మీ అమ్మాయి, పెద్దది కాబోలు, బిందెతో నీళ్ళు తీసుకొస్తోంది. వెనకాల అబ్బాయి రాగిచెంబుతో నీళ్ళు తెస్తున్నాడు. వీళ్ళ వెనుక మీ చంటిది ఎఱ్ఱటి లక్క పిడత నిండా నీళ్ళుపోసి తలమీద పెట్టుకుని రెండు చేతులూ పైకెత్తి అతి పొందికగా, ఒక్క చుక్క నీళ్ళు పడిపోకుండా తీసుకొస్తోంది. నేను పలకరిస్తే ఆ ఆరిందా అంటూందీ… ‘బాంది… ఎవలింట్లో నీల్లు వాల్లు తెచ్చుకోలూ?’