గురజాడ అప్పారావు


సొంత ఊరు:
ఎలమంచిలి
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ప్రముఖ రచయిత, *కవి శేఖర* గురజాడ అప్పారావు (1862-1915) తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. హేతువాది. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. ఆయన ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచించారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు.


 

వాడుక భాషను కులట అని మర్యాదచేసే పండితులు దానిని దూరముగా విసర్జించక యేల వాడుక చేతురో? వారు ‘యాంటీనాచ్’ కారు గాబోలును.