పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. తెలుగు నిఘంటువు గురించి… గురించి Vadapalli SeshaTalpaSayee అభిప్రాయం:

    05/22/2011 12:31 am

    FYI –
    ఆంధ్రభారతి నిఘంటుశోధనకు క్రింది మూడు నిఘంటువులను జతచేశాము.
    1. శ్రీహరి నిఘంటువు (శ్రీ రవ్వా శ్రీహరి)
    2. శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
    3. శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు

    వాడపల్లి శేషతల్పశాయి.

  2. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి మోహన అభిప్రాయం:

    05/20/2011 6:35 pm

    వివేకానందుని గొంతుకగా చెలామణి అయ్యేది అతని ప్రసంగాన్ని మరొకరు మళ్లీ యిచ్చినది. శ్రీరామకృష్ణ మఠము వాళ్లు తమ వద్ద అలాటి ధ్వని ముద్రికలు లేవని తెలిపియున్నారు. విధేయుడు – మోహన

  3. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Dr.Sudhakar అభిప్రాయం:

    05/19/2011 11:28 am

    Re: Swami Vivekananda’s speech in his ‘ Original Voice’ on ‘ you tube’.

    So far, I am under the impression that Swami Vivekananda’s speech was his original voice. ( We all know gramophone was invented in 1850’s. May be gramophone recording of Swami’s speech could be the source?! ) I tried to search on internet to know the veracity of the ‘speech’ online.
    I looked up in the Internetarchivedotcom. But nothing was mentioned about the source of the recording. Could any one help solve this issue?

    Sudhakar

  4. ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం: రెండో సారి! గురించి madhavi indraganti అభిప్రాయం:

    05/18/2011 7:18 am

    మీ వ్యాసము లో ప్రసావించిన విషయం చాలా ముఖ్యమైనదే. స్కోపస్ (Sciverse Scopus), సైన్స్ డైర క్ట్ (ScienceDirect) లాంటి వెబ్ సైట్లు ఏ కొద్ది మందికో తప్ప భారతీయ పాఠకులందరికీ అందని మామిడి పళ్ళే. ఇలాంటి జర్నల్సూ సామాన్యభారతీయ పరిశోధకులకి అందుబాటు లోకి తేగలిగితే మన దేశంలో శాస్త్ర పరిశోధన ప్రమాణాలు గణనీయంగా పెరిగే అవకాశం వుంది.

  5. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి koccherlakOTa baaparaavu అభిప్రాయం:

    05/17/2011 2:26 am

    మీరు అంటున్న సాహిత్యం నుంచి జీవనవిధాన్ని కనుగొనడం అన్నదాన్ని గురించి కీ.శే సురవరం ప్రతాపరెడ్డి గారు కృషి చేసారు. చూ. వారి ఆంధ్రుల సాంఘిక చరిత్ర (ఆంధ్ర సారస్వత పరిషత్తు, 1950).

    మీరన్న ఆముక్త మాల్యద పునర్ముద్రిత ప్రతి నేను హైదరాబదులో విశాలంధ్ర వారి వద్ద సునాయసంగా 2003 లో కాబోలు, పొందగలిగాను.

  6. పలుకుబడి: సంఖ్యా పదాలు – 1 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    05/16/2011 10:13 am

    చంద్రమోహన్ గారు:

    1. తమిళంలో విశేషణంగా వాడేది నేను రెండో ధాతువుగా వివరించిన ఒర్/ఓర్; ఒఱ్/ఓఱ్ కాదు.
    2. నాగమురళి గారు వివరించినట్టు టముకు, డప్పు, ఠవళించు, ఠేవ వంటివి ధ్వన్యనుకరణాలుగానో, వర్ణవ్యత్యయంగానో వివరించవచ్చు. దీని గురించి వివరంగా ఇంకో వ్యాసభాగంలో చర్చిద్దాం.

    శ్రీనివాస్ గారు:

    ఆయిరం, సావిరం రెండూ సంస్కృత తద్భవాలే. సహస్ర పదం ప్రాకృతం లో సాయిరంగా, ఆపై కన్నడ, తమిళాలలో సావిర గానూ, ఆయిరంగానూ మార్పు చెందింది.

  7. పలుకుబడి: సంఖ్యా పదాలు – 1 గురించి SrInivas Vuruputuri అభిప్రాయం:

    05/16/2011 8:28 am

    వెయ్యికి ఒక్క తెలుగులో మాత్రమే ద్రావిడ పదం కనిపిస్తుంది.

    ఆయిరమ్ అనే మాట ఉంది కదా తమిళంలో. కన్నడంలో సావిర అనే మాట ఉంది కదా? ఇవి ద్రావిడ పదాలు కావా?

  8. రాగలహరి: కల్యాణి గురించి Sireesha అభిప్రాయం:

    05/16/2011 7:36 am

    లక్ష్మన్న గారు,
    మీకు నా హృదయపూర్వక నమస్కారములు. హంసధ్వని రాగం పై వ్యాసం జతపరచమని కోరుకుంటున్నాను.

  9. పలుకుబడి: సంఖ్యా పదాలు – 1 గురించి nagamurali అభిప్రాయం:

    05/16/2011 6:19 am

    చంద్రమోహన్ గారూ,
    మూర్ధన్యాక్షరాలు తెలుగులో ప్రథమాక్షరాలుగా రావని వ్యాసకర్త అనలేదు. ఆయన అన్నమాట ఇదీ –
    >> ద్రావిడ భాషలలో మూర్ధన్యాక్షరాలు (ట,ఠ, డ, ఢ, ణ, ళ, ೞ లు), ర-ఱ-లలు ప్రథమాక్షరంగా ఉండడానికి వీలులేదు.
    >> అయితే, తెలుగు-కుయిలలో మాత్రం పై అక్షరాలు ప్రథమాక్షరంగా కనిపించే పదాలు కోకొల్లలు.

  10. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి SHANKAR.S అభిప్రాయం:

    05/16/2011 2:17 am

    జరుక్ శాస్త్రి గారి గొంతు వినిపించినందుకు మీకు బోలెడన్ని ధన్యవాదాలు. వీలయితే ఆయన ఫోటో కూడా సంపాదించగలరా?