తక్కాళి శివశంకర పిళ్ళై
జీవిత విశేషాలు
తన జన్మస్థలం పేరు మీద తకళిగా ప్రసిద్ధి చెందిన తక్కాళి శివశంకర పిళ్ళై (1912 – 1999) మలయాళ సాహిత్యానికి చెందిన రచయిత. అణగారిన వర్గాల జీవితాలపై దృష్టి సారిస్తూ 30కి పైగా నవలలు, నవలికలు, 600కి పైగా కథానికలు రాశారు. కాయర్ (కొబ్బరి పీచు, 1978), చెమ్మీన్ (రొయ్యలు, 1956) వంటి తన రచనలకు ప్రసిద్ధి చెందిన పిళ్ళై, పద్మభూషణ్‌ను అందుకున్నారు. 1984లో కాయర్ నవలకు గాను భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నారు.