కవన శర్మ


సొంత ఊరు:
విశాఖపట్నం
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

కవనశర్మ (1939 – 2018) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో ఆచార్యులుగా పనిచేసి ఉపన్యాసకులుగా అనేక దేశాలు సందర్శించారు. తెలుగులో మంచి కథకుడిగా, వ్యాసకర్తగా పేరు సంపాదించుకున్నారు. రచన (మాస పత్రిక) సలహాదారులలో ఒకరు. కవనశర్మ కథలు, సైన్సు నడచిన బాట, వ్యంగ్యకవనాలు, పరిధి ఉత్కృష్టమైనవి. కారామాస్టారు శ్రీకాకుళం లో ఏర్పరచిన ”కధానిలయం” కు శర్మగారు సలహాదారుగా ఉండేవారు.


 

మనం అంటున్నావ్. మనం అంటే ఎవరు? నువ్వూ, నేనూ మన పిల్లలూనా? మన పిల్లలు పెద్దవాళ్ళయ్యాక, వాళ్ళకి తల్లిదండ్రులమైన మనల్ని వాళ్ళ లిస్టు లోంచి తీసేస్తారు. కనుక మన లిస్టులో వాళ్ళని వేసుకున్నా వాళ్ళు మనల్ని వేసుకోరు. ఇంక మిగిలింది నువ్వూ నేనూ. ఇప్పుడు ఆలోచిద్దాం. నన్ను కన్న తల్లిదండ్రులు నా కుటుంబ పరిధిలోకి రారు. నేను కన్న పిల్లలు నన్ను వాళ్ళ పరిధిలోకి రానీయరు. ఇంక కేవలం నువ్వు మిగిలావ్.

శ్రీనివాసరావు కాకుండా ఆరోజు మరో ఇద్దరు బాగ్దాద్ నుంచి అదే విమానంలో బొంబాయి వెళ్తున్నారు. అందులో శివస్వామి తెలుగువాడే. “కల్సే వెళ్దాం” అన్నాడు శ్రీనివాసరావుతో. శ్రీనివాసరావు “మనం కల్సిరాలేదు. కల్సి వెళ్ళడం ఎందుకు?” అన్నాడు. శివస్వామి అసలే నాస్తికుడు. ఇనుముతో ఉన్న నిప్పుకి సమ్మెట పోట్లు తప్పవు. అతని దురదృష్టం తనకి అంటుకొంటుంది అనుకొన్నాడు శ్రీనివాసరావు.