కె. ఎన్. వై. పతంజలి


సొంత ఊరు:
అలమండ, విజయనగరం జిల్లా
ప్రస్తుత నివాసం:
వృత్తి:
పాత్రికేయుడు, రచయిత
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, ఆయుర్వేద వైద్యుడు కె. ఎన్. వై. పతంజలి (1952-2009) గారిది అనన్య సామాన్యమైన రచనా ప్రతిభ. 1975 నుంచీ ఈనాడు పత్రికలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ఖాకీవనం, పెంపుడు జంతువులు నవలలు రాశారు. రావిశాస్త్రి రచనా పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం, కృష్ణవంశీ ‘సింధూరం’ సినిమాకు ఉత్తమ మాటల రచయితగా బంగారు నంది అవార్డు అందుకున్నారు.


 

రాజు-మహిషిలోని లంబాచోడా ప్రసాద్ తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువుకు పరిగెత్తిన రాత్రి కురిసిన గాలీ వర్షాన్ని నేను ఎన్నడూ మరచిపోలేను. ఎక్కడో లాటిన్ అమెరికాలో ఎడతెరిపి లేకుండా కొన్ని వందల రోజులు కురిసిన వర్షాన్ని నేను చూడలేదుగానీ దానిని గార్షియా గాబ్రియెల్ మార్క్వెజ్ వర్ణించాడు. అందులో నేను దర్శించిన, చూచిన, తడిచి ముద్దయిన ఆ నా చూడని వర్షాన్ని కూడా నేను మరువలేను.