్గర కష్టమర్ సర్వీసు అందిస్తూ కొంత మంది కూర్చుని ఉంటారు. వాళ్ళు మా గొడవంతా విన్నతర్వాత సగం సగం తీసుకోమని తీర్పు ఇచ్చారు.”

    చాలా బాగ రాసారు……కాకపొతె శివరాత్రి కి సంక్రాంతిని తలపిఒచారు.

  8. కథ కథ గురించి Savithri Machiraju అభిప్రాయం:

    03/01/2011 11:07 am

    అద్భుతం!!!

    మొదటి రెండు పారాలూ చదవగానే “ఈ కథని నేను ‘నాకు నచ్చిన కథ’ శీర్షిక లో చర్చించవచ్చా?” అన్న ఊహ కలిగింది. సగందాకా చదివాక, చంద్రగారు “తనకి నచ్చని కథ”లను చాలా చదివినట్టున్నారు అనిపించింది. 🙂
    పూర్తిగా చదివాక, కథ కోరిక మేరకు, నాలో ఉత్పన్నమైన ప్రశంశలూ, కృతజ్ఞతలూ నాలోనే భద్ర పరచుకుంటున్నాను.

  9. తవ్విపోత గురించి జాన్‌ హైడ్‌ కనుమూరి అభిప్రాయం:

    03/01/2011 4:20 am

    అభిశప్తుడు గారు,
    పూర్వవిద్యార్థుల కార్యక్రమాలు కొన్నిహాజరైన నేపద్యంలో కలిగిన అనుభవాలనుండి అనుకోకుండా అలా పద్యం వచ్చేసింది.

    మోహన గారు,
    ఇది రాయక పూర్వంగాని, రాసిన తర్వాత గాని నేను సినిమా చూడలేదు.

    స్పందించినవారికి ధన్యవాదములు

  10. తవ్విపోత గురించి అరిపిరాల అభిప్రాయం:

    03/01/2011 12:55 am

    “పాత విద్యార్థుల పేరిట కలిసే చోటుల్లో
    పచ్చసిరావో వ్యాపారివో
    తెలుసుకుందామనే
    మన పలకరింపులు
    వాసనలేని కాడమల్లెలౌతున్నాయి”…
    వయసు పెరిగే కొద్ది అమాయకపు వాసనలు వదిలేసే మనుషులం మనము..!! పాతమిత్రులు కలిసినా “ఏం చేస్తున్నావు?” అన్న ప్రశ్నలో “నాకెలా వుపయోగపడతావు?’ అన్న ధ్వనే వినిపిస్తుంది మరి. చాలా బాగుంది