పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి తః తః అభిప్రాయం:

    04/08/2017 7:23 pm

    శ్రీ మురళీధరరావుగారూ!

    “జాగ్రత్తగా చూస్తే కఠినమైన చంద్రకాంత శిల నిజంగా కరగటం జరగలేదు” కవి సమయాలను జగ్రత్తగా చూడకూడదు. ‘వారక ఈశ్వరుండు తలపైన… చంద్ర కాంతముల్ నీరగునే…’లో వారిజవైరి ఏమై పోవాలి?

    నమస్కారాలతో
    తః తః

  2. మనుషులెందుమూలంగా జీవిస్తారు? గురించి Sujata అభిప్రాయం:

    04/08/2017 3:05 pm

    Leo Tolstoy, Stories and Fablesలో ఈ కధ 2007లో చదివాను. మళ్లీ పదేళ్ల తరవాత తెలుగులో చదవగలగడం నా అదృష్టం. అద్భుతమైన కధ. చాలా కుదురుగా అనువదించారు. కళ్లలో నీరు తిరక్కుండా ముగించడం కష్టం.

  3. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి తః తః అభిప్రాయం:

    04/08/2017 2:38 pm

    శ్రీ మురళీధరరావుగారూ! సదరు పద్యమూ శ్రీకామేశ్వరరావు గారి వ్యాఖ్యానమూ చదివి “సమకాలము వారలు మెచ్చరే గదా” అన్న మాట, ఆపైన మూడు పాదాల్లో చెప్పిన దానికి ఏమాత్రం పొసగదు అని అనుకుంటూ మీ అభిప్రాయం చూసిన నాకు వచ్చిన ధైర్యంతొ ఇలా రాస్తున్నాను:

    వేంకట కవి అబ్రాహ్మణుడు. అబ్రాహ్మణుడు వేదంతో సమానమైన మాటలు రాసినా బ్రాహ్మణులు మెచ్చరన్న విషయమే కవి చెప్పాలనుకున్నాడని తేలికగానే తెలుస్తున్నది. ఇది అలా ఉంచి, శ్రీ కామేశ్వరరావు గారన్న ‘స్పర్థ’లో ‘బ్రసన్నతయును సౌకుమార్యము’ ఇముడుతాయా? ‘మెచ్చుచు చంద్రుడు మిన్నునం బ్రసన్నతయును సౌకుమార్యము గనంబడ ఱాల్ గరగంగజేసె! ‘యీ గతి రచి/ చరి యించిరేని సమకాలము వారలు సౌఖ్యమౌ గదా!’ అని వేంకట కవి వ్రాసి యుండి యుంటే ఆయన చెప్పదలచుకున్న విషయం బాగా హత్తుకుని ఉండేది.

    నమస్కారాలతో
    తః తః

  4. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి P. Mohan అభిప్రాయం:

    04/08/2017 1:45 am

    Thanking you Srinivaasudu gaaru

  5. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి శ్రీనివాసుడు అభిప్రాయం:

    04/07/2017 8:54 pm

    పి. మోహన్ గారూ,
    “సారంగ” మూతబడిన తరువాత ఈ ఏప్రిల్ 6 నుండి క్రొత్త లంకెలో పాతవన్నీ లభ్యమవుతున్నాయి.
    ఆ లంకె http://saarangabooks.com/retired/

    అలాగే, “సారంగ” లో మీ రచనలన్నీ ఈ లంకెలో లభ్యం:
    Archives for పి. మోహన్

    ఇక మీరు పైన ఉదహరించిన వ్యాసం ఈ లంకెలో లభ్యం:
    రంగుల భోజనం…గొంతులో వీణలు!

    సందర్భం కాకపోయినా, ఈ సమయంలో తప్పితే నా ఉద్దేశాన్ని చెప్పడం సాధ్యంకాదు గనక మీకు చెబుతున్నాను. మీలాంటి రచయితలు పూనుకుని, బాధ్యతగా తీసుకుని, ఏకపక్ష వ్యాసాలను ఆ పత్రికలో పరిహరించబడేటట్లు గతంలోనే కృషిచేస్తే ఇప్పుడీ స్థితి వచ్చేది కాదు, అందరూ ఆ మహోన్నత ప్రయత్నానికి సహకరించేవారు. పత్రిక బాద్యత పాఠకులది, రచయితలది, అంతేగాని నిర్వాహకులది కాదని నా దృఢమైన నమ్మకం. అందుచేత, అది ఏమైనా తప్పులు చేస్తుంటే మనమందరం కూడా పూనుకోవాలని చెప్పడమే నా ఉద్దేశం.

  6. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    04/07/2017 11:25 am

    ఈ వ్యాఖ్యానమూ పద్యానికి మరింత వన్నెను తెచ్చింది.
    కావ్యప్రౌఢిని గుర్తించిన కవి అంతరంగాన్ని గమనించి పద్యం యొక్క అర్థగౌరవాన్ని, పంచభూతములను గుర్తుచేసే శబ్దచయనాన్ని కవి ఔచిత్యంతో చేసిన విధానాన్ని గమనించి పద్యం యొక్క శబ్దసౌందర్యాన్ని ప్రస్ఫుటం చేసి ఆనందం కలిగించారు. మురళీధరరావుగారికి వందనములు.

  7. బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్ గురించి పి.మోహన్‌ అభిప్రాయం:

    04/07/2017 9:43 am

    వేలూరి వెంకటేశ్వరరావు గారు, దామెర్ల బొమ్మలకు మీ వర్ణనలు చాలా బావున్నాయి. రామారావు బొమ్మపై కాదుగాని ఆయన భార్య సత్యవాణి వేసిన ఓ బొమ్మపై నేనూ ఇలాంటిదొకటి రాశాను. సెట్టిలక్ష్మీనరసింహం రవివర్మ పెయింటింగులపై రాసిన చిత్రమాలికలను సారంగ పత్రికలో పరిచయం చేశాను. ఇప్పుడు ఆ పత్రిక కనిపించడం లేదు. లింకు ఇద్దామంటే.

    పి. మోహన్‌

  8. మనోరమ గురించి Gorusu అభిప్రాయం:

    04/07/2017 5:05 am

    భాస్కరం గారూ , ధన్యవాదాలు.

    మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. వాచికంలో సినిమా, రేడియో ఎప్పుడూ ఉత్తర దక్షిణాలే. అయితే మహానటి సావిత్రి, గుమ్మడి, అల్లు రామలింగయ్య గార్లు సైతం రేడియోల్లొ నటించారని లోకానికి చెప్పడానికే ఈ ప్రసారం.
    సినిమా, రేడియో – ఈ రెండిటికీ మాడ్యులేషన్ లో కుదరదు. అంతెందుకూ రేడియోలో శారదా శ్రీనివాసన్ గారు ఒక హిమశిఖరం కదా – ఆమె “బంగారు కలలు” చిత్రం లో వహిదా రెహెమాన్ గారికి, “తోడు” (ఓల్గా గారి కథ) చిత్రంలో నటి గీత గారికీ డబ్బింగ్ చెప్పారు. అంతగా నప్పలేదని కొందరి అభిప్రాయం.

    అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా శారద గారితో కలిసి “పరితాపం” అనే నాటకం లో నటించారు. పి.వి. నరసింహారావు గారికి శారద గారి వాచికం అంటే చాలా ఇష్టం. రంగస్థల నటుల పద్యాల ముందు ఘంటసాల గారి పద్యాలు తేలిపోయినట్టు అంపించడం సబబే. మీరు ఆన్నట్టు ఎవరి శిక్షణ వాళ్ళదే.

    మీ స్పందనకు మారోమారు ధన్యవాదాలు.

  9. గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం గురించి సంస్కృతీ పరిరక్షకుడు అభిప్రాయం:

    04/06/2017 2:22 pm

    శ్రీ వేలూరి వారి సన్నిధికి,

    మీ వ్యాఖ్య కు సమాధానంగా ఈ విన్నపం.

    పోతన గారు తన భాగవతాన్ని ఆరంభిస్తూ – “పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుడట, నే పలికిన భవహరమగునట..” – ఇలా అన్నారని చదువుకున్నాం. తన నోట పలికించిన పలుకులు తనవి కావనీ, రామభద్రునివని ఆయన వినయంగా చెప్పుకున్నారు. ఆయన వాక్కులు కేవలం శుష్కశబ్దాలు కావు. వాటి వెనుక “భక్తి” అని, “ఆత్మార్పణమనీ”, “ప్రపన్నత” అనీ ఆయన తన పలుకులకు తాను ఇచ్చుకున్న ’విలువ’ అన్నవి ఉన్నై.

    శ్రీ లిడియా డేవిస్ అనే అద్భుత రచయిత్రి ఈ రచన ద్వారా పరిచయం కావడం ముదావహమే. కానీ దాని కోసం ఈ వ్యాసరచయిత పోతన ఆసరా తీసుకుంటున్నప్పుడు ఆ పోతన ఎందుకోసం తన శబ్దాలు పేర్చుకున్నాడో ఆ నేపథ్యానికి, ఆతని పలుకుల వెనుక ఉన్న భక్తి భావానికి విలువివ్వడం ఒక సంస్కారం. దానిని సంస్కృతీ పరిరక్షణ అనరనుకుంటాను. ఆయన ఈ రోజు మన మధ్య లేడు. కానీ ఆయన పద్యాలను కనీసం ఓ పదితరాల్లో అయినా అనేకమంది పిల్లలు కమ్మగా చదువుకుని మనసు నింపుకొని ఉంటారు. ఇప్పుడు ఇంగ్లీషు బలిసి, వెనక్కెళ్ళిపోయుండచ్చు గాక. అందుకోసమైనా కూసింత కృతజ్ఞత ఇవ్వచ్చు.

    బహుశా ఇంగ్లీషులో చెబితే మీ వంటి పెద్దలకు బాగా అర్థమవుతుందేమో, “If we are using the words of a poet for some purpose, – due credits must be given to the poet and the value behind his words. Is it a big/wrong ask?”

    పబ్లిక్ డొమైన్ లో ఉందని ఓ బస్ షెల్టర్ ను బెడ్ రూము గా, లేక బాత్ రూముగా వాడం కదండీ? అది ఎందుకోసం ఉద్దేశించిందో దానిని అలా ఉపయోగించటం చిన్నపాటి విచక్షణ. ఆ తర్కమే ఇక్కడాను. పెద్దలు ఆలోచించాలి.

    ఆ ఏముంది? Casual గా గూగుల్ బజారులో దొరికిన పద్యాన్ని రచనాశకలానికి వాడుకోరాదా ఏం? అంత రాద్దాంతమెందుకూ? అంటారా? Openness, Casualness అన్నవి మీ విలువలైతే భక్తి అనేది పోతన విలువ. ఆతని పద్యం గురించి రాసేప్పుడు, అతనెవరో తెలియాలి. తెలియకపోతే కనీసం గూగుల్ లో కొట్టి తెలుసుకోవచ్చు. లేదూ ఆయనకు/భక్తి అనే విషయానికి విలువ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆయన పద్యం వాడుకోవడం మానెయ్యవచ్చు. వేల సంఖ్యలో సినిమా పాటలు, చాటువులు, ప్రబంధకావ్యాల్లో నాయికా వర్ణనలు వీటిలో ఏ ఒక్కదాన్నైనా ఆ లిడియా డేవిస్ అనే అద్భుత రచయిత్రి గారి అనుపమాన రచనానువాద ప్రక్రియకు సలక్షణంగా ఎంచుకొని ఉండవచ్చు.

    పైగా ఆ “హెక్” ప్రత్యయాన్ని సరిగ్గా ఉపయోగించుకుని, సరైన సినిమా పాట వెతుక్కుని కూర్చుకుంటే – శబ్దచమత్కారాలకు, శబ్దంలో విరుపుల మధ్యలో ’హెక్’ నాదంతో పుట్టించే లయకూ చక్కని అవకాశమూ ఉంది.

    ఈ విషయాలు పై వ్యాసరచయిత్రికి తెలియలేదు. ఆమె తప్పేమీ లేదు. ఘనత వహించిన ఈమాట “ఎడిటర్” లకూ తెలియలేదు! అన్నేళ్ళు సంపాదకత్వం వహించిన మీ బోటి పెద్దలకు తట్టలేదు. కాబట్టలేదు. అది కాబట్టిన ఎవరో వ్యాఖ్య వ్రాస్తే వారిపై మీరు కోప్పడుతున్నారు! ఇదీ విడ్డూరమంటే!

    త్యాగరాజు కృతిని “పండు రీతి కొలువీయవయ్య రామా, తుండ విండి వాణి మొదలైన మదా
    దూల గొట్టి నెల గుల జేయు నిజ పండు రీతి…”

    ఇలా ఎవరైనా గాయకుడు తెలిసైనా, తెలియక అయినా పాడితే ఎవరో కనీసం కొందరు చెవులు మూసుకుంటారు. వారు సంస్కృతీ పరిరక్షకులే కానక్కర లేదండి.

    పౌరాణికాల్లో ’misuse’ చేశారు కాబట్టి it is licensed act అనడం పొసగని మాట.

    వ్యాఖ్యలు వ్రాసే వాళ్ళు బెదిరింపు ధోరణితో భయపెడుతున్నారని, Zealots అని అంటున్నారు. తెలుగు పత్రికలో మీ ఆంగ్ల వ్యాఖ్యలు చూస్తుంటేనూ, ఆంగ్ల రచయితలను సమర్థించే తీరును చూస్తుంటే – తెలుగులో మాట్లాడుకునే సాధారణమైన తెలుగువాడికి అంతకంటే ఎక్కువ భయమే వేస్తూంది.

    మీరు పెద్దలు, తెలిసిన వారు. ఓ మారు మా మొర లేదా కనీసం పోతన మొర ఆలకించండి. ఆయన మొర వినడానికి ’ఆపన్నప్రసన్నుండు’ కూడా లేడు. వేంకటేశ్వరులని పేరున్న మీరే వినాలి. ఆపై మీ ఇష్టం.

    ఈ వ్యాఖ్య కూడా తొలగించుకోవచ్చు. ఇబ్బంది లేదు. తొలగించడానికి అనువుగానే ఆ పేరును ఉపయోగించడం జరిగింది.

    [మీ వ్యాఖ్యను ఏం చేయచ్చో కూడా చెప్పిన మీ సూచనను ఇకనుంచీ పాటిస్తాం – సం.]

  10. నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! గురించి kalluri bhaskaram అభిప్రాయం:

    04/06/2017 7:25 am

    శ్రీ వేలూరి వెంకటేశ్వరరావుగారికి నమస్కారములతో.

    మీరు పొరబడలేదండీ. ఆంధ్రప్రభ దినపత్రిక ఆఫీసులో ఎడిటర్ శ్రీ విఠాల వాసుదేవ దీక్షితులుగారి దగ్గర మనం కలుసుకున్నాం. నాకు గుర్తున్నంతవరకు శ్రీ వెల్చేరు నారాయణరావుగారు, మీరు కలసి వచ్చారు. అప్పటి ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు కూడా ఉన్నారు. నేను దినపత్రిక ఉద్యోగిని. ఎప్పటి మాట! ’95-’96 అనుకుంటాను. ఇరవయ్యేళ్లు దాటిపోయాయి. మీ జ్ఞాపకశక్తి అద్భుతం.

    ప్రాక్పశ్చిమ సాహిత్యాల లోతులను తరచి చూడగల మీలాంటివారికి ‘వేయిపడగలు’-‘గాన్ విత్ ద విండ్’ లను పోల్చుతూ నేను రాస్తున్న వ్యాసాలు నచ్చడం నాకు ఎంతో సంతృప్తినీ, ఉత్సాహాన్నీ కలిగించే ఎరుక. నా ప్రయత్న సాఫల్యానికి పెద్ద భరోసా. మీకు కృతజ్ఞతలు.

    “Keep us educated” అనడం మాత్రం నాకు చాలా పెద్దమాటగా అనిపిస్తోందండీ. ఒక రచన గురించి నా మౌలిక భావన ఏమిటంటే, అది ప్రధానంగా రాస్తున్న ఆ రచయితను ఎడ్యుకేట్ చేసే వ్యాసంగం. ఇతరులను కూడా ఎడ్యుకేట్ చేసే లక్షణం అందులో కొంచెమో గొప్పో ఉన్నా అది ఆనుషంగికం. సింపుల్ గా చెప్పాలంటే రచన చేయడం కూడా లెర్నింగ్ ప్రాసెస్సే.

    “Ignore the irrelevant insulting comments.” మనం పనిగట్టుకుని ignore చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? “మమ్మల్ని ignore చేయండి” అనే హెచ్చరిక వాటి ముఖం మీదే రాసి ఉంటుంది.

    గౌరవ పురస్సరంగా,
    కల్లూరి భాస్కరం