పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16467

  1. నిరాశకై ఆశపడుతూ… గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    03/11/2011 9:45 pm

    నమస్కారమండి, సురేశ్ కొలిచాల గారూ!

    గుర్తుతెచ్చిన గీతాలకు కృతజ్ఞతలు.
    అభినందనలతో-
    ఆర్.దమయంతి

  2. నిరాశకై ఆశపడుతూ… గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    03/11/2011 10:01 am

    “కెందామరలు”, చెలిమిమీర” అంటే సరిపోయేదెమో!

    నాకు గుర్తుకు వచ్చిన రెండు పాటలు “తెలవారదేమో స్వామి (మక్కువ మీరగ … చెలువము నేలగ)”, “చిరుగాలే వింజామర, చిట్టిపాపే కెందామర” (సీతారామశాస్త్రి కాదు).

  3. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    03/11/2011 8:54 am

    బ్రహ్మానందం గారికి

    మీరు “శ్రుత” అనే మాట చాలా సార్లు వాడారు ఈ వ్యాసంలో.

    శృతం అంటే అంటే వండబడినది లేదా కాచబడినది అని అర్థం.
    శ్రుతం అంటే వినబడినది.

    శ్రుతపేయం అనటం సరి కాదనుకుంటా – శ్రోత్రపేయం అనే ప్రయోగం సంస్కృత నిఘంటువులో చూసాను.(పేయము = తాగదగ్గది)

    శ్రుతయోగ్యము అనటం కూడా సరి కాదేమో – శ్రవణయోగ్యం అనాలేమో.

    శ్రుతప్రాయము అనే మాటకి వాడుక గూగుల్ లో వెదికితే దొరికింది. దాదాపుగా అంతా వినబడినది (heard almost in full) అని అర్థం. మీరు ఉద్దేశించింది అదేనా?

    త్యాగరాజు వాడిన శబ్దాలంకారాలను వదిలి ఈ శబ్ద చర్చ చేస్తున్నందుకు క్షమించండి.

    నలుగురికి తెలిస్తే ఉపయోగం కదా అని ఇక్కడే రాస్తున్నాను.

    మీ
    శ్రీనివాస్

  4. నిరాశకై ఆశపడుతూ… గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    03/11/2011 6:46 am

    శ్రీనివాస్ గారు, థాంక్సండి.
    ఏమిటా రెండు పాటలు? తెల్సుకోవచ్చా?
    కృతజ్ఞతలతో-
    ఆర్.దమయంతి.

  5. కాలనీ భోగి గురించి chintalapati అభిప్రాయం:

    03/10/2011 1:44 pm

    Excellent. Not only the proper narration but a touch of humor made it a complete story. I think you need to put more time into writing more full-length stories. I feel proud to have a friend in my circle who is a writer.

  6. About eemaata గురించి b vijayakumar అభిప్రాయం:

    03/10/2011 1:21 pm

    ఈ మాట చాలా బాగుంది. తెలుగు సాహితీ భాండాగారంగా ప్ర సిద్ధికెక్కాలని మనస్పూర్తిగా కోరుతున్నాను.
    బల్లా విజయకుమార్ , గజపతినగరం

  7. నిరాశకై ఆశపడుతూ… గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    03/10/2011 8:41 am

    కెందారాలు అంటే? నిఘంటువులో దొరకలేదా మాట.

    “చెలువమీరిన సెల” అంటే? (చెలువ అంటే స్త్రీ అని అర్థం; చెలువము అంటే అందము అని).

    ఓ రెండు మంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలను గుర్తుకు తెచ్చారు మీరు.

  8. ఫాదరు జోజి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    03/10/2011 3:55 am

    ఫాదరు జోజి ఎవరా అని వెదుక్కుంటే…హైదరాబాదు ఆర్చిబిషప్పుగా పని చేసి ఇటీవలే మరణించిన జోజి బాబు గారి పేరు తారస పడింది. ఆయన స్మృతిలో రాసిన కవితా ఇది?

    “నేలబారు గద్ద / నిడుపు సూపు నేను / నేలమీద లేను / ధూళి రేగుతాను.” అన్న చరణం కవితా సందర్భంలో, మిగతా మృదు పద చిత్రాల నడుమ బాగా అతికినట్లు అనిపించలేదు.

  9. నిరాశకై ఆశపడుతూ… గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    03/09/2011 9:45 pm

    రమ గారికి,
    నమస్తే.
    మీ విమర్శ బావుందండి. మీరన్నట్టు మార్చాలనుకున్నా, కానీ కుదరలేదు.
    ‘అరిగిపోయిన’ అని అన్నారు మీరొక చోట. కాదండి. ‘కరిగిపోయిన’ కరెక్టేమో! అని అనుకుంటున్నా.
    కృతజ్ఞతలతో-
    ఆర్.దమయంతి.

  10. విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి మోహన అభిప్రాయం:

    03/09/2011 2:05 pm

    సాయి బ్రహ్మానందం గొర్తి వ్రాసినది –
    “నాగరత్నమ్మ గారు త్యాగరాజు మీద తెలుగులో స్వయంగా రాసిన ఒక వ్యాసం నావద్ద వుంది” .
    ఈ వ్యాసము, మరి కొన్ని వివరాలు పై వ్యాసానుబంధానికి జత చేయబడినదని పాఠకులకు తెలియజేస్తున్నాము. విధేయుడు – మోహన