మీరు కథలూ, కవితలే రాస్తారనుకున్నాను. పాటలు కూడా రాస్తారన్నమాట. ఇలా ఓ పాట పాడుకోండీ, లేదా వాయించుకోండంటూ నాలుగు వాక్యాలు మా ముందు కుమ్మరిస్తే ఎలా? ట్యూనిచ్చుకు కొట్టండి. లైలా విరచత అని చివర్లో చేర్చి మరీ హాయిగా పాడుకుంటాం. goose bumps రాకపోతే అప్పుడడగండి.
ప్రేమ పాటలు తప్ప పాడుకోకూడదా ఏం?
ప్రకృతి ధర్మాన్ని తప్పించుకోడం ఎవరి వల్లా కాదు. త్యాగరాజు కూడా మనలాగా ఉప్పూ కారమూ రుచులు తెలుసున్నవాడే!
మీ కోసం త్యాగరాజు రాసిన ప్రేమ గీతం. శృంగారంపాలు ఎవరికి కావలిసినంత వారు రంగరించుకోవచ్చు.
ఈ పాట చదివి ( మీ పాట లాగ )మీరు శాంతిస్తారని ఆశిస్తూ –
శృంగారించుకొని వెడలిరి శ్రీ కృష్ణునితోను
అంగ-రంగ వైభోగముతో
గోపాంగనామణులెంతో సొగసుగ (శృ)
కథ స్వగతం, నిలకడ లేని పేకమేడల్లాగా మారిన భావోద్వేగాలు – కొత్త రీతిగా చెప్పుకున్నట్టు బావుంది. “మిమ్మల్నీ చదవాలన్న తీవ్రమైన కాంక్ష” అన్న ప్రస్తావనలో అన్యాపదేశంగా చదువరుల పఠన తీవ్రత చెప్తూ, రచయిత/కవి జీవితాన్ని నిజాయితీగా ప్రేమించాలి, దాన్నుంచి జనించే రచన జీవధార అన్నదీ తెలుపుకనే తెలిపినట్టుగా…కథ తన కథని నిర్లజ్జగా తెలిపినట్టుంది.
Has Tyagaraju ever written love songs on a woman? I don’t remember from your previous essay. He is once or twice married, isn’t he?
శబ్దాలంకారములు ఎన్ని ఉన్నా త్యాగరాజుకు రాముడి మీద మక్కువ కన్నా, మిగతా మనుషుల మీద కోపం ఎక్కువ.
“దుర్మార్గ చరాధములను దొర నీవనజాలరా” అని పల్లవి రాసి అది ఐదుసార్లు పాడమంటాడు. అనలేనిది అన్నిసార్లు ఎందుకు? ఆ సాహిత్యం చదివాక ఇక ఆ స్వరం వాయించ బుద్ధి అవుతుందా. రాముడి దర్శనం కావటానికి మరి చానాళ్ళు పట్టిదంటే పట్టదూ.
నేను రాసిన ఈ పాట ఒకటి మీ వీణ మీద వాయించుకోండి. వీణెందుకు? గొంతెత్తి పాడుకోండి.
As you sing the first line, you have to stretch tall and throw both your arms up in the air. The song itself will direct you from there.
Ready? One, two, Hit it
కొలువగా తలిచేనో
కొలుతు నే కోదండపాణినే
కలవ కన్నుల వాడు
కమనీయ మూర్తి
కొలువై ఆతడుండగా
తలవగానేల తక్కిన వారిని
కొలుతునేనాటికి కోదండపాణినే!
‘త్యాగరాజనుత’ అని ఉంటే తప్ప ‘goose bumps’ రాకుండానూ, famous artist ఐతే తప్ప పాట ఏదీ నచ్చకుండానూ conditioned ఐపోయి ఉంటే, God help those Pavlov’s dogs.
“ప్రిదిలి” లాంటి మాటలని తెలుగు కవిత్వంలో వాడటమ్ ఏనాడో మానేసారు. అలాంటి మాటలకి భేషజమ్ తప్ప మరింకే భావమూ లేదివాళ సాహిత్యంలో!! ఇంతకీ… “పయ్యధరం” అంటే ఏంటీ?? “పై అధరం” అని కాబోలు. అదే అయితే పై అధరమ్ అనే అవుతుంది కానీ ఇలా పయ్యధరమ్ అవదు. అలాంటి పదమ్ లేదు. అసలంత ప్రయాస ఎందుకూ?? తేలిగ్గా సునాయాసంగా..సామాన్యంగా.. తప్పులకి చోటులేకుండా వాక్యమ్ రాయొచ్చును కదా?? ఏనాటిదో [అరిగిపోయిన] భావకవిత్వం శైలిలో ఇలా ఏమిటీ చెప్పడం??
ఒక పదం మరో పదం అర్ధవంతంగానూ అంతే సయోధ్య తోనూ కలగలిసిపోతేనే ఎప్పుడైనా ఒక కవితావాక్యమ్ విరాజిల్లుతుంది. అంతేగానీ చదువుతూంటే పంటికింద రాయిపడ్డట్టుండటమ్ వల్ల నొప్పేనొప్పి ..చికాకూను.
ఇంకా ఈవిడ కొత్తగా రాస్తున్నట్టుంది గనక రాబోయే కవితల్లో తన రచనలో మరింత నిలకడ..మరింత నైపుణ్యమ్ చూపించగలరని ఆశించవచ్చు. పైగా ఈమెకి రాయడమ్ కన్నా చదవడం మీద ఎక్కువ మక్కువ గనక మంచి రచనలని చదివి నేర్చుకునే సంయమనం ఉంటుందని నమ్మొచ్చు కూడాను.
నేను పుట్టింది పట్నవాసములో అయినా పెరిగింది అమ్మమ్మగారింట. నా వయసులో ఓ 17 యేండ్లు తగ్గించి చూసుకుంటే కృష్ణవేణమ్మ గలగలలు, రావిచెట్టు ఆకుల బూరలు, మరీ ముఖ్యంగా మా అమ్మమ్మ నాకోసం దాచే మొదటి అరిశె ఇలా ఎనెన్నో జ్ఞాపకాల దొంతర. కాని నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను బహుశా నాదే ఆఖరి తరమేమో అచ్చ తెలుగు సంక్రాంతిని మనసారా ఆస్వాదించినది. దేశాంతరవాసములో రేపు నాపిల్లలు వచ్చిపోయే అతిథులే కాని వారి సొంతము కాదేమో. కాసుల వేటకి దేశాంతరం వచ్చినా నాకు వెంటనే తెలిసిపోయింది నేను తలకిందులుగా తపస్సు చేసినా ఇక్కడ సంస్కృతి నాది కాదని. ఏది ఏమైనా మరోసారి నా మనసుని మా ఊరి పోలిమేరకి తీసుకెళ్ళారు. ధన్యవాదాలు.
అరుణ్ చంద్ర గడ్డిపాటి.
భాషల ఋతువు గురించి kiran babu అభిప్రాయం:
03/09/2011 1:15 pm
చాలా బాగుందీ కవిత.
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Brahmanandam Gorti అభిప్రాయం:
03/08/2011 2:57 pm
లైలా గారూ,
మీరు కథలూ, కవితలే రాస్తారనుకున్నాను. పాటలు కూడా రాస్తారన్నమాట. ఇలా ఓ పాట పాడుకోండీ, లేదా వాయించుకోండంటూ నాలుగు వాక్యాలు మా ముందు కుమ్మరిస్తే ఎలా? ట్యూనిచ్చుకు కొట్టండి. లైలా విరచత అని చివర్లో చేర్చి మరీ హాయిగా పాడుకుంటాం. goose bumps రాకపోతే అప్పుడడగండి.
ప్రేమ పాటలు తప్ప పాడుకోకూడదా ఏం?
ప్రకృతి ధర్మాన్ని తప్పించుకోడం ఎవరి వల్లా కాదు. త్యాగరాజు కూడా మనలాగా ఉప్పూ కారమూ రుచులు తెలుసున్నవాడే!
మీ కోసం త్యాగరాజు రాసిన ప్రేమ గీతం. శృంగారంపాలు ఎవరికి కావలిసినంత వారు రంగరించుకోవచ్చు.
ఈ పాట చదివి ( మీ పాట లాగ )మీరు శాంతిస్తారని ఆశిస్తూ –
శృంగారించుకొని వెడలిరి శ్రీ కృష్ణునితోను
అంగ-రంగ వైభోగముతో
గోపాంగనామణులెంతో సొగసుగ (శృ)
నవ్వుచు కులుకుచునొకతె కొప్పున
పువ్వుల ముడుచుచునొకతె
దువ్వుచు కురులనునొకతె కృష్ణుని
రవ్వ జేయుచునొకతె వేడ్కగ (శృ)
మగడు వీడనుచునొకతె రవికయు
బిగువున జేర్చుచునొకతె
తగును తనకనుచునొకతె పాద
యుగములనొత్తుచునొకతె వేడ్కగ (శృ)
సొక్కుచు సోలుచునొకతె కృష్ణుని
గ్రక్కున ముద్దిడునొకతె
పక్కగు రమ్మనుచునొకతె మడుపుల-
నక్కరనొసగుచునొకతె వేడ్కగ (శృ)
పరిమళములందుచునొకతె శ్రీ
హరి హరియనుచునునొకతె
ఉరమున జేర్చుచునొకతె పయ్యెద
జరిపి వేడుకొనుచునొకతె వేడ్కగ (శృ)
సారసాక్షయనుచునొకతె కను
సైగను పిలుచుచునొకతె
రారాయనుచునునొకతె త్యాగ-
రాజ సఖుడనుచునొకతె వేడ్కగ (శృ)
నౌకాచరిత్రం వినండి. మనసు కాస్త కుదటపడుతుంది. పాపం, త్యాగరాజుకీ తప్పలేదు ఈ ప్రేమగోలని తెలుస్తుంది.
కథ కథ గురించి సంచారి అభిప్రాయం:
03/08/2011 9:59 am
ఈ కథతో నాకు బోర్హెస్ ని తలపించారు.. నాకు తెలిసి అలా తన రచనతో ఆయన్ని గుర్తుకి తెప్పించిన, తెప్పించగల ఏకైక తెలుగు రచయిత మీరే, చంద్రా! సలూదో!
ఇల్లు విడిచి పోతావా రమణా? గురించి ooha అభిప్రాయం:
03/08/2011 5:09 am
చాలా బాగుంది.
కథ కథ గురించి Ravi Borra అభిప్రాయం:
03/08/2011 1:48 am
కథ యొక్క కథ చాలా బావుంది !
తామరాకు మీద నీటి బొట్టులా ఉంది కథా గమనం !!
నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి b.ajay prasad అభిప్రాయం:
03/08/2011 1:07 am
మా తెలుగు మాష్టారు గుర్తుకు వచ్చారు. చక్కటి పద్యాలు గుర్తుచేసారు.
కథ కథ గురించి ఉష అభిప్రాయం:
03/08/2011 12:13 am
కథ స్వగతం, నిలకడ లేని పేకమేడల్లాగా మారిన భావోద్వేగాలు – కొత్త రీతిగా చెప్పుకున్నట్టు బావుంది. “మిమ్మల్నీ చదవాలన్న తీవ్రమైన కాంక్ష” అన్న ప్రస్తావనలో అన్యాపదేశంగా చదువరుల పఠన తీవ్రత చెప్తూ, రచయిత/కవి జీవితాన్ని నిజాయితీగా ప్రేమించాలి, దాన్నుంచి జనించే రచన జీవధార అన్నదీ తెలుపుకనే తెలిపినట్టుగా…కథ తన కథని నిర్లజ్జగా తెలిపినట్టుంది.
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి lyla yerneni అభిప్రాయం:
03/07/2011 11:11 pm
Has Tyagaraju ever written love songs on a woman? I don’t remember from your previous essay. He is once or twice married, isn’t he?
శబ్దాలంకారములు ఎన్ని ఉన్నా త్యాగరాజుకు రాముడి మీద మక్కువ కన్నా, మిగతా మనుషుల మీద కోపం ఎక్కువ.
“దుర్మార్గ చరాధములను దొర నీవనజాలరా” అని పల్లవి రాసి అది ఐదుసార్లు పాడమంటాడు. అనలేనిది అన్నిసార్లు ఎందుకు? ఆ సాహిత్యం చదివాక ఇక ఆ స్వరం వాయించ బుద్ధి అవుతుందా. రాముడి దర్శనం కావటానికి మరి చానాళ్ళు పట్టిదంటే పట్టదూ.
నేను రాసిన ఈ పాట ఒకటి మీ వీణ మీద వాయించుకోండి. వీణెందుకు? గొంతెత్తి పాడుకోండి.
As you sing the first line, you have to stretch tall and throw both your arms up in the air. The song itself will direct you from there.
Ready? One, two, Hit it
కొలువగా తలిచేనో
కొలుతు నే కోదండపాణినే
కలవ కన్నుల వాడు
కమనీయ మూర్తి
కొలువై ఆతడుండగా
తలవగానేల తక్కిన వారిని
కొలుతునేనాటికి కోదండపాణినే!
‘త్యాగరాజనుత’ అని ఉంటే తప్ప ‘goose bumps’ రాకుండానూ, famous artist ఐతే తప్ప పాట ఏదీ నచ్చకుండానూ conditioned ఐపోయి ఉంటే, God help those Pavlov’s dogs.
లైలా
నిరాశకై ఆశపడుతూ… గురించి rama bharadwaj అభిప్రాయం:
03/07/2011 3:04 pm
“ప్రిదిలి” లాంటి మాటలని తెలుగు కవిత్వంలో వాడటమ్ ఏనాడో మానేసారు. అలాంటి మాటలకి భేషజమ్ తప్ప మరింకే భావమూ లేదివాళ సాహిత్యంలో!! ఇంతకీ… “పయ్యధరం” అంటే ఏంటీ?? “పై అధరం” అని కాబోలు. అదే అయితే పై అధరమ్ అనే అవుతుంది కానీ ఇలా పయ్యధరమ్ అవదు. అలాంటి పదమ్ లేదు. అసలంత ప్రయాస ఎందుకూ?? తేలిగ్గా సునాయాసంగా..సామాన్యంగా.. తప్పులకి చోటులేకుండా వాక్యమ్ రాయొచ్చును కదా?? ఏనాటిదో [అరిగిపోయిన] భావకవిత్వం శైలిలో ఇలా ఏమిటీ చెప్పడం??
ఒక పదం మరో పదం అర్ధవంతంగానూ అంతే సయోధ్య తోనూ కలగలిసిపోతేనే ఎప్పుడైనా ఒక కవితావాక్యమ్ విరాజిల్లుతుంది. అంతేగానీ చదువుతూంటే పంటికింద రాయిపడ్డట్టుండటమ్ వల్ల నొప్పేనొప్పి ..చికాకూను.
ఇంకా ఈవిడ కొత్తగా రాస్తున్నట్టుంది గనక రాబోయే కవితల్లో తన రచనలో మరింత నిలకడ..మరింత నైపుణ్యమ్ చూపించగలరని ఆశించవచ్చు. పైగా ఈమెకి రాయడమ్ కన్నా చదవడం మీద ఎక్కువ మక్కువ గనక మంచి రచనలని చదివి నేర్చుకునే సంయమనం ఉంటుందని నమ్మొచ్చు కూడాను.
రమ.
సిరుల సంక్రాంతి గురించి అచంగ అభిప్రాయం:
03/07/2011 11:26 am