బైరాగిపై బెంగాలీ కవి జీవనానంద్ దాస్ ప్రభావం ఉందని అంటారు. ప్రభావం అన్నది చాలా పెద్ద మాట. కానీ, స్వంత గొంతుక బైరాగికి ఉంది. ఆయన బాణీ ఎవరినీ అనుకరించినదీ, అనుసరించినదీ కాదని ఆయన కవిత్వంతో పరిచయం ఉన్నవారికి ఇట్టే తెలుస్తుంది.
టేకుమళ్ళ వెంకటప్పయ్య
జీవిత విశేషాలు
డాక్టర్ టేకుమళ్ళ వెంకటప్పయ్య కవి, రచయిత, విమర్శకులు. ఎకౌంట్స్ మేనేజరుగా పనిచేస్తూనే ఎం.కామ్, పి.హెచ్డిలు చేసారు. మహాసేనాని గోపన్న అనే కాల్పనిక చారిత్రక గ్రంథం రాసారు. పి.హెచ్డిలో భాగంగా డా.అద్దేపల్లి రామమోహనరావు కవితా ప్రస్థానం అనే గ్రంథాన్ని ప్రచురించారు. ఆధునిక ఇతివృత్తాలతో సామాజిక సమస్యలు, ధర్మదత్తోదయం అనే రచనలు చేసారు. అష్టవిధ నాయికలు, హరిసంకీర్తనాచార్య అన్నమయ్య అనే సంకలనాలకు సంపాదకత్వం చేసారు. మా జొన్నవాడ కథలు అనే శీర్షిక కింద పలు కథానికలు రాసారు.