రాజా! నువ్వు ఇంత కష్టపడటం వెనక నీ ఉద్దేశం తెలియకపోవటానికి, నేనేమీ రాజకీయనాయకుల ఉపన్యాసాలు నమ్మి ఓటు వేసే ప్రజల్లో ఒకడ్ని అనుకోకు. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో అలాంటి వాళ్ళని ఎలా గద్దె దింపాలో తెలిసిన ఓటర్లలాంటివాడిని నేను. నీ పన్నాగాన్ని తిప్పికొట్టటానికి ఓ కథ వినిపిస్తాను. నేనో సూర్యతేజాన్ని అనుకుని, నన్ను నీ చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకుండా కారును జాగ్రత్తగా నడుపు.
టి. చంద్రశేఖర రెడ్డి
- పూర్తిపేరు
- తల్లపరెడ్డి చంద్రశేఖర రెడ్డి
- సొంత ఊరు
- వైరా, ఖమ్మం జిల్లా
- ప్రస్తుత నివాసం
- వైరా
జీవిత విశేషాలు
ఖమ్మం జిల్లాలోని వైరాలో జన్మించిన చంద్రశేఖరరెడ్డి ఉద్యోగవిరమణానంతరం వైరాలోనే విశ్రాంతజీవనం గడుపుతున్నారు. పుస్తక పఠనం, చిత్రలేఖనం, సంగీత శ్రవణం ఆయన అభిరుచులు.