వాసిరెడ్డి నవీన్‌


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

 

ఒక్కమాటలో చెప్పాలంటే, వేలూరి కథలు అమెరికా తెలుగువాళ్ల వ్యవహారశైలిపై సుతిమెత్తగా చురకలంటించిన వ్యంగ్య కథలు. కథని, పాత్రలను నిర్మించటంలో, నడిపించటంలో ఆయనకొక ప్రత్యేక పద్ధతి ఉంది. అది అమెరికాలోని ఇతర తెలుగు రచయితల శైలికి భిన్నమైంది. హాస్య, వ్యంగ్య ధోరణిలో కథలు నడిపినా, వాటిల్లో ఆవేదన, ఆవేశం ఉన్నాయి. అవి పాఠకులను అలరిస్తూనే ఆలోచింపజేస్తాయి.

సమాజాన్ని, చరిత్రను, చరిత్రగతిని సీరియస్‌గా తీసుకుని రాసిన చంద్రశేఖరరావు కథల గురించి తెలుగు సాహిత్యలోకం చర్చించాల్సినంతగా చర్చించకపోవడం, దాదాపు మౌనంగా ఉండడం, అర్థంకాని కథలనే వ్యాఖ్యల మాటున దాక్కోవడం చంద్రశేఖరరావు కంటే తెలుగు కథకు జరిగిన నష్టంగానే భావించాలి. ఆయన రచనలపై చెప్పుకోదగ్గ వ్యాసాలేవీ ఈనాటికీ రాలేదు.