1990 తర్వాత తెలుగు సాహిత్యధోరణులు వికేంద్రీకృతమయ్యాయి. దానితో చాల ‘మంచి’ రచనలు సైతం తెలియకుండ పోయాయి. అలాంటి వాటిని నేను ఈ వ్యాసాల ద్వార గమనించగలిగాను. అట్లే సినిమాలకు సంబంధించి, గ్రామపునర్నిర్మాణానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలు తెలుసుకొనే అవకాశం నాకు కలిగింది.
డి. ఎస్. ఎన్. మూర్తి
బాపట్ల, గుంటూరు జిల్లా
నాటకరంగ నటుడు, దర్శకుడు, అభినయ అధ్యాపకుడు
జీవిత విశేషాలు
విదేశీ నాటక శైలులను తెలుగు నాటకరంగానికి పరిచయం చేసిన వారిలో డి.ఎస్.ఎన్. మూర్తి ప్రథములు.1880 నుండి 1980 వరకు తెలుగు నాటకరంగంలో వచ్చిన పరిణామ దశలను వివరిస్తూ ‘నూరేళ్ళ తెలుగు నాటకం- రంగస్థలం’ అనే పేరుతో డాక్యుమొంటరీలో రంగస్థల నాటకాన్ని ప్రదర్శంపజేశారు. రాజకీయ వ్యవస్థను చూపిస్తూ, కూచిపూడి నృత్యాన్ని అందులో పొందుపరిచి, ఇంద్రసిహాసనం పేరుతో ప్రదర్శించిన ఒపేరాకు దర్శకత్వం వహించి విలక్షణ దర్శకునిగా పేరు తెచ్చుకున్నారు. ఎలెక్స్ హేలీ రాసిన రూట్స్, కాళీపట్నం రామారావు రాసిన యజ్ఞం, చావు కథల ఆధారంగా వచ్చిన నాటికలకు దర్శకత్వం వహించారు. గుండ్రంగా ఉన్న ప్రాంతంలో 5 వేదికలను ఏర్పరచి, ప్రేక్షకులు చుట్టూ ఉండి ప్రదర్శనను చూసేవిధంగా చావు నాటికు ప్రదర్శించారు. వీరు రచించిన మహానగరం వీధి నాటకం నగరవాసుల బాధల్ని, గాథల్ని వివరిస్తుంది.