రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

పసుపుకాంతి

రచన: బివివి ప్రసాద్
జులై 2014

ఈ పసుపురంగు పూలని చూస్తున్నపుడు
ప్రపంచం కాసేపు మాయమౌతుంది
పుట్టాక మొదటిసారే ఈ రంగుని చూసినట్టు
పసుపుకాంతిలోకి ప్రవేశిస్తాను

‘నువు ప్రపంచంలోకి ఎందుకు వచ్చావో
ఎందుకు గొడవపడతావు
ఇక్కడ నువు చూసేందుకు నేనున్నాను

నదిలోకి పడవ జారినట్టు
ఎక్కడి కిరణమో నీవరకూ, నావరకూ వాలినట్టు
ఫలం నాలుకపై రుచిలా వికసించినట్టు
నాలోకి జారిపో, వాలిపో, వికసించు

ఈ వివశత్వానికి ముందు

నువ్వెవరో, నేనేమిటో ఎందుకు చింతిస్తావు
ఈ రససంయోగం తరువాత
ఏం కావటంలోకి విడిపోతామో, ప్రయాణిస్తామో ఊహిస్తావు

ఈ క్షణంలో మనం ఒకటి కావటంలోనే
పురాతనకాలాల విశ్రాంతి కొలువు తీరింది
ఈ విశ్రాంతిలోనే సమస్తసృష్టీ
నదిలో ప్రతిఫలించే ఆకాశంలా తేలుతూ వుంది’

పసుపుకాంతీ, నేనూ ఒకటైన క్షణాలలో
నక్షత్రాలు నా ప్రక్కగా వెళ్ళిపోతూవుండటం గమనించాను

ఒక గాఢమైన నిశ్శబ్దం
‘ఏదీ లేదు, ఊరుకో’ అంటూ వుండటం
నేను చివరిసారి విన్నాను.

    
   

3అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    avinEni bhAskar/అవినేని భాస్కర్ July 1, 2014 9:03 am

    చిక్కటి తత్వాన్ని అద్భుతంగా రాశారు కవిగారూ. అభినందనలు.

  2. 2
    బివివి ప్రసాద్ July 17, 2014 1:51 am

    ధన్యవాదాలు భాస్కర్ గారూ..

  3. 3
    రాధ మండువ July 31, 2014 5:16 am

    ప్రసాద్ గారూ, “ఏమీ లేదు ఊరుకో” అనే మాట చివరి సారి వినడం అనేది (ధ్యానంలో) అనుభవంలోకి వస్తే… ఆహా!

    చాలా బాగా రాశారు. అభినందనలు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • నువు కూడా
  • మలిసంధ్యవేళ
  • ఒక మధ్యాహ్నం
  • ఇంతేనా
  • అలా ఎలా

ఇటువంటివే…

  1. భావించేవరకూ…
  2. నాన్నా తెలుసా
  3. సుగమం
  4. ఎడబాటు
  5. జ్ఞాపకం

జులై 2014 సంచికలో ...

  • అక్షరమాలా పద్యములు
  • అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ప్లాస్టిక్ బ్యాగులు
  • అమ్మా కనకమ్మా
  • ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!
  • ఈమాట జులై 2014 సంచికకు స్వాగతం!
  • ఒక శతాబ్దకాలంలో భూపరిణామక్రమం: భూచక్రం
  • కాలం విలవ తెలీదు
  • కొండదారిలో!
  • కోనసీమ కథలు: కాటికాడ రుణం
  • ఛందం© – తెలుగు ఛందస్సు సాఫ్ట్‌వేర్
  • నాకు నచ్చిన పద్యం: అలముకొన్న అదృశ్యాంజనం
  • నేపథ్య సంగీతం
  • పసుపుకాంతి
  • బిల్హణీయము
  • భావించేవరకూ…
  • మనభాష – మనపద్యం
  • మాధవపెద్ది సత్యం: ప్రత్యేక జనరంజని మరియు లలితగీతాలు
  • మూడు ప్రశ్నలు
  • శార్దూలవిక్రీడిత వృత్తము
  • సమస్త సిద్ధాంతం అవసరమా?
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నేపథ్య సంగీతం
కొండదారిలో!

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.