సాక…

పొంగని అగ్గికొండ
కనుకొలకుల జారే
కరుణసుర

ఆమె


జోడుజటలు గుచ్చి
జీవజువ్వ పేల్చి
పారిపోయిన కఱకు
చీకటిపూసల తాడుకు… బందీ
సాలీడుగూటి లేదీగ

ఆమె


మన్నూమిన్నూ కలిసేచోటుకు
మాత్రమే కన్ను చాస్తుంది
నీడపడని అడుగు కదపడానికి
లేడిపిల్ల చూపులు
అంటించుకుని ఎల్లుండిని కంటుంది

ఆమె


కూనల పొత్తిముక్కలు
మార్చడమే
ఇక ఆమె మెతుకుసుడిగుండం…
కూర్చున్న బలగం కోసం
ఉగ్గబెట్టుకున్న
నెత్తుటి సాకబెడ్తుంది…
ఓ రోజు.