బ్రిడ్జి దగ్గర కాలవలో వేటకెళ్ళొచ్చిన పడవలు లంగరులేసి వున్నాయి. వెనక్కి తిరిగి మసీదు సెంటరుకొచ్చా. కోటయ్య కాజాల షాపు దగ్గర చాలా రష్‌గా వుంది. ఫేమస్ బేకరీకెళ్ళాను. లోనికి పోవడానికే ఖాళీ లేనట్టు కిక్కిరిసి పోయివుంది. అర్ధగంట ఆగితే గానీ లోనికి పోవడానికి కుదర్లేదు. వేలం వెర్రిగా కేకులు తీసుకుపోతున్నారు జనం. పెద్ద ప్లమ్ కేక్ తీసుకున్నాను. దాని పైన అందంగా ‘హేపీ న్యూ యియర్’ అని రాసి ఇచ్చాడు.
నక్కా విజయరామరాజు
జీవిత విశేషాలు
డా. నక్కా విజయరామరాజు సుప్రసిద్ధ కథా రచయిత. గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి. తనదైన రచనా శైలితో గ్రామీణ జీవితాన్ని, సమాజంలోని వాస్తవికతను ప్రతిబింబిస్తూ ఎన్నో అద్భుతమైన కథలను అందించారు.ఆయన ప్రముఖ రచనలు ‘భట్టిప్రోలు కథలు’, ‘నాగమ్మ’, ‘కథా స్రవంతి’. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల జీవన విధానాన్ని, మట్టి మనుషుల భాషను, సంస్కృతిని తన కథల ద్వారా అక్షరీకరించారు.