అరిపిరాల సత్యప్రసాద్


సొంత ఊరు:
గుంటూరు
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

ఒక పెద్ద ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్ లో వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్న అరిపిరాల సత్యప్రసాద్ రచయిత, ముఖ్యంగా హాస్య కథలు, ఆర్థిక విషయాలపై కథల రూపంలో రచనలు చేసినవారు. ఆయన “రూపాయి చెప్పిన భేతాళ కథలు” వంటి పుస్తకాలు ప్రచురించారు, ఇవి ఆర్థిక అవగాహనను కథల ద్వారా వివరిస్తాయి; ఈమాట, వాకిలి వంటి సాహిత్య వేదికలలో ఆయన రచనలు ప్రచురించబడ్డాయి.


 

ఇంతలో ఏదో జ్ఞాపకాల వాసన. ఉడకబెట్టిన శెనక్కాయల వాసన. శెనక్కాయలమ్మే నడివయసామె వచ్చింది. బుట్ట దించి నా ముందు పెట్టింది. చూద్దును కదా బుట్టనిండా నా జ్ఞాపకాలే! వాడు, శెనక్కాయలమ్మేదానిలాగా… అవును వాడే. ఆమె చీర గుండెల మీద నుంచి జారిపోయి ఇంకేవో కొత్త జ్ఞాపకాలను నా ముందు పరిచింది.