పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. పేకాట గురించి YdoU-care అభిప్రాయం:

    05/24/2007 1:48 pm

    Classic. will look forward for more from Viplav. Btw, the name “Viplav” did not suit the mental picture I got about this story teller. But hey who cares…life goes on…

  2. అద్వైతం గురించి YdoU-care అభిప్రాయం:

    05/24/2007 1:30 pm

    This is simply great!

  3. పేకాట గురించి రానారె అభిప్రాయం:

    05/24/2007 11:54 am

    తప్పుచేశామనే భావనను కప్పిపుచ్చుకుంటున్నప్పుడు – దానిగురించి ఎవరేం మాట్లాడినా భుజాలుతడుముకుని, ఆత్మన్యూనత పెంచుకొని, కొన్నిసార్లు అసహనమూ కోపమూ ప్రదర్శించి తప్పించుకోవాలనుకోవడం, దొరికిపోతామేమోననే భయం ఉన్నా మేకపోతుగాంభీర్యం ప్రదర్శించడం, ఇంతా చేశాక దొరికిపోతే అయోమయానికి గురవడం, అప్పటికీ ఈగోను వదల్లేకపోవడం … ఇలాంటి భావాల్ని సునిశితంగా హాస్యభరితంగా చెప్పుకొచ్చిన ఈ కథనం నాకు బాగా నచ్చింది.

  4. పేకాట గురించి Lyla Yerneni అభిప్రాయం:

    05/23/2007 7:35 pm

    ఏమిటి విప్లవ్ ! ఈ కధలేమిటి ? ఈ గొడవేమిటి?
    బుష్ , రస్సర్ట్ సంగతి సరేగాని -పవిత్ర భారతదేశంలో -శిల్పాషెట్టిని,
    రిచర్డ్ గేర్, రెండు ముద్దులు పెట్టుకుంటే అంత గొడవ చేశారేమిటి?
    కధ బాగుంది విప్లవ్! Sporty!

  5. శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం గురించి jilukara Sreenivas అభిప్రాయం:

    05/22/2007 6:59 pm

    అరుదైన వ్యాసం. ఇంకా శ్రీశ్రీ కవిత్వం గురించి ఆనాటి విమర్శకుల విశ్లేషణలు పొందుపరచాలని కోరుతున్నా.

  6. పేకాట గురించి Anitha అభిప్రాయం:

    05/22/2007 8:44 am

    నర్మగర్భితమైన హాస్యంతో బాగా రాశారు…కథ చెప్పిన తీరులో ఒక స్టైలుంది..టీవీ షోతో పోల్చుతూ…అలా అబ్‌రప్ట్ గా వదలడమే బావుంది.

  7. కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి రానారె అభిప్రాయం:

    05/22/2007 8:28 am

    ఇంటర్నెట్లో వెతికితే, కలివికోడి (Jerdon’s Courser) శాస్త్రీయనామం ఈ వ్యాసంలో చెప్పినట్లు Cursorius bitorquatus అని కాక Rhinoptilus bitorquatus అని కనబడుతున్నది వికీపీడియాలోనూ, మరిన్ని ఇతర వెబ్సైట్లలోనూ!!?

  8. కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి రానారె అభిప్రాయం:

    05/22/2007 7:47 am

    కొన్నేళ్ల క్రితం చిన్నపిల్లకోసం రాస్ట్రవ్యాప్తంగా రెడియోలో ప్రసారమైన ఒక విజ్ఞాన ధారావాహిక కార్యక్రమంలో కలివికోడి, బట్టమేకల గురించి తెలుసుకున్నాను. మళ్లీ ఇక్కడ చూస్తున్నాను. నాకు అమిత సంతోషం కలిగించినవి – అరుదైన ఆ పక్షి ఛాయాచిత్రాలు. కోనేటిరావుగారికీ ఈమాట సంపాదకవర్గానికీ కృతజ్ఞతలు. రెండు దశాబ్దాల క్రితం మన గ్రామాల్లో మనుషులకంటే జంతు సంపద ఎక్కువగీ ఉండేదని చెబుతారు. ఈ విషయం నాకూ అనుభవంలోనిదే. ఇవాళ పరిస్థితి మనకు తెలుసు. భూగోళాన్నంతటినీ మనిషి ఆక్రమిస్తున్న ఈ పోకడలో తమ ఉనికిని కోల్పోతున్న జీవాలెన్నో! సర్వేజనాః మాత్రమేకాదు సర్వప్రాణికోటీ సుఖీభవ – అనే స్పృహను కలిగించడంలో ఇలాంటి వ్యాసాలు సహాయపడగలవని ఆశిద్దాం.

  9. కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి రానారె అభిప్రాయం:

    05/22/2007 7:41 am

    కొన్నేళ్ల క్రితం చిన్నపిల్లకోసం రాస్ట్రవ్యాప్తంగా రెడియోలో ప్రసారమైన ఒక విజ్ఞాన ధారావాహిక కార్యక్రమంలో కలివికోడి, బట్టమేకల గురించి తెలుసుకున్నాను. మళ్లీ ఇక్కడ చూస్తున్నాను. నాకు అమిత సంతోషం కలిగించినవి – అరుదైన ఆ పక్షి ఛాయాచిత్రాలు. కోనేటిరావుగారికీ ఈమాట సంపాదకవర్గానికీ కృతజ్ఞతలు. రెండు దశాబ్దాల క్రితం మన గ్రామాల్లో మనుషులకంటే జంతు సంపద ఎక్కువగీ ఉండేదని చెబుతారు. ఈ విషయం నాకూ అనుభవంలోనిదే. ఇవాళ పరిస్థితి మనకు తెలుసు. భూగోళాన్నంతటినీ మనిషి ఆక్రమిస్తున్న ఈ పోకడలో తమ ఉనికిని కోల్పోతున్న జీవాలెన్నో! సర్వేజనాః మాత్రమేకాదు సర్వప్రాణికోటీ సుఖీభవ – అనే స్పృహను కలిగించడంలో ఇలాంటి వ్యాసాలు సాయపడగలవని ఆశిద్దాం.

  10. పేకాట గురించి Sowmya అభిప్రాయం:

    05/21/2007 12:05 am

    ఏమిటో…. సడెన్ గా అయిపోయినట్లు అనిపించింది. కథలో చెప్పదలుచుకున్న విషయం ఏమిటో నాకు అర్థం కాలేదు.