ఎన్. గోపి


సొంత ఊరు:
భువనగిరి
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
వృత్తి:
అధ్యాపకులు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ఆచార్య ఎన్. గోపి తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి అధ్యక్షుడిగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపసంచాలకునిగా పని చేశారు. నాలుగు పంక్తుల్లో మొత్తం 20 నుండి 25 అక్షరాలతో సాగే నానీలు అనే సూక్ష్మ కవితా పద్ధతిని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టారు. అధ్యాపక వృత్తిలో చాలా ఏళ్లు పనిచేశాడు. ఇతని భార్య ఎన్.అరుణ కుడా పేరు పొందిన కవయిత్రి. పదవీ విరమణ చేసేటప్పడికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలో డీన్ గా పనిచేశాడు. 11 కవితా సంకలనాలతో సహా దాదాపు ముప్ఫై పుస్తకాలు ప్రచురించారు.


 
  1. తెలుగు పరిశోధనపై వెల్చేరు నారాయణరావుతో ఇంటర్‌వ్యూ
  2. మార్చి 2017 » ముఖాముఖి