దేవిప్రియ
జీవిత విశేషాలు
ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు దేవిప్రియ (1949-2020). వీరు రచించిన ‘గాలిరంగు’ కవిత్వానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. కాలేజీ రోజుల్లోనే పద్యాలు, గేయాలు వ్రాశారు. పాత్రికేయుడిగా ప్రజావాహిని, నిర్మల, ప్రజాతంత్ర, జ్యోతి, మనోరమ మొదలైన పత్రికలలోనూ, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం, హైదరాబాద్ మిర్రర్ దినపత్రికలలోనూ పనిచేశారు. వ్యంగ్య, విమర్శనాత్మకమైన ఇతని ‘సమాజానందస్వామి’, ‘రన్నింగ్ కామెంటరీ’ కార్టూన్ కవిత్వం ద్వారా తెలుగు పత్రికారంగంలో కొత్త ఒరవడిని సృష్టించాడు. సినిమా రంగంపై సాధికారమైన వ్యాసాలు, దాసి, రంగులకల మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు వ్రాశాడు.