కె. వరలక్ష్మి


సొంత ఊరు:
జగ్గంపేట
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ప్రఖ్యాత రచయిత్రి కె.వరలక్ష్మిగారి కథలు ప్రధానంగా తను నివసిస్తోన్న మెట్ట ప్రాంతానికి చెందిన స్త్రీల, బడుగు జీవులకు చెందిన కథలు. కథలతోబాటు ఆవిడ కవిత్వం వ్రాసారు. రేడియోనాటికలు, వ్యాసాలు, నవలికలు వ్రాసారు. శ్రీ శ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కందుకూరి రాజ్యలక్ష్మి పురస్కారాలతో సహా సుశీలా నారాయణ రెడ్డి పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం వంటి అనేకం వీరు అందుకున్నారు.


 

ఉదయం ఏడు గంటలవేళ. చిరుచలిగా ఉంది. సంత ఇంకా ప్రారంభం కాలేదు. దుకాణాలవాళ్ళు కందరు బస్తీలనుంచి మెటాడోర్లలో వచ్చి దిగుతున్నారు. చింతచెట్ల కింద ఎవరికి కేటాయించిన స్థలంలో వాళ్ళు చాపలు పరుచుకుని, వాటిమీద తమ సరుకుల మూటలు పెట్టి, అక్కడికి కాస్త ఎడంగా ఉన్న రంగూనోడి టీకొట్టుకి వెళ్ళి వేడివేడి టీ నీళ్ళతో గొంతు తడుపుకని వస్తున్నారు.

కాంపౌండు వాల్‌ పక్కన వేపచెట్టు విరగబూసింది. ఫాల్గుణ మాసపు సాయంకాలం నులివెచ్చని గాలి చిరు చేదు సుగంధాన్ని కిటికీ లోంచి గదిలోకి మోసుకొస్తోంది. కిటికీకి […]