పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. గడి-నుడి 5 సమాధానాలు గురించి Rama Devi Pula అభిప్రాయం:

    04/01/2017 8:12 am

    సర్,
    నాది కూడ ఒక్క తప్పు మాత్రమే కలదు. అదీ 28 అద్దం. దయచేసి ఒకసారి పరిశీలించ మనవి.

    [తప్పు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. మీ పేరు కూడా జతచేశాం. — సం.]

  2. వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 1. ఒక ధీర, ఇద్దరు అధీరులు గురించి తెలుగు వాడు అభిప్రాయం:

    03/31/2017 9:04 am

    ఈ పోలికల వల్ల ఏమిటండీ మీరు చెప్పదల్చుకున్నది? ఇది చూస్తే మోకాలికి బోడిగుండుకి సంబంధం పెట్టినట్టు ఉంది. అసలు ఇలా పోలికలు చూపించడం మొదలు పెడితే ఏ రెండు యాదృచ్ఛికమైన కధలో ఏరుకుని పోల్చవచ్చు.

    గాంధీగారికి ద్వారం వెంకట స్వామి నాయుడు గారికీ పోలిక చెప్పొరే అంటే గాంధీ గారెప్పుడూ నాన్ వాయలెన్సు, ద్వారం గారెప్పుడూ వయలిన్సు అన్నట్టు ఉంది (భ.రా.గో మాటల్లో). మాటల గారడీకి, నవ్వుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావు ఇలాంటివి.

    ఇలాంటివి తీరిక ఉండాలే గానీ వందల కొద్దీ రాయొచ్చు లైబ్రరీలోకెళ్ళి కళ్ళు ముసుకుని ఏ రెండు పుస్తకాలు తెచ్చినా సరే. ఎక్కడి విశ్వనాధ, ఎక్కడి సినిమా సరుకూ పోల్చడానికి? విశ్వనాథ గారి పుస్తకానికీ ఆయన వేయించిన నాటకాలకీ పోలిక పెట్టినా బావుండేది. నాకేం నచ్చలేదు.
    ​

  3. వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 1. ఒక ధీర, ఇద్దరు అధీరులు గురించి kalluri bhaskaram అభిప్రాయం:

    03/27/2017 9:18 pm

    ధన్యవాదాలు మంజరి లక్ష్మిగారూ…మీ స్పందన చూసాక తిరిగి నా పాత పాఠకమిత్రుల మధ్యకు వచ్చినట్టు అనిపించి చాలా సంతోషం కలిగింది.

  4. వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 1. ఒక ధీర, ఇద్దరు అధీరులు గురించి manjari lakshmi అభిప్రాయం:

    03/27/2017 5:04 am

    సారంగ లో మీది ఆపేస్తె బాధ పడ్దాను భాస్కరం గారు. మళ్ళా ఇక్కడ మీ సశేష వ్యాసం చదివి చాలా ఆనందం వేసింది. మీరు రెండు నవలలను పోలుస్తున్న విధానం చాలా బాగుంది.

  5. విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు గురించి ns murty అభిప్రాయం:

    03/23/2017 1:07 pm

    మొదటిసారి విశ్వనాథవారి గొంతులో ఈ కిన్నెరసాని పాటను, వారు పరమపదించిన రోజు ఆకాశవాణి విజయవాడకేంద్రం వారు ప్రసారం చేసినప్పుడు విన్నాను. Amazing rendering.

  6. అతిథి గురించి Kleenpersizztutor అభిప్రాయం:

    03/23/2017 6:21 am

    చాలా బాగుంది కథ.

  7. My Teacher గురించి Nagesh అభిప్రాయం:

    03/21/2017 8:49 am

    Gollapudi Maruthi Rao is a multi talented and multi faceted personality. He deserves all awards and certificates, exist in the field of literature and arts. Great salute to him.

  8. సంగీతంతో కుస్తీ గురించి N krishna అభిప్రాయం:

    03/20/2017 10:51 pm

    తెలుగు పాటలు హార్మోనియంపై ఎలా వాయిస్తారో తెలపండి. పాటలకు సరిగమలు అల్లడం అవి కీబోర్డ్‌లో ఆ పాట ఎక్కడనుండి స్టార్ట్ అవుతుందో తెలపండి.

  9. అతిథి గురించి సుందరం అభిప్రాయం:

    03/20/2017 7:05 am

    చాలా బాగుంది శర్మ గారూ, ఒక చిన్న సంఘటన కొన్ని జీవితాల్లో ఎలాంటి పెనుమార్పులను తీసుకొనివస్తుందో అత్యంత సహజంగా చిత్రీకరించారు.మానవీయవిలువల “విలువ” తెలిపేలా ఉంది. ఊహించిన ముగింపైనా మనసుకు హాయినిచ్చింది.

  10. సంగీత కళా రహస్య నిధి భట్టుమూర్తి గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    03/18/2017 6:38 am

    మాన్యులు శ్రీ వాడపల్లి శేషతల్పశాయి గారికి
    నమస్కారములతో,

    కోరిన వెంటనే ఈ లంకెను అందజేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే దీనిని డౌన్ లోడ్ చేసికొన్నాను.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు