కొన్ని పాతజ్ఞాపకాలు ఏనాటికీ మరుపురానివి! ఆరోసారో పదహారోసారో చూస్తున్న ‘రోమన్‌ హాలిడే’ లాంటివి. మహాకవిని వోక్స్‌వేగన్‌ బగ్‌లో మేడిసన్‌ తీసుకొని వెళ్ళటం, జీడిమామిడి చెట్లకింద కూచొని మరోకవితో డైలన్‌ థామస్‌‌ని చదవటం, టెన్సింగ్‌ నార్కేకి షేక్‌ హాండ్ ఇవ్వడం, ఇండియా నించి కొత్తగా అమెరికా వచ్చిన ప్రొఫెసర్‌‌‌ని మంగలి షాపుకి తీసికెళ్ళి తెల్ల అమ్మాయి చేత క్షవరం చేయించటం, ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడితో మస్తుగా స్కాచ్‌ పట్టించడం, వగైరా!

సూర్యాస్తమయం నేనున్న చోటుకు వ్యతిరేక దిశలో అయింది కాని, అస్తమయం తరువాత వెల్లివిరిసే సంధ్యాకాంతులు పరిసరాలను సువర్ణభరితం చెయ్యడం గమనించాను. అవును – ఒక్కోసారి సూర్యాస్తమయ దృశ్యం కన్నా దాని తరువాత జరిగే వర్ణలీల మరింత మనసుకు హత్తుకొంటుంది.

బాపు ఒక నిట్టూర్పు విడిచి రాట్నం వడిగా తిప్పసాగారు. కీచుమని శబ్దం రావడం మొదలై, దారం పురి వదులయ్యి తెగిపోయింది. బాపు మళ్ళీ దారం కలిపి తిప్పడం మొదలు పెట్టారు. దారం మళ్ళీ తెగింది. ఆయన వేళ్ళకీ చక్రానికీ మధ్య వుండే సమన్వయం లోపించినట్టుగా వుంది. మళ్ళీ మళ్ళీ దారం తెగిపోతోంది. బాపు తల పూర్తిగా కిందికి వంచి, తన దృష్టినంతా చక్రం మీద కేంద్రీకరించారు. ఆయన వేళ్ళు వణకడం ప్రారంభించాయి.

ఏరా దామూ బడికి రాలేదూ అనడిగితే ఈ రోజు లచ్చిమి ఈనింది అని, ఇంకో రోజు రాజుకి దెబ్బ తగిలింది అని ఏదో ఒక కారణం చెప్పేవాడు. మేకలన్నిటికీ పేర్లు పెట్టాడు. ఎందుకురా మేకలకు పేర్లు పెట్టావ్ అంటే, ‘మేకల భాష తెలీదు కదా టీచరమ్మా వాటికి అవి ఏమి పేర్లు పెట్టుకున్నాయో! ప్రతి మేకకి ఏదో ఒక పేరు ఉంటది కదా, మరి మేక అని ఎట్లా అంటా, అందుకే నేను ఒక పేరు పెట్టుకున్నా’ అని అన్నాడు. వాడి దగ్గర అదో రకమైన మేకల వాసన.

అన్ని సూత్రాలనూ తుంగలో తొక్కుతున్నవి మాత్రం మొదటినుంచీ ఉల్లిగడ్డలు, టమోటాలు. వాటి ధరల్ని రాసిపెట్టడంలో కూడా అర్థం లేదు. నా జాబితా ప్రకారం వీటి ధరలు: టమోటా 2003లో 8. 2013లో 40. అంటే, రూపాయికి కిలో దాకా కిందికి పడిపోయి మళ్ళీ ఒక దశలో స్థిరపడిన ధరలు ఇవి. ఇప్పుడు వందకు మూడు కిలోలు. ట్రాలీల్లో తెచ్చేవాళ్ళయితే నాలుగు కిలోలు కూడా ఇస్తున్నారు. ఆమధ్య 20కి కూడా కిలో వచ్చింది.

బ్రిడ్జి దగ్గర కాలవలో వేటకెళ్ళొచ్చిన పడవలు లంగరులేసి వున్నాయి. వెనక్కి తిరిగి మసీదు సెంటరుకొచ్చా. కోటయ్య కాజాల షాపు దగ్గర చాలా రష్‌గా వుంది. ఫేమస్ బేకరీకెళ్ళాను. లోనికి పోవడానికే ఖాళీ లేనట్టు కిక్కిరిసి పోయివుంది. అర్ధగంట ఆగితే గానీ లోనికి పోవడానికి కుదర్లేదు. వేలం వెర్రిగా కేకులు తీసుకుపోతున్నారు జనం. పెద్ద ప్లమ్ కేక్ తీసుకున్నాను. దాని పైన అందంగా ‘హేపీ న్యూ యియర్’ అని రాసి ఇచ్చాడు.

రోజూ
లేగదూడ కన్నుల్లోని
నల్లని మూగతనం ముందు
తల్లి ఆవు పాలు పితుకుతున్నట్టు–
అతనేదో కూనిరాగం తీస్తున్నాడు
ఆమె చుక్కల ముగ్గు వేస్తోంది

యుద్ధానికీ దుఃఖానికీ
ఒక్క అల్మరా చాలు
ప్రేమకు
ఇంకొంచం పెద్ద గదిని కేటాయిద్దాం

పిల్లల ముందూ
స్త్రీల ముందూ ఎక్కువ ఓడిపోదాం

అందుకే, ఇతనికి ఇష్టమైన ఆట ప్రతీదీ ప్రశ్నించడం, చిన్నపిల్లల లాగా. ప్రతీదీ ఒక అద్భుతంలాగా, ప్రతీదాని వెనుకా ఏదో ముర్మముంది, అదేమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత. ఎందుకు, ఎందుకు, ఎందుకు అని పిల్లలందరూ ఎడతెరపి లేకుండా అడిగే ప్రశ్నలు. తెలియనిదంతా తెలుసుకోవాలనే తపన.

నవల నిండా ఉపాఖ్యానాల ఉద్బోధ కానవస్తుంది. బావరి కథ కాని, నౌకానిర్మాణ శాస్త్రవేత్త జాలరి ఓడేసు కథ కాని, కోస్తామాండలికంలో ఒక చేపకు కారువాకి నామకరణం చేసి నిర్ధారించిన కథ కాని, నిగ్రోధుడి ఆగమనం అతడి బోధ కానీ రచయిత యొక్క విషయ సంగ్రహ ఘోరపరిశ్రమను మనకు ఎరుక పరుస్తాయి.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: