వేంపల్లె షరీఫ్
సొంత ఊరు:
వేంపల్లె, కడపజిల్లా
వేంపల్లె, కడపజిల్లా
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
హైదరాబాద్
వృత్తి:
సీనియర్ జర్నలిస్టు, న్యూస్ ప్రజెంటర్
సీనియర్ జర్నలిస్టు, న్యూస్ ప్రజెంటర్
జీవిత విశేషాలు
తొలి కథ “జీపొచ్చింది” 2003లో ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. “జుమ్మా”, “టోపీ జబ్బార్”, “చారల పిల్లి”, “తియ్యని చదువు” కథా సంపుటాలు వెలువరించారు. 2012లో “జుమ్మా” కథా సంపుటికి కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కారం పొందారు. ఈయన కథలు అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి. “యువ అండర్ ఫార్టీ”, “కథా మినార్”, “చోంగా రోటీ” కథా సంపుటాలకు సంపాదకత్వం వ్యవహరించారు. జర్నలిస్టుగా వివిధ పత్రికలు, టీవీ చానల్స్ లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ తరపున వెలువడ్డ బాలికల ద్వైమాస పత్రిక “కస్తూరి” ఐదేళ్లపాటు ఎడిటర్ గా వ్యవహరించారు.